[ప్రొఫెసర్ పంజాల నరసయ్య గారు రచించిన ‘మాకో చరిత్ర ఉంది’ అనే కవితని అందిస్తున్నాము.]


మాకో చరిత్ర ఉంది
ఎవ్వరూ రాయరేమీ..
తాజ్ మహల్ కట్టిన
కూలీలం.. మేమే
నాగార్జున సాగర్ డ్యాం
నిర్మించింది.. మేమే
నూతన పార్లమెంట్
భవన సముదాయం
నిర్మించింది.. మేమే
పంటలు.. పండించేది
ఫ్యాక్టరీలు.. నడుపుతుంది
మేమే..
నాగరికతకు.. ముందు
నాగరికత..తర్వాత
కూలీలం.. మేమే
AI.. అదే కృత్రిమ మేధ
వచ్చినా మా స్థానం భద్రం
మాకో గౌరవ స్థానం ఇవ్వండి
మా అవసరాలు తీర్చండి
గంజిలో ఈగలా
తీసి పారేయకండి
పని అయిన తర్వాత
ఎర్ర తివాచీలు
మాకెందుకు..
ఘర్మ జలమే
మాకు body spray
అది చాలు ఇక
ఈ జన్మకు
రామరాజ్యం వస్తుందనే
ఆశ లేదు
కూలీ రాజ్యం
రాదని.. తెలుసు
మాకో చరిత్ర ఉంది
మా చరిత్ర
రాయరెందుకు..???

ప్రొ. పంజాల నరసయ్య డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ప్రొఫెసర్గా పదవీవిరమణ చేశారు.