సంచికలో తాజాగా

Related Articles

15 Comments

  1. 1

    Abhigna

    మొత్తానికి జాను బయలుదేరిందోచ్చ్ 🤩.. “ఇరు ప్రేమ బంధాల కలయికకు, రక్త సంబంధాల ఆకర్షణకు,మానవ బంధాల మనుగడకు మహత్తర వేడుకల ఆరోజు” ముఖ్యంగా ఈ వాక్యాలు చాలా చక్కగా అనిపించాయి, నాలోని ఆసక్తిని రెట్టింపు చేశాయి జాను వాళ్ళ నాన్నని పిన్నిని ఎప్పుడెప్పుడు కలుస్తుందా అని మరియు ఊర్మిల ఏమో పాజిటివ్ గా రియాక్ట్ అవుతోంది, మాలతి ఏమో ఊర్మిళ ని పాపిష్టిది అంటుంది అస్సలు వీరి గతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలని తరువాతి భాగం చదవాలని చాలా ఆసక్తికరంగా ఉంది

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కృష్ణ వాసంతిక గారి వ్యాఖ్య: *ఆదివారం కోసం వెయిట్ చేసినంత సేపు పట్టలేదండీ కథ చదవటం. చాలా తక్కువ రాస్తున్నారు 🙏*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది లక్ష్మి తలుపూరు గారి వ్యాఖ్య: *ఇప్పుడే చదివాను. బాగుంది. నిజమైన స్నేహ బంధాన్ని పాటించింది నీలిమ. తక్కిన స్నేహితులకు నిజాలేమి చెప్పలేదు.తండ్రిప్రేమకు దూరం కావొద్దు అన్న మాలతి ఆలోచన మంచిది. తండ్రి దగ్గరకు వెళ్తున్న సంతోషంలో కూడ తల్లి తాతల గురించిన జాను ఆలోచన తన పరిపక్వత తెలుపుతుంది. తల్లిదండ్రుల మధ్య గొడవలు పిల్లల మనస్సుల మీద చాలా ప్రభావం చూపెడుతాయి. మీరు కధ నడిపే తీరు పద ప్రయోగాలు బాగున్నాయి. మొత్తం కధ ఏకధాటిగా చదవాలనీ ఉంది.బాగ సస్పెన్సు మెన్ టెన్ చేస్తున్నారు. అభినందనలు.*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గిరిజ పీసపాటి గారి వ్యాఖ్య: *ఈవారం కథ మరీ మరీ బాగుందక్కా. మృగ్యమైపోతున్న ఆలూమగల దాంపత్య జీవితంలో పిల్లల మానసిక సంఘర్షణను చాలా బాగా రాస్తున్నారు.*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది తేజస్వి గారి వ్యాఖ్య: *మీ ఈ ఒక్క మాటతో నాకు జానూ పాత్ర మీద ప్రేమ కలిగింది, రచయిత్రి ఉద్దేశ్యం అర్థమైంది, అంతేనా, మామూలుగా పిల్లల పట్ల ఉండే నా సరళ స్వభావం తప్పు కాదు, ఎవఱు విమర్శించినా ఫర్లేదనే భావం కలుగుతోంది.*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ప్రమోదిని గారి వ్యాఖ్య: *పెద్దవాళ్ళము బాధ పడాల్సి వస్తే ఎందుకు మనకి బాధ వచ్చిందో అర్ధం చేసుకోగలము. మనల్ని మనం సముదాయించుకోగలము.. మనకి మనం సర్ది చెప్పుకోగలము, ధైర్యం చెప్పుకోగలము అమ్మా.. కానీ చిన్న పిల్లలు తమకి వచ్చిన బాధ అర్ధం కాక, ఆ బాధకి కారణాలను పెద్దవాళ్ళని అడగాలంటే భయంతో అడగలేక తమలో తాము కుమిలిపోతారు. చిన్నతనం బాధలు, సంతోషాలు అన్నీ వారి భవిష్యత్ పైన ప్రభావం చూపిస్తాయి. భావి సమాజం బాగుండాలంటే బాల్యం నలిగిపోకూడదు. పిల్లలు సంతోషంగా, హాయిగా పెరగాలి 😍 *

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది భారతి లక్ష్మి పెద్దింటి గారి వ్యాఖ్య: *ఉత్కంఠ భరితంగా ఉండటం వల్లనేమో తొందరగా ముగిసినట్టు అనిపించింది. ఈ వారం చాలా బాగుంది. చక్కని శైలి ఎన్నుకొన్న కధాంశం కొత్తదనం.మళ్ళీ వారందాక ఎదురు చూడడం.పాత రోజులు గుర్తు కు వస్తున్నాయి శారద గారు. *

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వి.ఎస్. భారతి గారి వ్యాఖ్య: *త్వరగా అయిపోయింది శారద గారు కొంచెమే వ్రాసారు 🤔 *

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పి. హేమ నళిని గారి వ్యాఖ్య: *చాలా చాలా బాగుంది శారద గారు.. కొంచమే రాశారు.*

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వసుమతి గారి వ్యాఖ్య: *చాలా బాగుంది శారద*

