పెళ్లివారిల్లు రక్తసంబంధీకులతో, బంధువులతో, స్నేహితులతో, శ్రేయోభిలాషులతో, పిల్లల కేరింతలతో, పెద్దల పలకరింపులతో, పెద్ద పండగ వాతావరణంతో కళకళ లాడుతోంది. వివిధ ప్రాంతాలనుండి ఇంకా బంధువులు దిగుతూనే వున్నారు. దగ్గరలో వున్న రెండు రైల్వే స్టేషన్లకీ, బస్సు స్టాండ్కూ, మూడు కార్లు అదే పనిగా తిరుగుతున్నాయి. ఎవరికీ ఇబ్బందులు కలగకుండా పెళ్లింటి వారు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ముఖ్యంగా రవాణా సౌకర్యం మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. వచ్చేవాళ్ళు వస్తుంటే, స్నానాలు చేసేవాళ్ళు కొందరు, టిఫిన్లకు సిద్ధపడేవాళ్లు కొందరు, తయారుకావడానికి అద్దం ముందు క్యూలు కట్టేవాళ్ళు మరికొందరు, ఇలా అక్కడ సందడి.. సందడిగా వుంది.
ఇంటి పెద్దలు అతిథులకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా అందరినీ మర్యాదగా పలకరిస్తూ వారి అవసరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రయాణం సంగతులు అడిగి మరీ తెలుసుకుంటున్నారు. రాకపోకలకు సిద్ధం చేసిన వాహనాలు సకాలంలో అందుబాటులోనికి వస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి కొందరు పెద్దలు యువతను అప్రమత్తం చేస్తున్నారు. వచ్చేవాళ్ళు ఇంకా వస్తూనే వున్నారు.
ఆ ఇంట్లో పెళ్లి ఆదర్శ వివాహం. అది కూడా రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్టర్ పెళ్లి. అమెరికాలో వుంటున్న పెళ్ళికొడుకు అనవసర ఆడంబరాలు వద్దని, పెళ్లి చాలా సింపుల్‌గా, రిజిస్టర్ ఆఫీసులో జరగాలని కండీషన్ పెట్టాడు. పరిస్థితిని బట్టి అతగాడు ఒక పట్టాన పట్టినపట్టు విడవడని తెలిసాక, పెళ్లికూతురు తరపు వాళ్ళు ఒప్పుకోక తప్పలేదు. అతికష్టంమీద పెళ్ళికొడుకుని ఒప్పించడంతో పెళ్ళైన తర్వాత ఇంటిదగ్గరే అతి సాధారణ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఇరుపక్షాల నుంచి యాభయి మందికి మించి అతిథులు (బంధువులు) ఉండకూడదనే ఒక ఒప్పందాన్ని ఇరుపక్షాలూ సంతోషంగా అంగీకరించాయి. దానికి అనుగుణంగానే ఆహ్వానాలూ వెళ్లాయి.
పెళ్లి రోజు రానే వచ్చింది. అతి సమీప బంధువు జిల్లా అధికారి కాబట్టి, ఆయన సహకారంతో, రిజిస్టార్ ఆఫీసులో ఎలాంటి ఇబ్బంది లేకుండా అతితక్కువ మంది బంధువుల సమక్షంలో పెళ్లి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా సంతోషంగా జరిగిపోయింది.
ఇక ముందు జరగబోయే కథ, పెళ్ళికొడుకు – పెళ్లికూతురుకు గాని వారి తల్లిదండ్రులకు గాని సంబంధించింది కాదు. పెళ్ళికొడుకు మేనమామ, కుటుంబానికి సంబందించినది. పిలిచిన ఆహ్వానితులు మాదిరిగానే, ‘వాళ్ళూ’, రిసెప్షన్ సమయానికి పెళ్లింటికి వచ్చారు. వాళ్ళు ఎప్పుడూ ఎలాంటి వేడుకలకు ఆ ఇంటికి వచ్చినా, పెళ్ళికొడుకు మేనత్త ఏదో సమస్య సృష్టిస్తుంది. అందుకే ఆమె అంటే.. ఇంట్లో అందరూ అప్రమత్తంగా వుంటారు, ఎప్పుడు ఎలాంటి సమస్య సృష్టిస్తుందో అని.
రిసెప్షన్ పెళ్లింటి మిద్దె మీద జరుగుతోంది. అందరి మాదిరిగానే పెళ్ళికొడుకు మేనమామ చిన్నయ్య కుటుంబం కూడా పైకి వెళ్ళింది. చిన్నయ్య తన మొబైల్ ఇంటి హాల్లో ఛార్జింగ్‌కి పెట్టి రిసెప్షన్ స్థలం మిద్దె మీదికి వెళ్ళాడు.
