అలా జరగకుంటే ఎలా ఉండేదో..!!
అవసరానికి ఆదుకోవడం అనేది అందరివల్ల సాధ్యం కాని పని. ఎదుటి వారికి సమస్య ఉత్పన్నమైనపుడు, మనకు చాతనయినంతలో ఆదుకోవడానికి ప్రయత్నించడం కనీస ధర్మం. అయితే అంత త్వరగా స్పందించే సహృదయులు ఎంతమంది? బయటివారే కాదు, బంధువులు కూడా సాహసం చేయడానికి వెనుకాముందులాడతారు. సమయానికి ఆదుకోవడం అన్నది మనిషి మనస్తత్వం మీద, వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. అయితే, మామూలు సమయాల్లో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పుడు, చాలామంది సహాయం చేయడానికి ముందుకి వస్తారు. చేతనయినంతగా సహాయం అందిస్తారు. కానీ కొన్ని సమస్యలు ఎవరూ ముందుకు రాలేని పరిస్థితులు ఏర్పడతాయి. అప్పుడు స్వంతమనుషులు, శ్రేయోభిలాషులు కూడా దగ్గరికి రాలేని పరిస్థితి, ఎలాంటి సహాయాన్ని అందించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటప్పుడు ఎవరినీ నిందించే పరిస్థితులు కూడా వుండవు. ఎవరి ప్రాణం వారికి తీపి కదా!
ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో కూడా తమ ప్రాణాలకు తెగించి, ఎదుటివారి కష్టాలను అర్థం చేసుకుని, సహాయం అందించడానికి ముందుకు వచ్చే స్నేహితులు కూడా ఈ రోజుల్లో లేకపోలేదు. అయితే ఇలాంటివారు కేవలం వేళ్ళమీద లెక్కపెట్టదగ్గ వారే కనిపిస్తారు. వాళ్ళు చేతులెత్తి నిత్యం మొక్కదగ్గ మహానుభావులు.
గత పది నెలలుగా (ఫిబ్రవరి 2020 నుండి) యావత్ ప్రపంచ దేశాలను గజ గజలాడిస్తూ, ప్రశ్నార్థకంగా నిలిచి అనేక ప్రాణాలను బలితీసుకున్న/తీసుకుంటున్న, కరోనా (కోవిడ్ -19) అందరికీ సవాలుగా నిలిచింది. స్వంత మనుష్యులు చనిపోయినా, ఇంటికి వెళ్లి కనీసం పరామర్శించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎంతోమంది భాగ్యవంతులు సైతం అనాథలు మాదిరిగా దిక్కులేని చావు దాపురించిన దురదృష్టకర సందర్భం.
ఇలాంటి సమస్య స్వయంగా నేను అనుభవించక పోయినా, మా చిన్నన్న డా. కె. మధుసూదన్, కరోనా కోరల్లో చిక్కుకున్నప్పుడు, నేను అనుభవించిన వ్యథ అక్షరాల్లో వ్యక్తపరచలేనిది. ఆయన విశాఖలో, నేను హనంకొండలో! క్షణ క్షణం ఆందోళనలో మునిగి తేలిన క్షణాలు. అది ఎంతటి బాధాకరమైనదో మీరూ అర్థం చేసుకోండి.
అన్నయ్య విశాఖపట్నం వాసి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో అనౌన్సర్‌గా చేరి, సుమారు ముప్పై సంవత్సరాలపాటు అక్కడే సేవలందించి పదవీ విరమణ చేశారు. అందుకే ఆయనకు విశాఖ అంటే మక్కువ ఎక్కువ. ఆ పట్టణం వదిలి బయటకు వెళ్లిన సందర్భాలు బహు తక్కువ. పైగా బ్రహ్మచారి. ఒంటరి జీవితం. ఆయన మా ఇంటికి వచ్చిన సందర్భాలు బహు తక్కువ. ప్రధాన కారణం ఆయనకు వృత్తి మీద వున్న ప్రగాఢ గౌరవం, అంకితభావం.
