సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    మనిషికి “తృప్తి” అనేది లభించాలంటే “సాధన” కావాలిని, ఏకాగ్రచిత్తం తో సాధించాలని చెప్పడం బాగుంది భువన్ జీ! అదే సమయంలో తృప్తి తో “అసంతృప్తి” కూడా ఉండాలనీ, ఆ అసంతృప్తి తోనే మనిషి ఇంకా…ఇంకా…అన్నీ సాధిస్తున్నాడనీ, విజ్ఞాన పరంగా, సాంకేతిక పరంగా అభివృద్ధి చెందుతున్నాడని స్పష్టంగా చెప్పారు.
    అల తల్లి కూతురి జీవితం పట్ల తాపత్రయం పడడం, తల్లి ని బాగా చూసుకోవాలని అల అనుకోవడం చాలా ఆర్ద్రం గా చిత్రించారు.

    Reply
    1. 1.1

      BhuvanaChandra

      సుశీల గారు నమస్కారం మీ స్పందన ఎప్పుడూ చాలా అర్థవంతంగా చాలా ఉత్తేజాన్ని రేకెత్తించే లా ఉంటుంది.
      మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే కథ ముందుకి సాగటానికి మీరు చాలా బలాన్ని ఇస్తున్నారు థాంక్యూ సో మచ్

      Reply
  2. 2

    Sobharaja

    🙏
    పూర్వ కాలంలో గూఢాచారులు దేశంకోసం రాజు సంక్షేమంకోసం గూఢాచారిత్వం చేసేవారు. మీరు వారిని నేటి ప్రజానీకం తో పోల్చారు. బాగుంది. కానీ దేశనాశనాన్ని అందులో మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు ముఖ్యంగా సినిమా వాళ్ళ మీద చిలవలుపలవలుగా కథలల్లుతున్నారు.
    అల, వినోదాల మధ్య ప్రేమను ఆవేశంతో ఆకర్షణతో కాకుండా ఒకరి మీద ఒకరికి. అవగాహనతో కూడిన ప్రేమను అంచలంచలుగా కలిగేలా చేస్తున్నారు. అప్పుడే పవిత్రమైన చెరగని ప్రేమ ఉద్భవిస్తుంది.
    తృప్తి తో బాటు అసంతృప్తి తోడైతేనే మనిషి అన్నివిధాలా ఎదగ గలడు. ఉన్నదాంతో తృప్తి పడితే ఎదుగుదల ఉండదు.
    ఈ శీర్షికలో కొన్ని నిజాలు చెప్పారు.
    ధన్యవాదాలు🙏🌹🙏

    Reply
    1. 2.1

      BhuvanaChandra

      శోభ గారు నమస్కారం మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు చక్కని స్పందన ఈ వారం మహతిపై అందించినందుకు. వారం వారం మీ స్పందన నాకు చాలా ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తోంది. మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు

      Reply
  3. 3

    Rohini

    శ్రీ భువన చంద్ర గారికి నమస్సులు. తృప్తి, అసంతృప్తి గురించి చాలా బాగా వ్రాసారు. మనిషి అసంతృప్తి ఎన్నో కొత్త ఇన్వెన్షన్, ఎంతో అడ్వాన్స్ టెక్నాలజీ ఎంతో గొప్ప ప్రపంచానికి కారణం అయినా మనిషి తృప్తి లేక, ఎలా ఎక్కడ దొరకు తుందో తెలియక ఏయోగం చేస్తే వస్తుందా, ఏడకు పొతే ఆత్మ తృప్తి వస్తుందా అని వెతుకులాడుతూనే వున్నాడు. ఇంత గొప్ప ప్రపంచాన్ని సృష్టించినా శాంతి పుష్ప్పాన్ని పొందలేక పోతున్నాడు. అమ్మ మనసు గురించి బాగా వ్రాసారు. ఈ సృష్టిలో ప్రతిఫలం ఆశించకుండా ఉండేది అమ్మ ఒక్కటే -ధన్యవాదములు – రోహిణి 🙏

    Reply
    1. 3.1

      BhuvanaChandra

      రోహిణి గారు నమస్కారం. మీ స్పందన ఎంతో చక్కగా నా హృదయాన్ని తాకింది వారం వారం మీరు మీ అభిప్రాయాన్ని చక్కగా వెల్లడించడం నాకెంతో ఉపయోగపడుతోంది
      చదువరుల స్పందనే రచయితలకు ప్రాణవాయువు లాంటిది
      క్రమం తప్పకుండా వారం వారం మీ స్పందన తెలియజేస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!