నా పుస్తకాలకు ముందుమాటలు రాసిన సాహితీమూర్తులు
పుస్తక ప్రపంచంలో, అది నవల అయినా, కథ అయినా, కవిత్వం అయినా వ్యాసం అయినా, పుస్తకానికి రచయిత కంటే అనుభవజ్ఞులైన రచయితల చేత, పండితుల చేత, ఇతర పెద్దల చేత ముందుమాట రాయించుకోవడం ఆనవాయితీ. ఈ సంప్రదాయం ఎప్పటినుండో ఇప్పటివరకూ కొనసాగుతున్నది. ఒక ప్రసిద్ధ రచయిత ముందుమాట కోసం నెలలు, సంవత్సరాలు ఎదురు చూసిన పెద్ద రచయితలు కూడా వున్నారు. దీనిని బట్టి ముందుమాటకు రచయిత ఎంతటి విలువనిస్తాడో అర్థం అవుతుంది. అసలు ముందుమాట ఎందుకు?ముందుమాట ఏమిటీ?
పుస్తకం రాయడంలో రచయిత ఉద్దేశం ఏమైనప్పటికీ, ముందుమాట రాసేవారు మాత్రం పుస్తకాన్ని మొత్తం క్షుణ్ణంగా చదివి, అన్ని రకాల పాఠక మహాశయుల్ని దృష్టిలో ఉంచుకుని, పుస్తకం లోని సారాన్నీ, రచయిత ఎన్నుకున్న అంశాన్ని, శైలిని, రచయిత ఎన్నుకున్న భాషా విధానం, ఇలా అనేక అంశాలు దృష్టిలో పెట్టుకుని, పుస్తకాన్ని చదివించేలా చేయడమే ముందుమాట ఉద్దేశం. అందుచేత ముందుమాటలు అలవోకగా ఆషామాషీగా రాసేవి కాదు. చాలామంది ముందుమాటలు కూడా సాహిత్య ప్రయోజనాన్ని కలిగి ఉంటాయి. అందుకే కొందరు ప్రసిద్ధ రచయితలు రాసిన ముందుమాటలు పుస్తక రూపంలో దర్శనమిస్తుంటాయి. అవి సాహిత్య ప్రయోజనం కలిగి ఉండడం వల్ల లేత.. లేత.. పరిశోధకులకు ఉపయుక్త గ్రంథాలుగా నిలుస్తాయి.
ముందుమాట – అనే అంశం ఈ మధ్యకాలంలో పట్టాలు మార్చుకుని మరో మార్గం వైపు ప్రయాణించే పరిస్థితులు కూడ ఏర్పడుతున్నాయి. ఇప్పుడు “నీ పుస్తకానికి నేనే ముందుమాట రాస్తాను” అని వెంటపడే పెద్దలూ వున్నారు. పుస్తకానికి ముందుమాట రాయమని, రాసిన తర్వాత, పుస్తక ప్రచురణ నిమిత్తం చందాలు వసూలు చేసే రచయితలూ వున్నారు. వీరికి మరింత భిన్నంగా, డబ్బులు తీసుకుని, ముందుమాటలు రాసి ఈ అంశాన్ని వాణిజ్య పరం చేసిన మహానుభావులు కూడా వున్నారు. ఏ రూపంలో ముందుమాట వచ్చినా, ఎంతటి పెద్దలు ముందుమాట రాసినా, కేవలం పొగడ్తలకు లేదా తెగడ్తలకు చోటివ్వకుండా, రచనలోని ముఖ్య ఉద్దేశాన్ని, రచయిత రచనాశైలిని పాఠకుడికి సమగ్రంగా, సరళతరంగా అందించగలగాలి. అప్పుడే ఆ ముందుమాటకు, తద్వారా రచనకు, రచయితకు విలువ పెరుగుతుంది.
ఒక మామూలు దంతవైజ్ఞానిక వ్యాసాల రచయితగా నేను నా మొదటి పుస్తకం ‘దంతసంరక్షణ’ నవభారత్ బుక్ హౌస్, విజయవాడ వారు (పి.ప్రకాశరావు గారు)ప్రచురించినప్పుడు, నా పుస్తకానికి ముందుమాట డా. సమరం (సెక్స్ సైన్స్ ఫేమ్ ) గారు రాశారు. డా. సమరం గారు అప్పటికే ఈనాడు దినపత్రికలో వారం వారం ‘సెక్స్ సైన్స్’ శీర్షికతో వ్యాసాలు రాస్తూ పాఠకలోకంలో మంచి పేరు తెచ్చుకున్నారు. వారి ప్రోత్సాహమే నా చేత వ్యాసాలు రాయించింది.
నా రెండవ పుస్తకం ‘చిన్నపిల్లలు – దంతసమస్యలు’ మొదటి ముద్రణకు మా గురువుగారు (బి.డి.ఎస్.లో) ప్రొఫెసర్ పి. రామచంద్రారెడ్డి గారు ముందుమాట రాసి ఆశీర్వదించారు. నన్ను వ్యాసాలు రాయమని, కవిత్వం రాయమని ప్రోత్సహించేవారు. ఆయన నాకు గురువు, మార్గదర్శి మాత్రమే కాకుండా, నాకు శ్రేయోభిలాషి కూడా.
అలాగే నా మొదటి కథల పుస్తకం ‘కెఎల్వీ కథలు’ పుస్తకానికి ముందుమాటలు రాసిన మహానుభావులు నలుగురు. నలుగురూ నాకు ఆత్మీయులే!
అందులో మొదటివారు, ప్రసిద్ధ నవల/కథా రచయిత డా. అంపశయ్య నవీన్ గారు. తన మొదటి నవల పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత ఆయన.