విశాఖలో ఆయన మంచి మిత్రమండలిని ఏర్పరచుకున్నారు. సాహితీ మిత్రులకు దగ్గర అయ్యారు. అనేక సాహిత్య సమావేశాలకు హాజరుకావడం, సాహితీ చర్చల్లో పాల్గొనడం ఆయనకు నిత్యకృత్యమై, వృత్తి ప్రవృత్తి ఆయన ఒంటరితనాన్ని దూరం చేశాయి. అలా బంధువులకంటే కూడా మనసున్న మంచి మిత్రులు ఆయనకు చేరువైనారు. అప్పుడప్పుడు శుభ కార్యాలకు మాత్రం వస్తూవుంటారు. నేనూ – నా పిల్లలు ఎప్పుడూ హనంకొండకు రమ్మని ఆహ్వానిస్తూ ఉంటాము. కానీ అది ఆయనకు అంతగా వీలయ్యేది కాదు. మాకు ఒకరకమైన బాధ కలుగుతుండేది. ఉద్యోగ విరమణ చేసిన పిదప, ఆయన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో (తాను పదవీ విరమణ చేసిన చోట) కాంటాక్ట్ పద్దతిలో ‘డ్యూటీ – ఆఫీసర్’ గా ఉద్యోగంలో చేరడం వల్ల ఆయనకు జీవితం సాఫీగానే సరిపోతున్నశుభ తరుణంలో,ప్రపంచ వ్యాప్తంగా ‘కోవిద్ -19 ‘ఒక సునామీలా వ్యాపించి జనాలను భయ భ్రాంతులకు గురి చేసింది. వందలు, వేలు, లక్షల్లో ప్రజలకు ఈ వైరస్ సోకడం, వందలు – వేల సంఖ్యల్లో ప్రాణ నష్టం జరగడం మొదలైంది. అదిగో.. అలాంటి తరుణంలో,ప్రజా క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వాలు ‘లాక్డౌన్’ ప్రకటించాయి. అందులో మన దేశము వుంది. అనేక కార్యాలయాలు మూతపడ్డాయి. తాత్కాలిక ఉద్యోగులను విధులనుండి తప్పించారు. అందులో మా చిన్నన్నయ్య కూడా ఉన్నాడు. అంతా మన మంచికే అనుకున్నాము.
ఆయన ఇంటికే పరిమితం అయినాడు. ఉదయం బీచ్ రోడ్లో వాకింగ్ చేసే అలవాటును మానుకున్నాడు. గతంలోలా, సభలు-సమావేశాలు, విందులు – వినోదాలలో పాల్గొనడం పూర్తిగా తగ్గించేసాడు. బ్రతుకు జీవుడా అనుకుని ఆయన ఆరోగ్యం విషయంలో నిశ్చింతగా వున్నాం. ఆయనతో కొందరు మిత్రులు మాత్రం ప్రతిరోజూ ఫోన్లో మాట్లాడుకుంటారు, అందులో ఎస్. హనుమంతరావు గారు ఒకరు.
నేనూ వయసు పైబడినవాడినే కనుక పూర్తిగా మా అమ్మాయి నిహార సంరక్షణలో ఉంటున్నాను. అబ్బాయి అమెరికాలో ఉంటున్నాడు. అందు చేత పూర్తిగా అమ్మాయి మీదే ఆధార పడవలసి వచ్చింది. గేటు దాటి బయటకు వెళ్లే పరిస్థితి లేదు. మా జీవితం మేము జీవిస్తున్నాము. ఈ నేపథ్యంలో అన్నయ్య స్నేహితులు శ్రీ ఎస్. హనుమంత రావు గారి దగ్గరినుంచి ఫోన్ వచ్చింది.
హనుమంత రావుగారు అన్నయ్య రోజూ ఫోన్ చేసుకుని మంచి చెడ్డలు మాట్లాడుకుంటారు. గత వారం రోజులుగా అన్నయ్యకు జ్వరం వస్తున్నట్టు, అది మామూలు జ్వరం అనుకుని తిండి మాని లంఖణాలు చేస్తున్నట్టు ఆయనకు తెలుసు. శివయ్య అనే శిష్య మిత్రుడు అన్నయ్యకు జతగా రాత్రిళ్ళు పడుకుంటున్న విషయమూ హనుమంత రావు గారికి తెలుసు. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా అన్నయ్య ఫోన్ కాల్‌కు స్పందించడం లేదని, కాస్త ఆందోళనగా వున్నదని, ఆయన ఫోన్ కాల్ సారాంశం. పైగా ఆయన జబ్బు పడ్డ విషయం మాకు చెప్పొద్దని, మేము కంగారు పడతామని, గతంలో అన్నయ్య ఆయనతో అన్నాడట! రోజులు బాగోలేదు. ఎక్కడ విన్నా కరోనా మరణాల గురించే. హనుమంతరావు గారి సమాచారం నాలో భయాన్ని పెంచింది.


