అలా కాకుంటే…
కొన్ని జీవితాలు ఎలావుండేవో! ఊహించలేని సందర్భాలవి. అలా కావడం వల్ల జరిగిన విషయాలు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మంచి జరిగితే గతం గుర్తుకు రాదు! జరగకూడనిది ఏమైనా జరిగితే అలా వుంటేనే బావుండేది అనిపిస్తుంది.
జీవితంలో కొన్ని సంఘటనలు తలరాతనే మార్చేస్తాయి. ఊహించని విధంగా, అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ మార్పులు మంచివైతే భవిష్యత్తును మహత్తర దశకు చేర్చేది కావచ్చు, లేదా అధఃపాతాళానికి దించేది కావచ్చు. సాధారణంగా మంచి జరిగినప్పుడే పదే పదే గుర్తు చేసుకోవాలని అనిపిస్తుంది. ఇది సాధారరణ మనిషి యొక్క మనస్తత్వం. అలంటి సంఘటనలు ఎందరి జీవితాల్లోనో చోటుచేసుకుంటాయి. ఆ అనుభవాలు తెలుసుకుంటే, అవి కొందరి జీవితాలకైనా స్ఫూర్తినివ్వక మానవు. ఇబ్బందులు కలిగినప్పుడు, వాటినే తలచుకుంటూ, నిరాశాజనకంగా బ్రతకడం, మనిషిని మరింత కృంగదీస్తుందే తప్ప, ఎలాంటి మేలు చేయదు.


బాల్యంలో నేను


తల్లిదండ్రులు తాతయ్య, వెంకమ్మగార్లు
ఇలాంటి అనుభవాలు కొన్ని తెలుసుకొని ఉండడం నేటి యువతకు అవసరమే అనిపిస్తుంది. పాఠ్య గ్రంధాలు తప్ప సాధారణ గ్రంథాలు ఉదాహరణకి సాంఘిక నవలలు, కథల పుస్తకాలు, మహానుభావుల జీవిత చరిత్రలు, జీవితాన్ని కాచి వడబోసిన పెద్దల జీవిత అనుభవాలు మొదలైనవి చదవక పోవడంవల్ల, తల్లిదండ్రులు చదివించక పోవడం వల్ల జీవితం గురించిన మంచి చెడులు తెలుసుకునే అవకాశం లేకుండా పోతున్నది. దీనివల్ల వైవాహిక జీవితానికి, సామాజిక జీవితానికీ అర్థం తెలియక, అవగాహన చేసుకోలేక, లేత వయసులోనే తొందరపాటు నిర్ణయాలు తీసుకుని, బంగరు భవిష్యత్తును కాలదన్నుకుంటున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. పిల్లలే కాదు, తల్లిదండ్రులు కూడా బాధ్యతాయుతంగా ఆలోచించవలసిన విషయం ఇది.
నా బాల్యం చాలా క్లిష్ట దశలనుండి బయటపడింది. బాల్యాన్ని సరిగా అనుభవించలేని దౌర్భాగ్య స్థితి నాది. ఏ చిన్నపిల్లాడు అనుభవించకూడని వ్యథ నాది. దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే, ఈ రోజున నా జీవితం ఇలా వున్నత స్థాయిలో ఉండేవాడిని కాదు! ఎందుచేతనంటే నేను ఆర్థికంగా ఉన్నత స్థాయినుండి వచ్చినవాడిని కాదు! ఉన్నత విలువలు వున్న దిగువ మధ్యతరగతి నుండి వచ్చినవాడిని. కష్టాల కడలిని దాటి నేను ఒక స్థాయికి చేరుకొనేవాడిని కాదేమో! నా ఈ విషాద ప్రయాణం వెనుక ఎందరివో ఆపన్న హస్తాలు వున్నాయి. ప్రత్యక్షంగా కొందరు, పరోక్షంగా కొందరు నా అభ్యున్నతికి అండగా నిలిచారు. అందులో కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఉన్నారు!
