[డా. కె. ఎల్. వి. ప్రసాద్ రచించిన ‘జీవచ్ఛవాలు..!!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


పిల్లలపై
ప్రేమలేనిదెవరికి!
పిల్లలను ప్రేమించని
తల్లిదండ్రులుంటారా?
అయితే
ప్రేమంటే
గారాబం అవుతుందా?
గారాబాన్ని
ప్రేమగా జమకట్టవచ్చా?
చిక్కంతా –
ఇక్కడే ఉంది సుమా..!
గారాబం
ప్రేమగా భావించే పెద్దలు ..
మితిమీరిన గారాబాన్ని
పిల్లలకు ఆపాదించి,
వాళ్ల అల్లరిని
అనందంగా ప్రేరేపించి
ఆనక – పిల్లలు
పట్టాలు తప్పిన బళ్ళుగా
మారినప్పుడు..
కూతురిని –
అదుపుచేయలేక,
కొడుకు విచిత్ర వేషాలను
నియంత్రించలేక..
బయటికి చెప్పుకోలేక
మూగజీవాలై –
జీవచ్ఛవాల్లా బ్రతుకుతున్న
తల్లిదండ్రులెందరో..!
హద్దులుమీరిన
ప్రేమ – గారాబం..
ఎప్పటికీ ప్రమాదమే సుమా!!

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
3 Comments
Sagar
అతి గారాభం ప్రమాదమని చెప్పే మీ సందేశం ఏ తరం తల్లి తండ్రులకైనా మంచి ఉపదేశం సర్. చేతులు కాలాక ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదనే మాట వాస్తవం. మీకు ధన్యవాదములు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
సాగర్ కవీ
నీ స్పందన కు ధన్యవాదాలు
—-డా కె.ఎల్.వి.ప్రసాద్.
J. Mohan Rao
అతి గారాబము చివరికి పిల్లలకు మేలు కంటె
చెడు చేయును. ఇప్పటి తరమునకు కట్టడి చేయుట సాధ్యము కావటము లేదు. తల్లి తండ్రులే
చాల వరకు కారణము. పిల్లలంటే ప్రేమ కలిగి ఉండలి . కాని వారిని తీర్చి దిద్ద వలసినది కుడ తల్లి తండ్రులే. గారాబము మితి మీరి చివరికి కన్నవారినే, schools లోని ఉపాధ్యాయులనె
ఎదిరించే పరిస్థితులు దాపురించినవి.
చిన్నతనము లోనే పిల్లలును దారిలో పెట్టాలి . Cell phones వాడకం, ప్రవర్తన తిరు, భయ, భక్తులు, teachers పెద్దలంటే వినయ విధే యతలు
జీవితపు విలువలు నేర్పవలె. పిల్లలను కొంచెం మందలించడనికి teachers భయ పడు తున్నారు . కారణo తల్లితండ్రులే school teachers ను సంజయిషి కోరే పరిస్థితి. దినికి ముఖ్యముగా ranks, corporate schools ,cell phone మితి మీరి వాడకము , social media , ప్రస్తుతపు సినిమాలు అన్నియును కారణo అని చెప్పాలి .
మంచి విషయము తీసుకొన్నారు మీరు .
మీరు పిల్లల పెంపకం గురించి మరి ముఖ్యముగా చిన్నతనము లోన వారి మీద
ప్రభావo చూపె విషయము పై చిన్న books
తల్లి తండ్రులు చదవటo కుడ మంచిదే .
Parenting is an art. మీకు తెలిసినదే. తెలుగు typing తప్పులు క్షమించి ఆదరించ
మనవి .
నమస్తే