నవలా రచయిత డాక్టర్ అంపశయ్య నవీన్ (హన్మకొండ) గారితో.


సాహితీ వేత్త శ్రీ గన్నమరాజు గిరిజామనోహర్ బాబు, హన్మకొండ.
తర్వాత శ్రీ గన్నమరాజు గిరిజామనోహర్ గారు చక్కని ముందుమాట రాసి ఇచ్చారు. పరిశోధనల డిగ్రీ లేకపోయినా ఎంతో మంది పరిశోధకులకు గురుతుల్యుడు ఆయన. పేరు ముందు ప్రత్యేక బిరుదులు అవసరం లేని మహా పండితుడు ఆయన.
నా మొదటి కథల పుస్తకానికి మరో ముందు మాట రాసిన మహానుభావుడు ప్రొఫెసర్ బన్న ఐలయ్య గారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో (వరంగల్) హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంటుగా కొనసాగి ప్రస్తుతం, ఆర్ట్స్ &సైన్స్ కళాశాల (సుబేదారి)కు ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నారు. ఎంతోమంది పరిశోధక విద్యార్థులకు మార్గదర్శకుడు మాత్రమే కాక, మంచి ఉపాద్యాయుడు, రచయిత, అద్భుతమైన ఉపన్యాసకుడు. ఆయనను నాకు మొదట పరిచయం చేసిన వారు స్వర్గీయ డా. పి. వి. రమణ గారు. బన్న ఐలయ్య గారు నాకు మంచి స్నేహితులు కావడం విశేషం!


డాక్టర్ బన్నా ఐలయ్య గారితో (ప్రిన్సిపాల్, ఆర్ట్ & సైన్స్ కాలేజీ, హన్మకొండ)
ఇక చివరి వ్యక్తి నాకు ప్రత్యేకమైన వ్యక్తి. ఆయనే మడిపెల్లి దక్షిణామూర్తిగారు. ఈయన ఆకాశవాణి (కడప/వరంగల్/హైదరాబాద్)లో అనౌన్సర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన ప్రియమిత్రుడు, శ్రేయోభిలాషి.