అది 1967 అనుకుంటాను, స్వగ్రామం దిండిలో (తూర్పు గోదావరి) అయిదవ తరగతి పూర్తి చేసి, మా అప్పటి తాలూకా కేంద్రం అయిన ‘రాజోలు’ కు, హైస్కూల్లో చేరడానికి ప్రవేశ పరీక్ష రాయడానికి వెళ్లాను. నిజానికి మా నాయన ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి (చిట్టెయ్య మాష్టారు) చెప్పి ఐదో తరగతి ఫెయిల్ చేయించారు. ఉన్నత చదువుల కోసం మిగతా పిల్లలు వేరోచోటికి వెళ్లిపోవడం వల్ల నాకు ఆ సన్మానం ప్రాప్తించింది. భవిష్యత్తులో జరిగే నష్టాలను వాళ్ళు ఊహించలేదు. ఇకపోతే, ఆరో తరగతి ప్రవేశ పరీక్ష కోసం పెద్దన్నయ్య అనుచరుడు, మాకు దూరం చుట్టం నల్లి ప్రసాద్ గారు సైకిల్ మీద తీసుకెళ్లారు. ఈ ప్రవేశ పరీక్షను ‘ఇన్ టు ఫస్ట్ ఫామ్’ పరీక్ష అనేవారు.
ప్రవేశపరీక్ష గట్టెక్కి అర్హత సంపాదించాను. అప్పుడు మా స్కూల్ కోర్టుల దగ్గర ఉండేది. ఇప్పుడూ అక్కడే వుంది కానీ పూర్తిగా గర్ల్స్ స్కూల్ అయింది. అక్కడ రెండవ తెలుగు స్థానంలో సంస్కృతం తీసుకుని ఎనిమిదవ తరగతి వరకు చదివాను. సంస్కృతం సబ్జెక్టు తీసుకున్నవాళ్లంతా, ఆడపిల్లల ఏ -సెక్షన్లో ఉండేవాళ్ళం. నాటి మిత్రులు విన్నకోట లక్ష్మీపతి (రాజోలు కోర్టులో అడ్వకేట్), జి. బ్రహ్మానంద శర్మ(విశాఖ) ఇంకా నాకు టచ్ లోనే వున్నారు. వెంపరాల గోపాలకృష్ణ (హైకోర్టు లాయరు) మాత్రం కాలం చేసారు. ఎనిమిదవ తరగతి నా జీవిత మార్గాన్ని పూర్తిగా మార్చివేసింది. అంతులేని అయోమయంలో పడేసింది, ఊహించని మార్పును తీసుకు వచ్చింది. అదెలాగంటే…
నేను చదువు నిమిత్తం నా స్వగ్రామం వదిలి రాజోలు వెళ్లాను. సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉండేవాడిని. అప్పుడు ఈ వసతి గృహాలు ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించేవారు. అయితే ఒక నిబద్ధత ప్రకారం, క్రమశిక్షణతో నడిపేవారు. పిల్లలు కూడా అలాగే పట్టుదలతో చదివేవారు. నేను ఆశ్రయం పొందిన వసతి గృహాన్ని స్వర్గీయ గొల్ల చంద్రయ్య గారు నడిపేవారు. వారు నిష్కల్మషమైన స్వతంత్ర సమరయోధులు. అంత మాత్రమే కాదు, ప్రముఖ కవి, ‘పాలేరు’ నాటకం రచయిత, పద్మవిభూషణ్ బోయి భీమన్న గారికి ఈయన మామగారు.


గొల్ల చంద్రయ్య గారి హాస్టల్, రాజోలు
హాస్టల్లో వుండి చదువుకుంటున్న సమయంలో ఎనిమిదవ తరగతిలో నాకు అనారోగ్యం ఏర్పడింది. కుడికాలు తొడభాగం వాచి, నొప్పిపెట్టేది, జ్వరం వచ్చేది. వ్యాధి తీవ్రతను పసిగట్టే వైద్యసదుపాయాలు అప్పట్లో రాజోలులో లేవు. డా. మల్లికార్జున రావు గారు అనే ఎం.బి.బి.ఎస్. డాక్టరు ఒకాయన ఉండేవారు. మాకు తెలిసిన ఒక ఆర్. ఎం. పి,డాక్టరు గారు ఆయన దగ్గరకు తీసుకువెళ్లారు. ఆయనకున్న పరిజ్ఞానంతో నామీద రకరకాల ప్రయోగాలు చేసి, చివరికి సర్జరీ కూడా చేసి, ఇక తనవల్ల కాక, ఆఖరికి చేతులెత్తేశారు డాక్టర్ గారు. వేరే పెద్ద డాక్టర్‌కు చూపించమన్నారు.


