తాళికట్టు శుభవేళ..!!
ఈ పేరుతో ఒక పాత సినిమా పాట ఉన్నట్టు గుర్తు. పేరు వినడమే గాని సినిమా కథ తెలియదు, అందులోని పాటలూ గుర్తుకు లేవు. పెళ్లి మీద పెళ్లి, మళ్ళీ పెళ్లి, అనే పాత సినిమాలు కూడా ఉన్నట్టు గుర్తు. మళ్ళీ పెళ్లి అంటే, మరోసారి పెళ్లి అని, లేదా రెండో పెళ్లి అని అర్థం చేసుకోవచ్చు. పెళ్లి మీద పెళ్లి చేసుకున్నా, రెండో పెళ్లి చేసుకున్నా ఆ పరిస్థితి రావడానికి అనేక కారణాలు ఉంటాయి. అలాంటి కారణాలు ఎదురుపడడానికి అనేక సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు కూడా కొన్ని కల్పించుకున్నవి, మరికొన్ని మనకు సంబంధం లేకుండానే మనల్ని ఇబ్బంది పెట్టేవి.
‘పెళ్లంటే నూరేళ్ళ పంట..’ అనేవారు. ‘వివాహము అన్ని విషయములలోనూ ఘనమైనది’ అని బైబిల్ (హెబ్రీ 13:4) చెబుతున్నది. అంటే పెళ్లి అనే తంతుకు అంత విలువ వున్నది. ఒకప్పుడు తెలిసిన కుటుంబాల మధ్య, పెద్దల సమక్షంలో పెళ్లి సంబంధాలు కుదిరేవి. పూర్తి వివరాలు సేకరించి, నచ్చితేనే గాని సంబంధాలు కుదిరేవి కావు. దీనికి తోడు పెళ్లి అయిన తరువాత, మన భారతీయ సంప్రదాయం ప్రకారం, ‘తాళి’ని పవిత్రంగా భావించేవారు. భార్యను భర్త, భర్తను భార్య ప్రేమించుకోవడం, ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం వంటివి బాగా ఉండేవి. అంతమాత్రమే కాకుండా సమాజంలో కుటుంబ గౌరవాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో, మంచి – మర్యాదలకు ఎంతో విలువనిచ్చేవారు. కొందరు సహజంగాను, మరికొందరు బలవంతంగాను, భర్తలపట్ల భయభక్తులతో మెలిగేవారు. అలాగే భర్తలు కూడా భార్యలను ప్రేమగా చూసేవారు. భార్యాభర్తల మధ్య అవగాహనా లోపం అప్పుడూ వుంది, ఇప్పుడూ వుంది, లేదంటే ఇప్పుడు కాస్త ఎక్కువగానే ఉందని చెప్పాలి. అంతమాత్రమే కాదు, ‘ఆడది ఆబల’, ‘ఆడది వంటింటి కుందేలు’ వంటి పదాలు చెల్లుబడి అయ్యేవి. అత్తింటి ఆరళ్ళు కూడా అధికంగా ఉండేవి. స్త్రీ ఆర్థికంగా అస్వతంత్రురాలు కావడమే దీనికి ప్రధాన కారణం కావచ్చు!
అలాగే ఒకసారి పెళ్లి తంతు ముగిసిన తర్వాత ఆడపిల్లల తల్లిదండ్రులు సైతం కష్టమైనా, నష్టమైనా అత్తింటివారితో సర్దుకుపోవాలి అని నచ్చజెప్పే ప్రయత్నం చేయడంతో తప్పనిసరిగా ఎన్ని ఇబ్బందులు వున్నా సర్దుకుపోయేవారు. ఎంతో నరక ప్రాయం అయితే తప్ప విడాకుల గురించి ఆలోచించే పరిస్థితి వచ్చేది కాదు. సకాలంలో పిల్లలు పుడితే వివాహబంధం మరింతగా బలపడేది. ఒక చింతలు లేని కుటుంబం ఉంటే అది పూర్తిగా ఆ ఇంటి కోడలు వ్యవహార శైలిమీద ఆధారపడి ఉండేది. స్త్రీల పక్షాన సమస్యలు కూడా వుండేవి గాని, బహుతక్కువగా ఉండేవి. అలా మొత్తం మీద వివాహ బంధానికి ఎక్కువ విలువ, ప్రాధాన్యత ఉండేవి. అందుకే ఆ రోజుల్లో వ్యవహారం విడాకుల వరకూ వచ్చిందంటే, అదొక పెద్ద సంచలనమే! ఇరుపక్షాలవారు జనావళికి దోషులుగా కనిపించేవారు. అలాంటి కుటుంబాలను జనం వింతగా చూసేవారు. అప్పట్లో భార్యాభర్తల మధ్య ప్రధాన సమస్య ‘వరకట్నం’ ఉండేది. అత్తమామల నుండి, భర్త నుండి, స్త్రీకి వరకట్నం అనేది, ప్రాణసంకటంగా ఉండేది. ఆ వేధింపులతోనే సమస్యలు ఎక్కువగా ఉత్పన్నమయ్యేవి. దానికోసం ప్రభుత్వ పరంగా ఎన్ని శాసనాలు వచ్చినా వరకట్నం చికిత్స లేని పెద్ద జాడ్యంగానే మిగిలిపోయింది.
ఇప్పుడు రోజులు మారాయి. మహిళ వంటింటి నుండి బయట పడింది. పురుషుడితో సమానంగా, ఒక్కోసారి పురుషుడిని మించి ఉన్నతస్థాయి ఉధ్యోగాలు చేసే స్థాయికి ఎదిగింది. ఆమెకు ఆర్థిక స్వేచ్ఛ, స్వాతంత్య్రం లభించాయి. అయితే ఇంటి పని, బయటి పని కలిసి తడిసి మోపెడయింది. ఇక్కడ పురుష అహంకారం సమస్యలకు ఆజ్యం పోసింది. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులైతే (ముఖ్యంగా సాఫ్ట్వేర్ అయితే), మరింత జటిల సమస్యలు ఉత్పన్నమై, ఇంట్లో పని పంచుకునే విషయాల్లో తేడాలు వచ్చి, ‘నువ్వెంత?’ అంటే ‘నువ్వెంత?’ అనే పట్టుదలలు పెరిగి, చిన్న చిన్న విషయాలకే విడాకుల వరకూ వెళ్లే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పైగా ఇందులో ఎక్కువశాతం ప్రేమ వివాహాలు, ఆ తర్వాత పెద్దలు ఏర్పరచిన వివాహాలూనూ. ఎంత, పెద్ద చదువులు చదివినా, ఎంత పెద్ద ఉద్యోగం వెలగబెట్టినా, జీవితం అంటే ఏమిటో, ప్రేమ, సంసారం, కుటుంబం, వాటి విలువలు ఏమిటో తెలుసుకోలేని అజ్ఞానులుగా మారి నేటి యువత సమాజానికి ఒక క్లిష్ట సమస్యగా తయారయింది. కేవలం సంపాదనకు మాత్రమే విలువనిచ్చి, మిగతా విషయాలను అశ్రద్ధ చేయడం వల్ల, పెళ్ళైన పది రోజులకే విడాకుల కోసం కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడుతున్నది. ఓర్పు, సహనం నశించడం, పనికిరాని పట్టుదలలు పంతాలు-పట్టింపులు పెరగడం, భవిష్యత్తును గురించిన అవగాహన అసలు లేకపోవడం మూలాన, పండంటి జీవితాలు రోడ్డున పడుతున్నాయి. ప్రస్తుతం, ఇక్కడ ఈ విషయాల్లో, ఆడ-మగ అనే తేడా లేనేలేదు, ఎవరూ తక్కువగా లేరు. విద్యావిధానంలో కేవలం పాఠ్య పుస్తకాంశాలకు తప్ప, జీవితానికి సంబంధించిన, మానవీయ అంశాలు కూడా లేకపోవడం ఈ సమస్యకు కారణం కావచ్చు. ఈ నేపథ్యంలో జరుగుతున్న నష్టాన్ని ఎవరూ గమనించక పోవడం, అంచనా వేయకపోవడం బాధాకర విషయం. ఒకప్పుడు సమస్యలను సృష్టించడంలో, యువకుల పాత్రనే ఎక్కువగా చెప్పుకునేవారు. కానీ,ఇప్పుడూ మేమూ ఉన్నామంటూ, యువతులు సైతం సమస్యలు సృష్టిస్తున్నారు, తెలియకుండానే తమకు తాము సమస్యలు సృష్టించుకుంటున్నారు. ఇది దురదృష్టకరం!
ఇలాంటి వాతావరణంలో నా అనుభవాన్ని కూడా ఇక్కడ ఉదాహరించవలసిన అవసరం వుంది. నాకు ఇద్దరు పిల్లలు. మొదటి సంతానం అబ్బాయి, రెండవ సంతానం అమ్మాయి. ఇద్దరినీ నా స్థాయిలో క్రమశిక్షణలోనే పెంచాను. వాళ్ళు కూడా నా జీవన శైలిని అర్థం చేసుకుని, సద్వినియోగం చేసుకుని పైకి వచ్చారు. మొదట అమ్మాయికి ఘనంగా పెళ్ళి చేసాను. ఆమె ఆకాశవాణిలో ఉద్యోగం సంపాదించుకుని తన ఆనందమయ జీవితాన్ని గడుపుతోంది. తరువాత నాలుగు సంవత్సరాల తేడాతో అబ్బాయి పెళ్లి ఘనంగా జరిపించాను. ఇంచుమించు నా బంధువులని ఆత్మీయులనీ, నా శ్రేయోభిలాషుల్ని, మిత్ర పరివారాన్నీ ఎక్కువ సంఖ్యలో పిలిచాను.
పెద్ద సంఖ్యలో పెళ్ళికి అందరూ తరలివచ్చారు. ఇద్దరు పిల్లలకు తృప్తిగా, ఘనంగా పెళ్లి చేయగలిగానన్న ఆనందంలో మునిగిపోయాను. కొడుకు కోడలూ అమెరికా వెళ్లిపోయారు. అక్కడ వాళ్ళు ఆనందంగా గడుపుతున్నారని, త్వరలోనే వారి సంతానాన్ని కూడా కళ్లారా చూస్తానని కలలు కన్నాను.
కానీ నా ఆనందం ఎంతో కాలం నిలవలేదు. మా కొడుకు సంసారిక జీవితం సజావుగా నడవడం లేదని చాలా ఆలస్యంగా తెలుసుకోగలిగాం. మేము ఎక్కడ బాధ పడతామోనని మా అబ్బాయి అంతా గోప్యంగా ఉంచాడు. తనకు తాను హింసించుకున్నాడు. ఆ అమ్మాయి తన స్వార్థం కోసం ఈ పెళ్లిని ఉపయోగించుకుంది. అబ్బాయి స్నేహితులతో భర్త మీద అర్థం పర్థం లేని అభియోగాలు రుద్దడం మొదలు పెట్టింది. దీనిని పెద్ద సమస్యగా చిత్రించి అబ్బాయికి వ్యతిరేకంగా ప్రచారం మొదలు పెట్టింది, మాకు కూడా ఫోన్ చేసి భర్తపై అనేక నిందలు మోపింది. తల్లిదండ్రులను మా వద్దకు పంపి,వాళ్ళతో ‘విడాకులే’ సరైన మార్గమని తేల్చి చెప్పించింది. ఇద్దరి ఒప్పందంతో అమెరికాలోనే విడాకుల ఎపిసోడ్ ముగిసిపోయింది. అప్పటి మాబాధ వర్ణనాతీతం. నా శ్రీమతి డిప్రెషన్ లోకి వెళ్లినంత పనిచేసింది. విషయం గుర్తుకు వస్తే చెప్పలేనంత దుఃఖం పెల్లుబికి వచ్చేది.
తన బాధను పక్కన పెట్టి మమ్ములను ఓదార్చే పనిలో ఉండేవాడు మా అబ్బాయి. ఈ సందర్భంగా రెండవసారి అమెరికా (బోస్టన్) వెళ్లి నెలరోజులు బాబుతో వుండి వచ్చాము. విడాకుల తంతు అమెరికాలో ముగిసిపోయింది. అబ్బాయికి త్వరగా పెళ్ళిచేయాలని నా శ్రీమతి, మా అమ్మాయి ఆరాటం. కొంత వ్యవధి అవసరం అని నా వాదన. నా వల్ల త్వరగా పని కాదని వాళ్లకి అర్థం అయిపొయింది. మధ్యలో ‘కరోనా’ బాబుని స్వదేశానికి రాకుండా కట్టడి చేసింది. మేము మూగ వేదన లోనే తల్లడిల్లిపోయాము. మా అమ్మాయి మాత్రం తన ప్రయత్నాలు మానలేదు. ‘ఆన్లైన్ మాట్రిమోనీ’ ద్వారా తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే వుంది. ఆ విషయంలో వాళ్ళమ్మను మాత్రమే సంప్రదిస్తూ ఉండేది. గత సంవత్సరం మధ్యలో ఆమె ప్రయత్నాలకు ఫలితం లభించింది అనుకూలమైన సంబంధం చేతికి చిక్కినట్లు అయింది. వాళ్ళతో సుదీర్ఘ సంభాషణలు జరిపింది. ఇరు పక్షాలకు ఇద్దరూ నచ్చిన తర్వాత విషయం నా దృష్టికి తీసుకు వచ్చింది. అప్పటికి ఆ అమ్మాయి (పెళ్లి కూతురు) చెల్లితో, తల్లిదండ్రులతో అమెరికాలో వుంది. వాళ్ళు హైదరాబాద్ వచ్చిన తర్వాత అమ్మాయిని చూడడానికి వెళ్ళాము. మా అమ్మాయి ఇంటికి వాళ్ళ ఇల్లు దగ్గరగా ఉండడం విశేషం. అమ్మాయిని చూడగానే నా మనసులో ఆమె పట్ల మంచి అభిప్రాయం ముద్రపడిపోయింది. నా కొడుక్కి సరిపడ భార్య దొరికిందని మనసులో యమ సంతోషపడిపోయాను.


