[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘మట్టి చేతుల అక్కున’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఒకనాటి చందమామ రావే జాబిల్లి రావే కథలిక కథలై పోయేనా కవులు కవితల భావోద్వేగ కల్పనలేనా మరి వీడని బంధమైన మేనమామగా కలువలరేడు కలిసిన కరచాలనం
చందమామ నా సందిట ఒదిగిన వేళ మెరిసే మట్టిని చేరే వెన్నెలకూనై చంద్రయాన్ ముద్దాడిన రోజు ఓ సుందర మధుర క్షణాన జాతి భారతావని అందెలు మురిసే గరిమతో హృదయం నాదే నినదించే నా దేశ స్పందన జవజీవమై
చందమామ ఒడి రా! రమ్మంది!! వెన్నెల తేరుపై గగన సీమలదాటి ఉప్పొంగే నా మది సాగరమై మట్టి చేతుల నాలో చందమామ చేరిన వేళ
అంతరిక్ష పరీక్షలెన్నో దాటి చేరే నెలరాజు దక్షిణ ధృవం తొల్దొలుత చరిత్ర సృష్టించెను చంద్రయాన్ 3 ఈ మట్టీ ఈ గాలీ ఈ నీరు జయజయహో నాదమై నినదించే దిక్కులు పిక్కటిల్లగా
వన్నెల జాబిల్లి వెన్నెల ఎద ఈ భూమికి అందిన వేళ మిషన్ చంద్రయాన్-3 దిగ్విజయమైన రోజు ఎంత గొప్పదో నా దేశం గుండెచప్పుడు విశ్వమై నినదించిన ఈ రోజు మరెంత అద్భుతమో మన అంతరిక్ష శాస్త్రవేత్తల శోధన! జయహో!! జయ జయహో! ‘ఇస్రో’ ఘన విజయ పరిశోధన కృషికివే నా దేశం జెండా రెపరెపలే భారతజాతి అందించిన ఘన అభినందనలు..
డా.టి.రాధాకృష్ణమాచార్యులు సీనియర్ వైద్యులు, ప్రముఖ కవి,రచయిత, అనువాదకులు, సమీక్షకులు. 5 సంకలనాలు తెలుగు కవిత్వంలో 1999 నుండి కరీంనగర్ నుండి పబ్లిష్ చేశారు. నలిమెల భాస్కర్ ‘సాహితీ సుమాలు’ వివిధ భారతీయ భాషల్లోని సాహితీవేత్తల పరిచయ సంకలనాన్ని “The Speaking Roots” Title తో ఆంగ్లంలోకి అనువాదం చేసినారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
అందరిలో ఉన్నా
99 సెకన్ల కథ-43
నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-72
మా సిడ్నీ పర్యటన
99 పదాల కథ: తొలి చూపులో ప్రేమ
నీలమత పురాణం-60
‘రచైత’ రాంపండు
నా రుబాయీలు-3
మరుగునపడ్డ మాణిక్యాలు – 69: లవింగ్ విన్సెంట్
ఆమని-13
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®