కొందరు పెద్దల ఆశీర్వచనాలు ముగిసిన తర్వాత నూతన వధూవరులను పెళ్ళికి వచ్చిన బంధువర్గం నూతన వధూవరులను కలిసి ఆశీర్వదించిన తర్వాత చక్కని విందు ప్రారంభమై అందరూ ఆనందంగా గడిపారు. పెళ్ళికొడుకు మేనమామ చిన్నయ్య, మేనత్త సావిత్రి కూడా సంతోషంగా అందరితో కలిసి గడిపారు. కొందరు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుంటే, మరికొందరు వెళ్లిపోగా మిగతావాళ్ళు అక్కడే రిసెప్షన్ వేదిక దగ్గర సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు.
‘అంతా ఆనందంగా జరిగిపోయింది’ అనుకుంటున్న సమయంలో, క్రిందికి వెళ్లిన చిన్నయ్య దిగాలు ముఖంతో ముఖం వేళ్ళాడేసుకుని పైకి వచ్చాడు. అప్పుడు అందరి దృష్టి అతడి వైపు మళ్లింది. విషయం తెలిసి అతనివైపు అందరూ సానుభూతిగా చూడడం మొదలు పెట్టారు. విషయం ఏమిటంటే ఛార్జింగ్‌కు పెట్టిన అతని మొబైల్ మాయమై, ఛార్జర్ మాత్రం వేళ్ళాడుతూ కనిపించింది. విషయం తెలిసి భార్య అనరాని మాటలతో దెప్పి పొడిచింది. తల్లి ఎప్పటి మాదిరిగానే “వీడి బ్రతుకు ఎప్పుడూ ఇంతే..” అని అక్షింతలు వేసింది.
అప్పటివరకూ వున్న అతని లోని సంతోషం కాస్తా ఆవిరి అయిపొయింది. తన దురదృష్టానికి తనని తానే మనసులో తిట్టుకున్నాడు. అతనికొచ్చే కొద్దీ జీతం నుండి ఇప్పట్లో మళ్ళీ మొబైల్ కొనుక్కునే అవకాశం లేదు. ‘మళ్ళీ మొబైల్ ఎలా సంపాదించాలా?’ అన్న దిగులు మొదలైంది.
***
సావిత్రి, చిన్నయ్య స్వగృహానికి వచ్చేసారు. పుట్టింటి నుండి పిలుపు రావడంతో మరునాడు పిల్లల్ని, భర్తను వదలి, పాలకొల్లు బయలుదేరింది సావిత్రి. చిన్నయ్య కాలకృత్యాలు తీర్చుకుని, స్నానపానాదులు ముగించుకుని పిల్లలు వడ్డించిన ఉప్మా తిని, ప్రయాణం కోసం బట్టలు సర్దిన సూట్ కేస్ తెరిచి తన ఇస్త్రీ చొక్కా ఒకటి తీసుకున్నాడు. చొక్కా మడత విప్పగానే, క్రింద ఏదో పడిన శబ్దం చిన్నయ్యకు వినిపించింది. వెంటనే అతని దృష్టి నేలమీదకు మళ్లింది. ఆశ్చర్యంగా, ఊహించని విధంగా, అది పోగొట్టుకున్నాననుకున్న అతని ‘మొబైల్!’. ఆత్రంగా దానిని చేతిలోకి తీసుకున్నాడు చిన్నయ్య.
మొబైల్ దొరికిందన్న సంతోషానికి బదులు, కోపంతో అతని ముఖం ఎర్రబడింది!!
వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
తప్పని సరిగా ఇది మేనత్త పనే సుమా.
ధన్యవాదాలు మిత్రమా….
ఇంటి దొంగలు.. —మాధురి.వారణాసి
మీ కు అభినందనలు
ఒక్కోసారి తొందరపాటు లో ఏమరుపాటు.. ఎప్పుడైనా, ఎక్కడైనా సమూహ కార్యక్రమంలో పాల్గొనే వేళ ఖరీదైన వస్తువులు ఎవరికి వారే బాధ్యతగా ఉండాలి అని అంతర్లీన అర్ధాన్ని బలే గా చెప్పారు సర్🌹 ——కొట్టే సుధాకర్ రెడ్డి హన్మకొండ
రెడ్డి గారూ ధన్యవాదాలు సర్
I have practically seen some people like Savithri who feel unrest if everything goes well. The story showed this through her mischief of stealing her husband’s mobile to blame the host. రచయిత ఈ కథలో ఈ కారెక్టర్ ను, నాటకీయము చూపించి రక్తి కట్టించారు
Excellent corect Good afternoon —– prasad.mvv
Thank you ji
చిన్న అంశాన్ని కథగా హృద్యంగా మలిచారు. బాగుంది. —-ఆనంద కుమార్ హైదరాబాద్.
సర్ కృత జ్ఞత లు.
కథ చదివాను. ఎప్పటిలా మీరు చిన్న కథల స్పెషాలిస్టే. కథ బాగుంది సర్ ధన్యవాదాలు. –డా.తాటి నరహరి ముంబై.