రచయితతో కూతురు నిహార. కోడలు దివ్య.


మేరేజ్ సర్టిఫికెట్ తో (రిజిష్టార్ ఆఫీస్) కొడుకు రాహుల్. కోడలు దివ్య.
అమ్మాయి తల్లిదండ్రులు కూడా నా కుటుంబంలో చక్కగా కలిసిపోయేవారిగా మొదటి పరిచయం లోనే తెలిసిపోయింది. తర్వాత ఒకరోజు వాళ్ళని కూడా మా ఇంటికి పిలిచాము. పనిలో పనిగా రిజిస్ట్రార్ ఆఫీసులో అమ్మాయి చేత పెళ్లి కోసం అప్లికేషన్ పెట్టించాము. విజయవాడ నుండి పెద్ద బావమరిది కూడా వచ్చాడు. మా గురించి మా కుటుంబం గురించి అమ్మాయి తల్లిదండ్రులకు తెలియజేశాము. వాళ్ళు ఎంత గానో తమ తృప్తిని వెలిబుచ్చారు. ముందు కలిసినప్పుడే చిన్న చిన్న సాంకేతిక సర్దుబాట్లు గురించి వియ్యంకుడు విజయకుమార్ గారు అమ్మాయి వాళ్లకి వివరణ ఇవ్వడం వల్ల మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడుకునే అంశాలేవీ తెరమీదికి రాలేదు.


తల్లిదండ్రులతో రచయిత కోడలు దివ్య.


అన్నయ్య రాహుల్ పెళ్ళికి ప్రధాన సూత్రధారి చెల్లెలు శ్రీమతి నిహార. కానేటి (ఆకాశవాణి ,హైదరాబాద్)
పెళ్లి రోజు కూడా 29 – డిశంబర్ గా నిర్ణయించుకోవడం, తర్వాత అమెరికా నుండి రావడం, సోదరుడు, జిల్లా ట్రేసరరీ ఆఫీసర్ సహకారంతో, చాలా బాగా రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి జరిగి పోయింది.