డెబ్భై ఏళ్ళ అన్నయ్య జ్వరం కరోనా.. కాకూడదని మనసులో అనుకున్నాను. వెంటనే విజయనగరంలో ఉన్న సోదర మిత్రుడు ‘చలం’కు ఫోన్ చేసాను. విషయం ఆయనకు తెలియదన్నాడు. నాకు భయం మరింత ఎక్కువైంది. అనవసరంగా భయపడవద్దని, స్థానిక మిత్రులకు తెలియజేస్తానని, ఆందోళన పడవద్దని, చలం నన్ను ఓదార్చాడు. వెంటనే విశాఖలో వున్న అన్నయ్య ముఖ్య స్నేహితులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు.


వాళ్ళు కూడా ఈ సంగతి విని ఆశ్చర్య పోయారట మరునాడు అందరు చినవాల్తేరులో ఉంటున్న అన్నయ్య దగ్గరకు వెళ్లి, వెంటనే కోవిడ్ -సెంటర్ కు తీసుకువెళ్లి పరీక్ష చేయిస్తే ‘కరోనా పాజిటివ్’ వచ్చిందట! ఫలితం తెలియగానే అన్నయ్యను ‘విమ్స్’ (విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) లో అడ్మిట్ చేశారు. ఆ సమయంలో అక్కడ అడ్మిషన్ దొరకడం అంత సులభమైన పని కానేకాదు. అన్నయ్య మిత్రులు అంతా వివిధహోదాలలో పలుకుబడి వున్నవారు కావడం వల్ల ఆ ఆసుపత్రిలో అడ్మిషన్ దొరకడం, ఉచిత వైద్యానికి కూడా అవకాశం కలిగింది. ఈ విషయంలో పూర్తి బాధ్యత తీసుకుని అన్నివేళలా అప్రమత్తంగా పని చేసినవారు, నాకు ఎంతో ధైర్యాన్ని అందించిన వారు శ్రీ వేణు (వేంకటపతి రాజు).


ఆయన రిటైర్డ్ ఉపాధ్యాయుడే కాకుండ, ఒక వామపక్ష పార్టీ నాయకుడు కూడా. ఆయన అందించిన సహకారం ఎన్నటికీ మరువరానిది. స్వంత రక్త సంబంధీకులు కూడా చేయలేని సహాయం ఆయన చేశారు. ఆయనతో పాటు సహాయం చేసిన మరొక సహృదయుడు, విశాలాంధ్ర బుక్ హౌస్ మేనేజర్ (విశాఖపట్నం) శ్రీ రాజు. పి. ఎ.


మానవత్వంతో కూడిన మైత్రిని కొనసాగిస్తున్న వీరు ప్రశంసనీయులు. జ్వరం అంటే కరోనా అని భయకంపితులవుతున్న రోజుల్లో శివయ్య గారు భార్య, చిన్న బిడ్డను ఇల్ట్లో వదిలి అన్నయ్యకు సహకారిగా ఉండడం,ఆశ్చర్యకరమైన విషయమే! ఆయనకు కూడా ఎంతో రుణపడి వున్నాము.
కింగ్ జార్జ్ ఆసుపత్రిలో అనస్థటిస్ట్ (మత్తు ఇచ్చే వైద్యురాలు) డా. సుబ్బులక్ష్మి (జనగాంలో నా సహా ఉద్యోగిని) ఎప్పటికప్పుడు,అన్నయ్య ఆరోగ్య పరిస్థితిని నాకు అందించి నాకు ఎంతగానో మానసిక ప్రశాంతతను కలిగించారు. డా. లక్ష్మి చేసిన సహాయం కూడా ఎన్నటికీ మరువలేనిది. ఆసుపత్రిలో ఉన్న పద్నాలుగు రోజులు అన్నయ్యకు చక్కని అమూల్యమైన వైద్యం అందించిన వైద్య దేవుళ్ళకు,ఇతర ముఖ్య సిబ్బందికి ఎంతగానో రుణపడి వుంటాను. పెద్దన్నయ్యను, ఇద్దరు అక్కలను కోల్పోయిన నేను, చిన్నన్నయ్య కరోనా కోరల్లోనుంచి బ్రతికి బయట పడటం కేవలం నా అదృష్టంగానే భావిస్తాను. ఆ రోజున అలా జరగకుండా ఉంటే.. (అన్నయ్య మిత్రుడు నాకు ఫోన్ చెయ్యకుండా ఉంటే) పరిస్థితి ఎలా ఉండేదో…!! నా దృష్టికి రాని ఎందరో మహానుభావులు ఈ కథనం వెనుక వున్నారు. వారందరికీ వందనాలు.


