ఎవరికోసమో నీవు నీకోసమే నేను గమ్యమెరుగని నీవు నీవే గమ్యమైన నేను నీవు వెదుకుతున్నావు నేను నీ వెనుకే ఉన్నాను మనసెరిగిన నిరాశ నీది మనసిరిగినా….. ఆశ నాది కలత చెందిన కన్నీరు నీది కన్నీరు నిండిన కన్ను నాది స్పందన లేని హృదయం నీది హృదయం లేని స్పందన నాది నీకు బ్రతుకు శాపం అదే నా జీవితానికి లోపం ఒకటే దారి ఇద్దరిదీ ఒక్కటయ్యే దారేదీ? నీవు పంతం వదలవు నేను ప్రేమ నొదలను ఆట ఆడిందెవరు? ఆడి ఓడేదెవరు? గెలుపోటముల కారణమెవరు? ఎవరో తెలియని నీవు నీవని తెలిసినా నిస్సహాయంగా నేను ఆడి అలిసేది నీవు ఓడి నిలిచేది నేను అదిగదిగో ప్రియతమా! మనిద్దరి ఆట చూసి దేవుడు నవ్వుతున్నాడు
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
మరోసారి ‘జగజ్జాణ’ – సరళంగా, సంక్షిప్తంగా!!-23
దిగులు
మరుగునపడ్డ మాణిక్యాలు – 7: ఫ్లైట్
శ్రీవర తృతీయ రాజతరంగిణి-18
భూతాల బంగ్లా-7
పెద్ద మనసు
వ్యామోహం-9
అన్నింట అంతరాత్మ-24: హలో,, హలో నేనండీ ఫోనును!
తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర-14
‘సిరికోన’ చర్చాకదంబం-11
అన్నం విలువ మనసుకు తాకేలా వివరించారు... ప్రతిదీ వివరంగా పరిశీలించి అందిస్తున్నందుకు ధన్యవాదాలు...🙏
Thank you somuch sir
ధన్యవాదాలు సర్.
సుబ్బారావు గారు ధన్యవాదాలు మీకు.
వేణు గారూ ధన్యవాదాలు
All rights reserved - Sanchika®