అన్నయ్యతో నేను చిన్నప్పుడు
అప్పటికి కొద్దిసంవత్సరాల క్రితమే మా అన్నయ్య కె. కె. మీనన్ (ప్రముఖ నవల-కథా రచయిత) హైద్రాబాద్‌లో ఉద్యోగంలో చేరాడు. ఏ.జి.ఆఫీసులో పనిచేసేవాడు. కూబ్దిగూడలో నివాసం ఉండేవాడు. నా విషయం తెలుసు కున్న అన్నయ్య, వెంటనే నన్ను హైదరాబాద్ తీసుకురమ్మని ఫోన్ చేసారు. అప్పటికింకా మా అన్నయ్యకు పిల్లలు లేరు. చిన్నన్నయ్య నన్ను వెంటబెట్టుకుని ముందు విజయవాడ తీసుకువెళ్లాడు. అక్కడ మా పెద్దన్నయ్య కానేటి కృష్ణమూర్తి (టికెట్ కలెక్టర్-రైల్వే) పనిచేసేవారు. ఆయన,నా విషయం విని చాలా బాధపడి కొత్తగా మొదటిసారి హైదరాబాద్ వెళుతున్న మాకు దైర్యం చెప్పి, అవసరమైతే సహాయం చేయమని నాంపల్లి రైల్వే స్టేషన్ మాష్టరుకు ఉత్తరం రాసిచ్చారు. మమ్మలిని రైల్ ఎక్కించి వీడ్కోలు పలికారు. మేము ఎక్కిన రైలు ఏదో గుర్తులేదుగానీ, విజయవాడనుండి నాంపల్లి వెళ్లేసరికి తెల్లవారి బాగా వెలుగు వచ్చేసింది. భయం.. భయంగానే రైలు దిగాము. ప్లాట్‌ఫామ్ మీదికి దిగి చూసేసరికి అన్నయ్య మీనన్, వదిన శిరోరత్నం, మావైపు వేగంగా రావడం చూసి,హమ్మయ్య.. బ్రతుకు జీవుడా అనుకున్నాం. పొట్టి గూడు రిక్షాల్లో అందరం చేరుకున్నాం.
కూబ్దిగూడలో అన్నయ్య ఉంటున్న పోర్షన్ చాలా చిన్నది. నాకు గుర్తు వున్నంతవరకు దానికి అద్దె నెలకు 40/-. రెండు గదుల్లో, ఒకటి డ్రాయింగ్ రూమ్ కం -బెడ్రూం, రెండవది వంటగది కం అటాచ్డ్ బాత్. అన్నయ్యతో పాటు ఇంకా జేసురత్నం కుటుంబం, విజయానందం, సామ్యూల్ గారి కుటుంబం, రంగయ్య, షన్నో దేవి, నారాయణమ్మ, తదితరులు నివాసం ఉండేవారు. అంతా ఒక కుటుంబం మాదిరిగా ఉండేవారు. కిష్టయ్య, యాదయ్యల ఇళ్ళు అవి.
వీలు చూసుకుని అన్నయ్య రిక్షాలో ఉస్మానియా ఆసుపత్రికి తీసుకు వెళ్ళాడు. నిజాము కట్టించిన అంత గొప్ప భవనం నేను చూస్తానని ఎన్నడూ అనుకోలేదు. అప్పటికి ఇంకా కుక్కగొడుగుల్లాంటి నేటి కార్పొరేట్ ఆసుపత్రులు లేవు. పక్క రాష్ట్రాలకు కూడా ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులే దిక్కు! అందుచేత జనం కిటకిటలాడుతుండేవారు. నేను వెళ్ళవలసిన ఆర్థోపెడిక్ ఔట్ పేషేంట్ విభాగం కూడా జనంతో క్రిక్కిరిసి వుంది. అన్నయ్య నా పేరుమీద ఓపీ చిట్టీ తీసుకుని లోపలికి పంపించాడు.
నా వంతు వచ్చాక నా పేరు పిలిచారు. భయంగానే లోపలికి వెళ్లాను. లోపల రోగులకంటే డాక్టర్లే ఎక్కువమంది వున్నారు. అసలు పెద్ద డాక్టర్లు కాక, పి.జి.లు, హౌస్ సర్జన్లు వున్నారు. వీళ్ళు పరీక్షించిన మీదటే పెద్దవాళ్లకు చూపించి వ్యాధి నిర్ధారణ నిర్ణయం తీసుకుంటారు. ఈ ఆర్థోపెడిక్ విభాగం అధిపతిగా డా. ధర్మరాయ్ ఉండేవారు. ఈయన ఒక ఆంగ్లేయుడు మాదిరిగా ఎప్పుడూ నోట్లో సిగార్/పైప్ పెట్టుకునిఉండేవారు.