(మళ్ళీ కలుద్దాం)

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
60 Comments
డా కె.ఎల్.వి.ప్రసాద్
సంచిక
ముఖ్య సంపాదకులకు
ఇతర సాంకేతిక సిబ్బందికి
హృదయ పూర్వక ధన్యవాదములు.
Shyam
God bless you all. Where is shivaiah and his family. Who is he. Where is his photo. He is the greatest human of all.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Thank you
Shyaam.
sagar
మంచి మిత్రులను సహృదయులను కలిగి ఉన్న మీకు, మీ అన్నయ్యగారికి హృదయపూర్వక అభినందనలు సర్ . మనీషి దగ్గరకు చేరువయ్యేదానికే వణికిపోతున్న సందర్భంలో అంతమంది చేరి ఆస్పత్రిలో చేర్చెదానికి పూనుకోవడం అనేది వారి మంచితనానికి మీకు వారితో ఉన్న సత్సంబంధాలకు నిదర్శనం. మీకు మరో సారి అభినందనలు సర్ .
డా కె.ఎల్.వి.ప్రసాద్
సాగర్
మీ స్పందనకు
ధన్య వాదాలు.
బి.జానిభాష
అన్నయ్యా గారి ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడం లాక్ డౌన్ వల్ల మీరు దూరంగా ఉండడం వల్ల అన్నయ్యా గారి ఆరోగ్య పరిస్థితి పైమీర అనుక్షణం పడిన వేదిన వర్ణనాతీతం సర్.
కరోనా వల్ల ప్రపంచం మొత్తం స్తంభించిపోయిన సమయంలో ,కరోనా సోకి ఇబ్బంది పడుతున్న అన్నయ్యా గారికి ఇంతమంది గొప్ప వ్యక్తులు తమ సహాయసహాకారాలు అందించడం చాలా గొప్ప విషయం సర్…..అలాంటి మిత్రులను,శ్రేయోభిలాషులు ఉండడం మీ అదృష్టం సర్.
కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడడం సంతోషం సర్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
జానీ బాబూ
మీ స్పందన కు ధన్యవాదాలండీ
రాపాక అశోక్ కుమార్
ఆనాటి రోజులు చాలా భయంకరమైనవి మామయ్య. నిజంగా అంత మంచి స్నేహితులు వుండడం గొప్ప విషయమే. వారి స్నేహితులు ఎంతో అభినందనీయులు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
అశోక్
ధన్య వాదాలు.
తంగెళ్ళ శ్రీదేవి రెడ్డి
మొత్తానికి మీ అన్నయ్య కోలుకున్నారు. సంతోషం. కరోనా మహమ్మారి మా కుటుంబంలో కూడా భయాన్ని కలిగించి, మెల్లగా జారుకుంది. సర్వేజనా సుఖినోభవంతు
డా కె.ఎల్.వి.ప్రసాద్
శ్రీదేవి గారు
మీ స్పందన కు ధన్యవాదాలండీ
Jhansi koppisetty
అన్నయ్యగారిని గురించిన ఈ ఎపిసోడ్ చాలా బావుంది. సహృదయులను భగవంతుడు ఎప్పుడూ కాచుకుని వుంటాడు. మంచి స్నేహితుల రూపంలో మీ అన్నయ్యను కాపాడాడు. రక్తాన్ని పంచుకున్న మీ అన్నయ్యగారి ఆరోగ్యం పట్ల మీ ఆంందోళన, పూర్తిగా కోలుకున్న పిదప వారిని మీ ఇంటికి ఆహ్వానించి పెట్టుకోవటం వారి పట్ల మీ అనురాగాన్ని ఆపేక్షను తెలియచేస్తున్నాయి..this episode on blood relations worth reading Sir


డా కె.ఎల్.వి.ప్రసాద్
మీ స్పందనకు
ధన్యవాదాలు
ఝాన్సీ గారూ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
ఝాన్సీ గారూ
మీ స్పందన కు ధన్యవాదాలండీ.
Sarasi
ఆప్తులకు కరోనా సోకితే అది ఎంత బాధ కలిగిస్తుందో అనుభవించినవారికే తెలుస్తుంది. నేను కూడా ఆ బాధ అనుభవించాను. నిజమైన ఆప్తులెవరో ఇలాంటి సమయాల్లోనే బయటపడేది. Life risk ఉన్నా ఆదుకున్న మిత్రులే మిత్రులు. వారికి పాదాభివందనం చెయ్యాలి.
డా కె.ఎల్.వి.ప్రసాద్
నిజం సరసి గారూ
మీ స్పందన కు
ధన్యవాదాలండీ .
Ch S N Murthy
I think almost every one might have faced the same situation during last 10 months in case of dear friends or relatives. No transport facilities, quarantine procedures made the situation still worse. Children are not allowed to see the parents or parents to see their children. No words to describe the agony. Our kindness and good behaviour will be rewarded at some time, somewhere by some body. He is God.
Thank Him for the victory over corona survival of your brother Sri Madhusudan.
May almighty bless him with good health and long life.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Thank you
Murthy garu.
Sambasivarao Thota
Prasad Garu!



