[వివిధ భారతీయ సాంప్రదాయాల గురించి, విద్వాంసుల గురించి, రాగాల గురించి ఈ రచనలో విశ్లేషిస్తున్నారు డా. సి. ఉమా ప్రసాద్.]
ఏ సాహిత్య సృష్టికైనా సామాజిక వాతావరణమే ప్రేరణ. ఈనాడు దేశం అన్ని వైపుల నుంచి విదేశీయుల తాకిడిని ఎదుర్కోవలసి వస్తుందని భయపడుతోంది. ఈ సందర్భంలో అంతఃకలహాలు వాంఛనీయం కాదు. జాతి రక్షణకు జాతీయ సమైక్యత అవసరం. జాతీయ సమైక్యతకు ప్రధానాధారం ఒకే జాతీయ సాహిత్యం అనే భారతీయ సాహిత్యం.
మరొక వంక ప్రపంచం మూడవ ప్రపంచ యుద్ధాన్ని అడ్డుకొని మానవ జాతిని కాపాడాలని విశ్వప్రయత్నం చేస్తుంది. దీనికి ప్రపంచ భావ సమైక్యత అవసరం. ప్రాంతీయ భాషాభేదాలకు అతీతమైన సాహిత్యమే దానిని సాధించగలదు. ఈనాడు ప్రబలుతున్న ‘ప్రపంచ సాహిత్యం’ సృష్టికి ప్రేరణ ఇదే.
ప్రపంచంలో ఒక భాగమై నియతమయినదై అంతర్గతమైన మార్పులెన్ని వచ్చినా తన మౌలికతను పోగొట్టుకొనని దానిని ‘వ్యవస్థ’ అనవచ్చు. సాహిత్యం ఒక వ్యవస్థ. కానీ ఇది సమాజం లోని వ్యక్తులను నిర్బంధంగా తనతో బంధించే వ్యవస్థ కాదు.
సాహిత్యాన్ని సమాజంతో అనుసంధానించే శక్తులు రెండు. (1) అంతరికం (విమర్శకుల అలంకారిక లక్షణాలు, శిల్పము, శైలి, మొదలగునవి. (2) బాహిరం (పోషకులు మొదలగునవి)
ఆలంకారిక గ్రంథాలు సాహిత్యాన్ని యథాతథంగా ఫాఠకుల ముందు ఉంచుతాయి. ఇంకో రకంగా ఉపయోగించుకొనే అవకాశం ఇయ్యవు. సాహిత్యంలో మార్పు అనివార్యం. మార్పుకు ప్రతిఘటన కూడా అనివార్యమే. జీవమున్నది నిలుస్తున్నది.
పోషకత్వంలో 3 అంశాలు వుంటాయి – 1) ఆదర్శము 2) ఆర్థికం 3) సామాజిక స్థాయి. ఈ వ్యవస్థలో సాహిత్యం వ్యవస్థను సమర్థిస్తుంది. అంటే ఇంకో రకమైన సాహిత్యం రాదని కాదు. అది అధికారికమైన మార్గంలో రాదు. ఆ యా వ్యవస్థలు దీనిని క్రింది తరగతి సాహిత్యం (లేదా) ప్రజాసాహిత్యం అని ముద్రవేస్తాయి.
ఉదాహరణ – వేమన సాహిత్యం, జానపద సాహిత్యం మొదలగునవి. ఇది ఒక్కోసారి బలవంతంగా కూడా జరుగుతుంది. పాకిస్థాన్లో ‘ది శాటనిక్ వర్సెస్’ గురించిన అలజడి గొప్ప నిదర్శనం. మూడు ఏకమైతే, వ్యవస్థలో విమర్శ కూడా అలాగే ఉంటుంది. అంటే సంప్రదాయక ప్రమాణాలను అంటిపెట్టుకుని ఉంటుంది.
రాచరిక వ్యవస్థ లేని చోట రచయిత స్వతంత్రుడు.
ఒక సాహిత్యానికి భాష కానీ నైతిక రాజకీయాంశాలు గాని హద్దులు కావు. సాహిత్యాన్ని నియమించేది సాహిత్య లక్షణాలు. ఇవి రెండు విధాలుగా ఉంటాయి.
ప్రపంచ సాహిత్యాలన్నింటిలోను ఆ యా వ్యవస్థల అనుగుణంగా సాహిత్యంలో వస్తున్న మార్పులను గమనించగలం.