ఆయనకు అసిస్టెంట్లుగా డా.మధుసూదన్ రెడ్డి, డా.సి.ఎస్.రెడ్డి, డా.గోవర్ధన రెడ్డి గార్లు ఉండేవారు. అడ్మిషన్లు పూర్తిగా ధర్మరాయ్ గారి ఆధిపత్యంలోనే ఉండేవి. అందుచేత ఆయన ఆడింది ఆట, పాడింది పాటలా ఉండేది. అంటే హాస్పిటల్లో అడ్మిషన్ కావాలంటే ఇంటికి వెళ్లి సమర్పించుకోవలసిందే! ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ కల్చర్ అప్పటినుండీ వుంది. నా సమస్య మందులతో పరిష్కారం అయ్యేది కాదని, శస్త్ర చికిత్స తప్పనిసరని మొదటి రోజే తేలిపోయింది. కొందరు ఆసుపత్రి పెద్దల సలహా మేరకు అన్నయ్య, డా. ధర్మరాయ్ ఇంటికివెళ్ళి రెండు వందలు సమర్పించుకున్నాక నాకు ఆర్థోపెడిక్ వార్డులో అడ్మిషన్ సులభమైంది. అప్పట్లో ఒక సాధారణ ఉద్యోగి రెండువందలు లంచం ఇవ్వడం చిన్నవిషయం కాదు!


అన్నయ్య కూతురు డా.అపర్ణ.కానేటి
అలా మూడుసార్లు సర్జరీ జరగడం, డిశ్చార్జ్ చేసినప్పుడల్లా, అన్నయ్య వెళ్లి సమర్పించుకోవడం, ఇలా షుమారు మూడు సంవత్సరాలు గడిచిపోయాయి. బాధ వల్ల నేను ఏడవడం, నన్ను చూసి మా అన్నయ్య ఏడవడం మామూలు అయింది. డా. సి.ఎస్.రెడ్డి గారు ప్రొఫెసర్ అయిన తరువాత నన్ను చాలా బాగా చూసుకునేవారు. అందుచేతనే, అన్నయ్య రాసిన ఒక నవల డాక్టర్ గారికి అంకితం చేసి కొంతవరకూ డాక్టర్ రెడ్డి గారి ఋణం తీర్చుకున్నారు అన్నయ్య. ఎన్నో ఇబ్బందులను అధిగమించి మొత్తం మీద ఇంటికి చేరుకున్నాను. అప్పట్లో అన్నయ్య మాసాబ్ ట్యాంక్ దగ్గర అద్దెకు వుండేవారు. 1970 జనవరి అనుకుంటా, అన్నయ్యకు ప్రథమ సంతానం ఆడపిల్ల పుట్టడం (డా. అపర్ణ, ఐ -స్పెషలిస్ట్), నా జబ్బు తగ్గిపోవడం జరిగాయి. ఇప్పుడు ప్రథమ కర్తవ్యం ఆగిపోయిన చదువు మీద పడింది.
అన్నయ్య, కుటుంబ సభ్యుల సలహా మేరకు ‘ఉస్మానియా మెట్రిక్యులేషన్’ చదవాలని నిర్ణయం చేసారు. నాకు కూడా అదేమంచి మార్గం అనిపించింది కానీ, ఇన్ని సంవత్సరాల గేప్ తర్వాత చదవగలనా? అన్న సంశయం కూడా రాకపోలేదు. తప్పదు కష్టపడాలి, మనం చేయదగ్గ ప్రయత్నం చేయాలి, లేకుంటే భవిష్యత్తు లేదు! అందుకని చదవడానికి నిర్ణయం తీసుకున్నాను. పట్టుదల పెంచుకున్నాను. అన్నయ్య, చింతలబస్తీ దగ్గర, ఆనందనగర్‌లో వున్న ‘గుడ్ షెపర్డ్ ట్యుటోరియల్ కాలేజీ’ యాజమాన్యంతో మాట్లాడి అందులో చేర్చారు. రోజూ మాసాబ్ ట్యాంక్ నుండి ఆనంద్ నగర్ వరకు హాయిగా నడిచివెళ్లి వస్తుండేవాడిని. కొద్దిరోజులకు గాడిలో పడ్డాను. నాకే మంచి మార్కులు వచ్చేవి. అలా 1971లో పరీక్షా రాసి ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణుడినైనను. అప్పుడు నాగార్జున సాగర్‌లో వున్న పెద్దక్క ఆహ్వానంతో అక్కడికెళ్లి, హిల్ కాలనీలో వున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్లో ప్రవేశం పొందాను. 1972-74లో ఇంటర్మీడియెట్ పూర్తిచేశాను. మళ్ళీ అన్నయ్య సలహా మేరకు హైదరాబాద్ పయనం అయ్యాను. అప్పుడే కొత్తగా ప్రారంభమైన ఆర్ట్స్ & డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ పొంది బి.ఎస్.సి.లో జాయిన్ అయ్యాను.


