సంచికలో తాజాగా

Related Articles

32 Comments

  1. 1

    D. Umashanker

    వైద్యో నారాయణో హరిః ప్రభుత్వాల బాధ్యతా రాహిత్యంతో, వైద్యుల వ్యాపార దృక్పథంతో కునారిల్లుతున్న నేటి పరిస్తుతల్లో మీలాంటి, మీరు పరిచయం చేసిన వారిలాటి అవసరం ఎంతైనా ఉంది. మీబోటి సహృదయ వైద్యులకు శతకోటి వందనాలు

    Reply
  2. 2

    sagar

    నిజమే సర్. ఏ నాటికైనా సమాజంలో వైద్యుడిపాత్ర ప్రత్యేకమైనదే. మీరన్నట్లు రాజకీయ జోక్యాలు ఎక్కువై సామాన్యుడి చెంతకు చేరే నాణ్యమైన వైద్యం చాలా తక్కువ. ఆ నాణ్యమైన వైద్యం ప్రైవేటు ఆసుపత్రులు ధనికులకు మాత్రమే అందించడమే నేడు జరిగేవిచారకరమైన పరిణామం.ఇక మీ ఊరిలో అవకాశాలు తక్కువైనా ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకుని ఎదిగిన వైద్యులందరికీ(మీతో సహా)హృధయపూర్వక అభినందనలు.ఋమీకు ప్రత్యేక ధన్యవాదములు సర్.

    Reply
  3. 4

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    👏👏👏బాగుంది మీవూరి
    వైద్యుల పరంపర !అంకితభావంతో సేవలనందించే ప్రతి వైద్యుడూ నారాయణుడే !కార్పొరేట్ దోపిడీ వైద్య వ్యవస్థలతో పాటు… అత్యధిక ప్రేమపూరిత సేవాభావంతో వైద్య సేవలందిస్తున్న మావిశాఖ kgh. లాంటి పవిత్ర వైద్యాలయాలు, డాక్టర్ దేవుళ్ళకు వినమ్ర నమస్కారాలతో…అనేకఉచిత వైద్య సేవలను పొందిన కోరాడ నరసింహారావు 🙏💐🙏🌷🙏

    Reply
    1. 4.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

      Reply
  4. 5

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    నిజమే సార్! మీరన్నట్లు వైద్య వృత్తి ఎంతో గౌరవప్రదమైనది, మరియు బాధ్యతాయుతమైనది .వారి ఆహార్యమే వారికి చేతులెత్తి నమస్కరించాలి! అనే భావన కలిగిస్తుంది .అధిక శాతం మంది వైద్యులు దానికి అనుగుణంగానే ప్రవర్తిస్తున్నారు కూడా.
    ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టి , సరైన ప్రోత్సాహము మరియు అవకాశాలు లేకపోయినా, వ్యయ ప్రయాసలకోర్చి వైద్య విద్యను అభ్యసించడం… అన్నది సామాన్య విషయం కాదు ఆ రోజుల్లో. అటువంటి ఘనతను సాధించిన వారిలో మీరు ఒకరుగా ప్రసిద్ధిగాంచినందులకు చాలా సంతోషం. “ఏరు దాటిన తర్వాత తెప్ప తగలబెట్టే” మనస్తత్వం గల మనుషులున్న ఈ రోజుల్లో పుట్టిపెరిగిన ఊరికి ఏదో కొంత సహాయం చేయాలనే దృఢ సంకల్పంతో తోటి వైద్యుల సహకారంతో ,మీ శక్త్యానుసారము సేవా కార్యక్రమాలు మీ సొంత ఊరిలో తలపెట్టడం
    మీకు మాతృభూమి పైన ఉన్న కృతజ్ఞతకు నిదర్శనం.
    కేవలము వైద్యులే కాకుండా, సొంత ఊరు వదిలి పెట్టి ,అక్కడక్కడా స్థిరపడిపోయిన ఇతర వృత్తి నిపుణులు… ముఖ్యంగా వ్యాపారస్తులు ,ఇంజనీర్లు , విద్యావేత్తలు, కాంట్రాక్టర్లు, కళాకారులు మొదలగువారు అప్పుడప్పుడు సమావేశమై తమ గ్రామానికి ఏ ఏ వసతులు అవసరమో, దానికి అనుగుణంగా ప్రణాళికలు రచించి, వాటిని అమలు చేయగలిగితే సమాజం ఎంతో అభివృద్ధి సాధిస్తుంది . రచనా రూపంలో మీరందించిన ఈ జ్ఞాపకాన్ని చదివిన తర్వాత, కొందరైనా స్పందించి తదనుగుణంగా ప్రణాళిక రచిస్తారని ఆశిద్దాం!
    ———బి.రామకృష్ణా రెడ్డి
    సికింద్రాబాద్.