మిల్టన్ (Milton) మహకవి ‘పారడైజ్ లాస్ట్’ లోని ‘సాటన్’ గొంతులో అప్రయత్నంగా దైవ ధిక్కారంతో పాటు మానవత్వం కూడా పలికింది.
సామాజిక వాస్తవికతను సాహిత్యం అంగీకరించింది.
మతం నుంచి సమాజం వైపుకు మళ్ళే ప్రయత్నానికి తొలి మెట్టుగా ప్రకృత్యారాధన కాల్పనిక రీతిలో కవితలో పలకడం – సామాజిక వాస్తవికతను సాహిత్యం అంగీకరించడం – ఈ క్రమ పరిణామలన్ని ప్రపంచ సాహిత్యాలన్నింటిలోనూ చూడగలం.
భక్తరామదాసు, పోతన, త్యాగరాజులు – ఆంధ్రజాతిలో ఉదయించిన మహాభక్తులు. వీరి ఆరాధ్య దైవము శ్రీ రామచంద్రుడే.
పోతన – గద్య, వైద్య, సంకలిత భాగవత మహా ప్రబంధమును – భక్తి సాహిత్యమున రాగతాళములతో మేళవించి మధురముగా ఆలపించెను.
ఇక గోపన్న రసా విశిష్టుడై రచించెను.
త్యాగరాజు మృదుమధుర భక్తి సాహిత్యమును రాగతాళములతో మేళవించి రామభక్తి సుధా ధారా శోభితము నైతికమనీయ తెలుగు సంకీర్తనా సంప్రదాయమగు సష్టించి మనోహరంగా కీర్తించెను
ఈ ముగ్గురు త్రిమూర్తులు రామతారక మహా మంత్రోపాసకులు, పరమ పవిత్రులు, ముక్తులు, సిద్ధులు. దక్షిణాపథమును వీరు రామభక్తి సాగరమున ముంచెత్తిరి.
~
ఈ విధంగా నవ విధ భక్తితో ముక్తి పొందిరి.
శ్రీ రామదాసు సకల విధములు భక్తి మార్గముల ఆచరణ రూపమున ఆత్మీయమొనర్చుకొని భక్తియే రామదాస్యం. రామదాసే మూర్తీభవించిన భక్తిగా భావింపబడి శ్రీరామ దేవుని దివ్య సాక్షాత్కారమంది కృతార్థుడయ్యెను.
పోతనవంటి కవితాధార, త్యాగయ్య పాండిత్య ప్రకర్షణ – అత్యంత రమణీయమైన భక్త రామదాసునీ – హృదయపు శతపత్రా విర్భూత నిరర్గళ మహోధృత భక్తిధార మరి ఎవ్వరికి అబ్బును? భక్తి భావానికి రామదాసు రామదాసే. ఇట్టి ఆవేశ భక్తులు ‘న భూతో న భవిష్యతి’. పుట్టులేదు, పుట్టబోరు. వీరి రచనలు మిక్కిలి స్వల్పములే అయినను అవి చుక్కల నడుమ చంద్రుని వంటివి.
రామదాసు చరిత్ర అందలి కీర్తనలన్నియు రామదాసు స్వంత రచనలు గావు. కొన్ని కథా సంకలనకర్తయగు సింగర దాసువి. కొన్ని తూము నృసింహదాసువి. ‘రామదాస నవ విధ కీర్తనల’లో అతని ప్రసిద్ధ భక్తి భావనలు ప్రస్ఫుటములై – నవరస స్ఫూరితో వెలుగొందుచుండును.
నవ విధ భక్తులు
రామదాసు విరచితములగు దాశరథీ పద్యములు, పోతన్న రచిత భాగవత పద్యములు వోలె ‘అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్తు’లను గావించును.
భద్రాచల క్షేత్రము – భద్రుని తపోమహిమచే ఆవిర్భవించి దేవర్షి నారదుని దివ్య మహాతీ విపంచి నాదముచే ముఖరితమై, ఆది శంకరుల ఆశీస్సులంది, పోతనామాత్యుని యోగశక్తికి నెలవై రామదాసుకు ఇలవేలుపై, త్యాగరాజుచే కీర్తింపబడి వెలుగొందెను. ఇది అంధ్ర రాయలసీమ, తెలంగాణములకు సాంస్కతిక ఐక్యతను సాధించిన పుణ్య తపోభూమి. షట్కోటి యాంధ్రుల హృదయ తంత్రులలరారు కథాగీతికలచే సమ్మోహిత మొనర్చు సుక్షేత్రము.
