[శ్రీ మల్లాప్రగడ రామారావు రచించిన ‘ఎన్నాళ్ళింకా..’ అనే కవితని అందిస్తున్నాము.]


మింగేయ్
లేదా
కక్కేయ్
ఎందుకలా
మోస్తూ తిరుగుతావ్.
ఎండలు మండుతున్నాయి
వానలు కురుస్తున్నాయి
చలిగాలను వణికిస్తున్నాయి
ఐనా
ఎందుకలా
మోస్తూ తిరుగుతావ్.
పసితనం వాడిపోయింది
వయసు మీద పడింది
వెళ్లే సమయం దగ్గరైంది
ఐనా ఎందుకలా మోస్తూ తిరుగుతావ్.