కవి కలం కలవరపడుతోంది- కల్లోలమైన సమాజాన్ని అక్షరీకరించలేని అశక్తతతో..!
అక్షరం అల్లాడుతోంది, అతుకుల బొంతల అనుబంధ బాంధవ్యాలను అర్థం చేసుకోజాలక!!
కవిత తికమక పడుతోంది, సామాన్యుడి కష్టాలకు అసలైన అర్థాలు వెతకలేక..!
విమర్శకుల నోళ్లు మూతపడ్డాయి విషం చిమ్మే అధికార వ్యవస్థల అదుపులేని ఆగడాలతో!!
అర్థవంతమైన రచనలతో, సమాజానికి దశ, దిశ చూపే, రచయితలు సైతం.. స్పందనలేని సమాజాన్ని వీక్షించి, విరక్తితో నవ్వుతున్నారు!!
ఇదే నేటి సమాజ పయనం.. గమ్యం తెలియని… గందరగోళ రాజ్యం!!
సాగర్ రెడ్డిగారి పూర్తి పేరు పెనుబోలు విద్యాసాగర్ రెడ్డి. స్వంత ఊరు నెల్లూరు జిల్లా, నెల్లూరుపల్లి కొత్తపాళెం గ్రామము. ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్య నెల్లూరుపల్లి కొత్తపాళెంలోని ప్రాదమిక మరియు జిల్లాప్రజాపరిషిత్ పాఠశాలలో పూరి చేశారు. ఎన్ బి కె ఆర్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్ నుంచి బికాం వరకు చదివారు. చెన్నై లోని విక్కీ ఇండస్ట్రీస్‌లో మార్కెటింగ్ విబాగంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నారు. కవితా రచనలు ప్రవృత్తి. ఇప్పటి వరకు 400 కవితలు రచించడం జరిగింది.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
వగ
సంస్కృత శ్లోకాలు – తెలుగు పద్యాలు 23
రాత్రి
‘శ్రీమతి సంధ్యా యల్లాప్రగడ – రచనలు – విశ్లేషణ’ సాహిత్య సభ – నివేదిక
పదసంచిక-85
కాలంతోబాటు మారాలి – 7
తోలుబొమ్మలు
‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్’-16 – మన్ రే తూ కాహే నా ధీర్ ధరే
అద్వైత్ ఇండియా-1
జీవన రమణీయం-79
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®