సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    “తోడు నీడ ఎవరు లేని ఒంటరి, వాడు లోకమనే పాఠశాల చదువరి” అన్నాడు ఒక సినీకవి. పాఠశాలల్లో, కళాశాలల్లో చెప్పే చదువు విజ్ఞానాన్ని ఇస్తుందేమో గానీ లోకజ్ఞానాన్ని ఇవ్వలేదు. లోకజ్ఞానం కావాలంటే లోకాన్ని చదవాలి. మనుషులను అర్థం చేసుకోవాలి. మీ “బ్రతుకు పుస్తకం” కథ కూడా అలాగే ఉంది వాణీ గారూ! వేపచెట్టు గాలి చల్లదనంకీ, ఏ.సీ. చల్లదనంకీ ఉన్నంత తేడా ఉంది రెండు కుటుంబాలకీ మధ్య…. ఏ.సీ. చల్లదనం ఎక్కువసేపు భరించలేం! అలాగే అభిమానం లేకుండా అతిశయం ప్రదర్శించే మనుషుల మధ్య ఎక్కువసేపు కుర్చోలేము… మీ సునిశిత పరిశీలనా శక్తి, వాస్తవానికి దగ్గరగా ఉన్న కథాంశం చాలా బాగున్నాయి. …మంచి కథను అందించినందుకు ఆభినందనలు.

    Reply
    1. 1.1

      Dr. Kothari vani chalapati Rao

      బ్రతుకు పుస్తకం కథ వాస్తవానికి దెగ్గరగా వుంది అన్నందుకు ధన్యవాదాలు మురళీకృష్ణ గారూ .ఈ compliment నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది .మూడు కుటుంబాల కథ ను ఆర్ధికవ్యత్యాసంతో ఉన్నవాటిని తీసుకొని.. వాళ్ళ మనస్తత్వాన్ని , life style ని సహజధోరణిలో చెప్పాలన్న ప్రయత్నమే నా ఈ కథారచన . ఏదో యధాలాపంగా అనిపించే మన మాటలు , మన body language ఎదుటివాళ్ళ వ్యక్తిత్వాన్ని ఎలా కించపరిచేలా వుంటాయో rich family లో చెప్పాను .. దిగువ మధ్యతరగతి ఇంటి వాతావరణం , వాళ్ళ మాటలు బాబాయి కుటుంబం ద్వారా చూపించాను . ఇక కథానాయకుడు ప్రకాష్ మధ్యతరగతి జీవితాలకు ఓ ఉదాహరణ ..మీ విశ్లేషణ కథా సారాంశాన్నంతా క్రోడీకరించి కొద్దిమాటల్లో చెప్పినట్టుంది ..అది కథను మీరు ఎంత ఆసక్తిగా చదివారో తెలిపింది .. మీ స్పందనకు థాంక్యూ 🙏

      Reply
  2. 2

    ఎం.వి.ఎస్. రంగనాధం

    ఫాల్స్ ప్రిస్టేజ్ (False prestige) దక్షిణ ధృవం అయితే ధన మదంతో కృతకంగా ఉండడం ఉత్తర ధృవం. మనిషి ఎప్పుడూ గతాన్ని మర్చిపోకుండా వినయ విధేయతలతో ఉండడం వాంఛనీయం. లేని దర్పాన్ని ఐశ్వర్యాన్ని ప్రదర్శించాలని ఒక వర్గం, నడమంత్రపు సిరిని మాత్రమే చూపిస్తూ తాము ఎక్కడి నుంచి వచ్చామో ఇతరులకు తెలియకుండా కప్పి ఉంచాలని తాపత్రయ పడే ఇంకో వర్గం, మనకి కనిపిస్తూనే ఉంటాయి. ఒక్కొక్కప్పుడు మనం కూడా ఈ రెంటిలో ఒక దానిలో చేరిపోతామేమో. అలా చేరిపోకూడదని ఈ కథ ఒక హెచ్చరిక చేస్తోంది.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!