Manasunna meelaanti Manchi manushyulaku ,andari sahaayam adagakundaane anduthundi ..
Dhanyavaadaalandi,,,
డా కె.ఎల్.వి.ప్రసాద్
రావు గారూ..
ధన్యవాదాలండీ
డా కె.ఎల్.వి.ప్రసాద్
All human relations and relationships are cenripetal to market forces….is the sum and substance of Marx’s evolution of history in our day to day terminology.
The deadliest global pandemic Corona irrefutably and visually proved in letter and spirit how the superstructure (superficial bonds of family kinship and other relations/ships/hoods etc)is illusive and illusional…

However, here and there we find Oases in the hopeless and ruthless society…. but they are RARER than the RAREST.
Animal kingdom is incomparable and beyond human reach in their DIVINITY …
Any way your gracious concern for your lovable bachelor brother is natural. …
May we all be free from the predatory,exploitative and inhuman behaviour of Mankind….
——-Nakka Sudhakar
PEX-AIR
HYDERABAD.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Well said
Sudhakar garu.
Thank you.
చిట్టె మాధవి
మంచి మిత్రులు దొరకడం అదృష్టం సర్.మీ అన్నయ్య గారిని సరైన సమయంలో సరైన చికిత్స లభించడం….వారు కోలుకోవడం అదృష్టం సర్.మంచి సంఘటనను మాతో షేర్ చేసుకున్నారు.సంతోషం సర్
డా కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా..
మీ స్పందన కు
ధన్యవాదాలండీ .
డా కె.ఎల్.వి.ప్రసాద్
మీ జ్ఞాపకాల పందిరి 39 చదివిన.ఏమి రాసినా చదివించే గుణం ఉండటం అవసరం.మీరచన లొ అది పుష్కలం.ఇక విెషయానికొస్తే బంధువులకంటే స్నేహితులే అత్యవసర సమయాల్లొ ఆదుకంటారు.చుట్టపువచూపుగా వచ్చి పలకరించే వారు బంధువులు.కొందరు దానికి భిన్నంగా ఉంటరు కావచ్చు వారి శాతం తక్కువ. నాఅనుభవం చెప్తాను.నాకు 1967 లొ టైఫాయిడ్ వచ్చి గాంధా ఆసిపత్రి లొఉన్న .అప్పటుకు బ్రహ్మనచారిని .మా నాన్న గారు పెద్ద వారు ఊళ్ళొనే మాఅన్నెయ్య ఉంటడు 25కి మీ.నదూరంల ఇంకొ అన్నయ్య.కాని దవాెఖాన లొ రాత్రి నా బెడ్ పక్కన15నరొజులు కింద పడుకున్నవాడు నామిత్రుడు సమ్మారెడ్డి .నేనప్పుడునొఖమ్మం ల ఉద్యొగించే వాడిని ..రెమడు నెలలు ప్రైవేటుగా వైద్యం. తగ్గిందని ఫిట్ నెస్ సర్టిఫకేట్కొసం పొంగనే మళ్ళ జ్వరం.అప్పుడు వి ఎన్ వాగ్రే గారిదగ్గర అడ్మిట్ ఐన . మా చెల్లెలొ మా నాన్ననొ మధ్యాహ్నం భొజనం తెచ్చేవారు రాత్రి తన డూటీ ఐనాక మా మిత్రుడు వచ్చే వాడు.ఎంగుకు చెప్కున్నా నంటే “విడువడాపన్ను”అంటడునభర్తృహరి మిత్రుని లక్షణాలు చెప్తూ ెఆపదలందువవిడువని వాడే మిత్రుడు.
బచ్చే వసీయత్ పూెఛ్ తేహైం.రిశ్తే హైసియత్ పూఛ్ తేహైం. దొస్త్ ఖైరియత్ పూఛ్తే హైం అని ఉర్దూల కహావత్
పిల్లలు ఆస్తులు బంధువులు స్థాయి.మిత్రులుక్షేమసమాచారం కొరుకుంటారని .
మిత్రులున్న వాడు గొప్పసంపద ఉన్న వాడని నాభావన.మీరు చాలాగొప్ప వారు. —రామశాస్త్రి
డా కె.ఎల్.వి.ప్రసాద్
శాస్త్రి గారు
మీ స్పందన కు
ధన్యవాదాలండీ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
