సంచికలో తాజాగా

Related Articles

33 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
    —-డా కె.ఎల్.వి.ప్రసాద్
    సఫిల్ గూడ
    సికిందరాబాద్.

    Reply
  2. 2

    Sagar

    రవీంద్రభారతి పేరు వినడమే తప్ప చూడడం నాకు కూడా మొదటి సారే సర్. అది కూడా మిమ్మలను మొదటి సారి కలిసే కార్యక్రమం ఉన్నందున సాధ్యాపడింది. ఆరోజు అలాంటి సమస్య ఉందని నాకు కూడా ఇప్పటివరకు తెలియదు. కార్యక్రమం విజయవంతం గా జరిపినందుకు మీ ద్వారా నిర్వాహకులకు అభినందనలు. మరియు మీకు ధన్యవాదములు సర్

    Reply
    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      నీ స్పందనకు ధన్యవాదాలు .

      Reply
    2. 2.2

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      జ్ఞాపకాల పందిరి 150 లో రవీంద్ర భారతి గురించి రాశారు. రవీంద్ర భారతిని అపురూప రంగస్థలియని వర్ణించారు. రవీంద్ర భారతిలో జరిగే సాహిత్య మరియు సాంస్కృతిక కార్యక్రమాల గురించి తెలిపారు. రవీంద్ర భారతిలో మీకు వైద్యరత్న బిరుదు ప్రదానం చేసిన సందర్భంగా మీకు అభినందనలు. రవీంద్ర భారతితో మీకున్న అనుభవాలను చక్కగా తెలిపారు.
      —-జి.శ్రీనివాసాచారి
      కాజీపేట.

      Reply
      1. 2.2.1

        డా కె.ఎల్.వి.ప్రసాద్

        చారి గారూ ధన్యవాదాలు సర్ మీకు .

        Reply
  3. 3

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Ravi drabharathi is a గొప్ప స్మారక చిహ్నం . You are lucky to have a great attachment with Ravindra Bharathi. Nice write-up. Congratulations sir.మీరు హైదరాబాద్‌లో మరొక అధ్యాయాన్ని అనుభవిస్తున్నారు. Sekend ఇన్నింగ్స్.
    DR D.Sujatha
    Vijayawada.

    Reply
  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    రవీంద్రభారతి లో ప్రదర్శన,ఏదైనా కార్యక్రమం లో పాల్గొనడం ప్రతి కళాకారుని కల. బాల్యం నుండి మీకు ఆ అదృష్టం రావడం,ప్రతిభావంతులు అయిన మీరు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని అలరించడం ముదావహం.రవీంద్ర భారతి కార్యక్రమాలు తిలకించడం చాలాసార్లు జరిగినా పాల్గొనే అవకాశం,మామిడి హరికృష్ణ గారితో మేమొంటో తీసుకునే అదృష్టం ఈ మధ్యనే జరగడం ఒక గొప్ప జ్ఞాపకం. రవీంద్ర భారతి గూర్చి మీ జ్ఞాపకాల పందిరి లో చాలా విషయాలు తెలియచేశారు. ధన్యవాదాలు.
    –జనార్ధన్.ఎం.సి
    హన్మకొండ.

    Reply
    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      జనార్ధన్ గారూ
      ధన్యవాదాలు.

      Reply
  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ జ్ఞాపకం రవీంద్రభారతితో మరిచిపోరానది. కొందరికి జీవితాల్లో చాలా కలిసి వస్తవి. మీరు భాగ్యవంతులు వైద్యవర్య!
    –ప్రొఫెసర్ జనార్ధన రావు.తంగేడ
    హన్మకొండ.