  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అనూరాధ గారి వ్యాఖ్య: *మళ్ళీ ఆదివారం ఎప్పుడొస్తుందా అని ఉత్కంఠగా ఉంది.*

  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దుర్గ గారి వ్యాఖ్య:*సందె చీకట్లు… తృప్తి కలిగించే పదం… ఈ తెనుఁగును ౘూస్తే భలే అనిపిస్తుంది.*

  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మాధురి సోమరాజు గారి వ్యాఖ్య: *అసలింతకీ మాలతి ఆరోగ్యం, సంయమన స్థితీ ఎలా ఉన్నాయీ? తాతగారూ, వారి స్నేహితుడు, ఆయన ధర్మపత్నీ ఊహించి చెప్పిన జోస్యం, “ౘాప క్రిందకు ఎవఱూ నీరు తెౘ్చుకోరు”, అన్న మాటకు భిన్నంగా, ఊర్మిళ జానూను పిలుస్తోంది, అంటే, పాపం మాలతి భయం నిౙమేనా? అంటే, ఆమె దూరంగా ఉండటం సరైన నిర్ణయమేగా!?
    కానీ ఆ పిలుపూ, కలయికా అది కేవలం ఒకే ఒక్క వారానికేనా?
    అలా అయితే అది ధర్మమేనా? ఇందుకేనా, మాల‌ భయాలను తీసి పారేస్తూ పెద్ద వారంతా జానూను అక్కడకు పంపుతోంది, తండ్రితో “ఓ వారపు”, అదీ, సవతి తల్లి, ఆమె కుటుంబ సభ్యుల మధ్యన, ఇష్టం లేని తండ్రితో గడపటానికేనా?
    పోనీ ఈ వారం రోౙుల తర్వాత మార్పు వస్తుందేమో ఆనంద్ లో అంటే, మఱి అప్పుడు జానూను జీవితాంతం కోరుకుంటే, మాలతి పరీస్థితి ఏమిటీ!?
    ఒకవేళ అతను వీరితోనే కలిసి పోతే, మఱి మంచిదే అయిన ఊర్మిళ, ఏ పాపం ఎఱగని ఆమె పిల్లల పరీస్థితి ఏమిటీ?
    అసలు ఊర్మిళ ఓ విషయం మాట్లాడాలీ అని ఆనంద్ తో అంటే, అది తను ‘దాచిన’ విషయమే అని ఎందుకు అనుకోలేదూ? అంటే ఉత్తరాల పైననే కాదు, ఊర్మిళ పైన కూడా నిర్లక్ష్యమే కదా!
    పైగా, ఊర్మిళ మాట్లాడాలీ అనగానే, “బడిలో పిల్లలను ఆమె బాగా ౘూసి ఉండదూ” అని చులకనగా అనేశాడు?
    భార్యతో పాటు బిడ్డ కూడా ఉండగా ఇంకో పెళ్ళి చేసుకున్న వ్యక్తి, ఆ ఱెండవ భార్యనూ చులకన చేస్తున్నాడు!
    అంటే, అసలు “స్త్రీ” హృదయం ఏమి అర్థం చేసుకున్నట్టూ?
    ఇంత ఝంఝాటమూ అసలితని అహం వల్లనే వచ్చిందేమో అనిపిస్తోంది ఆలోచిస్తుంటే!
    ఈ విషయాలేవీ పట్టని జానూ, “తల్లి కూడా తండ్రి లాగానే అహం కోసమే ఆరాటపడుతోంద”ని అపార్థం చేసుకుంటోంది, అది “అభిమానమనీ, ఆ అభిమానం మాలతి తన కోసమే కాక, ‘పిల్ల కోసమూ కూడా దుగ్ధ అనీ'” గ్రహింౘ లేక పోతోంది.
    పెద్దల ఊహలూ ఇందుకు భిన్నంగా లేక పోవటం, ‘ఒంటరి మాలతి’ దురదృష్టం.
    తనను తండ్రి వద్ద ౘూసుకోవాలనే తపన లో, తల్లి ముందు ౘూపును అంచనా వేయకుండా, అహం ముసుగులో తల్లి తాపత్రయాన్ని పడదోస్తోంది జానూ.
    ఒక్క ఆనంద్ అహంకారపు, అనాలోచిత ప్రవర్తన వల్లనే కాదు, పెద్దల‌ ఆరాటం వల్ల కూడా కదూ ఇదంతా!
    ఏమో! ఈ కథకు విరించి అయిన, ఆ ‘శారదమ్మ’ ఏమి వ్రాశారో మఱి!*

  14. 14

    కొల్లూరి సోమ శంకర్

    It’s ☀️🌞 Sunday, time for our episode and reviews 🩵
    దేవులపల్లి సీత

  15. 15

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సాయి భవానీ గారి వ్యాఖ్య:*జాహ్నవి పరీక్షలు అయ్యాయా?
    మార్కులు తల్లి కోరుకున్నట్లే వస్తున్నాయా?
    ఊర్మిళ పిలిచింది సరే! మఱి ఆనంద్ పాపను ౘూశాక స్పందన ఏంటి?*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!