శ్రీ భద్రగిరి రాముడు ప్రాచీన గోల్కండ వైభవమును మరిపించుచు మన పునర్నిర్మిత నవ్య భాగ్యనగర రాజ్య కులదేవతయై ఆంధ్ర ప్రదేశమున శాశ్వత రామరాజ్య ధర్మ సంస్థాపన మొనర్చుచు సర్నోన్నతుడై వెలుగొందుచున్నాడు.
‘శ్రీద, సనందనాది ముని సేవిత పాద, దిగంత కీర్తి సం పాద, సమస్త భూత పరిపాల వినోద, విషాద వల్లి కా చ్ఛేద, ధరాధినాధకులసింధు సుధామయ పాద, నృత్తగీ తాది వినోద, భద్రగిరి దాశరథీ, కరుణాపయోనిధీ!’.
(ఇంకా ఉంది)
డా. సి. ఉమా ప్రసాద్ గారు పుట్టింది, పెరిగింది రాజమండ్రి. వారి స్థిర నివాసం హైదరాబాద్. తల్లి తండ్రులు – కీ.శే: M.V. రంగా చార్యులు, M. ప్రమీలా దేవి. అత్తామామలు: కీ. శే.డా. సి. ఆనందా రామం, శ్రీ రామా చార్యులు. భర్త: సి. బదరీ ప్రసాద్(రిటైర్డ్ సీనియర్ మేనేజర్ ఆంధ్రా బ్యాంక్). ఉమా ప్రసాద్ ఉపాధ్యాయురాలిగా (M A ఎకనామిక్స్ ఆంధ్రా యూనివర్సిటీ) పని చేశారు. వారి ప్రవృత్తి సంగీతాభిలాష (పిహెచ్డి ఇన్ మ్యూజిక్ పద్మావతి మహిళా యూనివర్సిటీ). భావ కవితలు, స్వీయ సంగీత రచన, రాగల కూర్పు, పుస్తక పఠనం వారి అలవాట్లు. వివిధ సంగీత పత్రికలలో- సంగీత రచన వ్యాసాలు మరియు కవిత్వ ప్రచురణాలు, లక్ష గళార్చన ప్రశంసా పత్రం, తెలుగు బుక్స్ ఆఫ్ రికార్డ్స్ లో కవిత్వ ప్రచురణ పురస్కారాలు. గురువులు: విజయవాడ సంగీత కళాశాలలోని అధ్యాపకులైన అందరి గురువులు, శ్రీమతి రేవతి రత్న స్వామి గారు మొట్టమొదటి గురువు- తదనంతరం పెమ్మరాజు సూర్యారావు గారు, MV రమణ మూర్తిగారు, కిట్టప్పగారు, అన్నవరపు రామస్వామి గారు, డా. నూకల చిన సత్యనారాయణ గారు. తదితరుల ఆశీస్సులతో సంగీతంలో ఓనమాలు దిద్దుకొని సంగీతంలో పిహెచ్డి పట్టా పొందారు. “మహా సముద్రంలో ఒక నీటి బిందువు నా సంగీత -కృషి” అంటారు. మధుర గీతికలు (రెండు భాగాలు), రస గాన లహరి, స్వర అమృతవాహిని, హనుమ కీర్తనల సమాహరం, చైతన్య భావ కవితామాలికలు, రాగరంజని (రెండు భాగాలు), భావ-రాగ-లహరి (రెండు భాగాలు), కవితామృతఝరి అక్షర తరంగిణి, అపురూప-అపూర్వ-రాగలహరి వంటి పుస్తకాలను వెలువరించారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
రంగుల కల
మన ఉగాది
నాని భుజాన మోసిన “జెర్సీ”
నీరాజనం
కలవల కబుర్లు-31
కాల్పనిక సాహిత్యంలో ధర్మసూక్ష్మాలు
తరలిపోయిన పాటల వసంతం
వి’నాయక’ చవితి
సరస్వతీ పుత్ర పద్మశ్రీ డా. పుట్టపర్తి నారాయణాచార్యులు
నియో రిచ్-24
అన్నం విలువ మనసుకు తాకేలా వివరించారు... ప్రతిదీ వివరంగా పరిశీలించి అందిస్తున్నందుకు ధన్యవాదాలు...🙏
Thank you somuch sir
ధన్యవాదాలు సర్.
సుబ్బారావు గారు ధన్యవాదాలు మీకు.
వేణు గారూ ధన్యవాదాలు
All rights reserved - Sanchika®