[వివిధ భారతీయ సాంప్రదాయాల గురించి, విద్వాంసుల గురించి, రాగాల గురించి ఈ రచనలో విశ్లేషిస్తున్నారు డా. సి. ఉమా ప్రసాద్.]
ఈ రాగము 53 గమనశ్రమలో జన్యం. వక్ర, షాడవ, సంపూర్ణ ఉపాంగ రాగం.
ఆరోహణ: స రి గ మ ప ద ప స
అవరోహణ: స ని ద ప మ గ రి స
ఆరోహణలో నిషాదము లేదు. పూర్వీ కల్యాణి ప్రసిద్ధ జన్యరాగములలో ఒకటి. ఈ రాగములో అనేక రచనలు కలవు. సాయంత్రము వేళ పాడిన రంజకముగా యుండును; ఇందు అన్నియు రాగాచ్ఛాయ స్వరములే. గ్రహస్వరములుగా ‘గ, స, ప’ లు; న్యాస స్వరములుగా స, గ, ప’లు బాగుండును. త్రిస్థాయి రాగము. గమదస విశేష ప్రయోగము. ఈ రాగమును పూర్వం ‘గమక’ అనెడివారు.
ప మగరి గా – దపమగరి సాపదా – దసరిగా – గమపదపా – పమగమ పదపసానిద- దసరిగా రిస దసా – రిసని దసరిగా – గపమగరిసా – రిసనిద సానిద- గమదసని – దపమరిగరిసా – పమగారిసా – రిసనిదసా.
~
పల్లవి: ఏకామ్ర నాథం భజేహం ఏకానేక ఫల ప్రదం శ్రీ అనుపల్లవి: ఓంకార రూపం శివం ఓషధి మూలం వరం (మధ్యమ కాల సాహిత్యం) కాల కాలం హరం కర్మ భేద హరం జ్ఞాన రూప సుతం గురు గుహ నుతమ్ చరణం: పంచాక్షర మంత్ర రూపం ప్రసన్న రూపం ప్రపంచాతీత సద్యోజాతాది పంచ ముఖం సుముఖం (మధ్యమ కాల సాహిత్యం) ప్రకటిత కామ కోటి పీఠ స్థితం ప్రసిద్ధ మూకాది నుత కామాక్షీ సహితం
ఏకామ్ర నాధుని నేను సేవింతును. ద్వితీయా విభక్తి.
ఒకడైన మామిడి చెట్టు క్రింద వెలసిన స్వామి యగుటుచే ‘ఏకామ్ర నాథేశ్వర’ నామము ప్రసిద్ధి గాంచినది. ప్రణవమైన ఓంకార రూపుని, మంగళప్రదుని, ఓషధికి మూలమైన వానిని, యముని కాలమును చాలించు వానిని, కర్మ భేదమును చేయువానిని, జ్ఞాన రూపమైన, సుఖము నిచ్చు వానిని, కుమార స్వామికి సంతోషమును కలిగించు వానిని, నమశ్శివాయ యను పంచాక్షరీ రూపుని, ప్రసన్న రూపుని, ప్రపంచమునకు అతీతమైన, సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన – అను ఐదు ముఖములు గల వానిని, మంచి ముఖములు గల వానిని, ప్రకటింపబడిన ప్రసిద్ధమగు కామ కోఠి పీఠమున నున్న వానిని, యజ్ఞాదులలో నుతింపబడు కామాక్షీ దేవితో గూడిన ఏకామ్రేశ్వరుని నేను నుతింతును అని వర్ణించిరి.
ఇందు రాగ నామము లేదు.
56 మేళకర్త రాగం. దిశ.
దిశ 10వ చక్రంలో 2వ మేళం. దిశ 8
ఆరోహణ: స రి గ మ ప ద ని స
గమక వరీక రక్తి రాగం. నిషాదము ఒక్కటే కంపితంగా పలుకుటకు అవకాశం కలదు. రిషభమునకు కంపితము లేదు. అన్నియు రాగచ్ఛాయ స్వరములే. జంట, దాటు, ఆహత (స ని ని ద), ప్రత్యాహత ప్రయోగములన్నింటికి అవకాశం గల రాగం. గాన రస ప్రధాన రాగం. త్రిస్థాయి. సాయంకాలం పాడిన బాగుండును. దీని గాంధర మూర్ఛనలో 35 శూలిని, పంచమ మూర్ఛనతో ధేనుక, దైవత మూర్ఛనతో చిత్రాంబరి రాగములు వచ్చును. దీక్షితుల వారి ప్రకారం ఇది చామరం.
పా పా పా దని దపమ – పాపాదనిసరిగా – రీరీ – సారీ సరి – మగారి – రిసరిగా రీగసా – సారిసా రిగరిసనిద – దని దనిస – నిసని సరి – సరిగరి సనిదా దపమ – గరీ – రీగ రిగమా – గరి – సరిగా రీగస – నీ స దా – ని ద ప మా – పా ద ని సా దా నీ – దా సా.