పెళ్ళికి ముందు రాహుల్-దివ్య.


ఇంట్లో పెళ్లి తంతు నిర్వహించిన పాష్టర్ డా.రెవ.నిరంజన్ బాబు గారితో రచయిత


రచయిత కుటుంబం….


తాళి కడుతున్న శుభవేళ


రింగులు మార్చుకుంటున్న వధూవరులు,రాహుల్-దివ్య.
మా కుటుంబానికి ఇదొక పెద్ద ఊహించని అనుభవం. అదే రోజు మధ్యాహ్నం అతి కొద్దీ బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో స్వగృహంలో, పాస్టర్ నిరంజన్ బాబు, మైకేల్ పాస్టర్, చిన్నాన్న కుసుమ వెంకటరత్నం గార్ల ఆశీస్సులతో రిసెప్షన్ జరిగింది. ఇక్కడ నేను ఎంత విశ్లేషణ చేసినా, ఈ ఎపిసోడ్‌కు ప్రధాన సూత్రధారి నా కూతురు నిహార కానేటి. కుటుంబానికి ప్రత్యక్షంగానూ, పరోక్షం గాను శ్లాఘనీయం. ఈ విధంగా నా పిల్లలు ఇద్దరూ ఆణిముత్యాలే!


పెళ్లి సజావుగా జరగడానికి సహకరించిన సోదరుడు శ్రీ గుజ్జు. రాజు (డి.టి.ఓ.హన్మకొండ జిల్లా)


రెండు కుటుంబాల కలయిక


పెళ్లి తర్వాత భార్యాభర్తలు దివ్య-రాహుల్
మా కోడలు, మా కుటుంబంలో ప్రవేశించి, మాతో సుమారుగా నెలకు పైగా గడపడం వల్ల ఆమె ఏమిటో మాకు పూర్తిగా తెలిసిపోయింది, నా కొడుకు అదృష్టవంతుడిని తేలిపోయింది. ‘అంతా మన మేలుకొరకే’ అన్న నానుడి నిజమని తేలింది. మా కోడలు అతి తక్కువ సమయంలోనే మా అందరి హృదయాలను గెలుచుకుంది. ఈ విధంగా మా రెండు కుటుంబాలు అదృష్టానికి నోచుకున్నాయి. కొడుకు – కోడలు, సంసారిక జీవితం ఆనందమయం కావాలనే నేను ఎప్పుడూ కోరుకుంటాను, విధివ్రాతకు తల వంచక తప్పదని నమ్ముతాను!
(మళ్ళీ కలుద్దాం)

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
52 Comments
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు.
—-డా కె.ఎల్.వి.ప్రసాద్
హన్మకొండ
06-02-2022.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
నిండైన కుటుంబానికి అభినందనలు.నూతన దంపతులకు శుభాకాంక్షలు.మా మేడం నకు నమస్తే
——డా. మల్లి కార్జున్
హన్మకొండ జిల్లా.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
ధన్యవాదాలండీ.
Sagar
చివరిలో మీరు అన్నట్లు విధిరాతకు మనం తలవంచక తప్పదు సర్. అలాగే సోదరుడు దూరంగా ఉన్నప్పటినించి మీ బాగోగులు చూడడమే కాక, ఇప్పుడు సోదరుడి వివాహ విషయం బాధ్యతగ నెరవేర్చిన నీహార గారు అభినందనీయురాలు. ఆమెకు, మరియు నూతన వదూవరులకు ఆత్మీయ శుభాకాంక్షలు సర్. ఇంతవరకు రాహుల్ పెళ్ళి విషయంలో చింతతీరిన మీకు అభినందనలు.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
సాగర్
ధన్యవాదాలు.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
సమస్యలెదురైనా… చివరికి మంచికి… మంచే జరుగు తుంది… ఇది సత్యం !అనుభవాలు మనుషుల్ని మరింతగా తీర్చి దిద్దుతాయన్నది రుజువవుతోంది
—-కోరాడ నరసింహారావు
విశాఖపట్నం.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
ధన్యవాదాలండీ
కోరాడ గారు.
అశోక్ కుమార్ రాపాకరా
అవును మామయ్య, అంతా మన మంచికే అంటారు కదా. రాహుల్ కుటుంబం ఆనందంగా వుండాలని కోరుకుందాం.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
ధన్యవాదాలు అశోక్.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
ఎంత మంచి శుభవార్త చెప్పారు సర్.బిడ్డల జీవితాల్లో ఒడిదుడుకులు ఉంటే తల్లిదండ్రులు బాధ వర్ణనాతీతం. మీరు ఆ బాధ నుండి ‘దివ్యం’గా బయటపడడానికి ఎంతో శ్రమించిన సోదరి నిహారా గారు ఎంతో ప్రసంశనీయులు.సోదరుడి ఆనందం కోసం ఆడపడుచు పడే తపన కళ్ళకి కట్టినట్టు ఉంది.మీ ఇద్దరు బిడ్డల ప్రేమైక బంధమ్,మీ చక్కని పెంపకం మంచికే దారి తీసింది.కళ్ళు తడవని మనిషి లేనట్టు మీరు పడ్డ వేదనని తీర్చి కుటుంబంలో తిరిగి ఆనందాన్ని నింపారు ఇంటిదీపం నిహారా గారు.వారికి అభినందనలు.కొత్త జీవితాన్ని ప్రారంభించిన దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. వెన్నెల వనంలా వారి జీవితం విరబూయాలి.మీ తేలికపడ్డ మనస్సుకీ హార్ధిక శుభాకాంక్షలు సర్.చాలా అంటే చాలా మంచి జ్ఞాపకాన్ని పంచారు.మా సంతోషాల్నీ కూడా కలుపుకోండి సర్.ధన్యవాదాలు





