Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంపాదకీయం జనవరి 2026

‘సంచిక’ పాఠకులకు, రచయితలకు, శ్రేయోభిలాషులకు 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ మేలు చేయాలని ఆకాంక్షిస్తున్నాము.

‘సంచిక’ – తెలుగు సాహిత్య వేదిక పాఠకులకు వందనాలు. సంచికను అభిమానిస్తున్న వారందరికి కృతజ్ఞతలు.

విశిష్టమైన, విభిన్నమైన రచనలను పాఠకులకు అందించేందుకు ‘సంచిక’ ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంది.

విభిన్న దృక్కోణాలకు, భిన్న స్వరాలకు వేదికలుగా, ‘సంచిక’లో ప్రచురితమయ్యే రచనలు నిలుస్తున్నాయి. పాఠకుల ఆదరణను మరింతగా పొందేందుకు కొత్త కొత్త ఫీచర్లు, సీరియల్స్, కథలకు ఆహ్వానం పలుకుతోంది ‘సంచిక’.

సంచికలో ధారావాహికలుగా వచ్చిన కొన్ని రచనలు 2025లో పుస్తక రూపంలో వెలువడ్డాయి. శ్రీ కస్తూరి మురళీకృష్ణ అనువదించిన ‘నిజాం పాలన చివరి రోజులు’, శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘కల్లోల భారతం’, శ్రీ కల్లూరు జానకి రామరావు గారి ‘మంకుతిమ్మన కగ్గ’, శ్రీమతి హిమజ గారి ‘మాయా ఏంజెలో కవితలు’, డా. బి.వి.ఎన్. స్వామి గారి నవల ‘పల్లేరుకాయలు’, శ్రీ ఎలనాగ గారి అనువాద కవితలు ‘ఆత్మలో రెక్కల పక్షి’, శ్రీ పాణ్యం దత్తశర్మ గారి నవల ‘శ్రీమద్రామరమణ’, శ్రీ వేదాల గీతాచార్య గారి ‘కొరియానం’, శ్రీ జిల్లేళ్ళ బాలాజీ గారి నవల ‘జీవితమొక పయనం’, కె.పి. అశోక్ కుమార్ గారి ‘తెలంగాణ మలితరం కథకులు – కథనరీతులు’, భువనచంద్ర గారి నవల ‘మహతి’ పుస్తకాలుగా వెలువడి పాఠకులకు అందుబాటులోకి రావడం ముదావహం.

ఎప్పటిలానే కాలమ్స్, వ్యాసాలు, కథలు, కవితలు, పుస్తక సమీక్ష, గళ్ళనుడి కట్టు, పిల్లల కథలు, పరిశోధనా రచన, ఇతర రచనలతో పాఠకుల ముందుకు వచ్చింది ‘సంచిక’ 1 జనవరి 2026 సంచిక.

1 జనవరి 2026 నాటి ‘సంచిక మాసపత్రిక’లోని రచనలు:

సంపాదకీయం/రచనల జాబితా:

ధారావాహిక:

కాలమ్స్:

పరిశోధనా గ్రంథం:

గళ్ళ నుడికట్టు:

వ్యాసాలు:

భక్తి:

కథలు:

కవితలు:

పుస్తకాలు:

బాలసంచిక:

అవీ ఇవీ:

English Section:

~

సంచికపై పాఠకుల ఆదరణ ఇలాగే కొనసాగుతుందని విశ్వసిస్తున్నాము.

2025లో సాంకేతికపరమైన ఇబ్బందులు చాలా ఎదుర్కున్నా, వాటిని అధిగమించగలిగాము. నూతన వత్సరంలో మరింత సులభరీతిలో ఉండేలా సైట్‌లో మార్పులు చేసేందుకు ప్రయత్నిస్తాము. సదా మీ సహకారం ఆశిస్తూ.. ధన్యవాదాలు.

సంపాదక బృందం.

Exit mobile version