మెట్రిక్యులేషన్ బ్యాచ్
ఇక్కడినుండి జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం అయిందని నాకు అనిపిస్తుంది. ఇక్కడ చదివిన మండలి బుద్ధ ప్రసాద్ (ఆర్ట్స్ గ్రూప్) తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసారు. నా సహాధ్యాయి డా. సత్యవోలు సుందర శాయి రేడియోలోనూ, దూరదర్శన్ లోను ప్రోగ్రాం ఎగ్జిక్యూయివ్గా పనిచేసారు. నేను ఆకాశవాణి లోనూ, దూరదర్శన్ లోను 1975 నుండి పాల్గొనే అవకాశం కల్పించింది శాయి గారే! ఇంకొక మిత్రుడు కృష్ణమోహన్ బ్యాంకు ఆఫీసర్‌గా పని చేసి రిటైర్ అయినాడు. మా స్నేహం ఇప్పటికీ కొనసాగుతూనే వుంది. రోజూ పలకరించుకుంటుంటాం.
చింతలబస్తీలో నెలకొల్పిన డిగ్రీ కళాశాలలో పేరున్న సీనియర్లు పని చేసారు. ప్రొఫెసర్ గంగప్ప (తెలుగు), డా. కోటేశ్వర రావ్ (ఆంగ్లం), డా. భవానీ శంకరం (బోటనీ) మొదలైనవారు. అయితే పూర్తి విద్యా సంవత్సరం పూర్తి కాకుండానే నాకు బి.డి.ఎస్ (దంతవైద్యం కోర్సు)లో అడ్మిషన్ దొరకడం, మధ్యలోనే కాలేజీ విడిచి వెళ్లిపోవడం జరిగింది.
నా జీవితానికి ఇది పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఆశాజనకమైన భవిష్యత్ సూచికలు అంకురించడం మొదలయింది. సరికొత్త జీవితం మొదలయింది. ఈ వృత్తి విద్యతో పాటు రచనా వ్యాసంగం కూడా ఎంతో పట్టుదలగా మెరుగుపెట్టుకోవడం జరిగింది. వ్యాసాలు రాయడం, యువవాణిలో రేడియో కార్యక్రమాలు ఊపందుకున్నాయి. 1980లో బి.డి.ఎస్. పాస్ కావడం, హౌస్ సర్జన్సీ తర్వాత, 1982లో ఆరునెలల పాటు బెల్లంపల్లిలోని సింగరేణి కాలరీస్ ఏరియా ఆసుపత్రిలో, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైద్య రంగంలో చేరి వివిధ స్థాయిల్లో దంత వైద్య విభాగాల్లో పని చేసి, 2011లో సివిల్ సర్జన్‌గా, కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో పదవీ విరమణ చేయడం జరిగింది. వైద్యుడిగానే కాక, సాహిత్యకారుడిగా కూడా మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది.
ఆనాడు అలా జరిగి ఉండకపోతే, నేను ఏమయ్యి వుండేవాడినో ఆలోచిస్తే భయం పుడుతుంది. బహుశ.. ఏ సీనియర్ అసిస్టెంట్‌గా రిటైర్ అయ్యేవాడినేమో! సమస్య వల్ల కృంగిపోయి ఉంటే ఏమయ్యేవాడినో…!
అందుచేత జీవితంలో ఎన్ని బాధలు వ్యథలు ఎదురైనా, మనిషి ఆశాజీవిగా తాను చేయదగ్గ కృషి చేయాలి గాని, క్రుంగి కృశించిపోకూడదు, ఇది నాకు జీవితం నేర్పిన గొప్ప పాఠం. ఇలా నాకు గొప్ప పునర్జన్మ ఇచ్చిన వాడు ఖచ్చితంగా మా పెద్దన్నయ్య, స్వర్గీయ కె.కె.మీనన్ మాత్రమే అని చెప్పగలను!! ‘అంతయు మన మేలుకొరకే’ అన్న నానుడి ఈ నేపథ్యంలో పుట్టిందేనేమో!