    Reply
    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సాహితీ వేదికైనా రవీంద్ర భారతి గురించిన విశేషాలు రచయిత గారు ఈ సంచికలో చాలా విపులంగా వివరించారు. ఒక సాధారణ ప్రేక్షకుడిగా, కళాభిమానిగా, ఆ కళాక్షేత్రములోనికి ప్రవేశము పొందగలిగిన ఒక సాధారణ వ్యక్తి , ఎందరో కవులతో, కళాకారులతో పరిచయ భాగ్యము కలగటం, ఆ గౌరవప్రదమైన వేదికను తోటి కళాకారులతో పంచుకొని ప్రసంగించ గలిగే స్థాయికి ఎదగటం ,తోటి కళాకారులను ప్రోత్సహించే క్రమములో ముఖ్య అతిథిగా పాల్గొనడం ,ఆనాటి ఆరోగ్యశాఖ మంత్రితో “వైద్యరత్న “అనే బిరుదును అందుకోవటం …మొదలగు పరిణామాలు వారి యొక్క నిబద్ధతకు, ఆ ప్రవృత్తి పైన డాక్టర్ గారికి ఉన్న జిజ్ఞాసకు నిదర్శనం . మీరు వెలిబుచ్చిన మీ అనుభవం నాలాంటి ప్రేక్షకులు ,అప్పుడప్పుడు ఆ ప్రాంగణములో వీక్షించిన సందర్భాలను ,సన్నివేశాలను గుర్తుకు తెస్తున్నాయి.
    —-బి.రామకృష్ణా రెడ్డి
    సఫిల్ గూడ
    సికిందరాబాద్.

    Reply
    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      రెద్దిగారూ
      ధన్యవాదాలండీ.

      Reply
  7. 7

    Shyamkumar chagal

    ఒకప్పుడు గొప్పగా వెలుగు వెలిగిన రవీంద్ర భారతి గురించి చెప్పిన విషయాలు దాని స్వర్ణ యుగం అనే చెప్పాలి.అందులో కార్యక్రమం బాగా పేరు లేదా డబ్బు వున్న వాళ్ల అందుబాటులో వుండేది.
    అదొక, సంఘంలో పరపతి చూపించు సాధనంగా ఉండేది.
    యెప్పుడు చూసినా అది జనాలతో కిటకిట లాడుతూఉండేది.
    టీవీ..మొబైల్ ఫోన్లు లేనప్పుడు అదొక అద్భుతమైన వినోదా లకు మంచి సెంటర్ గా ఉండేది.
    1960 ..23rd మార్చి నాడు
    బెజవాడ గోపాల్ రెడ్డి గారు, అప్పటి ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా ఉన్నప్పుడు దీనికి శంకుస్థాపన చేశారు. ఈ బంగాళా యొక్క డిజైన్ మొత్తం అప్పటి గొప్ప ఆర్కిటెక్ట్ మహమ్మద్ ఫయాజ్ ఉద్దీన్ చే చేయబడింది. ఆ సమయంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారి శతాబ్ది ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి.
    దీని ప్రారంభోత్సవం ఉస్మానియా యూనివర్సిటీ యొక్క. డ్రామటిస్ట్ క్లబ్ ద్వారా చేశారు.
    ఈ ఈ మధ్యన మళ్లీ రవీంద్ర భారతికి పూర్వ కళా వైభవం వస్తుండడం కనిపిస్తోంది.
    మన హైదరాబాద్ కి గర్వించదగిన కళావైభవాల్లో రవీంద్ర భారతి కూడా ఒకటి అని చెప్పొచ్చు.
    మన కళ్ళముందే ఎప్పుడూ కనిపిస్తూ ఉన్నప్పటికీ మనం సరిగ్గా గమనించని రవీంద్ర భారతి గురించి మరొక్కసారి మన దృష్టికి తేవడానికి ప్రయత్నించి న రచయిత గారికి నా అభినందనలు

    Reply
  8. 8

    Rajendra Prasad

    Ravindra Bharthi is affordable and location wise very approachable. We are Happy and relieved to know you were not disappointed since your last program is not cancelled.

    Reply
  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    డా . కెఎల్వీ ప్రసాద్ గారి జ్ఞాపకాల పందిరి నిజంగా చలువ పందిరే . వారి జ్ఞపకాలు చల్లగా , చక్కగా ఉంటాయి . వారు ‘ వైద్య రత్న ‘ అవార్డు రవీంద్ర భారతి లో అందుకోవడం నిజంగా గొప్ప అనుభవమే . డాక్టర్ గారు అదృష్టవంతులు . వారికి అభినందనలు .
    మెట్టు మురళీధర్
    హన్మకొండ.

    Reply
    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మురళీ ధర్ గారు
      ధన్యవాదాలండీ.

