4-6-2021 తేదీ నూతన్ జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.
***
ప్రముఖ బాలీవుడ్ సినిమా నటి, గాయని, కవయిత్రి, భజన్ల గాయని, అగ్ర కథానాయకులందరి సరసన నటించి, జీవించి, మెప్పించిన నటీమణి, ఫిల్మ్‌ఫేర్ అవార్డులను పొందిన పద్మశ్రీ నూతన్ సమర్థ్ బహల్. వీరి కుటుంబం యావత్తు – తల్లిదండ్రులు, సోదరీసోదరులు, వారి పిల్లలు, స్వయాన నూతన్ కుమారుడు అందరూ సినీ ప్రపంచాన్ని సొంతం చేసుకున్నవారే! వీరి భర్త కూడా సినిమా నిర్మాణంలో పాల్గొన్నారు.
వీరు 1936 జూన్ 4వ తేదీన నాటి బొంబాయి ప్రెసిడెన్సీ నేటి మహారాష్ట్రలో జన్మించారు. తల్లిదండ్రులు శోభనా సమర్థ్, కుమారసేన్ సమర్థ్. వీరు మరాఠీ కుటుంబీకులు. తల్లిదండ్రులు సినిమా పరిశ్రమకు చెందినవారు.
నూతన్ పంచగని లోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ స్కూల్లో చదివారు. తరువాత స్విట్జర్లాండ్ లోని లాచటెలైన్ స్కూల్లో చదివి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
వీరు బాలనటిగా నటించిన తొలి చిత్రం హమారా బేటి, ఈ చిత్రానికి దర్శకురాలు వీరి తల్లి శోభన సమర్థ్. 1940ల మధ్యలో నలదమయంతి సినిమాలో కూడా బాలనటిగా కన్పించారు.
స్విట్జర్లాండ్‌లో చదువు ముగించుకుని తిరిగి వచ్చాక సీమా, హీరో, బరీష్, పేయింగ్ గెస్ట్, కన్హయ్య, బందిని, యాద్గార్, కస్తూరి, పైసా మే పైసా, కర్మ, దిల్లీ కా థగ్, మిలన్, హమ్ లోగ్, నగీనా, సౌదాగర్ మొదలయిన సినిమాలలో నాయికగా, గుణచిత్రనటిగా పాత్రలను పోషించారు.
4 దశాబ్దాల సినీ జీవితంలో 70కి పైగా సినిమాలలో నటించి గొప్ప పేరు ప్రతిష్ఠలను సంపాదించారు. నవరసాల పాత్రలను అవలీలగా పోషించారు. కథానాయిక నుండి తల్లి పాత్రల వరకు అద్వితీయమైన నటన వీరి సొంతం.
1955లో ‘సీమా’ సినిమాలో పోషించిన అనాథ యువతి పాత్ర ఎనలేని పేరు తెచ్చింది. బలరాజ్ సహానితో పోటీపడి నటించిన ఈ చిత్రానికి మొదటిసారి ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును పొందారు. ఈ చిత్రం లోని ‘తూ ప్యార్ కా సాగర్ హై’ పాట ఈనాటికీ ప్రేక్షక శ్రోతలను అలరిస్తూనే ఉంది.
వీరు భారత హిందీ సినీ చరిత్రలో పేరు పొందిన మహానటులు శ్రీయుతులు బలరాజ్ సహాని, అశోక్ కుమార్, రాజకపూర్, దేవానంద్, సునీల్ దత్, దిలీప్ కుమార్, ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్ మొదలయిన వారందరితోను నటించి ప్రత్యేక రికార్డును సొంతం చేసుకున్నారు. నటీమణులు సాధన, స్మితాపాటిల్ వీరిని రోల్ మోడల్‌గా ఆరాధించడం విశేషం.
“వీరిని మించిన నటీమణులు ముందు ముందు రావడం కష్టమని” సంజయ్ లీలా భన్సాలీ శ్లాఘించారు. మూడేళ్ళ బాల్యంలోనే శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు. ‘కథక్’ నృత్యాన్ని నేర్చుకున్నారు.
మోడల్, సినిమానటి, గాయకురాలు, సంగీత దర్శకురాలిగా (భజన్స్)కి పనిచేశారు. 1980 తరువాత భజనలు వ్రాసి, స్వరరచన చేసి ఆలపించారు.
