[గదిలో ఒంటరిగా కూర్చుని దివ్యని, అమృతని తలచుకుంటూ బాధపడతాడు వివేక్. అంతలో అక్కడికి అమృత వస్తుంది. వివేక్ బాధని అర్థం చేసుకుంటుంది. తమ పెళ్ళి జరిగినా పూర్వం లానే ఉందామని అంటుంది. వాళ్ళిద్దరినీ గమనించిన శారద, సుమిత్ర మురిసిపోతారు. పెళ్ళి ఏర్పాట్ల గురించి చర్చలు ఇంట్లో మొదలవుతాయి. అమెరికా వెళ్ళడానికి సిద్ధమవుతాడు వివేక్. అమృత బాధపడుతుంది. తన తండ్రి కోసం వివేక్ చేస్తున్న త్యాగాన్ని మెచ్చుకుని అతని మనసు గొప్పదని, వివేక్ తన తండ్రి స్థానంలోకి రావాలని అంటుంది అమృత. వివేక్ అల్లుడవుతున్నందుకు నారాయణ రావు, సుమిత్ర సంతోషిస్తారు. అమృత సంతోషంగా ఉండడం కోసం అమృతని కూడా అమెరికా తీసుకువెళ్లమని వివేక్ని అడుగుతాడు నారాయణరావు. ఆ ఆలోచనని బలపరుస్తాడు వివేక్. మొదట సంశయించిన, వివేక్ చెప్పిన మాటలతో అంగీకరిస్తుంది అమృత. పెళ్ళి ముహూర్తాలు నిర్ణయమయ్యాకా, ఇండియా రమ్మని, అప్పటి వరకు తాను కోలుకునేందుకు ప్రయత్నిస్తానని అంటాడు నారాయణరావు. – ఇక చదవండి.]
“మనం మాటల్లో పడి టైమ్ చూసుకోలేదు. మీరు ఇలా మాట్లాడుతుంటే అవతల ఫ్లైట్ వెళ్ళిపోతుంది. రోజూ మీ మేనల్లుడు, అమృత మాట్లాడుతారు లెండి” అంది నవ్వుతూ సుమిత్ర.
“విన్నావుగా వివేక్? రోజు మీరు ఫోను చేయకపోతే ఇక్కడ అన్నయ్య పడే ఆత్రుత, కంగారుకి సమాధానం చెప్పలేం” అని శారద అంటుండగానే
“అమ్మా.. మేము మాత్రం రోజు నాన్నగారితో మాట్లాడకుండా ఎలా ఉండగలం?.. అసలు మీకు వీ.వి.. నాన్న కోసం ఎంత త్యాగం చేస్తున్నాడో తెలియదు. తెలిస్తే షాక్ అవుతారు.. మావయ్య మీద ఉన్న అభిమానంతో, ప్రేమతో, తనకి ఇష్టం లేకపోయినా, ఈ పెళ్లికి అంగీకరించాడు. నేను కూడా అంతే.. నాన్నగారు కోరినట్లు మేము పెళ్లికి అంగీకరించాము” అంది అమృత..
“అమ్మూ!..” అన్నాడు కంగారుగా వివేక్.
అందరూ షాకైయ్యారు.
కంగారుగా అన్నాడు నారాయణరావు.. “ఏంటి వివేక్ బాబూ? అమృత అంటుంది.. నీకి పెళ్లి ఇష్టం లేదా?..”
“అయ్యో! మావయ్యా!.. అమ్మూ సరిగా, పూర్తిగా చెప్పకుండా అలా అంటే నువ్వు అలా అపార్థం చేసుకుంటే ఎలాగు?.. నేను మాటల్లో సరదాగా అన్నాను. మావయ్య కోసం ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను.. నేను డాక్టరేట్ తీసుకున్నాక, జాబ్ వచ్చినాక, బాగా సెటిల్ అయినాక.. అప్పుడు పెళ్ళి చేసుకుందాం అనుకున్నాను అంటే.. నాకు ఇంత తొందరగా పెళ్ళి చేసుకోవాలని లేదు మామూ.. నేను నాన్న కోసం ఈ పెళ్లికి ఒప్పుకున్నాను అంది” చెప్పాడు వివేక్.
గభాలున వాళ్ళిద్దరి చేతులు గట్టిగా పట్టుకొని కళ్ళల్లో నీళ్ళు నిండుతుండగా.. “నా కోసం.. ఎంతో ప్రేమతో పెళ్ళి చేసుకోవడానికి అంగీకరించారన్నమాట.” అంటూ..
“అవును.. రేపో, ఎల్లుండో.. ఈ వ్యాధితో పోతానని పెళ్ళికి అంగీకరించారని నాకు తెలుసు. లేకపోతే హాస్పటల్లో ఎంగేజ్మంట్కి ఎందుకు అంగీకరిస్తారు?.. నా చివరి కోరిక మీరిద్దరు తీరుస్తున్నందుకు.. కృతజ్ఞతగా మీ కడుపున పుడతాను” అన్న నారాయణరావు వైపు వివేక్, అమృత కంగారుగా చూశారు.