–నాగజ్యోతీ శేఖర్.దొన్డపాటి
కాకినాడ.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
అమ్మా
మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
ధన్యవాదాలు అశోక్.
Bhujanga rao
జ్ఞాపకాల పందిరి 96
నమస్కారములు డాక్టర్ గారు.
తాళి కట్టు శుభవేళ.!! పెద్దలు చెప్పినట్టు పెళ్లి సంబంధం అనేది విధి వ్రాసి పెట్టి నట్లు జరుగుతుంది.జరిగేటివి జరగక మానవు,మనిషికి కాలం నేర్పుతుంది పాఠం అంటారు.సమస్యలెదురైన చివరకు మంచి వాళ్లకు మంచే జరుగుతుంది,మీ కుటుంబ విషయంలో మీ అమ్మాయి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయాలు రాహుల్ పెళ్లి విషయంలో మీ బాధను అధిగమించిన మీకు మీ కుటుంబ సభ్యులకు అభినందనలు మరియు ధన్యవాదములు సర్.మీ జీవితంలో జరిగిన సంఘటనలు ఇప్పటికి ఎన్నో తెలిసినా,ఇంకా తెలియని మరెన్నో విషయాల కోసం ఎదురు చూస్తున్నాము.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
ధన్యవాదాలండీ
భుజంగరావు గారు.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
Br. Nee feelings chala ధైర్యం ga express chesinavu. Congratulations

