గోవిందరాజు సీతాదేవి సాహితీ వేదిక నిర్వహించిన ‘గోవిందరాజు సీతాదేవి జాతీయ స్థాయి సాహితీ పురస్కారం 2024’ పోటీలకు మొత్తం 10 నవలలు, 35 కథా సంపుటాలు వచ్చాయని, వీటిల్లోంచి నవలా విభాగంలో ఆర్.సి.కృష్ణస్వామి రాజు గారి ‘మేకల బండ’ని, కథాసంపుటి విబాగంలో కె.ఎ. మునిసురేష్ పిళ్లె గారి ‘గారడీవాడు’ లను న్యాయనిర్ణేతలు ఎంపిక చేశారని సాహితీ వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు గోవిందరాజు సుభద్రా దేవి తెలియజేశారు.
త్వరలో నెల్లూరులో జరిగే ఓ కార్యక్రమంలో పురస్కార ప్రదానం ఉంటుందని తెలిపారు.

