సంచికలో తాజాగా

Related Articles

18 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
    —డా కె.ఎల్.వి.ప్రసాద్

    Reply
  2. 2

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Very good sir, good information to sr citizens like me.
    —–K J.Srinivas
    Hyderabad.

    Reply
  3. 3

    sagar

    మీరన్నట్లు ఆరోగ్యమే మహాబాగ్యమే అయినా అది శుభ్రంగా కాపాడుకోవాలి అనే ధ్యాస అందరికీ ఉండదు సర్ . వ్యాసంలోనే మీరు చెప్పినట్లు తమ ఆనందంకొరకు బ్రతికేవాళ్ళు ఆరోగ్యాన్ని ఖాతరు చేయరు. ఇక నిర్లక్ష్యమనేది రెండో కోవకు వస్తుంది. మీరు చెప్పినట్లు ఈ యంత్రమనేది కాపాడుకున్నన్నిరోజులు బాగుంటుంది తరువాత విజృంభించి సమస్యలు సృష్టిస్తుంది. మీరు ఈ వయసులోనూ ఆ రెండు సమస్యలున్నా ఉత్సాహంగ సాహితీ ప్రయాణం చేయడం అభినందనీయం. మీకు శుభాకాంక్షలు మరియు మంచి వ్యాసం అందించినందుకు ధన్యవాదములు సర్

    Reply
    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర
      నీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  4. 4

    భుజంగ రావు

    జ్ఞాపకాల పందిరి 179 సంచికలో పెరిగే వయసు – తరిగే ఆరోగ్యం గురించి మంచి విషయాలు అందించిన డాక్టర్ గారికి అభినందనలు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడి, అయినా దానిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి,కానీ మీరు చెప్పినట్టు వారి ఆనందం కోసం ఆరోగ్యాన్ని చేజేతులా కాపాడుకోలేకపోతారు.శారీరకంగానూ, మానసికంగానూ మరియు ఆర్థికపరంగాను తను ఉన్న పరిసరాలలో తృప్తిగా జీవించడం అన్నది ఆరోగ్య లక్షణం.అయినప్పటికీ జన్యుపరమైన రుగ్మతలవంటివి కూడా సంభవించచ్చు వాటి వత్తిడిని తట్టుకొని నిలబడటానికి శారీరక మానసిక వ్యాయామం తప్పనిసరి అని ఈ సంచిక ద్వారా తెలిపిన రచయిత గారికి హృదయ పూర్వక నమస్కారములు🙏

    Reply
    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      భుజంగరావు గారూ.

      Reply
  5. 5

    sunianu6688@gmail.com

    రచయత Dr KLV ప్రసాద్ గారు వ్రాసిన “పెరిగేవయస్సు – తరిగే ఆరోగ్యం” గురించి వ్రాసిన ఇతివృత్తం ఎంతో మందికి అనుభవపూర్వకమైనది. కానీ Dr గారు వ్రాసిన విషయాలూ ఎంతో మందికి విలువైన సూచనలు. వయసు పై బడిన వారు తీసుకోవలసిన జాగ్రత్తలు. మీరు తగిన జాగ్రత్తలు తీసుకొని మా లాంటి ఎంతోమందికి మార్గదర్శకంగా వుండాలని కోరుకుంటున్నాము sir. మీకు మా అందరి తరపున హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏🌹

    Reply
    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  6. 6

    Mohammad. Afasara Valisha

    సాహితీ రంగంలో కవులకు మంచి మార్గ దర్శకులే కాక ఆరోగ్య విషయంలో కూడా మీ సూచనలు సలహాలు అభనందనీయమైనవి సార్. మీకు సరైన సమయంలో మంచి ఫిజియోథెరపిస్ట్ దొరకడం చాలా సంతోషం .
    ఆరోగ్య విషయంలో చాలా తక్కువ మంది మాత్రమే తగిన శ్రద్ధ తీసుకోవడం నిజం.మీరు వ్రాసిన ప్రతి అక్షరం నిజం. మీరు ఆయురారోగ్యాలతో కలకాలం ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మంచి మంచి వ్యాసాలు మాకు చాలా ఆదర్శ వంతంగా, స్ఫూర్తి దాయకంగా అందిస్తున్న మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐 🙏