    Reply
  5. 6

    డి. వి. శేషాచార్య

    అవునండీ. డా. అల్లూరి రాజకుమారి గారిది గొప్ప సాహిత్యాభిరుచి. ప్రతి సంవత్సరం ఒక రచయితను ఎంచుకొని ఆ రచయిత సాహిత్యంపై నాలుగైదు రోజులు( డిసెంబర్ నెలలో అనుకుంటా)ఉత్సవాలు జరిపించారు. రాష్ట్రంలోని ప్రముఖ సాహిత్య కారులను ఆహ్వానించి ఆ రచయిత గురించి మాట్లాడించేవారు. ప్రసంగ వ్యాసాలను చక్కగా ఫైల్ చేసేవారు. వారి ఆతిథ్యం కూడా అద్భుతంగా ఉండేది. విశ్వనాథ వారిపై జరిపిన సాహిత్యోత్సవాలకు నేను కూడా వెళ్ళినాను.
    సుప్రసన్న, సంపత్కుమార,జి.వి. సుబ్రహ్మణ్యం,బేతవోలు,నండూరి రామకృష్ణమాచార్య, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ వంటి ప్రముఖుల ప్రసంగాలు వినే అవకాశం దక్కింది. ఈ ఉత్సవాలకు వారి ఆసుపత్రి పూర్తిగా అతిథుల ఆవాసంగా మారేది.

    Reply
    1. 6.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      వారిని
      గుర్తు చేసుకోవడం
      అభినందనీయం.

      Reply
  6. 7

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    ముందుగా మీకు అభినందనలు , ఇది 108 వ భాగం కావడం ఒక విశేషం …. ఈ సంఖ్య మన సంప్రదాయం లో ఒక ప్రత్యేకత ఉన్న సంఖ్య ….. అష్టోత్తర శత నామాలే అందరు దేవుళ్లను పూజించే మంత్రాలు , అన్ని శతకాలూ 108 పద్యాలతో కూర్చబడి ఉంటాయి , ఇంకా ఇలా ఈ 108 సంఖ్యకు చాలా ప్రాధాన్యం ఇచ్చింది మన సంప్రదాయం …. ఇవ్వాళ మీరు రాసిన విషయానికీ ఒక ప్రత్యేకత ఉందనిపించింది ….. రాసింది వైద్యరంగం గురించి , రాసిన మీరు స్వయానా వైద్యులు , పైగా ఆ రంగం లోని వాళ్ళతో దగ్గరి అనుబంధం ఉన్నవారు ,దాని లోతులూ తెలిసినవారు …… అన్ని విషయాలనూ అతి సమీపంనుండి చూసి పరిశీలించిన వారు కనుకనిస్సందేహంగా ఇదొక ప్రత్యేకత కలిగిన అంశమే …….. మీరన్నట్టు మీ స్వగ్రామం నుంచి , బంధువులలోంచి చాలా సంతోషకరమైన అంశం …… కానీ అందరికీ తమతమ స్వగ్రామానికి సేవ చేసే అవకాశం రాకపోవచ్చు ….. ఈ రోజుల్లో అయితే వైద్యవిద్య చదివే లక్ష్యమే వేరు …..aఆదర్శాలు లేవు , సేవలు లేవు ఏవీ లేవు , కేవలం వ్యాపారం ….. మీరు అప్పటితరం చూశారు , ఇప్పటి తరాన్ని చూస్తున్నారు కనుకనే మొదట్లోనే ఈ అనారోగ్యభావాలను గురించి ప్రస్తావించారు …. మనుషులజీవితాల విలువలు మారిపోతున్న దృశ్యాల్ని చూడటమే కాదు దాని పర్యవసానాల్నికూడా ఎదుర్కొంటున్నవారినీ కలుస్తుంటారుకదా !!!! నేటి భాగాన్ని వైద్య విద్యా రంగాన్ని గురించీ , ఆ రంగంలో రాణిస్తున్న ఆత్మీయులను గురించీ తెలిపారు … ధన్యవాదాలు సర్ ………
    —గన్నమరాజు గిరిజామనోహర్ బాబు
    అమెరికా.

    Reply
  7. 8

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    మీ సుదీర్ఘ స్పందనకు
    ధన్యవాదాలు సర్ మీకు.

