“మన దేశములా అన్ని గుడులపైన కామ పురాణాలు
చెక్కిండారు ఏలనా?” గోపురం చూస్తా అంట్ని.
“అదేడరా నాకండ్లకి ఎబుడూ కనిపిలే” అన్న అనె.
“నువ్వింగా సరిపోతివినా, నేను అంటావుండేది గుడి శికరము
పైన చెక్కిండే కామ బొమ్మల గురించి” వివరంగా చెప్పితిని.
“అట్ల బొగుళు, అది యిడసి పెట్టి పురాణాలు, పుంగు అంటే ఎట్ల?” అని
రేగే.
“నీతావ మాట్లాడి గెలిసేకి అయితుందా? ఆ బొమ్మల కత రవంత
చెప్పనా?”
“ఈ బూమ్మీద పుట్టిన ప్రతి జీవికి కామము అనేది వుంటుందిరా
అది ప్రకృతి దర్మము కూడా, ఇది తెలీని కొందరు పరదేశీ నాయాళ్లు,
మన దేశీ నాయాళ్లు కామము పాపకార్యమని చెప్పి జనాలని చెడిపి
చేటాకులు చేస్తారని తలసిన మన పెద్దాళ్లు అట్ల గుడి శికరాల పైన
ఆ బొమ్మలని చెక్కిండేదిరా” బొమ్మల అసలు కత చెప్పే అన్న.
“అంటే కామ కార్యము పుణ్యకార్యమానా?”
“పుణ్యకార్యమే కాదురా, సృష్టికార్యము కూడా”
“ఓ అదా అసలు సమాచారము”
“ఊరా”
***
బొగుళు = చెప్పు
8 Comments
Manasa
Good one
జొన్నవిత్తుల శ్రీరామచంద్ర మూర్తి
ఈ నడుమ మా పక్కోళ్ళు గుడులు కట్టిస్తా వుండారుగానీ వాంట్లి మింద బొమ్మలు ఎగరగొడతాండారు. దేనికప్పా అని యోచన చేస్తానే ఉందా. ఇప్పుడు తెలిసింది దేనికనేది.
Bhagyamma
Nijamaina mata . super….
Madhu
Good Nice
Narayana
Nice
Suresh
Good sir
Arun
Super sir
Gopi
Nice sir