1965లో విడుదలయిన ‘ఖాన్దాన్’ సినిమాలో “తుంహి మేరే మందిర్ తుమ్హి మేరే పూజ” పాట లతాజీకి ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందించింది.
వీరు సాంప్రదాయక దుస్తులకే ప్రాధాన్యతనిచ్చారు. అయితే 1958 లోనే ‘దిల్లీ కా థగ్’ సినిమాలో స్విమ్ సూట్ ధరించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.
1960లో ‘చబిలి’ సినిమా కోసం “ఆయే మేరే హమ్‌సఫర్ ” పాటను స్వయంగా వ్రాసి ఆలపించారు. ఈ విధంగా సినిమా పాటల రచయిత్రిగా, గాయనిగా చరిత్రను సృష్టించుకున్నారు.
1957లో సీమా, 1960లో సుజాత, 1964లో బందిని, 1968లో మిలన్, 1979లో తులసీ తేరే అంగన్రీ సినిమాలలోని నాయికా పాత్రల నటనకు వీరు ఫిల్మ్‌ఫేర్ అవార్డును పొందారు.
1978లో ‘మేరీజంగ్’ ఉత్తమ సహాయనటి పాత్రకు మరోసారి ఫిల్మ్‌ఫేర్ అవార్డు లభించింది. ఈ విధంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుల స్వీకరణలో రికార్డు సృష్టించారు.
సంభాషణా చాతుర్యం కంటే ముఖ భావ వ్యక్తీకరణ అద్భుతమనే ప్రశంసలను అందుకున్నారు.
BEJA (Bengal Film Journalists Association) వారి అవార్డులను 1964లో ‘బందిని’, 1968లో ‘మిలన్’, 1974లో ‘సౌదాగర్’ సినిమాల్లోని నాయిక పాత్రలకు అందుకున్నారు.
1974లో భారత ప్రభుత్వం వారి చేత ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందుకున్నారు. 2011లో రెడిఫ్.కామ్ ‘ఆల్-టైమ్’ 3వ గొప్పనటిగా ఎంపికయ్యారు. 2010లో ఫిల్మ్‌ఫేర్ వారు నూతన్ నటనను ’80 ఐకానిక్ ఫెర్మామెన్స్’లో చేర్చి గౌరవించారు. 2013లో భారతీయ సినిమా శతవసంతాల సందర్భంగా వీరి నటన ప్రశంసించబడింది.
వీరి జీవిత చరిత్రను “నూతన్ అసెన్మి నాసేన్మి” అనే పేరుతో ‘లలితా తమ్హనే’ గ్రంథస్థం చేశారు.
బుల్లితెరని కూడా వీరు అలరించారు. ‘ముజ్రమ్ హజీర్ ‘ అనే సీరియల్ లో ‘కలిగంజ్ కి బహు’ గా నటించి బుల్లి తెర ప్రేక్షకుల నీరాజనాలను అందుకున్నారు.
వీరి కిష్టమైన సినిమా ‘బందిని’. ఆ పాత్రను తన నటనతో సుసంపన్నం చేశారు.
తన జీవితంలో ‘సంతోషంగా గడిపింది స్విట్జర్లాండ్‌లో ఉన్న కాలమే’ అని ముక్కుసూటిగా, నిర్భయంగా చెప్పగలిగిన ధైర్యం ఆమెది. ప్రతి ఒక్కరూ జీవితంలో ఇటువంటి అనుభవం కలిగి ఉండడం అతిశయోక్తి కాదు.
1959లో లెఫ్టినెంట్ కమాండర్ రజనీష్ బహల్‌తో వీరి వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు.
కుటుంబంతో సంతోషంగా ఉన్న సమయంలో రొమ్ము క్యాన్సర్ మహమ్మారి వీరిని సోకింది. 1991 ఫిబ్రవరి 21వ తేదీన బొంబాయి లోని బ్రీచ్‌కాండీ హాస్పిటల్లో మరణించారు.
వీరి జ్ఞాపకారం 2011 ఫిబ్రవరి 13వ తేదీన 5 రూపాయల విలువతో స్టాంపును విడుదల చేసింది భారత తపాలాశాఖ.


జూన్ 4 వ తేదిన వీరి జయంతి సందర్భంగా ఈ నివాళి.