    Reply
  8. 9

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    Deyyvulla tharvatha doctors nu devullu antaru.meeru yanchu kunna doctor vrutti entho goppadi.mee vuri lo camps petti andinchina sevalu goppavi marchi polaynivi annayya gaaru
    ——-Jayamma
    USA

    Reply
    1. 9.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      జయమ్మ కు
      ధన్యవాదాలు.

      Reply
  9. 10

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    ఇన్ని సంవత్సరాలైనా పుట్టిన ఊరును మనుషులను మనస్తత్వాలను వారి సేవలను గుర్తు పెట్టు కోవడం మీ మంచితనానికి స్వంత గడ్డపై మీకున్న మమకారాన్ని తెలియచేస్తుంది సార్ మీ సహృదయ జ్ఞాపకాల పందిరికి హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏
    అఫ్సర వలీషా
    ద్వార పూడి.

    Reply
  10. 11

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    నిజమే సార్! మీరన్నట్లు వైద్య వృత్తి ఎంతో గౌరవప్రదమైనది, మరియు బాధ్యతాయుతమైనది .వారి ఆహార్యమే వారికి చేతులెత్తి నమస్కరించాలి! అనే భావన కలిగిస్తుంది .అధిక శాతం మంది వైద్యులు దానికి అనుగుణంగానే ప్రవర్తిస్తున్నారు కూడా.
    ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టి , సరైన ప్రోత్సాహము మరియు అవకాశాలు లేకపోయినా, వ్యయ ప్రయాసలకోర్చి వైద్య విద్యను అభ్యసించడం… అన్నది సామాన్య విషయం కాదు ఆ రోజుల్లో. అటువంటి ఘనతను సాధించిన వారిలో మీరు ఒకరుగా ప్రసిద్ధిగాంచినందులకు చాలా సంతోషం. “ఏరు దాటిన తర్వాత తెప్ప తగలబెట్టే” మనస్తత్వం గల మనుషులున్న ఈ రోజుల్లో పుట్టిపెరిగిన ఊరికి ఏదో కొంత సహాయం చేయాలనే దృఢ సంకల్పంతో తోటి వైద్యుల సహకారంతో ,మీ శక్త్యానుసారము సేవా కార్యక్రమాలు మీ సొంత ఊరిలో తలపెట్టడం
    మీకు మాతృభూమి పైన ఉన్న కృతజ్ఞతకు నిదర్శనం.
    కేవలము వైద్యులే కాకుండా, సొంత ఊరు వదిలి పెట్టి ,అక్కడక్కడా స్థిరపడిపోయిన ఇతర వృత్తి నిపుణులు… ముఖ్యంగా వ్యాపారస్తులు ,ఇంజనీర్లు , విద్యావేత్తలు, కాంట్రాక్టర్లు, కళాకారులు మొదలగువారు అప్పుడప్పుడు సమావేశమై తమ గ్రామానికి ఏ ఏ వసతులు అవసరమో, దానికి అనుగుణంగా ప్రణాళికలు రచించి, వాటిని అమలు చేయగలిగితే సమాజం ఎంతో అభివృద్ధి సాధిస్తుంది . రచనా రూపంలో మీరందించిన ఈ జ్ఞాపకాన్ని చదివిన తర్వాత, కొందరైనా స్పందించి తదనుగుణంగా ప్రణాళిక రచిస్తారని ఆశిద్దాం!
    –బి.రామకృష్ణా రెడ్డి
    సికింద్రాబాద్.

    Reply
    1. 11.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      ధన్యవాదాలండీ
      రెడ్డి గారు….

      Reply
  11. 12

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    జ్ఞాపకాల పందిరి 108 ఇపుడే చదివాను బాగుంది.మీరు చెప్పినట్టు సమాజంలో ఎప్పటికయినా వైద్యుడి పాత్ర చాలా ముఖ్యమైనది, ప్రత్యేకమైనది,పవిత్రమైనది మరియు గౌరవప్రదమైనది కూడా. డాక్టర్ గారి అనుభవాలు చాలా గొప్పగా ఉన్నాయి.అవే కాకుండా ఫోటోలు జాగ్రత్తగా దాచుకుని,ఆయొక్క పరంపర సన్నివేశాలు మర్చిపోకుండా రికార్డ్ చేసుకుని ఇన్ని సంవత్సరాల తరువాత పుట్టి పెరిగిన ఊరి వాతావరణం, మనుషులు వారి మనస్తత్వాలు, వారు చేసిన సేవలు గుర్తుపెట్టుకొవడం మీ మంచి తనానికి నిదర్శనం సర్.మీ జ్ఞాపకాల పందిరిలో ప్రతి సంచిక చాలా ప్రత్యేకమైన కొత్త కోణంలో మంచి విషయాలు అందిస్తున్న మీకు ధన్యవాదములు సర్.🙏
    —-ఎన్. భుజంగరావు
    హన్మకొండ.

