బోసి నవ్వుల పిల్లలారా….
తెల్లగ పూసిన మల్లెల్లారా….
కాలుష్యాన్ని నిర్మూలించి
పరిసరాలపై శ్రద్ద వహించి
పరిశుభ్రతను పాటిద్దాం
కరోనా వైరస్ తరిమేద్దాం
సబ్బు, డెట్టాల్ పూసుకుని
చేతులు శుభ్రం చేసుకుని
అపరిశుభ్రతను దూరం నెట్టి
ఆరోగ్యంపై ధ్యాసను పెట్టి
నిండు నూరేళ్ళు జీవిద్దాం
సంతోషంగా బ్రతికేద్దాం
అందరి మేలు సదాశయం
స్వచ్చ భారతమే మన ధ్యేయం.
అనంతపురం జిల్లా పుట్టపర్తికి చెందిన రజిత కొండసాని మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగిని. కొండసాని నారాయణరెడ్డి సాహితీ పురస్కారం వ్యవస్థాపకురాలు. “ఒక కల రెండు కళ్ళు” అనే కవితాసంపుటి వెలువరించారు. వాట్సప్, ఫేస్బుక్ లలో గ్రూపు ఆద్వర్యంలో కవితా పోటీలు నిర్వహిస్తుంటారు. విరజాజులు గ్రూప్ అడ్మిన్.