***
Image Courtesy: Internet

12 Comments
AR Rao
Well crafted..All said done, Nutan was one of the best actresses.Mrs. P Nagalakshmi brought rightly all points in respect her.
Alluri Gouri Lakshmi
నూతన్ మహానటి. ఆవిడ సి ని మా ల్లో పాత్రే కనబడుతుంది..ఆమె కనబడరు..బంది ని..సుజాత…సరస్వతీ చంద్ర etc. Nagalakshmi చాలా వివరాలు అందంగా చెక్కినట్టుగా రాసారు..అభినందనలు
Jhansi Lakshmi
నా అభిమాన నటి!అద్బుత నటిగా మాత్రమే తెలుసు.ఇంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి అని ఇప్పుడే తెలిసింది.చక్కటి చదువు నటనా నేపథ్యం నుంచి వచ్చి సినిమా రంగాన్ని తన నటనతో అలరించి,మంచి నటనకు గీటురాయిగా నిలిచారు! సౌందర్యరాశి
అద్బుత నటి త్వరగా మరణించటం బాధాకరం.. మేడం మీ రచనా శైలితో ఆసాంతం చదివింప చేస్తున్నారు!keep writing
కొల్లూరి సోమ శంకర్
నూతన్ నటించిన కాలం సినీరంగంలో స్వర్ణయుగం.గొప్పనటి నూతన్ గురించి చక్కగా వివరించారు నాగలక్ష్మిగారు.నూతన్ తర్వాత మీనాకుమారి మహానటి అనిపించుకున్నవారు.ఆమె గురించి కూడా రాయండి
డా. వి. ఆర్. రాసాని
G.prameela
ఏ పాత్ర లో నైనా పరకాయ ప్రవేశం చేసి నటించి మెప్పించిన గొప్ప నటి నూతన్ ను స్మరించు కొని నివాళులర్పించుటకు, నాగలక్ష్మి గారు వ్రాసిన వ్యాసం గుర్తు చేసినది. నాగలక్ష్మి గారికి ధన్యవాదములు.
ఉషారాణి పొలుకొండ
నూతన్ గారి గురించి చాల బాగా వ్రాసారు మేడం…ఆ రోజుల్లోనే స్విట్జర్లాండ్ వెళ్లి చదుకుని, బహుముఖ ప్రజ్ఞాశాలి గా రాణించిన గొప్ప నటీమణి..నిజం గా మరల అలాంటి నటులు పుట్లలేరు..
కొల్లూరి సోమ శంకర్
ఈమె నిజంగానే బహుముఖ ప్రజ్ఞాశాలి.ఈ నాటి నాయికలు తమ సంభాషణలు తాము చెప్పలేని స్థితిలో ఉన్నారు. అలాంటిది ఈమె అనేక కళలలో మేటి అయినారు. వ్యాసం బాగుంది మేడమ్.
జయవేణి
Annapurna
Are! nenu alasyamga choosenu. Nutan ante Naku chala ishtam.
Especially her smail oh beautiful. Action SUPPREB!
I don’t know her details.
Thank you so much NAGALAKSHMI garu!
Annapurna
Aa navvu aadavarine sammoha parustundi.
Dev Anandto vesina movies lo songs anne hits.
Balu gari Birthday kooda 4th June.
satyanarayana reddy deshmukh
మీ విశ్లేషణ చాలా బాగుంది.బహుముఖ ప్రజ్ఞాశాలి,సహజ నటి నూతన్ గురించి.పోతే తుంహి మేరే మందిర్ పాట ఖాందాన్ సినిమా లోనిది. ఖండన్ అని అచ్చు తప్పు పడింది.దిలీప్ కుమార్ నూతన్ జంటగా నటించిన సినిమా ఏదో గుర్తుకు రావట్లేదు.ఏదో తెలుప గలరు.
కస్తూరి మురళీ కృష్ణ
Dilip kumar and nutan came together for a film called shikwa in 1950s, but the film was incomplete. Later, late in their career they acted together in karma and kanoon apna apna. Thanks for pointing out the type. It will be corrected.
పుట్టి. నాగలక్ష్మి
ఇప్పుడే మీ కామెంట్ చూశాను సత్యనారాయణ గారూ! నా వ్యాసం నచ్చినందుకు ధన్యవాదాలు.