కరోనా మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. మీ అన్నగారు దాని బారిన పడి ఆరోగ్యం తో బయటఆడటం చాలా ఆనందాన్ని కలిగించింది. మీరు చాలా మానసిక వ్యధను అనుభవించి ఉంటారు.సుఖాంతం అయినందుకు సంతోషం. మీఅన్న గారు సంపూర్ణ ఆరోగ్యంతో నూరేళ్లు సంతోషంగా జీవించాలని ఆకాంక్షిస్తూ,
సత్యనారాయణ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్య వాదాలు
సత్యన్నారాయణ గారూ
డా కె.ఎల్.వి.ప్రసాద్
స్నేహం మానవ జీవితానికి అతిముఖ్యమైన అవసరం … కానీ స్నేహితుల్లోనూ అంతరంగాన్ని పంచుకొని ఆత్మీయులుగా మన అవసరారాన్ని గుర్తించి ఆదుకునే వారు అరుదే ..
మీ అన్నయ్య విషయంతెలియగానే స్పందించి సహకారాన్ని అందించి సాయపడ్డమిత్రులు నిజమైన మానవతామూర్తులు … హృదయంనిండా ప్రేమనింపుకున్న సౌజన్య శీలురు … ప్రమాదాన్ని కూడా పట్టించుకోకుండా కష్టాల్లో చిక్కుకున్న వాళ్ళను కాపాడాలన్న కనీస ధర్మాన్ని చిత్తశుద్ధితో ఆచరించి చూపిన .. స్నేహ ధర్మం అంటే ఏమిటో నిరూపించిన నిజమైన మిత్రులు …
కాలం కఠోరమైనది … ఈ కరోనాకాలమైతే మొత్తం ప్రపంచ మానవులందరికీ చేదు అనుభవాల్నే పంచింది …
మనిషికి మనిషి తోడుండటమే ఈ సమయంలో పెద్ద సాయం … ఆ పని చేసిపెట్టిన వారే అసలైన ఆత్మీయులు …
మానవ సంబంధాలలో విశ్వాసం ఉన్న వారు గనుక మధుసూదన్ గారు అందరికి ఆప్తుడయ్యారు … ఆ ఆప్తతే ఇప్పుడు అవసరానికి ఉపయోగపడ్డది … మీరన్నట్టు సాయంచేయడానికి వెనకాడే వారే అధికమౌతున్న ఈ రోజుల్లో ఇందరి సాయం అందడం మీ అన్నయ్యగారి మైత్రి లోని నిష్కల్మషత , నిజాయితీ ..
ఒక విధంగా అదే ప్రాణాల్ని నిలబెట్టిందేమో !!!!
సజీవ మానవ సంబంధాల గురించిన విలువైన సమాచారం తెలిపారు … అభినందనలు సర్ !!!
—-గన్నమ రాజు గిరిజామనోహర్
హనంకొండ
డా కె.ఎల్.వి.ప్రసాద్
గురువు గారూ
మీ అమూల్యమైన
స్పందన కు
ధన్య వాదాలు సర్ మీకు
డా కె.ఎల్.వి.ప్రసాద్
నిజంగా ఎంతో వ్యధను అందరికీ మోసుకొచ్చింది కరోనా.ఎంతో సహృదయులు, మంచి వ్యక్తిత్వం ఉన్న వారు,నిరాడంబరంగా కనిపించే మేధావి శ్రీ మధుసూదన్ సర్ కూడా ఈ కోరల్లో చిక్కుకోవడం వారి కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితుల్ని ఎంతగానో కలవర పరిచిన అంశం.అయితే మనిషి సంపాదించుకొనే గొప్ప సంపద ఏదైనా ఉంది అంటే అది మనుష్యుల్ని సంపాదించుకోవడమే.తన కొరకు ఏదైనా చేయగల స్నేహితులు ఉండడం కన్నా ఐశ్వర్యం ఏమీ లేదు.అలాంటి మంచి హృదయాలు కలిగిన సన్నిహితులు మధు సర్ ని కంటికి రెప్పలా కాపాడుకోవడం ఒక మంచి మనిషికి చేసిన సత్కారమే. ఒకరి కొరకు ఒకరు నిలిచిన మిత్ర బృందం అందరికీ,వారిని సంపాదించుకొనెలా చేసిన మధు సర్ వ్యక్తిత్వానికి ప్రణామాలు.మంచి మనుష్యుల గూర్చి మంచి జ్ఞాపకాన్ని అందించారు.మొదట్లో విషాదంగా మొదలైన సుఖాతమైన ముగింపు తెరిపినిచ్చింది సర్

—-నాగ జ్యోతి శేఖర్
కాకినాడ
డా కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా
మా స్పందనకు ధన్యవాదములు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
సార్ నేను ఎప్పుడూ చెబుతుంటాను మంచివారికెపుడూ ఆపదలో దేవునిలా ఎవరో ఒకరి సాయం అందుతుందని. అలాగే మీకు, అన్నయ్యగారికి అంతా మంచి జరిగినందుకు చాలా సంతోషం. ఇంకా కొందరిలో మానవత్వం ఉందనడానికి నిదర్శనంగా సాయంచేసిన వారికి వందనాలు.