    Reply
  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సాహితీ రంగంలో కవులకు మంచి మార్గ దర్శకులే కాక ఆరోగ్య విషయంలో కూడా మీ సూచనలు సలహాలు అభనందనీయమైనవి సార్. మీకు సరైన సమయంలో మంచి ఫిజియోథెరపిస్ట్ దొరకడం చాలా సంతోషం .
    ఆరోగ్య విషయంలో చాలా తక్కువ మంది మాత్రమే తగిన శ్రద్ధ తీసుకోవడం నిజం.మీరు వ్రాసిన ప్రతి అక్షరం నిజం. మీరు ఆయురారోగ్యాలతో కలకాలం ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మంచి మంచి వ్యాసాలు మాకు చాలా ఆదర్శ వంతంగా, స్ఫూర్తి దాయకంగా అందిస్తున్న మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐 🙏

    మొహమ్మద్. అఫ్సర వలీషా
    ద్వారపూడి (కోనసీమ జిల్లా)

    Reply
  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Gd Evng Doctor garu,
    Please take care of your health.
    Long standing diabetic patients are doing good even at 75-76 years of age with little health aberations.
    —suryanarayana rao
    Hyderabad.

    Reply
  9. 9

    Shyam kumar chagal

    ఆరోగ్యం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రచయిత గారు స్వఉదాహరణలతో ఆసక్తికరంగా కొనసాగించారు .
    రెండవ పేరా లోని అంశాలన్నీ నాకు సంబంధించినవిగా అనిపించింది.
    ఆరోగ్యం మన తోడు ఉన్నంతవరకు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోకపోయినా జీవితం సాఫీగా గడిచిపోతుంది. వయసు మీద పడిన తర్వాత శరీరం సహకరించడం తగ్గిన తర్వాత అసలు ఇబ్బందులు మొదలవుతాయి.

    l మనిషి జీవితంలో శరీరానికి తగిన వ్యాయామం అన్నది తప్పనిసరి. మన దైనందిన జీవిత కార్యక్రమంలో అది కూడా ఒక భాగంగా అయిపోతే మరీ మంచిది. చాలా వరకు అందరూ హాయిగా తిని గడిపేస్తూ శారీరక ఇబ్బందులు మొదలైన తర్వాత ఫిజియోథెరపీ లాంటి వాటిని ఆశ్రయించక తప్పదు. నా స్నేహితుడు మరియు రచయిత డాక్టర్ కే ఎల్ వి ప్రసాద్ గారికి ఈ విషయంలో మంచి అవగాహన ఉన్నప్పటికీ వాటిని ఆచరణలో పెట్టకుండా ఇబ్బందుల పాలైన విషయం నాకు అందరికంటే ఎక్కువగా తెలుసు అని అనుకుంటాను. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయంలో నా తోడ్పాటు నేను వీలైనంతవరకు అందించాను.
    ఆరోగ్య పరిరక్షణ విషయంలో వ్యాయామం మరియు ఆహారపు అలవాట్లు , జీవనశైలి అన్నవి చాలా ముఖ్యమైనవి.
    ముందు జాగ్రత్త చర్యల విషయంలో సమయానుకూలంగా తగిన ఆరోగ్యానికి సంబంధించిన పరీక్షలు చేయించుకుంటూ పరిస్థితి విషమించకుండా చేసుకోవడంలో ఏమీ తప్పులేదు. వాటికి తగిన ఇన్సూరెన్స్ చేసుకోవడంతో ఆర్థిక ఇబ్బందుల పాలు కాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