      Reply
  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    రవీంద్రభారతి గురించి చెప్పినారు.రవీంద్రభాతే కాదు ఏ ప్రభుత్వ మందిరం అయినా జిల్లాపరిషత్ సమావేశమందిరాలైనా ప్రభుత్వ హోటల్లు అయినా మనం బుక్ చేసినాంక ప్రభుత్వ కార్యక్రమాలకేవైనా అదే మందిరమో హాలో కావలసివస్తే ప్రభుత్వేతర కార్యక్రమాలకు ఇచ్చిన అనుమతిని నిర్దాక్షిణ్యంగా రద్దూ చేస్తరు. మనకు సమాచారంకూడా ఇవ్వరు.బహుశా ఆఅనుమతి పత్రం లోనే ఈ షరతూ ఉంటుందనుకుంట..
    మీరన్నట్టు ఇప్పుడు సాహిత్య కార్యక్రమాలకు రవీంద్ర భారతి మినీహాల్ ను ఉచితంగా ఇవ్వటంగొప్పవిషయమే.అందుకు ప్రభుత్వాన్ని అభినందించవలసిందే.
    ఒకరోజుల్లో రవీంద్రభారతి మెట్లెక్కాలన్నాభయమయ్యేది.ఇప్పుడు అట్లకాదు.
    అసలు హైదరాబాద్ లో సమావేశాల మందిరాలు గమ్మత్గా వుంటవి.
    వెనుకట సినారె పాల్గోనే కార్యక్రమాలెక్కువగా త్యాగరాయగానసభలో జరిగేవి.కొద్దిగా అభ్యుదయ భావాలున్న వారి సమావేశాలైతే సుందరయ్యవిజ్ఞానభవన్ లో జరిగేవి .ప్రభుత్వానికి దగ్గరివారి సభలు రవీంద్రభారతిలో జరిగేవి
    కొద్దిగాప్రజాసంస్థల కార్యక్రమాలైతే ప్రెస్క్లబ్లో
    ఇట్లా రిజర్వేషనన్నమాట..
    ఏది ఏమైనా ప్రభుత్వంవారు అనుమతులిచ్చి రద్దుచేరటం సరైందికాదనేది కాదనలేని నిజం.
    రవీఅంద్రభారతి వేదిక మీద నేను మాట్లాడుతానని ఎన్నడూ అనుకోలేదు.కాళోజీ శథజయంతి సభలో ప్రభుత్వ కార్యక్రమం కనుక మాట్లాడగలిగిన తరువాత కూడా అంతే.
    సామాన్య జనానికి కొంతవరకు అందుబాటులోనికి వచ్చినట్లేనేమో.
    —-నాగిళ్ళ రామశాస్త్రి
    హన్మకొండ.

    Reply
    1. 10.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారూ
      హృద య పూర్వక
      కృతజ్ఞతలు.

      Reply
  11. 11

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    నిజమే సర్.రవీంద్ర భారతి అంటేనే సంగీత,నృత్య సాహితీ కార్యక్రమాల పుట్టింటి వేదిక అనిపిస్తుంది.కొన్ని స్థలాలు,కట్టడాలు ఎంతో సార్ధకతను సంతరించుకుంటాయి. ఎన్నో సజీవ స్మృతులకు నెలవౌతాయి.వాటి ప్రతి గోడా ఎన్నో మధుర అనుభూతుల వర్ణాలను పూసుకుంటాయి! ఆ నేల ఎందరో మహనీయుల పాదముద్రల్ని భద్రపరుస్తుంది! ఆ ద్వారాలు ఎన్నో వసంతాలకు స్వాగతం పలుకుతాయి! పునాది వేసిన మనస్సుది ఎన్ని తరాల సుదూర స్వప్నమో గాని అది సజీవమై అలరారితుంది!అజరామరమై నిలుస్తుంది! అది నాలుగు గదుల నడుమ నవలోకాలనూ నింపుకున్న ఒక దివ్య కట్టడమే! దాన్ని నిర్మించిన ,దర్శించిన హృదయాలు పులకిత వనాలే! నిత్య వికసిత కళారామమ్ రవీంద్ర భారతి!మంచి అనుబంధాన్ని పంచుకున్నారు రవీంద్ర భారతితో ధన్యవాదాలు సర్🙏💐💐💐
    నాగజ్యోతి శేఖర్
    కాకినాడ.