మడిపెల్లి దక్షిణామూర్తి (హైదరాబాదు) గారితో
రేడియో ఇంటర్వ్యూ లకు నాలోని బెదురును చెదరగొట్టిన సహృదయుడు శ్రీ దక్షిణా మూర్తి. స్నేహానికి/సహాయానికి, మారుపేరు ఈ శ్రీ మడిపెల్లి.
మరో కథల పుస్తకం ‘హగ్ మీ క్విక్’కు, కార్టూన్ రూపంలో, ప్రియమిత్రులు శ్రీ ‘సరసి’ ఆశీస్సులు అందించారు. నేను రాసిన రెండు పుస్తకాలకు (పనస తొనలు/చిలకపలుకులు) ముఖ చిత్రం వేసి ఇచ్చిన మహానుభావుడు సహృదయమూర్తి ఆయన.


శ్రీ సరస్వతుల రామనరసింహం (సరసి), హైదరాబాదు
ఆయన అసలు పేరు సరస్వతుల రామ నరసింహం. ఆయన కేవలం కార్టూనిస్టు మాత్రమే కాదు, మంచి చిత్రకారుడు, మంచి హాస్యకథా రచయిత కూడాను.
ఇదే పుస్తకానికి పద్యరూపంలో ఆశీస్సులు అందించిన మిత్రులు, మహా పండితులు, అవధాని, మంచి రచయిత పద్మశ్రీ డా. ఆశావాది ప్రకాశరావు గారు.


పద్మశ్రీ ఆశావాది ప్రకాశరావు గారు, అనంతపురం
తర్వాత, ‘చిలక పలుకులు’ పుస్తక వచ్చింది. ఇందులో ఇద్దరు ప్రసిద్ధ రచయిత్రులు, మహిళా మిత్రమణులు తమ ముందుమాటలు అందించారు. ఇదే రచయిత్రులు, నా మరో కథల పుస్తకం ‘నాన్నా పెళ్ళిచేయవూ..!’ పుస్తకానికి కూడా ముందుమాటలు రాశారు. అందులో మొదటివారు శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి. హైదరాబాద్ నివాసి అయినప్పటికీ, పిల్లల స్థిర నివాసం దృష్టిలో ఉంచుకుని ఎక్కువకాలం ఆస్ట్రేలియా దేశంలో గడుపుతున్నారు. కథలూ నవలలూ రాసినప్పటికీ, మంచి నవలా రచచయిత్రిగా పేరుపొందడమే గాక, అనేక సంస్థలనుండి సన్మానాలు, ప్రశంసలు అందుకుంటున్న సహృదయని, మిత్రమణి శ్రీమతి ఝాన్సీ.


నవలా రచయిత్రి శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి గారితో….
నా పుస్తకాలకు ముందుమాట రాసిన మరో మిత్రమణి డా (శ్రీమతి) సుశీల. వీరు గుంటూరు వాసి అయినప్పయికి ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం వుంటున్నారు. ప్రిన్సిపాల్‌గా పదవీ విరమణ చేసిన సుశీల గారు మంచి పరిశోధకురాలు. ఎంతోమంది తెలుగు పరిశోధక విద్యార్థులకు మార్గదర్శిగా తన సేవలు అందించారు. డా. సుశీల గారు మంచి రచయిత్రి, సమీక్షకురాలు. ఈ రెంటికీ మించి మంచి సాహిత్య విమర్శకురాలిగా పేరు తెచ్చుకున్నారు. వీటికి తోడు సుశీల గారు మంచి వక్త కావడం విశేషం.


డాక్టర్ సి.హెచ్. సుశీల గారు, హైదరాబాదు
నా పుస్తకాలకు ముందుమాటలు రాసిన వారందరూ, నేను అభిమానించేవారు నన్ను అమితంగా అభిమానించేవారు, ప్రేమించేవారూ కావడం నా అదృష్టం. వరంగల్ (హన్మకొండ) సాహితీ రంగంలో నా పేరు కూడా ఈ సందర్భంగా నమోదు కావడం నాకు గర్వకారణం. దీని వెనుక వున్న స్నేహితులకూ, సాహితీమూర్తులకు ఎప్పటికీ రుణపడే వుంటాను.