డాక్టర్ గారూ ధన్య వాదాలండీ
పొరపాటున ఆయనే చూసుకోలేదోమో సర్. వేడుకలలో జరిగే చిన్న చిన్న పొరపాట్లను బాగా వివరించారు.ధన్యవాదములు సర్
లేడు సాగర్ కావాలని భర్తకు టె న్సన్ లో పెట్టడానికి చా డస్టపు క్రీడ.
కథ సింపుల్ గా బాగుంది. ఎండింగ్ లో చదువరుల బుర్ర కు మంచి పని పెట్టారు, మొబైల్ phone ni ఎవరూ బట్టల మధ్యలో పెట్టారా అని. బాగుంది, ఛార్జింగ్ అయిపోయాక చూసి, అది చిన్నయ్య గారి ఫోన్ అని తెలిసి చిన్నయ్య గారి సూట్ case lo petti ఉండవచ్చు. Overall burra ku పనిచెప్పారు. చాలా బాగుంది. —సత్య ప్రసాద్.ఎం.వి. విజయవాడ.
ప్రసాద గారూ ధన్యవాదాలు.
చిన్న కథ అయినప్పటికిని అన్ని హంగులతో చక్కగా వివరించారు .పోయిన ఫోన్ దొరికింది …అని సంతోషించక చిన్నయ్య ముఖం కోపంతో ఎర్రబడి పోవడానికి కారణం… ఊహకు అందకుండా ఉంది. ఎందుకంటే తనే చార్జింగ్ లో పెట్టాను …అని అనుకొని, పెట్టకపోవడం,లేదా చార్జింగ్ అయిన తర్వాత తీసి సూట్ కేసులో పెట్టి కూడా ఎవరో దొంగిలించారని పొరపాటుగా భావించి ఉంటే కోపపడవలసిన పనిలేదు. ఇక మేనత్త సావిత్రి విషయానికి వస్తే …పెళ్లి ఇంట్లో ఏదో ఒక రాప్తాంతము చేయాలనే మనస్తత్వం కలిగిన వ్యక్తి ,తన భర్త ఫోన్ ని తీసి సూట్ కేసులో దాచిపెట్టి, తిరిగి భర్తను నిందించవలసిన అవసరం లేదు. పెళ్లికి ఆహ్వానించిన వ్యక్తులతో గాని లేదా వారికి సంబంధించిన ఇతర బంధువులతో కానీ ఈ విషయంపై గొడవపడేది కదా! రచయిత గారి రచనలోని వైవిద్యము నాలాంటి సాధారణ పాఠకుల ఊహకు అందుట లేదు. —బి.రామకృష్ణ రెడ్డి సఫిల్ గూడ.
రెద్దిగారూ ధన్య వాదాలాండీ.
భలేగా ముగించారు
ధన్యవాదాలండీ
సర్ ఈ కథలో కొసమెరుపు సావిత్రి గారే గొడవ సృష్టించడానికి ఫోన్ దాచి ఉంటారని.సమస్యలు పుట్టించాలి అనుకున్న వాళ్ళని ఎవరం ఆపలేం.కానీ ఇలాంటి వ్యక్తుల్ని అంతా ఎంత ఎహ్యంగా చూస్తారో అన్నది వారు ఊహించలేరు.ఎవరో ఒకరు ప్రతి కుటుంబంలోనూ ఉంటారు ఈ కథతో చాలా మంది ఐడెంటిఫై చేసుకుంటారు తమ అనుభవాల్ని. చివరిగా ఎవరింటికైనా వెళ్లి అక్కడ వస్తువుల్ని పోగొట్టుకున్నామని గోల చేస్తే ఆ ఇంటి వారు అనుభవించే బాధ, ఫంక్షన్ లోని ఆనందం ఆవిరవడం చెప్పనలవి కాదు.అందుకే వ్యక్తిగత జాగ్రత్తే మందు.సావిత్రి గారి లాంటివారైతే మనమేం చేయలేము.చిన్న కథలో బోలెడు అనుభవాల పొరల్ని తట్టిలేపే అంశాలు ఉన్నాయి సర్.బావుంది కథ.👌💐💐💐🙏 —-నాగజ్యోతి శేఖర్ కాకినాడ.
అమ్మా బాగా కనుక్కున్నారు అభినందనలు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
ఆచార్యదేవోభవ-24
జ్ఞాపకాలు – వ్యాపకాలు – 6
ఆకాశవాణి పరిమళాలు-37
విభిన్నమయిన రచనలు విశిష్టమయిన రీతి- సంచిక అవలంబించే నీతి
కుసుమ వేదన-6
ఉపన్యాస పయోనిధి – పుస్తక పరిచయం
మహాప్రవాహం!-35
సరస్వతీ! నమస్తుభ్యం
ఆకాశవాణి పరిమళాలు-29
From Fear to Fulfilment – The Epic Fall and Rise of a Raindrop
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®