    Reply
  12. 13

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    ఇప్పుడే చదవడం పూర్తి అయింది
    డా.కె.ల్వి.ప్రసాద్ గారు
    మీఅనుభవాలను అనుభూతులను,
    ఎందరో వైద్యులను మరియు కె.కె.మీనన్ గారి గురించి తెలిపిన
    విధానం చాల బాగుంది
    అభినందనలు 👏💐
    —-లలిత కుమారి
    అడ్వకేట్
    హైదరాబాదు.

    Reply
  13. 14

    గుండాన జోగారావు, SIMHACHALAM

    నమస్కారం. మీ జ్ఞాపకాల పందిరి స్పర్శించాను. నయనానందకరమైంది. మా పెద్దబ్బాయి+ కోడలు డాక్టర్లు. వారికి ఈ పోస్ట్ పంపిస్తున్నాను. మీ జ్ఞాపకాల పందిరి ఒక సంపుటిగా తీసుకువచ్చినప్పడు తప్పకుండా ఫుస్తకాన్ని ఓ మెడికల్ కళాశాలలో వైద్య విద్యార్థుల మధ్య ఆవిష్కరింపజేస్తే, వారికి ప్రేరణ ఇస్తూ సమాచారయుక్తంగా ఉంటుంది.
    అభినందనలతో
    మీ…గుండాన జోగారావు, సింహాచలం , విశాఖపట్నం

    Reply
    1. 14.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  14. 15

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    జ్ఞాపకాల పందిరి 108 లో దిండిలో పుట్టిన వైద్యుల గురించి, వారి సేవా తత్పరత గురించి చక్కగా తెలిపారు. దంత వైద్యుడిగా మీరు పుట్టిన ఊరికి సేవచేశారు. వైద్య వృత్తి నేడు వ్యాపారమైంది.
    —జి.శ్రీనివాసాచారి
    కాజీపేట.

    Reply
  15. 16

    గీతాచార్య

    చాలా విశేషాలు అందిస్తున్నారు సార్. మీలాంటి పెద్దలు ఇలా రాస్తుంటే ఎన్నో ఉపయుక్తమైన విశేషాలు కాక అప్పటి కాలపు first hand experiences మా తరఫు వారికి తెలుస్తుంటాయి.

    Reply
  16. 17

    శ్యామ్ కుమార్ చాగల్

    ఈ మారు వైద్య వృత్తి , ఆ రంగం లో విద్య , దాని పూర్వాపరాలు చెప్తూ అందులో కల సేవ భావాన్ని వివరించారు రచయిత డాక్టర్ కె ఎల్వి ప్రసాద్ గాను. తాను కొనసాగించిన వృత్తి అదే కావటం మూలాన అనుకుంటాను దాని గురించి మంచి అవగాహన తో అన్ని విషయాలను కూలంకషంగా ఉటంకించారు.
    ప్రభుత్వ రంగం నుండీ వైద్య విద్య అనేది వాణిజ్య విద్య గా మారటం మూలంగానే మధ్య తరగతి భారతీయులకు అదొక శాపంగా మారిందనేది విస్మరించలేని నిజం. ఒకప్పుడు విద్యార్ధి తెలివి తేటలతో అలరారిన వైద్య రంగం ఇప్పుడొక వాణిజ్య విఫణి గ మారి , ధనవంతుల చేతిలో దోపిడీ వ్యవస్థ కింద రూపాంతరం చెంది సామాన్యుల కు అందనంత ఎత్తుకు ఎదిగి పోయింది. కార్పొరేట్ ఆసుపత్రులు అయితే మొత్తంగా ఓక అయిదు నక్షత్రాల హోటల్ గా మారి పోయాయి. ఇప్పుడదోక వ్యాపార సామ్రాజ్యం.

    కరోనా కత్తులు దూసి ప్రజల ప్రాణాలను అలవోక గా హరిస్తున్న వేళ , ఈ గొప్ప గొప్ప ఆసుపత్రులు సామాన్య ప్రజానీకాన్ని ఏ విధంగా నిలువు దోపిడీ చేశాయో మనమందరమూ కళ్లారా చూసాం. అంతే కాదు దోపిడీని ఆప గలిగే శక్తి వుంది కూడా కూడా ప్రభుత్వం కళ్లప్పగించి చూస్తూ ,కుమ్మక్కు స్నేహం కొనసాగించింది.

