భారత స్వాతంత్ర్య రజతోత్సవ ప్రచురణగా వెలువడ్డ ఈ ‘మహతి’ యువభారతి ప్రచురణలలో తలమానికమైనది. పేరును తలిస్తే చాలు, యువభారతీయులందరి హృదయాలలోనూ తియ్యని, తీయని జ్ఞాపకాలను చెలరేగేలా చేసే పుస్తకం – మహతి. నూరుగురు ప్రసిద్ధాంధ్ర రచయితల రచనలతో వెలువడిన వ్యాససంహిత – మహతి. కవిత, నవల, కథానిక, నాటకం, విమర్శ, భాష వంటి వివిధ సారస్వత సాంస్కృతిక అంశాల మీద సహృదయ సమీక్షా సారం – మహతి.
మహతిలో సప్త స్వరాలు– అనే అధ్యాయ సప్తకాలున్నాయి. అవేమిటంటే –
సప్తస్వర విన్యాసం వినిపించి, సమకాలీన సారస్వత సంరంభానికి ప్రతీకగా నిలిచి, సరికొత్త సాహిత్య సమారోహానికి సామగానం సారించిన ఈ మహతి శత వ్యాస తంత్రుల మంజుల నిక్వాణం మీ మనసును ఏ కొంత రంజింపజేసినా మా ప్రయత్నం సఫలం అయినట్లే మేము భావిస్తాము.
UNO గ్రంధాలయంలో చోటుచేసుకుని యువభారతి గౌరవాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన పుస్తకం – మహతి. ఈ పుస్తకంలో విశ్వనాధ వారు, శ్రీ శ్రీ గారు రాసిన వ్యాసాలు హైలైట్లు. ఈ పుస్తకాన్ని కలెక్టర్స్ ఐటెం గా భావిస్తారు.
భారత స్వాతంత్ర్య రజతోత్సవ ప్రచురణగా వెలువడ్డ ఈ పుస్తకం, భారత స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా — 50 ఏళ్ళ తరువాత – ఇటీవలే పునర్ముద్రించబడింది.
క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ ఉద్గ్రంధాన్ని ఉచితంగానే చదువుకోండి.
https://drive.google.com/file/d/1dQUabJMqPBf9XoxBR_KxQXZVNZWF9bnP/view
లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా మహతిని ఉచితంగానే చదువుకోవచ్చు.
అయితే, అత్యంత వ్యయ ప్రయాసలకోర్చి ఈ పుస్తకాన్ని సరికొత్త ముందుమాటతో యువభారతి పునర్ముద్రించింది. ఉచితంగా పాత పుస్తకాన్ని చదివినా క్రొత్త పుస్తకాన్ని కొని దాచుకోమని మనవి. కొత్త పుస్తకంకోసం శ్రీ రవీంద్ర, కోశాధికారి ని సంప్రదించండి. ఫోను నంబరుః 9849909896.
శ్రీ పత్రి అశ్వనీ కుమార్ గారి నివాసం నవీ ముంబై, మహారాష్ట్ర. విద్యాభ్యాసం అంతా విజయవాడ లోనే జరిగింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి MBA పట్టా పుచ్చుకుని, ఉద్యోగార్ధం హైదరాబాద్ వచ్చిన తర్వాత యువభారతి సంస్థతో (1982) నలభై ఏళ్ళ అనుబంధం. వృత్తిరీత్యా రిలయన్స్ ఇండస్ట్రీస్ లో Finance & Accounts లో Senior Management Team లో పనిచేసి 2016 లో పదవీ విరమణ చేసినా, ప్రవృత్తి మాత్రం – సంగీత సాహిత్యాలే. ప్రస్తుతం ఒక Youtube Channel కి Voice Over artiste గా, స్వరమాధురి సంగీత సంస్థకు అధ్యక్షునిగా వారి విశ్రాంత జీవితాన్ని బిజీ గా, ఆనందంగా గడుపుతున్నారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
ఆటల పూదోటలో సుగంధ పరిమళ పద్యాలు ‘భారతమ్మ శతకం’
మహిమాన్వితుడు.. మహా శివుడు!
నేనే!
ప్రపంచ మానవులారా… ఏకం కండి!
మనస్వి మూడు మినీ కవితలు
కలవల కబుర్లు-5
ఆనందరావు కథలు
మౌనమె నీ భాష ఓ మూగ మనసా!-4
సిరివెన్నెల పాట – నా మాట – 55 – తెలుగు ఘన వారసత్వాన్ని వర్ణించిన పాట
వేంపల్లి రెడ్డి నాగరాజు నాలుగు మినీ కథలు-27
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®