(మళ్ళీ కలుద్దాం)

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
132 Comments
డా.కె.ఎల్.వి.ప్రసాద్
జ్ఞాపకాల పందిరి లో మీరు రాసిన ప్రతి ఎపిసోడ్ …..ఎవరికి వారు తమ గత అనుభవాలను introspect చేసుకునేలా నిజ జీవితానికి దగ్గరగా ఉన్నాయి ……
చదువు కోసం మీరు పడ్డ తపన స్ఫూర్తిదాయకంగా ఉంది …

ప్రతీ frame లోమీకు కలిసిన అందరి పేర్లు చెప్పి ఆశ్చర్యపరుస్తారు …..
And once again Meenan garu showed the love and responsibility of the brother ….
_____శ్రీధర్ రెడ్డి.తుమ్మల
హనంకొండ.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
రెడ్డి గారూ
మీ స్పందన కు
ధన్య వాదాలు.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Chinnanagaru you faced many hardships in your childhood yet you never lost hope.It’s your determination and dedication that made you what you are today.Really


Menon pedanannagaru stood by you in your difficult times.Nowadays we seldom come across such personalities.
____లక్ష్మి నందన
రాజమండ్రి
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ఆమ్మా
నీ స్పందన కు
ధన్యవాదాలు
డా.కె.ఎల్.వి.ప్రసాద్
13th sanchika chala bagundi your child hood and health problems you mentioned everything you remembered clearly you mentioned about your turning point in your life
____Dr.T V Lu.
Kazipet.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Thank you Dr.
For your good words
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Doctor gariki namaskaramulu…
Mee gnapakaalu chala baga gurtu chestunnaru. Okka kshanam Meetho chuttu vunna janalaku matram varu kuda vari gnapakalaku mallinpa chestunnaru. Vurike ne pedda vallu kaaru. Entho kasta padda vare unnatha sthiti loki ragalugutharu. Adhi meeru ,maa vaari lanti vallu, inka endaro mahanubhavula nidarsham. Emaina miru matram mi jeevitha gnapakalanu okkokka mettu laga raastu vunte, appati ah badha nu anubavisthene ippudu paper meeda ku ragaligayi. Anduke mee raatha antha goppaga velligindhi. Anduke meeru kavi ga mararemo anipistundi.
pushpa Rajam.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Madam
Thank you
For your response
డా.కె.ఎల్.వి.ప్రసాద్
మీ విద్య, ఉద్యోగ జీవితానుభవాలతో ఈ సారి మీ ఙాపకాలపందిరి చాలా బాగుంది సార్. కష్టాలు వచ్చినపుడు కుంగిపోతే ఏంచేయలేమన్నది అక్షర సత్యం.మీ ధైర్యానికి జోహార్లు.
మీ సోదరుని సహకారానికి వందనాలు. 

_____డా.విద్యాదేవి.ఎ
హనంకొండ
డా.కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా
మీ స్పందన కు
ధన్యవాదాలు.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
[07/07, 15:24] MANJULA M. DR: Destiny will take you where you have to be. You will get what you are destined for.
[07/07, 15:25] MANJULA M. DR: I feel you have experienced the same because of your destiny.
_____ప్రొ.మంజుల
హైదారాబాద్.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Thank you
Dr.Manjula
For your
Response.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
శుభోదయం డాక్టర్ గారికి. మీ జ్ఞాపకాల పందిరి లోకి వెళ్లాను సేద తీరాను. ఎంతో ఆసక్తికరంగా సాగింది రచన. ఎక్కడ బోర్ కొట్టలేదు. మొత్తం మీద మీరు బాగా కష్ట పడ్డారు. నిరాశ కు గురి కాలేదు. అందువల్ల మీరు విజయం సాధించారు. నిరాశ వాదులకు మీ జీవిత చరిత్ర ఒక ఆలంబనం.


____అబ్దుల్ రషీద్
హైదారాబాద్.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
రషీద్ గారూ
మీ స్పందన కు
ధన్య వాదాలు.
చిట్టె మాధవి
మీ జీవితం ఎంతో మందికి ఆదర్శదాయకం సర్…ఎన్ని ఆటంకాలు ఎదురైనా… అనుకూల పరిస్థితులు లేకపోయినా…..మీలోని ఆత్మస్తేర్యం..మొక్కవోని పట్టుదల మిమ్మల్ని సమాజంలో ఇంత ఉన్నతస్థానంలో నిలబెట్టింది. అలాంటి తోబుట్టువులు దొరకడం ఎంతో అదృష్టం సర్.మీ జ్ఞాపకాలు…మేము ఎన్నో విషయాలు తెలుసుకోవడమే కాదు మమ్మల్ని మేము దిద్దుకోవడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది సర్.
