ఇది ప్రాణాంతక కరోనా తుపాను
కల్లోల పడవలోయావత్ప్రపంచం
ప్రచండవేగపు విషవాయువులు
తీరం జాడలేని సముద్రమధ్యం
శాస్త్రవేత్తలు ఊహించని పరిణామం
పరిశోధకులు చూపలేని పరిష్కారం
స్వీయ మేధకు మురిసిన మనిషి
నిరుత్తరుడై నిలబడిపోయిన వైనం
నిర్వీర్యుడై సాగిలపడిన సందర్భం
అదృశ్య రాకాసి విసురుతున్నపంజా
కని విని ఎరుగని విలయతాండవం
పిట్టల్లా రాలుతున్న జనసందోహం
అదృశ్యశక్తి ఆపద కాయవలసిన కాలం
ధరణీమతల్లి దయచూపవలసిన తరుణం
ప్రకృతిమాత కరుణించవలసిన సమయం

అల్లూరి గౌరీలక్ష్మి కథా, నవలా రచయిత్రిగా చక్కని పేరు సంపాదించారు. ఈమె మంచి కవయిత్రి, ఫెయిర్ కాలమిస్ట్ కూడా. నాలుగు కథా సంపుటాలూ, 4 నవలలూ, 3 కవిత్వ సంకలనాలూ, ఒక కాలమ్స్ బుక్ వెలువరించారు.
APIIC Ltd. లో General Manager గా పనిచేసి పదవీ విరమణ పొందారు.
12 Comments
G.prameela
కరోనా విలయతాండవం చేస్తున్న వేళ, ఎన్నో జీవితాలు ఛిద్రమౌతున్నాయి. మీ కవిత చాలా బాగున్నది గౌరీలక్ష్మీ గారు.
కొల్లూరి సోమ శంకర్
Mallika
కొల్లూరి సోమ శంకర్
Baavundi
Hemalata
కొల్లూరి సోమ శంకర్
చాలా చాలా బాగుంది రా… నిజంగానే దైవమే శరణం… aardrangaa prabhaavaatmakangaa ఉందమ్మా…



Kaasimbi
కొల్లూరి సోమ శంకర్
మీరు రచయితగా ఇంకా ఎంతో పేరు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Nice poem
Narasimha
పుట్టి. నాగలక్ష్మి
“మనిషి ఇల మహానుభావుడే “అన్న శ్రీశ్రీ పలుకులు… నిజం కావని అదృశ్య శత్రువు చేతిలో ‘మరణం అంచున’ విశ్వమంతా విలవిల లాడుతున్న పరిస్థితిని… బాధాతప్త హృదయంతో ఈ కవిత ని వెలయించారు కవయిత్రి…
కొల్లూరి సోమ శంకర్
Yes Madam..Well explained with Good comparison….
Wonderful… hats off to you Madam….
Madhav..Guntur
రాపాక పవన్ స్వరూప్
ప్రకృతి కరుణించే సమయం త్వరలో రావాలని ఆశిద్దాం.
కొల్లూరి సోమ శంకర్
బాగా రాసారు..నిజమే..
Vani.. Hyd
Dr. Trinadha Rudraraju
వైరస్ (విదేశీ మూలం!) తీవ్రత గురించి బాగా రాశారు.
G. S. Lakshmi
నిజం చెప్పారు. ప్రకృతిమాత ఎప్పటికి కరుణిస్తుందో.
ఉషారాణి పొలుకొండ
చాలా బాగా రాసారు మేడమ్, సామాన్యులకు కూడా అర్ధమయ్యే సుందర భాష..