ప్రముఖ కవి దర్భశయనం శ్రీనివాసాచార్య, హైదరాబాదు
చివరగా మరొక సాహితీమూర్తి గురించి కూడా చెప్పాలి. రాబోయే నా మరో చిన్న పుస్తకానికి (ఆటవిడుపు – బాలగేయాలు) ముచ్చటైన ముందుమాట రాసి ఇచ్చి పుస్తకానికి పేరు కూడా సూచించిన, ప్రముఖ కవి, అనువాదకులు విమర్శకులు, మంచి వక్త, శ్రీ దర్భశయనం శ్రీనివాసాచార్య గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు.
(మళ్ళీ కలుద్దాం)

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
31 Comments
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు.
—డా కె.ఎల్.వి.ప్రసాద్
హన్మకొండ జిల్లా
Sagar
ముందుమాటలోనే పుస్తకం విషయం సంక్షిప్తంగా ఉంటుందని ఒకప్పటి నమ్మకం సర్. తరువాత మారిన పరిస్ధితుల్లో మీరు పైన ఉదహరించిన వ్యవహారాలు సాగుతున్నాయి. ఇక మీ విషయంలో ఇంతమంది సాహితీ దిగ్గజాలు ముందుమాట అందించడం వారి మంచితనానికి మీ సంబంధ బాంధవ్యాలకు మంచి ఉదాహరణ. మీకు అభినందనలు మరియు ధన్యవాదములు.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
సాగర్
నీ స్పందన కు
ధన్యవాదాలు.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
ముందుమాట విలువ..ఆ విలువగల వ్యక్తుల పరిచయం బాగుంది.
——డా.మల్లికార్జున్
హన్మకొండ.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
ధన్యవాదాలండీ
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
Gd Mng Doctor garu,
ఎందరో మహానుభావులు అందరికి వందనములు
——సూర్య నారాయణ రావు
హైదరాబాద్
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
ధన్యవాదాలండీ
ఎన్.వి.ఎన్.చారి
ముందుమాటలముద్దుముచ్చట బాగుంది
ఋణానుబంధం …కృతజ్ఞతలు ఇలా మధీర స్మృతులలో
డా. కె.ఎల్ వి ప్రసాద్
ధన్యవాదాలండీ.
డా. కె.ఎల్ వి ప్రసాద్
మీ పుస్తకాలకి ముందు మాటలు రాసిన సాహితీ మూర్తులకు వందనాలు. నిజమే … మీరన్నట్టు కొందరి అనుభవాలు జీవితంలో కొందరికి జ్ఞాన మార్గాలు కావొచ్చు
–డాక్టర్ తంగెళ్ల శ్రీదేవిరెడ్డి
హైదరాబాద్.
డా. కె.ఎల్ వి ప్రసాద్
అమ్మా…..
మీ స్పందనకు ధన్యవాదాలు.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
Great
Ur Doctor & writer more than ur profession as passion
——Dr.Hanmantarao
Hyderabad.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
Thank you sir.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
చూసాను డాక్టర్ గారూ. మీ పుస్తకాలకు ముందు మాటలు రాసిన వారిని గుర్తు చేసుకున్నారు. సంతోషం.
—-దర్భశయనం శ్రీ నివాసాచార్య
హైదరాబాద్.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
ధన్యవాదాలండీ
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
జ్ఞాపకాల పందిరి -92 లో పుస్తకానికి ముందు మాట ప్రాధాన్యత గురించి చక్కగా వివరించారు. అభినందనలు.
—-జి.శ్రీనివాసాచారి