మీకు అభినందనలు,
డా.కె.ఎల్.వి.ప్రసాద్
చిట్టె మాధవి గారూ
మీ స్పందనకు
ధన్య వాదాలు
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Rachayeta ayanatho
Patuga patakudini kuda gata jnapakalathoti munchi vestunnaru. Thanks. Jeevitamlo
jarege paristitulaku
Yeduroddi pooradite
Vijayam sadincha
tam kastam yemikadani rachiyeta tana sweeya anubhavam
Dwara cheppatam
Bagundi.
____D.chandra sekhar
Hyderabad
డా.కె.ఎల్.వి.ప్రసాద్
శేఖర్
నీ స్పందన కు
ధన్య వాదాలు
Mannem sarada
కధలు జీవితాలనుండే పుడతాయన్న డానికి మీ జీవితం ఒక ఉదాహరణ. ఎక్కాడా పట్టువీడక ముందుకు నడిచారు. నిజంగా అభినందనీయులు. . అని స్థితిలో మరొకరయితే చదువు వదిలేసే వారు గ్రేట్ అండీ
డా.కె.ఎల్.వి.ప్రసాద్
మేడం
మీ సహృదయ
స్పందనకు
ధ న్యవాదాలండీ
డా.కె.ఎల్.వి.ప్రసాద్
మీ జ్ఞాపకాల పందిరి ఎంతొ మందికి ప్రేరణ గా ఉంటుంది ప్రసాద్ గారూ! నిజంగా మీరు కొలిమి లొ కాల్చబడ్డారు తర్వాత అచ్చమైన బంగారంగా బయటికొచ్చారు .ఐతే జీవితంలొ బాగాదంబ్బలువతిన్న వారు సమాజంమీద కసి పెంచుకొని
ప్రజలను దొచుకునే వాళ్ళుగా తయారయారు.నాకు తెలిసి ఏకడాక్టరుగారు వారాలు చేసుకొని చదివి డాక్టరైడిస్టిల్డ్ వాటర్ ఇంజక్షన్లచేసి (బ్రాట్డెడ్)డబ్బు సంపాదించాడు ఐతే సంస్కారంఉన్న లేదా అట్లాటి కుటుంబం నిమచి వచ్చిన వారు పరిస్థితుల నర్థం చేసుకొని సరైన మార్గమే పడతారు మీ వలె .సంఘర్షణే బతుకంతా ఐన మీరుఉన్నస్థితినించి ఉన్నతస్థితికి ఎదగడానికే ప్రయత్నం చేసినారు .ెఇతరులకు మార్గదర్శకం మీ జ్ఞాపకాలపందిరి.
ఎక్కువగా మాట్లాడా నేమొకదా సర్?
_____నాగిళ్ళ రామ శాస్త్రి
హనంకొండ
డా.కె.ఎల్.వి.ప్రసాద్
శాస్త్రి గారూ
మీ స్పందన కు
ధన్య వాదాలు.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
చాలా బాగుంది. మీ జీవన ప్రయాణం లో చిన్నప్పటి నుండి ఎదుర్కొన్న కష్టాల గురించి, మీలో ఉన్న పట్టుదలతో సమాజంలో ఒక గౌరవ స్థానానికి ఎదగడం తెలుసుకొని, చాలా సంతోషం కలిగింది. ఆ ప్రయాణంలో మీతో నేను కూడా స్వల్ప కాలం ప్రయాణం చేశాను. అది గుర్తు చేసుకున్నందుకు చాలా సంతోషము. మీరు మన అధ్యాపకుల పేర్లు గుర్తుంచుకోవడం శ్లాఘనీయం.
_____వై.కృష్ణ మోహాన్
ఆస్ట్రేలియా(బెంగుళూరు)
డా.కె.ఎల్.వి.ప్రసాద్
మోహాన్
నీ స్పందనకు
ధన్య వాదాలు
నీలిమ
Good one doctor ji..