పల్లవి: సదాశ్రయే అభయాంబికే సన్నిధేహి సదాశ్రయే త్వామంబికే భద్రం దేహి అనుపల్లవి: చిదాశ్రయే చిదంబర చంద్రికే ఏహి చిదాశ్రయే శివ మంచకే నత వారాహి ముదాశ్రయే భుక్తి ముక్తి ప్రద మార్గం బ్రూహి (మధ్యమ కాల సాహిత్యం) ముదాశ్రయే మాయాధీనం దీనం మాం పాహి చరణం: గౌరి మాయూర నాథ మోహనకర శక్తే శౌరీశ విధీంద్రాది సన్నుత పరాశక్తే నారీమణ్యాద్యర్చిత నాద బిందు యుక్తే శారీరకాది విద్యా సిద్ధాంత యుక్తే భేరీ మద్దళ వీణా వాదనానురక్తే సూరి జనోపాసిత చరణ నళిన యుక్తే వాణీ మా కర ధృత చామర సేవాసక్తే దూరీ కృత దురిత వేద శాస్త్రాది ప్రసక్తే (మధ్యమ కాల సాహిత్యం) వారీశాది లోక పాల నుత గురు గుహ భక్తే దారిద్ర్య దుఃఖ భంజన-కర శంకరావిభక్తే శుక సనకాది దేవతా సేవితే పర దేవతే వారిజ ముఖి వరదాభయ హస్తే నమో నమస్తే
వ్యాఖ్యానం:
సంబోధన ప్రథమా విభక్తి.
ఓ అభయాంబికా ఎల్లప్పుడు ఆశ్రయించిన నా వద్దకు రమ్ము. నిన్ను ఆశ్రయించిన నాకు శుభము లిమ్ము. ‘చిత్’ ను ఆశ్రయించ ‘చిత్’ అనే ఆకాశమునకు చంద్రిక యైన, మంగళప్రదురాలా, వారాహి చే నమస్కరింపబడు తల్లీ – సంతోషముతో నాశ్రయింతిని. భుక్తిని, ముక్తిని యొసగు మార్గము పలుకు మాయకు అధీనుడనైన, దీనుడనైన నన్ను రక్షించుము. గౌరీ – మయూరనాథునికి మెహము కలిగించు శక్తివి, విష్ణు, శివ, బ్రహ్మాదులచే నుతింపబడు పరాశక్తివి. నారీమణుల చేత పూజింప బడిన, నాద బిందు స్వరూపిణివి, శరీర సంబంధమైన విద్యను సిద్ధాంత మొనర్చిన దానివి. భేరి, మద్దెల, వీణ మొదలైన వాద్యముల వాదన యందు ఆసక్తిగల దానివి. శుక, సనక, సనందనాదులచే సేవింపబడు పరదేవతవు. పద్మము వంటి ముఖము గల, వరద అభయ హస్తములు గల తల్లీ, నీకు నమస్కారమని స్తోత్ర మొనర్చిరి.
(ఇంకా ఉంది)
డా. సి. ఉమా ప్రసాద్ గారు పుట్టింది, పెరిగింది రాజమండ్రి. వారి స్థిర నివాసం హైదరాబాద్. తల్లి తండ్రులు – కీ.శే: M.V. రంగా చార్యులు, M. ప్రమీలా దేవి. అత్తామామలు: కీ. శే.డా. సి. ఆనందా రామం, శ్రీ రామా చార్యులు. భర్త: సి. బదరీ ప్రసాద్(రిటైర్డ్ సీనియర్ మేనేజర్ ఆంధ్రా బ్యాంక్). ఉమా ప్రసాద్ ఉపాధ్యాయురాలిగా (M A ఎకనామిక్స్ ఆంధ్రా యూనివర్సిటీ) పని చేశారు. వారి ప్రవృత్తి సంగీతాభిలాష (పిహెచ్డి ఇన్ మ్యూజిక్ పద్మావతి మహిళా యూనివర్సిటీ). భావ కవితలు, స్వీయ సంగీత రచన, రాగల కూర్పు, పుస్తక పఠనం వారి అలవాట్లు. వివిధ సంగీత పత్రికలలో- సంగీత రచన వ్యాసాలు మరియు కవిత్వ ప్రచురణాలు, లక్ష గళార్చన ప్రశంసా పత్రం, తెలుగు బుక్స్ ఆఫ్ రికార్డ్స్ లో కవిత్వ ప్రచురణ పురస్కారాలు. గురువులు: విజయవాడ సంగీత కళాశాలలోని అధ్యాపకులైన అందరి గురువులు, శ్రీమతి రేవతి రత్న స్వామి గారు మొట్టమొదటి గురువు- తదనంతరం పెమ్మరాజు సూర్యారావు గారు, MV రమణ మూర్తిగారు, కిట్టప్పగారు, అన్నవరపు రామస్వామి గారు, డా. నూకల చిన సత్యనారాయణ గారు. తదితరుల ఆశీస్సులతో సంగీతంలో ఓనమాలు దిద్దుకొని సంగీతంలో పిహెచ్డి పట్టా పొందారు. “మహా సముద్రంలో ఒక నీటి బిందువు నా సంగీత -కృషి” అంటారు. మధుర గీతికలు (రెండు భాగాలు), రస గాన లహరి, స్వర అమృతవాహిని, హనుమ కీర్తనల సమాహరం, చైతన్య భావ కవితామాలికలు, రాగరంజని (రెండు భాగాలు), భావ-రాగ-లహరి (రెండు భాగాలు), కవితామృతఝరి అక్షర తరంగిణి, అపురూప-అపూర్వ-రాగలహరి వంటి పుస్తకాలను వెలువరించారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
కల్పిత బేతాళ కథ-10 శిష్యుని సందేహం
తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-3
సంచిక పదసోపానం-5
సరిగ్గా వ్రాద్దామా?-11
స్త్రీ పర్వం – ఉపాఖ్యానం-3
చెట్టమ్మా..!
అలనాటి అపురూపాలు-74
జ్ఞాపకాల పందిరి-104
సంచిక-సాహితీ ప్రచురణలు సమర్పిస్తున్న సరికొత్త కథాసంకలనం ప్రకటన..
33. సంభాషణం – శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి అంతరంగ ఆవిష్కరణ
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®