కాజీపేట.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
ధన్యవాదాలండీ
Rajendra+Prasad
మీలో ఉన్న ప్రతిభను చూసి, చాలా మంది మిమ్మల్ని ప్రోత్స హించినట్టు తెలుస్తోంది. మీ ఆసక్తే సాహిత్య రంగానికి దగ్గర చేసింది. All the best ahead sir
– రాజేంద్ర ప్రసాద్
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
ధన్యవాదాలండీ
ప్రసాద్ గారు.
శ్యామ్ కుమార్ చాగల్
ఒక రచన కు , పుస్తకానికి మొదటి పేజీ లో వ్రాయ బడే ముందు మాట కు ఎంతటి ప్రాముఖ్యత ఉందొ చాలా బాగా వ్రాసారు రచయిత డాక్టర్ కె ఎల్ వి ప్రసాద్ గారు.
పుస్తకం లో ముందు మాట ఒక సారి చదవక ముందు, చదివి న తర్వాత ఆ పుస్తకం లో వుండే విషయాన్ని అర్థం చేసుకునే విధానం లో మార్పు ఉంటుంది . సాధారణంగా ఆంగ్ల భాష పుస్తకాలలో అయితే ముందు మాట అనేది పుస్తకం వెనుక వేపు అందరికీ కనిపించే విధంగా ఉంటుంది. చాలా సార్లు పుస్తకం కొనే ముందు ..అది చదివిన తర్వాతే కొనటం జరుగుతూ ఉంటుంది.
అటువంటి ముఖ్యమైన ప్రక్రియ నేడు వెర్రి తలలు వేసి దాని యొక్క ప్రాముఖ్యతను కోల్పోవటం అన్నది ఎంతో దురదృష్టకరం.
కథ ల పుస్తకం ,రచన ఒక ఎత్తు అయితే, దానికి మంచి ముందు మాట ఇంకొక ఎత్తు.
నాకు తెలిసినంత వరకూ ..రచన బావుంటే గానీ విశిష్టమైన వ్యక్తులు ముందు మాట రాయరు. ఇందులో కూడా వ్యాపార పోకడలు వేళ్లూనుకోవడాన్ని సాహితీవేత్తలు నిష్కర్షగా ఖండించాలి, నిరుత్సాహా పరచాలి.
ఈ సందర్భం లో డాక్టర్ కె ఎల్ వి ప్రసాద్ పుస్తకాలకు మంచి మిత్రుల సహకారం, ముందు మాట వ్రాయటం సంతోషకరం. ఎన్నుకున్న విషయం ఏదైనా సరే , దాన్ని పరిపూర్ణ పద్దతిలో మన కు సమర్పించటం రచయిత ప్రత్యేకత. అభినందనల తో మిత్రుడు, శిష్యుడు శ్యామకుమార్ చాగల్.,నిజామాబాదు
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
మిత్రమా
నీ విశ్లేషణ బాగుంది
హృదయపూర్వక ధన్యవాదాలు.
Bhujanga rao
జ్ఞాపకాల పందిరి 92 లో పుస్తకానికి ముందు వ్రాసే మాటల విలువలు తెలియ చేసిన మీకు, ముందు మాటలు వ్రాసిన సాహితీ వేత్తలకు మా నమస్కారములు.హనుమకొండ సాహితీ రంగంలో మీ పేరు కూడా నమోదు కావడం మీ ప్రతిభకు తార్కాణం సర్.మంచి విషయాలు అందిస్తున్న మీకు హృదయపూర్వక నమస్కారములు.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
ధన్యవాదాలండీ
భుజంగరావు గారు.
Sambasiva+Rao+Thota
Prasad Garu!
Oka pusthakaaniki mundu mata aavashyakatha ,gurinchi chaalaa chakkagaa vivarinchaaru…
Kaani andaroo andari pusthakaalaku mundu maatalu vraayarandi…
Vaari vaari sthaayi…aa vishayaanni nirnayisthundi..
Meeru,mee sthaayi anduku nidarshanam…
Manchi vishayalanu theliyajeshinanduku , Dhanyavaadaalandi
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
ధన్యవాదాలండీ
రావుగారు.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
హృదయపూర్వక నమస్సులు సార్