మీరు చెప్పిన మాటకు ప్రతి ఒక్కరి జీవితం లో ఒకసారి వెనక్కి వెళ్లి వల్ల జ్ఞాపకాలను గుర్తు చేసుకునేలా వుంటున్నాయండి…
డా.కె.ఎల్.వి.ప్రసాద్
నీలిమ గారూ
మీ స్పందనకు
ధన్య వాదాలు.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
[09/07, 13:21] OM kkm. bezwada: Chadivanu andulo konni vishayalu meeru naku chepparu
[09/07, 13:29] OM kkm. bezwada: Personal vishayalu cheppakudadu danivalana chedu jaruguthundi
____ఎం.కుసుమ కుమారి
ఒంగోలు
డా.కె.ఎల్.వి.ప్రసాద్
కుసుమా
నీ స్పందన కు
ధన్యవాదాలు
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Gyaapakaala pandhiri 13
ALAA KAAKUNTE
Baalyam etu daari teesthundho teliyani asthiratha nundi , Akkayya Annayya la bandhaalu kottha bhadratha nu aashalni kalpinchatame kaaka, oka lakshyaanni chere dhaaka vennanti nadipinchatam goppa adrushtam. Veetilonche kutumba bandhaalu parimalinchedhi.
School chaduvula nundi meeru doctor ayye dhaaka jarigina sanghatanalu anubhavaalu meeru cheptunte, ekkadikakkada ee mudi elaa veeduthundho ane bhaavana aasaanttham naalo meduluthune undhi.
Baalyam lonchi koumaara yovvana kaalaalloki jarige abhivruddhi aasha niraashala madhya saaguthundhi. Anukunna phalithaanni cherukunnappudu , saayapadina vaari patla krytagyathaa bhaavam tho paatu, mana lo oka aatma vishvaasam erpaduthundhi.
Kathanam eppati laage aasakti ga chadivinchindhi.
Meeru Osmania Matric ku tayaaraina vishayam naalo oka gyaapakaanni mundhuku techhindhi.
Anukuni paristhitullo chaduvu aagi poyina oka vidyaarthi ki nene Osmania Matric ku fee katti, subjects anni cheppi Hyderabad teesukelli pareeksha raayinchaa. Aa taruvaatha kuda thanu naatho, kutumbam tho undatame kaaka, nagaram lo prasiddhi gaanchina vista samsthalaku adhipathi ga edhigaadu.
____Ganta Rami Reddy
HANAMKONDA.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Sir,
Thank you somuch
For your kind words sir
డా.కె.ఎల్.వి.ప్రసాద్
కొందరిజీవితాలు వడ్డించినయిస్తరిలా వుంటాయి విరికిచెప్పుకోడానికి అనుభావాలు వుండవు.గ్రామీణ మధ్య తరగతి జీవితాలు కష్టలకొలిమిలోకాల వలసిందే ..జీవితపోరాటం చేయవలసిందే..ఆనాటి ఉమ్మడికుంటుంబ జీవితంలో విలువలుండేవి మీఆన్న కెకెమీనన్ లాంటిధర్మరాజులు వుండేవాళ్లు కాబట్టి మిమ్ములను దురదృష్ణ వెంటాడినప్పుడల్ల మీఅన్న వెన్ను దన్నుగా వున్నారు ఆవిషయంలోమీరుఅదృష్టవంతులు…అన్నలుకుటుంబంకోసంచేసిన త్యాగాలను మరచి కృతఘ్నులుగా వున్నతమ్ముళ్లున్నారు..అన్నపట్ల కృతజ్ఞత గలమీలాంటి తమ్ముడు ఉండటం మీఅన్నయ్య అదృష్టం..జీతమంటెనే అదృష్టదురదృష్టల సమ్మితం.దురదృష్టాలకు కుంగాపోకుండా అదృష్టాలకు పొంగిపోకుండా స్థితప్రజ్ఞులుగా వున్నప్పుడేకదా కెఎల్వీప్రసాదులు తయారవుతారు…జీవితంలోపోరాడి ఎదిగిన మీకు అభినందనులు..
____డా.వీరాచారి
హనంకొండ
డా.కె.ఎల్.వి.ప్రసాద్
చారి గారూ
మీ స్పందనకు
ధన్యవాదాలు
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Nijanga jeevitha pataalu Entha goppa malupulu thirongo kada.Mee anubhavam andariki margadarsakam.Very Nice.Phone problem tho menu Mee article chadavadam late ayindi kshanthyuralini
___డా.సుజాత.దేవ
విజయవాడ
డా.కె.ఎల్.వి.ప్రసాద్
డాక్టర్ గారూ
మీ స్పందన కు
ధన్యవాదాలు