    వయసుతో బాటు వచ్చే డయాబెటిస్ ,బ్లడ్ ప్రెషర్ కంటి చూపు ,అసిడిటీ మామూలే అయినప్పటికీ రుచికి ప్రాధాన్యత లేకుండా ఆహారాన్ని తీసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తే బ్రతికినన్నాళ్లు ఎవరి మీద ఆధారపడకుండా ఉండే అవకాశం ఉంది.
    ఆహార నియంత్రణతో మధుమేహ వ్యాధి మరియు రక్త పీడనను తగ్గించే మార్గాలు ఎన్నో ఉన్నాయి కానీ అవన్నీ మనకు ఆచరణలో పెట్టడం చాలా కష్టం. కాబట్టి వాటికి తగిన మందులు తీసుకోవడం మినహా వేరే గత్యంతరం లేదు.
    చాలావరకు పూర్తిగా ఒక నడక మీదే దృష్టి సారించి అదే మంచి సాధనం అనుకుంటారు. అయితే నడక ఒక్కటే ఆరోగ్య పరిరక్షణ కు సరిపోదు. వీగిపోతున్న శరీరానికి బలహీన పడుతున్న కండరాలకి నరాల వ్యవస్థకి వేరు వేరు వ్యాయామాలు అవసరం. ఈ మధ్య వస్తున్న సాంఘిక మాధ్యమాల ద్వారా వీటి గురించి తెలుసుకునే అవకాశం మనకుంది. ఇవన్నీ ఆచరించినప్పటికీ ఆరోగ్యం వంద శాతం వరకు అద్భుతంగా ఉంటుందని ఏమి గ్యారెంటీ లేదు. కానీ మన వంతు సహకారం శరీరానికి ,ఆరోగ్యానికి తోడ్పాటు అందించవల సిందే. ఈ విధంగా చేస్తే కొంతవరకు మనం మన వృద్ధాప్యాన్ని అది మన మీద చేస్తున్న యుద్ధాన్ని జయించడానికి అవకాశం ఉంది. మంచి ఆరోగ్యం అన్నది దేవుడు ఇచ్చిన వరం. అయినప్పటికీ మనం మన వంతు కృషి చేయవలసిందే.

    ప్రతివారం జ్ఞాపకాల పందిరి శీర్షికలో ఆరోగ్యకరమైన విషయాలను మన ముందు చర్చకు మనకు అందిస్తున్న నా గురువుగారు డాక్టర్ కే ఎల్ వి ప్రసాద్ గారికి ఆరోగ్యమస్తు.
    సర్వేజనా ఆరోగ్య భవంతు.

    Reply
    1. 9.1

      Sagar reddy

      మీ సుదీర్ఘ సమీక్ష చాలా బాగుంది శ్యామ్ సర్ . నిజమే మీరన్నట్లు నడకతోనే అన్నీ సమకూరుతాయి అనుకుంటారు చాలామంది. వాస్తవం ఏమిటంటే నడకతో ప్రయోజనాలు సాఫీ రక్తసరఫరా మరియు శరీర ఉత్తేజం. అంతె తప్ప అన్నిటికీ అదే పరిష్కారం కాజాలదు. అలాగని మితిమీరి చేసే వ్యాయామంకూడ అనర్ధదాయకమే. మన శరీర పరిమితి మేరకే వ్యాయామంకూడా చేయాలని నా అభిప్రాయం.ఇక మీరు చెప్పిన తిండి విషయం నేను మాట్లాడకూడదు. ఎందుకంటే రుచి బాగుంటే అతిగా లాగిస్తున్నా. కాబట్టి మీరన్నట్లు మన పని మనంచేయాలి. గురువుగారు అందించిన వ్యాసం మీ సమీక్ష అందరికీ ఉపయోగం. మీ ఇద్దరికీ మరోసారి ధన్యవాదములు

      Reply
  10. 10

    Rajendra Prasad

    స్వీయ అనుభవంతో మంచి అవగాహన కల్పించారు. వృద్ధాప్యంలో ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. రచయితకు ధన్యవాదాలు

    Reply
    1. 10.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ప్రసాద్ గారూ
      ధన్యవాదాలు.

      Reply
  11. 11

    పుట్టి నాగలక్ష్మి

    ఆరోగ్యం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో తెలియజేశారు.ప్రస్తుతం ఫిజియోథెరపీ చాలామందికి అవసరమవుతుంది. వృద్ధాప్యం లో
    ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి వ్యాయామం చాలా అవసరం. జిహ్వచాపల్యమూ తగ్గించుకోవాలి.మంచి విషయాలని అందించినందుకు ధన్యవాదాలు🙏

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!