    Reply
    1. 11.1
  12. 12

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Nice writeup. Ravindra Bharati to na jnapakalu madi lo medilayi.1960s nundi Telugu vari samskruti jeevita purogatiki RB entagano upayogapadindi.
    ——S.Hanmantarao
    Visakhapatnam.

    Reply
  13. 13

    Bhujanga rao

    జ్ఞాపకాల పందిరి 150 సంచికలో అడు గిడి అపురూప రంగస్థలి..రవీంద్రభారతి..!!రవీంద్రభారతి గురించి మీరు చాలా విషయాలు తెలియచేసిన మీకు ధన్యవాదములు సర్.నేను చాలా సంవత్సరాల క్రితం రవీంద్రభారతిలో ఒక భరత నాట్యం చూశాను. రవీంద్రభారతి ఒక సాంస్కృతిక కళా భవనం. నిత్యం ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది.అక్కడ మీరు2019 సంవత్సరంలో ఆర్ధిక శాఖ మంత్రి గారిచే ఆరోగ్య రత్న అవార్డు అందుకోవడం మీకు గొప్ప అనుభవం. ఏది ఏమైనా మీరు చాలా అదృష్టవంతులు సర్🙏

    Reply
    1. 13.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అవునండీ
      మీకు ధన్యవాదాలు
      భుజంగరావు గారూ…

      Reply
  14. 14

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    రవీంద్రభారతి లో జరిగే కార్యక్రమాలను గురించి బాల్యం నుండి చాలా కథలు, నవలలలో చదివాను.. మా అబ్బాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2000 సంవత్సరంలో ఈ ఆడిటోరియంలో ..విశ్వభారతి ఫౌండేషన్ వారి టాలెంట్ టెస్ట్ లో రాష్ట స్థాయి బహుమతిని అందుకోవడం ,,

    నేను 2020 మార్చి 12 న.. రవీంద్రభారతి వేదిక మీద ‘ లేఖిని రచయిత్రుల వేదిక.. వారి.. మాతృదేవోభవ పురస్కారాన్ని’ అందుకోవడం

    2023 ఫిబ్రవరి 16 న ‘లేఖిని కథాకార్యశాల ‘లో రచయితలు, రచయిత్రులను కలవడం.. ముఖ్యంగా సంచిక ఎడిటర్ శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారిని కలవడం.. నాకు సంబంధించిన జ్ఞాపకాలు.

    తెలుగు రచయితలకి, రవీంద్రభారతికి గల అనుబంధం ఎనలేనిది. ఈ వేదికను గురించిన మీ జ్ఞాపకాలను అందించారు.. అభినందనలు ప్రసాద్ గారికి, సంచిక వారికి👍🏻🙏🏻
    —–పుట్టి నాగలక్ష్మి
    రచయిత్రి
    హైదరాబాద్.

    Reply
    1. 14.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ

      Reply
  15. 15

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మంచి… తీపిజ్ఞాపకాలు !
    రవీంద్రభారతి కి అనుకోకుండా చాలాకాలంక్రితం
    1976-7 లో అనుకుంటా… నేను మిత్రుడు ధర్మరాజు పుణ్యక్షేత్రాల సందర్శనకు బయలు దేరాం… ఆ క్రమంలో హైదరాబాద్ సంద ర్సించటం !పబ్లిక్ గార్డెన్హ్స్ చూస్తూపక్కనున్న .. రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ జరుగుతుందని తెలిసి వెళ్ళటం ఆ కార్యక్రమంలో కాసేపు గడిపి బిర్లామందిర్ కు వెళ్ళటం బాగాగుర్తు !👏👏👏🙏💐🙏చాలాబాగుంది జ్ఞాపకాల పందిరిలో మీ ఈ జ్ఞాపకం

    కోరాడ నరసింహారావు
    విశాఖపట్టణం.

    Reply
    1. 15.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      కోరాడ వారి స్పందనకు
      హృదయ పూర్వక కృతజ్ఞతలు.

      Reply
  16. 16

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    శుభోదయం 🙏 మీ ఙాపకాల పందిరి రవీంద్రభారతిని కళ్ళకు కట్టిస్తూ బాగుందండి. అదొక మంచి ఙాపకాల ఒరవడి స్ధలంలా అన్పిస్తుంది. అభినందనలతో 💐👏
    —విద్యా డేవి.ఆకునూరు
    హనంకొండ.

    Reply
    1. 16.1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!