ఎండ.. ఎండ.. ఎండ…
మండు తున్న ఎండ
మనిషిని ,
పశు పక్ష్యాదులను
మాడ్చి మసిచేస్తున్న ఎండ!
ఎండకు ఎండిపోతున్న
బావులు… కుంటలు
అడుగంటి పోతున్న
భూగర్భ జలాలు!
ఆశగా ఆకాశం వైపు
నాలుగు చినుకులు
రాల్తాయేమోనని
రైతన్న ఎదురు చూపులు!
బిందెడు మంచినీళ్ళ కొసం
చేతి పంపు దగ్గర
బారులు తీరిన
మహిళా మణులు!
కాలాన్ని సొమ్ము చేసు కోడానికి
దారి పొడవునా
రంగు రంగుల
శీతల పానీయాల బండ్లు
ఎండకు తోడయిన
తోబుట్టువు లాంటి
వ్యధా భరిత దృశ్యాలు!
పత్రికలూ ….
ప్రసార మాధ్యమాలూ
పుండు మీద కారం చల్లినట్టు
నాయకులు వేదాలు వల్లించి నట్లు
రేటింగుల షూటింగుల్లో
పోటీ పడుతూనే వుంటై ….!!

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
18 Comments
sagar
ప్రస్తుత పరిస్ధితిని బాగ వర్ణించారు సర్ . అభినందనలు.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Sadar
Thank you
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Sagar,
Thank you so much
డా.కె.ఎల్.వి.ప్రసాద్
గ్రీష్మ గీతం చదివానండి.మండుతున్న ఎండలు గురించి భలే వివరించారు. అది మీకే సాద్యం. మేము అలా రాయటము రాదండి.
____mrs.Bharathi.yeda
Saripalli
W G Dt
డా.కె.ఎల్.వి.ప్రసాద్
భారతి గారూ
మీ స్పందనకు
ధన్యవాదాలు
డా.కె.ఎల్.వి.ప్రసాద్
గ్రీష్మ గీతం చాలా చక్కగా ఉంది.సర్..నేటి స్థితికి అద్దం పడుతూ
____నాగ జ్యొతి శేఖర్
రచయిత్రి
కాకినాడ
డా.కె.ఎల్.వి.ప్రసాద్
జ్యోతి గారు
మీ స్పందన కు
ధన్య వాదాలు
డా.కె.ఎల్.వి.ప్రసాద్
మీరు రాసిన కవిత ఈ సీజన్ కు అంతగా వర్తిచదేమో?
ఎందుకంటే, మన తెలంగాణాలో, ఈ సంవత్సరం భూ గర్భ జలాల మట్టం .13 మీటర్ల నుండి 8 మీటర్ల వరకు పెరిగింది. Major reservoirs లో ఈ సారి పరిస్థితి మెరుగ్గా ఉండటం వల్ల, రెండో పంటకు కూడా నీళ్ళు ఇచ్చారు. ఇంకా monsoon start time కాదు కాబట్టి, రైతు ఆకాశం వైపు అప్పుడే చూడకూడదు. ఇక పంపుల దగ్గర బిందెల సంస్కృతి కనుమరుగు అవుతున్నది.
నా అభిప్రాయం, విమర్శ ఏమిటంటే, కవిత పెట్టిన టైమింగ్ synchronise కాలేదు అని. – మీ సద్విమర్శ కుడు
_____Rajendhra prasad
USA(Hyderabad)
డా.కె.ఎల్.వి.ప్రసాద్
మీ కన్ను పూర్తిగా
పట్నాల మీదే వుంది.ఋతు వులు దారి తప్పాయి.అందు చేత రైతు కళ్ళేప్పుడూ ఆకాశం వైపే చూస్తుంటాయ్.
మీ స్పందన కు
ధన్యవాదాలు.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Apt to present situation
___mrs.Laxmi Nandana
English Teacher
Rajahmundry
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Thank you
Nandana
Jhansi koppisetty
వూలు వస్త్రాల్లో వణుకుతున్న నాకు ఇండియా ఎండలను మీ కవిత గుర్తు చేస్తోంది… Nice


డా.కె.ఎల్.వి.ప్రసాద్
అవునా,
ఇరు దేశాల మధ్య
ఎంత తేడా నో కదా!
మీ స్పందనకు
ధన్యవాదాలు.
మొహమ్మద్ అఫ్సర వలీషా
మీ గ్రీష్మ గీతాలాపన సరైనది సార్ ఎందుకంటే కరోనాకు అందరం భయపడుతున్నాం కానీ అది మాత్రం కాదు .ఎందుకంటే ఎప్పటిలాగే తన పని తాను యధేచ్ఛగా చేసుకుంటూ వెళుతున్నది .ప్రతి సారీ నీటికొరత కై జనాలు రైతన్న లు పాట్లు పడుతూనే ఉన్నారు. ఎన్ని అభివృద్ధి పధకాలు వచ్చినా.నిజాలను కళ్ళకు కట్టింది మీ కవిత .హృదయపూర్వక అభినందనలు సార్ మీకు. పరిస్థితులను అవపోసన పట్టే కవితలను మాకు అందిస్తున్నందుకు












మొహమ్మద్. అఫ్సర వలీషా
ద్వారపూడి (తూ గో జి)
డా.కె.ఎల్.వి.ప్రసాద్
మీ గ్రీష్మ గీతాలాపన సరైనది సార్ ఎందుకంటే కరోనాకు అందరం భయపడుతున్నాం కానీ అది మాత్రం కాదు .ఎందుకంటే ఎప్పటిలాగే తన పని తాను యధేచ్ఛగా చేసుకుంటూ వెళుతున్నది .ప్రతి సారీ నీటికొరత కై జనాలు రైతన్న లు పాట్లు పడుతూనే ఉన్నారు. ఎన్ని అభివృద్ధి పధకాలు వచ్చినా.నిజాలను కళ్ళకు కట్టింది మీ కవిత .హృదయపూర్వక అభినందనలు సార్ మీకు. పరిస్థితులను అవపోసన పట్టే కవితలను మాకు అందిస్తున్నందుకు












మొహమ్మద్. అఫ్సర వలీషా
ద్వారపూడి (తూ గో జి)
డా.కె.ఎల్.వి.ప్రసాద్
అఫ్సర్ వలీషా గారు
మీ స్పందన
చాలా బాగుంది.
చక్కని విశ్లేషణ
ధన్యవాదాలు మీకు.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
రేటింగ్ ల విషయంలో పత్రికలు, మీడియా పోటీ పడుతుంటాయి. కానీ ఏ రేటింగ్ లు నాకు అక్కర్లేదు అని సూరీడు తన పని తాను చేస్తున్నాడు..మీ వర్ణన బాగుంది. సర్.








____కె.రమేశ్
ఎయిడ్స్ కౌన్సిలర్
మహబూబాబాద్.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
రమేశ్,
నీ స్పందన కు
ధన్యవాదాలు