—డా.శంకర్ లాల్
హైదరాబాద్.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
మిత్రమా
ధన్యవాదాలు.
శీలా సుభద్రా దేవి
మీతో ఇంత పరిచయం ఉన్నా ఇవన్నీ తెలియవు.మీ అమ్మాయి బాధ్యత వహించి తన సోదరుడి జీవితానికి ఒక తోడును సమకూర్చడం ముదావహం.
భారతీయ కుటుంబాల్లో వివాహ వ్యవస్థకు గల ప్రాముఖ్యత ను చక్కగా తెలియజేసారు.
మీ కుటుంబానికి అభినందనలు
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
మేడం
మీ స్పందనకు ధన్యవాదాలు.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
Lovely describing the families (Gnapakala Pandiri) we are very proud of you Brother. Thank you so much for your love and affection.
–Alexander.nama
Safilguda
Secunderabad.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
Thank you brother.
Rajendra+Prasad
Only parents know the pain if the children marriage life doesn’t go well. I believe we need to overcome these difficult situations with patience and seeking guidance from God. MAY GOD BLESS RAHUL AND DIVYA & THEIR MARRIED LIFE.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
Thank you
Prasad garu.
శ్యామ్ కుమార్ చాగల్
వివాహ వ్యవస్థ , , మన సంస్కృతి కి భిన్నంగా అందులో వస్తున్న మార్పులు , వాటిలోని దుర్గుణాలను, సరళంగా వివరించారు. స్త్రీ ల విద్య, ఆర్ధిక స్వావలంబనే కాకుండా , భారతీయులు పాశ్చాత్త్య పెడ ధోరణులను , గుడ్డిగా అనుకరించడం కూడా ప్రస్తుత దుస్థితి కి కారణం.
రచయిత గారు చెప్పినవన్నీ మనం చూస్తూనే వున్నాము.
మనకు తెలీకుండా మన స్నేహితుల కుటుంబాలలో వీటి వల్ల బాధలు పడుతున్న వారు కూడా వున్నారు.
ఇంతకు ముందు రోజులలో భర్త తో యెనలేని బాధలు అనుభవిస్తే గాని విడాకులు తీసుకునే వారు కాదు. అధిక శాతం స్త్రీలు మాత్రమే విడాకుల వల్ల సంఘం దృష్టి లో పలుచన అయ్యేవారు. ప్రస్తుతం విడాకుల తర్వాత అబ్బాయిలు చాలా క్షోభ అనుభవించటం
చూస్తున్నాం. ఒకరి నొకరు భరించే స్థితిని కోల్పోవటమే విడాకులకు కారణం.
ఈ విషయాన్ని చాలా వివరంగా, సరళంగా వివరించారు డాక్టర్ కె ఎల్వి ప్రసాద్ గారు. వారు కూడా వీటి బారిన పడటం విధి లిఖితం. ఏది జరిగిన మన మంచికే అన్న సూత్రం కూడా వర్తించింది. ఎంత మంచి వారికైనా కష్టాలు తప్పవు. కూతురు, బంధువులు, స్నేహితులు సందోర్బచితంగా పనులు నిర్వర్తించి, కష్టాలను ఎదుర్కోవటం శుభ సూచకం.
నేను గమనించిన మరో విషయం ఏమిటంటే , విడాకుల తర్వాత అబ్బాయి కి మంచి భార్య దొరకటం. ఇంకా విచిత్రం ఏమిటంటే అబ్బాయి మీద మొదటి భార్య మోపిన నిందలేవీ తర్వాత నిజం కాకపోవటం. అంతే కాదు ఆ తర్వాత అబ్బాయి చాల్ సంతోషంగా వైవాహిక జీవితం కొన సాగించటం.
డాక్టర్ కె ఎల్వి ప్రసాద్ గారి కుటుంబం సుఖ సంతోషాల తో గడపాలని భగవంతుడిని కోరుకుంటున్నాను.
.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
మిత్రమా
సుదీర్ఘ మైన విశ్లేషణ తో కూడుకున్న
నీ స్పందన అద్భుతంగా వుంది.
నీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
డాక్టర్ గారూ
గుండెను చేతిలో పట్టుకొని నలిపేసినంత బాధగా వుంది. ఇలాంటి బాధ వర్ణనాతీతం.
ఈ బాధను గొంతు దాటకుండా ఇంత కాలం దిగమింగుతూ వచ్చిన మీ దంపతులకు నమస్కారం.
చి. రాహుల్ వివాహ జీవితం సుఖసంతోషాలతో కొనసాగాలని సమస్త దైవాలనూ ప్రార్థిస్తున్నా.
ఈ వారం ఎపిసోడ్ చదివాక ఏదో ఆవేదన నా మనసు ను ఆవరించింది. తేరుకోవడానికి చాలా సమయమే పట్టింది.
ఏం చేస్తాం.
సర్లెండి ఈ ఆమ్మాయి బాబును సరిగా అర్థం చేసుకుందని రాశారు. సంతోషం.
——డి.వి.శేషాచార్య
కరీమ్నగర్
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
ధన్యవాదాలు
మిత్రమా…
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
Very frankly written the truth. You have guts. Appreciate you
—-Dr.J.Kranthi
Hyderabad.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
Thank you
Dr.Kranthi.
Sambasiva+Rao+Thota
Prasad Garu!
Ee episode lo vidaakula gurinchi oka thesis chadivinatlanipinchindi..
Vishleshana adbhthamgaa vundi…
Ee episode dwaaraa,mee Abbayiki rendo pelli chesina vishayam thelisindi…
Naaku chaalaa Santhosham kaligindi…
Adugudaamanukunna vishayam adakkundaane thelusukunnaanu..
Mee abbaayi mariyu kodalu..,vaari vivaaha jeevitham sukhamayam mariyu shubhapradam kaavaalani manaspoorthigaa korukuntunnaanu..
Dhanyavaadaalandi
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
Thank you sir.
Sambasiva+Rao+Thota
Prasad Garu!
In the entire episode Chi.Nihara played a key role..and she always support your family with all her abilities..and affection…
My heartiest and sincere appreciation to her..
You are so lucky to have very good children,more particularly Chi.Nihara..
God Bless your entire family..