—డా.విద్యా దేవి.ఆకునూరు
హనంకొండ..
డా కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా..
ధన్యవాదాలు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Anduke antaru yepudu
Bandi mitrulani doorman chesuko kuda dani. Yevari
Sahayam yepudu yela avasaram padu tundo teleyadu.
——D.Chandra sekhar
Hyderabad.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Thank you
డా కె.ఎల్.వి.ప్రసాద్
Covid-19 pandemics అందరూ ఎప్పుడు అనుభవించని క్షోభ అందరూ అనుభవిoచాము. ఇట్టి పరిస్థితులలో మీరు అనుభవిoచిన క్లిష్టమైన స్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవ్వరూ పట్టించుకోరు. సహాయం చేసే దానికి ముందుకు రారు. ఇట్టి పరిస్థితుల్లో సహాయం కోసం వచ్చిన సహృదయ మూర్తులకు వందనం. వారికి ఎంతైనా రుణం తీర్చుకోలెమ్. వారికి మా తరుపున ధన్యవాదము తెలుప గలరు.
—–ప్రొ.రవి కుమార్.
కాజీపేట.
డా కె.ఎల్.వి.ప్రసాద్
మీ స్పందన కు
ధన్యవాదాలు బ్రదర్.
రమాదేవి బాల బోయిన/మృదువిరి
కరోనా, మనుషుల మధ్యన తెచ్చిన ఎడబాటు మామూలుది కాదండీ…మానసిక వేదన.నిరంతర ప్రవాహమై నేటికీ పొంగారుతోంది…మీ అనుభవాలు
అందరి వేదనలో నుంచి రాసినట్లు గా రాసినట్టు గా ఉన్నాయ్ సార్
డా కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా..
ధన్య వాదాలు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
నమస్కారం సార్





ప్రజా వైద్యులుగా పేరొందిన మీకు,సోదర ప్రేమ ఎలా ఉందో ఈ వారం సంచికలో చెప్పకనే చెప్పారు.కరోనా కరాలా నృత్యం చేస్తున్న సందర్భంలో చిన్నన్నయ్య కూడా బారిన పడటంతో మీరు ఆందోళన చెందటం సహజం.కారణం అలనాడు కరోనా ఫలితాలు అలాగే ఉండటమే కదా.ఐతే అన్నయ్య చేసుకున్న పుణ్యఫలమో,లేదా మీ కుటుంబం చేస్తున్న సేవా గుణమో కావచ్చు ఈ రోజు అన్నయ్య ఆరోగ్యంగా ఉండటానికి కారణం కావచ్చు.అందుకే మీరు సహృదయులయిన స్నేహితులను కలిగి ఉన్నారు.వారి తోడ్పాటుతో అన్నయ్య కరోనా గట్టెక్కారు. ఏదీ ఏమైనా గాడ్ ఈజ్ గ్రేట్ అని అంటారు అందుకే కావచ్చు.
—–గెడ్డం వెంకన్న
హనంకొండ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
వెంకన్న గారూ
మీ స్పందన కు
ధన్యవాదాలండీ.
మొహమ్మద్. అఫ్సర వలీషా
నమస్సుమాంజలులు సార్


అందరూ బాగుండాలి , అందులో మనముండాలి అనే మంచి మనస్తత్వం ఉన్న మీ మనసుకు ఆనందం కలగ చేసిన ఆ దేవునికి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు సార్ .ఆ సమయంలో ఎంత వేదన అనుభవించారో నని మీ జ్ఞాపకాల పందిరిలో దాగిన మీ ఆవేదన పూరిత మాటలే చెబుతున్నాయి సార్. ఆ సమయంలో మనసులో బాధను దాచుకుని ఎంతో మనో ధైర్యాన్ని ప్రదర్శించిన మీ వ్యక్తిత్వం ఆదర్శం స్ఫూర్తి దాయకం .