    దిండి ప్రాంత బీద రికం యొక్క పట్టుదలే అంత మంది డాక్టర్ లను తయారు చేసింది. ఆ రోజుల్లో కల సామాజిక ఆర్ధిక అసమానలతకు ఎదురొడ్డి విధ్య నార్జించిన వారి పట్టుదల ఎంతో గొప్పది. తాను పుట్టి పెరిగిన ఊరిని మర్చిపోకుండా తిరిగి ఆ ఊరి ప్రజలకు సేవలందించిన వారందరినీ అభినందించాల్సిందే .
    అక్కడ సేవలందించిన ఎంతో మంది డాక్టర్ లను పేరు పేరున గుర్తు పెట్టుకుని సంచిక ద్వారా నిస్వార్థంగా మనకు పరిచయం చేసిన అభినందనీయుడు డాక్టర్ కె ఎల్వి ప్రసాద్. ఇంటర్ సి, నాగార్జున సాగర్లో అతడి తో కొంత కాలం చదివి, స్నేహితుడైన నేను అదృష్టవంతుడిని. సంచిక కు అభినందనలతో ..శ్యామకుమార్ చాగల్ , నిజామాబాదు

    Reply
  17. 18

    Shyamkumar chagal

  18. 19

    ఎల్.వి.ప్రసాద్. కానేటి.

    అష్టోత్తర శతభాగం చదిపిన. జ్ఞాపకాలపందిరి.
    వైద్య వృత్తి చాలా పవిత్రమైనది.మనుషుల ప్రాణాలను నిలబెట్టేది..అయితే ప్రతి వృత్తి లో వున్నట్టే మంచి చెడ్డలు ఈ వృత్తి నిర్వాహకులలోనూ ఊన్నది.డెడ్ బాడీకి డిస్టిల్డ్ వాటర్ ఇంజక్ట్ చేసి డబ్బు డిమాన్డ్ చేసిన డాక్టల్లను చూసిన ( చంద్రశేఖర్ అనేటాయన) .అదీ ప్రభుత్వ సర్వీస్ లొ వుంటూ.
    ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తూ పేదలైనపెషంట్లకు ఫీజు తీసుకోక పోవే కాక తనే ఎదురిచ్చిన డాక్టర్లనూ చూసినా( డా: చంద్రమౌళీశ్వరరావు కీ శే: వంటివారు)తక్కువ ఫీజుతో వైద్యం చేసి రూపాయి మాత్రమే తీసుకొనిమందిచ్చి రూపాయి డాక్టరుగా పేరుపొందిన వాళ్ళనూ చూసిన.అంతా బాగానే వుందిఅని గానీ అంతా చెడేఅనిగానీ అన లేను.కాని అన్ని రంగాలలో దిగజారినట్టుగానే నీతి-నిజాయితీ ఈరంగంలోనూ దిగజారిందని అందరు ఒప్పుకొనే మాటే.
    ఐతే మనుషుల ప్రాణాలు ఇన్వాల్వ్ ఐతవిందులో .దినిలో స్టాఅండర్డ్స్
    దిగజారకూడదు.
    వి ఎన్ వాగ్రే, ధర్మా రావు, ప్రసాదరావు వంటివ్రినీ
    సుబ్బారావు వంటి వారినీ చూసినం.
    సమాజంలో కార్పొరేట్ దృక్పథం చొరబడ్డాక, ఆసుపత్రుల నిర్వహణ మేనేజర్ ల చేతిలో పడ్డాక దోపిడీ ఎక్కువైందని అంటరు. ప్రతి విషయం లోనూ రాజకీయజోక్యం ముఖ్యకారణం అనక తప్పదేమో.
    ఏదిఏమైనా సేవారంగంతో ముడిపడిన వైద్య వృత్తికి మీ వూరు కంట్రి బ్యూషన్ చెప్పుకోదగ్గదే.మీ వూరికి వందనం.మీకు అభినందనలు .
    మామూలు గా మాట్లాడితే
    అక్కడక్కడ ధర్మాత్ములున్నరు గనుకనే ఈ ప్రపంచం ఇంక మునిగి పోకుండ వున్నది.
    —రామశాస్త్రి
    హన్మకొండ

    Reply
    1. 19.1

      ఎల్.వి.ప్రసాద్. కానేటి.

      ధన్యవాదాలండీ శాస్త్రి గారు.

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!