“బూమ్మీద పుట్టిన ప్రతి ప్రాణి చస్తుంది. చెట్లు, చేమలు పెరిగి, యిరిగి పోతావుండాయి ఏల ఇట్లనా?” అంటా కిచ్చన్నని అడిగితిని.
కానుగ మాను కవల కొమ్ములా కూకొని ఏకనాధం వాయిస్తా వున్న అన్న కిందకి దిగి “ఈ అనంత విశ్వంలా మార్పు అనేది సహజంరా దాంట్లా బాగమే పుట్టేది, పెరిగేది, యిరిగేదిరా” అనె.
“సరేనా! ఈ మార్పు అనేది ప్రాణుల్లా మాత్రమేనా? లేదా పదార్థాల విషయంలా కూడా జరుగుతుందానా?”
“ప్రాణి, పదార్థం వేరేవేరేగా మనకి కనిపించినా, అది నిజం కాదు. ప్రాణికి ఆధారం పదార్థమే. ప్రాణి పుట్టింది కూడా ఆదనింకానే. కాని మార్పు అనేది ప్రాణుల్లా జరిగినంత బిరిబిర్నా పదార్థాలలా జరిగెల్దురా”
“అంటే పొద్దప్పడు (సూర్యుడు), సెంద్రుడు, బూమీ అన్నీ కూడా ఒగానొగ కాలానికి మార్పుకి లోనై తమ రూపాల్ని మార్చు కొంటాయానా?”
“రూపాలనే కాదురా తమ ధర్మాలని కూడా మార్చుకోవచ్చు. సృష్టిలా మార్పు అనేది సహజంరా” అని పాయ అన్న.
***
బిరిబిర్నా = తొందర తొందరగా
5 Comments
Arun
Super sir
R.Krishnamurthy
Biribirna story super sir
sir good story sir Dr.Mr.Vasanth
Raghunadhara reddy
Nice story
Madhu
Good
K.muniraju
Very good message sir. Superb.