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
Thank you sir.
Neelima
డాక్టర్ గారు
నమస్కారములు..
పెళ్లి బంధం కోసం చాలా బాగా చెప్పారు.
అలాగే ఈరోజుల్లో విడాకులు ఎంత easy గా తీసుకుంటున్నారు అనే విషయం మీద కూడా చక్కగా విశదీకరించారు..
అలాగే మీ personal విషయం ( అబ్బాయి విడాకులు, పెళ్లి) కూడా అందరితో పంచుకుని మీ ఉన్నతత్వాన్ని చాటారు..
మీ ఇంటికి వచ్చినపుడు అన్నారు
సంబంధం కుదిరేలా ఉంది అని.. ఇంతలోనే పెళ్లి అయింది అని తెలిసి చాలా ఆనందించాను..
అబ్బాయికి , కోడలికి మా విషెస్ చెప్పండి..
ధన్యవాదాలు..
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
అమ్మా
ధన్యవాదాలు.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
శుభాకాంక్షలు..wish both Rahul and Divya a happy married life.. May God supply every need according to his Grace and abundance. చాలా
సంతోషంగా ఉంది ఈశుభవార్త.
పాప తీసుకొన్న నిర్ణయానికి మంచి ఫలితం దొరికింది. Be happy always.
—–డా. ఝాన్సీ నిర్మల
హైదరాబాద్
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
ధన్యవాదాలు సోదరీ.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
చేదు అనుభవాల నుంచి.. నేటి సమాజంలోని చేదు నిజాలను చెబుతున్నారు..
—–వెంకట్రామ నరసయ్య
మహబూబాబాద్.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
మిత్రమా
ధన్యవాదాలు.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
Gd Evng Doctor garu,
Financial independence for the present generation girls (with few exceptions) is the root cause for this (divorce) trend.
Please convey my best wishes to Mr & Mrs. Rahul.
—surya narayana rao
Hyderabad.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
Thank you somuch sir
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
[07/02, 06:46] Harika.Dr./karimnagar.: I can not be able to express my feelings regarding this story sir.
I can only say one thing- you all stood like a rock even bearing the tough painful times.
Hats off to Nihara sister for her stand and hearty congratulations to brother Rahul and wishing them a very beautiful life sir.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
Thank you Dr.Harika
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
96 వసంచిక భారంగా ఉన్నది.నాకు తెలిసిన దగ్గరి కుటుంబమూ,ఇట్టి పరిస్థితిని ఎదుర్కొన్నది.
ఒక్కొక్క సారి వారివిముఖత్వానికి కారణాలే తెలియవు. అమ్మాయి తలిదండ్రులు కాని అబ్బాయి తలిదండ్రులుకానీచెప్పలేరు.
ఐతే ఒకమాట చెప్పవచ్చు
దినాం గొడవలతో కాపురం చేసేకంటే విడిపోవటమే మేలు. కొన్ని ప్రేమవివాహాలు కూడా ఇట్లాగే విచ్చిన్నం కావటం చూస్తున్నం. ఆకర్షణ నే ప్రేమ అనుకుంటున్నారేమో అనిపిస్తది.
ఏదిఏమైనా ఆపరేషన్ బాధాకరమే ఐనా తప్పని వరిస్థితిలో అదే నయం..నేను గమనించినంతవరకు అమ్మాయి కాపురంలో అమ్మాయి తలిదండ్రుల జోక్యం ఎక్కువయ్యేశసమస్యలు వస్తున్నాయి.తమ కాపురంలో తలిదండ్రుల జోక్యాన్ని అమ్మాయిలు నివారించగలిగి తమ సమస్యలకు తామే పరిష్కారం కనుక్కోగలమని నిర్ణయించుకుంటేఇంత భయంఈరంగా వుండదేమో పరిస్థితి.
All is well that ends well కదా
—రామశాస్త్రి. నాగిల్ల
హన్మకొండ.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
ధన్యవాదాలండీ
శాస్త్రి గారు.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
మీ రు వున్న ది వున్నట్లు రాసారు ఆనాటి అంతులేని కథ చిత్రం లో ది పిల్లలు సుఖం గా వుంటే నే తల్లిదండ్రులకు శాంతి మంచి కోడలు దొరికింది చాలా సంతోషం
–విజయలక్ష్మి. కస్తూరి
హైదరాబాద్
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
ధన్యవాదాలండీ
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
Klv garu it is good that you suffered from Corona in 3rd wave and moreover you were in the safe hands of your daughter.
Congratulations. I am very happy to know that your son got married.
In present generation women wants equal rights. Because they are in transition stage they are not able to decide what is best and what is wrong. They feel what they feel and what they say is correct. Moreover it is kaliyugam. Both put together we see present happenings in the society.
Rectification will start only when it reaches peaks.
Any way you have come out of the problem early and could overcome the problem on time. That is the capacity of time.
What ever has to happen will happen. That is the destiny.
–Dr.M.Manjula,MDS
Hyderabad
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
Thank you Dr.for your wonderful analysis.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
Hearty congratulations sir