కరోనా పేరు లోనే ఏడుపును మోసుకొచ్చి అందరినీ ఏడిపిస్తున్నది ఇప్పటికీ, నిజం గా అన్నయ్య గారికి ఆరోగ్యం కుదుట పడి అందరికీ ఆనందాన్ని పంచింది. కోవిడ్ అంటేనే కోసుల దూరం పరిగెత్తే ఆ కష్ట సమయంలో ఆదుకున్న మిత్రులకు వేలవేల నమస్సుమాంజలులు.
మా అందరి కోసం ఏది వ్రాసినా మీ ప్రతి మాటా మాకు అమూల్యం సార్
ప్రతి వారం మీ జీవితం లో ఎదురైన ప్రతి వారిని పలకరించి పలవరించడం మీ గొప్ప మనసుకు నిదర్శనం సార్ హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు మీ మరో జ్ఞాపకం కోసం ఎదురు చూస్తూ శెలవు సార్
డా కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా
నీ అభిమాన
స్పందనకు
హృదయ పూర్వక ధన్యవాదములు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
కుటుంబం పట్ల….సమాజం పట్ల మీకున్న శ్రద్ధ మీ వ్యక్తిత్వానికి దర్పణం….మీ అన్నయ్య గారు ఇంతకుముందు లాగా సాహితీ సేవలందిస్తూ వుండాలని కోరుకుంటున్నాను…. ఒకసారి చూసి రండి…. బస్సులు స్టార్ అయ్యాయిగా….
—–శర్మ
హైదారాబాద్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
మీ స్పందనకు ధన్యవాదములు
డా కె.ఎల్.వి.ప్రసాద్
As I have told earlier, a friend in need is a friend indeed. Pranamam to all the good hearted friends.
—–surya narayana rao
Hyderabad.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Thank you
So much sir.
డా కె.ఎల్.వి.ప్రసాద్
సర్ మీరు రాసిన ఈ కథ రెండు నుంచి నాలుగు సార్లు చదివాను. కథ ఒక ఉత్కంఠత మధుసూధన్ గారికి ఏమి అవుతుంది అని . ఆయన చక్కగా covid నుంచి బయట పడ్డారు , అదే పది వేలు.
వారు ఇంకా చల్ల గా పది కాలాలు ఆయువు ఆరోగ్యాలు తో బ్రతకాలని కోరుకొంటూ.
మీ సత్యనారాయణ
డా కె.ఎల్.వి.ప్రసాద్
డాక్టర్ గారూ
మీ స్పందన కు
ధన్యవాదాలండీ .
డా కె.ఎల్.వి.ప్రసాద్
It was so touching to the heart.
—-TSC Bose
Hyderabad.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Thank you somuch sir
డా కె.ఎల్.వి.ప్రసాద్
శివయ్యగారు శివుడే దగ్గరుండి అన్న
య్యను కాపాడినాడు .లక్ష్మిడాక్టరు
తోనున్న మీ స్నేహాను బంధం అన్నయ్యగూర్చి సమాచారం ఇచ్చి
మిమ్ములను కుదుట పరిచింది.
కోవిడ్ జయించిన అన్నయ్య ఆత్మస్థైర్యం అన్నిటికన్నా గొప్పది.
ఏదిఏమైనా కథ సుఖాంతం కదా
శుభాకాంక్షలు
——వజ్జల రంగాచార్య
హనంకొండ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
రంగాచార్య గారూ
మీ స్పందన కు
ధన్యవాదాలండీ .
డా కె.ఎల్.వి.ప్రసాద్
నమస్కారం సర్

కోవిడ్ మహమ్మారి వల్ల ప్రత్యక్షంగా
పరోక్షంగా ఎందరో బాధింపపడ్డారు…
మీ అన్నయ్యగారి కోసం మీరు పడిన బాధ ప్రతీ అక్షరం లో కనబడింది
సర్….
మీ అన్నయ్య గారి ఆరోగ్యం కోసం
అంత మంది సహకరించారు అంటే
మీరు, మీ అన్నయ్య గారు ఎంత సహృదయులో తెలుస్తుంది సార్
—–కళావతి.కె
హైదారాబాద్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా
మీ స్పందన కు
ధన్యవాదాలండీ .
డా కె.ఎల్.వి.ప్రసాద్
Again and again same thing. If any one comes out of the problem it is because of the God. He will help through messenger or messengers.
——-Dr.M.Manjula
Hyderabad.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Thank you
డా కె.ఎల్.వి.ప్రసాద్
అన్నగారి మిత్రులు తమ వయస్సు,తమ భద్రత లేక్క చేయకుండ మితృత్వం చాటారు Great Friends
——-నిధి(బ్రహ్మ చారి)
హనంకొండ
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు
నిధిగారూ….