మీ రచనలు – ముందుమాటలు ‘వ్యాసం’ ఆసాంతం చదివాను సర్. 5 గురిని గొప్పగా పరిచయం చేశారు .
మీరు ఎక్కడ ఏది కొంచం కూడా ఎక్కువ కానీ తక్కువ కానీ కాకుండా సమానంగా
ఒక బ్యాలెన్స్ గా గొప్పగా రాస్తారు
మీకు





—అన్వర్ కవి
హన్మకొండ.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
ధన్యవాదాలు సోదరా.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
92 వ సంచిక చధివినాను డాక్టర్ గారూ!
ముందుమాటల అసలు ఉద్దేశ్యం ఏమిటో మీరు చెప్పిన విషయాన్ని వ్యతిరేకిఅంచటానికి వీలు లేదు.అందరూఒప్పుకున్న ఒప్పుకోవలసిన మాట.
అవి దారి తప్పుతున్నయనే మాట కూడా నిజమే కావచ్చు.పరస్పర ప్రయోజనాలువకూడా ఉండవచ్చు.
నన్ను ఒకపెద్దమనిషి ఒక శతకానికివముందుమాట రాయమన్నాడు రాయనన్నప్పటికీబలవంతశపెట్టి రాయిఅంచుకున్నాడు.
బహుశాఆయన పైఅధికారులతో ఆయనకేదో పని పడి ఉంటుంది.అందుకని తన పొఅధికారితో రాయించుకుని అచ్చు వేసినాడు.ఎంతమందితో రాయించూకోవాలో అనేది ఆయన ఇష్టం.కాని నాతో పోరి పోరి రాయిఅంచుకున్న ముందుమాట వేసుకోలేదు పుస్తకంలో.నలుగురికి పాఠాలువచెప్పేటాయనఇట్లావచేస్తడనుకోలే.ఆవిష్కరణ సమాచారమూ నాకు లేదు.ముందుమాట వేసుకోలేక పోతున్నాననే విషయమూ నాకు చెప్పలేదు.ఏశప్రయోజనాన్నిఆశించి ఇట్లా చేసినాడో తెలువదు. మర్యాదకైనా నాకు చెప్పలేదు.ఓఏడాది తరువాత పుస్తకంఅచ్చైందా అని అడుగుతే
ఒక కాపీ ఇచ్చినాడు సారీ మరచి పోయిన అని .
ఇటువంటి పెద్దలూ ఉంటరు.మీకు తారస పడ్డట్టు లేరు.మీపుస్తకాలకు ముందు మాటలు రాసిన వారంతా సహృదయులు,. వారికి నమస్సులు. మీకు అభినందనలు,వారితోవముందు మాటలు రాయించుకోగలిగినందుకు
—–రామశాస్త్రి
—
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
ఒక మంచి అనుభవం చెప్పారు
ధన్యవాదాలు శాస్త్రి గారు.
మొహమ్మద్+అఫ్సర+వలీషా
చాలా బాగుంది సార్ 92 ఎపిసోడ్ ఎందుకంటే నేనేదైనా పుస్తకం చదివే ముందు తప్పకుండా ముందు మాట ఎవరు వ్రాశారు ఎలా వ్రాశారు ఎంత బాగా వ్రాశారు వారు ఆ పుస్తకం గురించి రచయితకు ఎలాంటి సూచనలు అభినందనలు ఎలా తెలిపారు అని తెలుసుకోనిదే కధ కానీ కవితలో అడుగు పెట్టను .ఎందుకంటే ఎంతో సాహిత్యంలో ఆరితేరితే గానీ ముందు మాటలు వారితో వ్రాయించరు.చాలా చక్కగా అందరినీ గుర్తు పెట్టుకొని మరీ వారి ఫోటో లతో సహా మాకూ పరిచయం చేసిన మీ జ్ఞాపకాల పందిరికి హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు శుభాభినందనలు సార్ మీకు.











డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
అమ్మా
మీ స్పందనకు ధన్యవాదాలు