ఈ నూతన సంవత్సరం మీకో గొప్ప సంతోషాన్ని ఇచ్చి నందుకు చాలా ఆనందంగా ఉంది. జీవితంలో అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరగవనే సత్యాన్ని మీ 96 వ ఎపిసోడ్ జ్ఞాపకాల పందిరిలో దాగిన గుండె బరువు చాలా బాధను కలిగించింది నాకు .ఇంటికో కూతురుండాలని అంటారు అందుకేనేమో మీ బాధలకు పన్నీటి జల్లు నిహార గారు సో…..గ్రేట్. కొత్త జంటకు హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు చెప్పండి







సార్. చాలా ముచ్చటైన జంట.మీ సంతోషాన్ని మాతో పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. హృదయపూర్వక శుభాభినందనలు సార్ మీకు 










—అఫ్సర్ వలీష
ద్వారపూడి.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
అమ్మా…
మీ స్పందనకు ధన్యవాదాలు.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
డాక్టర్ గారి హృదయ లోగిళ్ళ నుండి 96 వ భాగముగా వెలువడిన జ్ఞాపకాల పందిరి లోని మరో ఆణిముత్యం “తాళికట్టు శుభవేళ” అనే ఈ శీర్షిక వారి రచనా పరిపక్వతకు నిదర్శనం.
ఇందులో రచయిత తన అనుభవ సారాన్ని మేళవించి మనకు అందించినట్లు కనిపిస్తుంది. వివాహబంధాలు, మరియు సంసార బంధాలు, చక్కబెట్టే విధానాలు .. నాటి తరానికి మరియు నేటి తరానికి ఉన్న వ్యత్యాసాన్ని ఉపోద్ఘాతము లోనే బహు చక్కగా వివరించారు. ఇందులో పొందు పరచిన ప్రతీ వాక్యమూ యధార్థమైనదే!
తమ కుమారుడి మొదటి వివాహం వైఫల్యం చెందిన సందర్భంలో తన కుటుంబ సభ్యులు అనుభవించిన మానసిక క్షోభను అధిగమించి, ఆ ఆఘాధాన్ని పూరించే క్రమములో తమ కుటుంబ సభ్యులలో ప్రతి వ్యక్తి తీసుకున్న చొరవ, సత్ఫలితాలు ఇచ్చిన క్రమము, ఆ కుటుంబ సభ్యుల యొక్క పరిపక్వతకు నిదర్శనం.
ఈ యావత్ సంఘటన రచయిత గారి స్వీయ అనుభవం అనే విషయాన్ని కొద్దిసేపు పక్కన పెడితే… ఈ ఎపిసోడ్ యొక్క ముఖ్య పాత్రధారి రాహుల్ …ఒక పరిణతి చెందిన ఉన్నతమైన మానసిక స్థితి కల వ్యక్తిగా అభివర్ణించవచ్చు. అలా కాకపోతే… ఎటువంటి రాజకీయ, మరియు ఆర్థిక ప్రలోభాలకు లొంగని , ప్రత్యేకమైన చట్ట విధానాలు ఉన్న అమెరికా లాంటి దేశంలో, పూర్తిగా వ్యతిరేక మనస్తత్వము గల భాగస్వామితో గడిపిన కొన్ని రోజులలో, తను అనుభవించిన మానసిక క్షోభను తనలోనే దిగమింగుకొని ,ఇతర స్నేహితులతో, మరియు బంధుమిత్రులతో పంచుకోవటానికి ఇష్టపడక ,ముఖ్యంగా సున్నిత మనస్తత్వం గల తల్లిదండ్రులకు తెలియనీయకుండా, వీలైనంత వరకు తనే స్వయంగా పరిష్కరించుకోవాలనే తపనతో , జీవితంలో బహుకొద్ది మందికి మాత్రమే ఎదురయ్యే ఇటువంటి విపత్కర సంఘటనను, ఆ చిన్న వయసులోనే పరిష్కరించుకో గలిగిన విధానము బహు ప్రశంసనీయము.
ఈ దుస్సంఘటన యొక్క జ్ఞాపకాలను తనసోదరుని మదినుండి వీలైనంత త్వరగా తొలగించాలని, తనకు మరో కొత్త జీవితాన్ని ఇవ్వాలి …అనే దృఢ సంకల్పముతో మరియు వృత్తి రీత్యా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని, తమ భవిష్యత్తును దిద్దుకొనుటయే కాక ,తమ పిల్లలకు మంచి భవిష్యత్తును ఇచ్చి, సమ సమాజంలో ఒక గౌరవప్రదమైన విశ్రాంత జీవితాన్ని గడపాలని కోరుకునే తల్లిదండ్రులకు మనశ్శాంతిని సమకూర్చాలనే పట్టుదలతో ,సోదరునికి మరో అనుకూలమైన భాగస్వామిని వెతకడంలో, అన్నీ తానై , సఫలీకృతురాలైన సమర్థత కలిగిన ఆడపడుచుగా నిహార అనే సోదరి పాత్ర బహు అభినందనీయం.
“ఆడపిల్ల ఆడిపిల్లే ” అని ఎవరన్నారో కాని నా ఉద్దేశ్యము అది సరైన అభిప్రాయం కాదు . ఆడపిల్ల ఎప్పటికీ ఈడి పిల్లే. మెట్టినింట్లో అత్తమామల పట్ల, భర్త, పిల్లల పట్ల ,బాధ్యత కలిగి ఉండవచ్చునేమో కానీ, ప్రేమానురాగాలు …కనీ, పెంచిన తల్లిదండ్రులు మరియు తోబుట్టువులపైన అధికంగా కనపడతాయి మనభారతీయ సంప్రదాయంలో అని అనటం అతిశయోక్తి కాదేమో! నాచిన్నతనంలోనే మా పెద్దక్కయ్య కి వివాహమైనది. అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు నాతో తరచుగా అంటూ ఉండేది. “ఇంట్లో అందరూ తిన్న తరవాత కుండలోని మాడునుతిన్నా ,పొంత లోని నీరు తాగినా, కటికనేల మీద పరుండినా , తల్లిదండ్రులు మరియు తోబుట్టువుల మధ్య గడప కలిగిన కొన్ని రోజులే ఎంతో తృప్తిని స్థాయి” అని. అటువంటి
మానసిక ఉల్లాసాన్ని మా అమ్మాయి పెళ్లి అయిన తర్వాత మా ఇంటిలో కలివిడిగా తిరగాడేటప్పుడు ఒక తండ్రిగా నేనూ గమనించాను .
పై సంఘటనలోని మరో సానుకూల అంశం… రాహుల్ చెల్లికి తన తల్లిదండ్రులు ఉన్న ప్రదేశంలోనే ఉద్యోగ నియామకం యాదృచ్ఛికమో ,లేదా ప్రయత్నపూర్వకంగా జరిగినదో తెలియదు కానీ, అది ఆ తల్లిదండ్రులకు ఒక సంజీవని లాంటిది. అలా కాకపోయి ఉంటే …ఎక్కడో ఖండాంతరాలలో ఉన్న కొడుకు అనుభవిస్తున్న మానసిక క్షోభని తలచుకుంటూ ,ముఖ్యంగా ఈ కరోనా ప్రభావముతో ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యము ఎలా ఉండేదో! తలచుకుంటేనే ఒళ్ళు గగుర్పాటు చెందుతుంది.
ఈ ఎపిసోడ్ మొత్తము సుఖాంతం అవ్వటానికి తన కూతురే కారణం…తను కేవలం ఒక ప్రేక్షక పాత్ర పోషించాను ..అని ఇంటి యజమాని సెలవిచ్చినా , వృత్తిరీత్యా సమకూరిన మృదుస్వభావమే మిగతా కుటుంబ సభ్యులు తమ తమ నిర్ణయాలను స్వేచ్ఛగా పంచుకొని కార్యసాధకులైనారు… అనే నగ్మ సత్యము అవగతమౌతుంది
—బి.రామకృష్ణా రెడ్డి
సఫిల్ గూడ
సికింద్రాబాద్.
డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్
సర్
మీ స్పందనకు ధన్యవాదాలు సర్.