[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘మహాత్ములు’ అనే రచనని అందిస్తున్నాము.]
యథా చిత్తం తథా వాచో, యథా వాచస్తథా క్రియాః। చిత్తే వాచి క్రియాయాం చ సాధూనామేకరూపతా॥
వేదాలలో మంచి ప్రాచుర్యం పొందిన నరసింహ సుభాషితం లోనిది ఈ శ్లోకం. ఇది చాలా అర్థవంతమైనది, అజ్ఞానం, అశాంతి, అలజడులలో నిత్యం సతమతమయ్యేవారికి చక్కని రాచబాట చూపిస్తుంది పై శ్లోకం. మహాత్ములకు వారి మనస్సు, వాక్కు మరియు వారి కర్మలు ఒకటే.
అదే ఇతరులకి వారి ఆలోచనలు భిన్నం, మాటలు భిన్నం, మరి వారి చేతలు మరీ భిన్నం. వారు తోటివారికి హాని తల పెట్టడానికి సర్వదా సంసిద్ధులై ఉంటారు. ఇటువంటి వారికి సదా దూరంగా వుండాలి. మనసా వాచా కర్మణా ఒకే విధంగా ప్రవర్తిస్తేనే మానవాళికి శ్రేయస్సు కలుగుతుందని ఈ శ్లోకం భావం.
మానవాళికి అనుక్షణం రెండు రెండు రకాలైన మార్గాలు ఎదురవుతూ వుంటాయి. మంచి బాటన నడవడం చాలా కష్టం. అనుక్షణం అనేక సవాళ్ళూ ఎదురవుతూ వుంటాయి. అయితే అంతిమ విజయం ఈ బాటన ప్రయాణించేవారికే లభిస్తుంది. మంచి వారికి వారి ఆలోచనలు ఏ విధముగా ఉంటాయో వారు మాట్లాడే తీరు, మాటలు కూడా అదే విధంగా ఉంటాయి. వారి మాటలు ఏ విధంగా ఉంటాయో వారి చేతలు, కర్మలు కూడా అదే విధంగా ఉంటాయి. మనం పోయేటప్పుడు – లౌకికంగా సంపాదించిందంతా ఇక్కడే వదిలేసి పోతామని.. జీవుడు ఒక దేహం విడిచి మరొక దేహం పొందేటప్పుడు తన వెంట ఇంద్రియాలు, మనస్సు తీసుకు వెళతాడని, మనం చేసే కర్మల ఫలితం ఇంద్రియాలకు, మనస్సుకు అంటుకుని ఉంటుందని.. ఈ కర్మలే జీవుల ఉత్తమ, అధమ జన్మలను నిర్ణయిస్తాయని వేదం స్పష్టంగా చెబుతోంది. అందుకే జీవితంలో సాధ్యమైనంతగా మంచి పనులు చేస్తూ, సర్వ మానవ సౌభ్రాతృత్వం, సర్వ జీవ సమానత్వం ఆచరణలో చూపిస్తూ, సమాజ శ్రేయస్సులే పరమావధిగా యథాశక్తిన కృషి చేయడం మన తక్షణ కర్తవ్యం. హిందువుల జీవన విధానానికి ప్రాతిపదిక అని చెప్పబడే కర్మ సిద్ధాంతంలో భగవంతుడు ప్రతి జీవికి, వారి కర్మానుగుణంగా పరిపక్వమైన కర్మలను తీసి ఏడు జన్మలకు కేటాయిస్తాడు అని చెప్పబడుతోంది.. ఏ కర్మఫలం ఎప్పుడు, ఏ విధంగా అనుభవించాలో నిర్ణయిస్తాడు.
ఈ ప్రపంచములో ప్రతి జీవి జన్మించడానికి కారణము ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మఫలాలే. చెడు కర్మకి ఫలితము పాపం, పాపానికి దుఃఖము, మంచి కర్మకి ఫలితము పుణ్యము. పుణ్యానికి సుఖము అనుభవించాలి. వాటిని అనుభవించడానికే ప్రతి జీవి జన్మని తీసుకుంటుంది.
జన్మాంతరాల్లో చేసిన పాప, పుణ్య కర్మలే దుఃఖాలుగా, సుఖాలుగా ఈ జన్మలో అనుభవంలోకి వస్తాయి. ఈ జన్మలో సత్కర్మలు ఆచరిస్తే కర్మ ఫలం నశించి సద్గతులు కలుగుతాయి. మనం చేసే పనులన్నీ భగవత్ సంకల్పంగా భావించినప్పుడు మంచి కర్మలు మాత్రమే చేయగలుగుతాం. అప్పుడు ప్రతీ మానవుడు ఒక మహాత్ముడు కాగలుగుతాడు.
ఒక్క శ్లోకంతో అల్పాక్షరాలతో అనల్పమైన సందేశం ఇచ్చారు. మహాత్ముల లక్షణాలు ఎలా ఉంటాయో చక్కగా చెప్పారు. మనో వాక్కాయ కర్మలతో ఒకటి గానే ప్రవర్తించే వాడు శ్రీరాముడు……… శ్రీకృష్ణుడు వేరు, అయన మాటలు చేతలు యోగీశ్వరులకు గానీ అర్ధం కావు….. శ్రీరాముడికి తగిన ఇల్లాలు సీత. ఆమె మనసా వాచా కర్మణా ఎట్టి స్థితులలో నైనా భర్తను తప్ప ఇతరులను తలచుకోదు..
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
నిరంతర మథనం
తిరుమల రామచంద్ర ఆధ్యాత్మిక రచనలు
నవ్వులరేడు రేలంగి
ఆలి కోపం – ఆకలి కోపం
మహా తపోధనుడు శౌనక మహర్షి
గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 51: నంబూరు
తల్లివి నీవే తండ్రివి నీవే!-6
విల్లీ
ఎదురుగాలి
సంశయాత్మక ధోరణి
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®