“ఏంటండి ఆ మాటలు?” అని సుమిత్ర కన్నీరు పెట్టుకుంది.
“అన్నయ్యా నువ్వు ఇలా మాట్లాడితే వాళ్లిద్దరూ ఎంత హడలిపోతారో, అంత దూరంలో ఎలా ఉండగలరో ఒక్క నిమిషం ఆలోచించు” అంది శారద..
“శారదా.. నాకు తెలిసి వాళ్ళని బాధపెట్టను.. అన్నట్లు ఇందాకే నాకు ఒక ఆలోచన వచ్చింది. చెప్పనీ వివేక్ బాబూ.. నీ థీసెస్ లాస్ట్‌లో ఉంది, ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేను మామయ్యా అన్నావు.. వివేక్ బాబూ!.. ఇన్నాళ్ళ కష్టం.. మంచి ఫలితాన్ని అందుకోవాలి.. నీ వర్క్ నువ్వు ఎటువంటి ప్రెజర్ లేకుండా చేసుకో!.. పెళ్ళి ముహూర్తంకి.. మావయ్యకి తారీఖు చెప్పాలని అస్సలు ఆలోచించ వద్దు.. నువ్వు ఫ్రీ అయినాక.. ఇండియా ఎప్పుడు రావాలనుకుంటున్నారో చెబితే నేను మీ పెళ్ళి ముహుర్తం నిర్ణయిస్తాను.. ” అన్నాడు నారాయణరావు.
“థ్యాంక్స్ మావయ్యా!.. నన్ను అర్థం చేసుకున్నారు” అన్నాడు సంతోషంగా వివేక్.
“నిన్ను అర్థం చేసుకోబట్టే.. నా బంగారు తల్లిని నీ చేతుల్లో పెట్టాను.. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది” అన్నాడు నారాయణరావు.
“నాన్నా!” అని గభాలున వెళ్ళి నారాయణరావు గుండె మీద వెళ్ళి తన తల ఆన్చి.. “నాన్నా.. నా మీద నీకెందుకంత ప్రేమ?.. నీకేనా? ఈ లోకంలో తండ్రులంతా అంతేనా?” అంది అమృత.
ప్రేమగా అమృత తల మీద చెయ్యి వేసి నిమరసాగాడు నారాయణరావు..
“వివేక్!.. టైమ్ అవుతుంది.. అమృతా లే తల్లి” అంది శారద.
గుమ్మం వరకు అందరూ వెళ్ళారు.. వివేక్, అమృత కారెక్కారు..
కారు ఎయిర్‌పోర్టుకి బయలుదేరింది.
ఇద్దరు ఫ్లైటు ఎక్కారు.. Aisle seats లో కూర్చున్నారు అమృత, వివేక్.
“మామూ!.. నేను చాలా స్వార్థపరురాలిని.. నన్ను ప్రాణపదంగా ప్రేమిస్తున్న అమృతమూర్తి నాన్న చివరి కోరిక తీర్చడానికి మనసులో ఏడుస్తూ అంగీకరించాను.. ప్చ్!.. ఇక మీదట.. నేనసలు బాధపడను. ఏం పెళ్ళి చేసుకుంటే ఆ బంధమే ముఖ్యామా?.. ఎంత మంది.. పెళ్ళిళ్ళు చేసుకోకుండా, సమాజ సేవలు చేసుకుంటూ,. భగవంతుని ఆరాధనలో బ్రతకడం లేదు?” అంటూ..
“నేను..” అని “అన్నట్లు మామూ!.. నువ్వు.. నువ్వు వేరే పెళ్ళి చేసుకో! .. నాన్నకు మాత్రం ఈ విషయం తెలియకూడదు” అంది..
“నువ్వు.. నువ్వు.. నిజంగా స్వార్థపరురాలివి!.. నువ్వు మాత్రమే తండ్రి ఋణం తీర్చుకుంటావన్నమాట.. అన్నీ తానై నా భవిష్యత్‌ని తీర్చిదిద్దన మావయ్య ఋణం నేను తీర్చుకోవద్దా?..” అన్నాడు బాధగా వివేక్..
“మామూ!.. ” అని గభాలున వివేక్ చెయ్యి పట్టుకొని భుజం మీద తల వాల్చింది అమృత.
***
సునీల్ డల్‌గా ఉండడం చూసి రాధిక, దివ్య, డేవిడ్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.. కళ్ళతోనే వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నారు.
“నీల్!.. ఈ రోజు మీ అందరికి పార్టీ ఇస్తున్నాను..” అంది దివ్య.
“వావ్!.. ఏం అదృష్టం!.. ఎప్పటి నుండో అడుగుతున్నాం.. మంచి ట్రీట్ ఇవ్వవే.. హీరోలాంటి వివేక్ని పట్టేసావ్?” అని.. “ఇన్నాళ్ళకి దయ కలిగిందా?” అంది రాధిక.
“నోరు ముయ్యవే!.. పట్టేయడం ఏమిటి? పవిత్రమైన ప్రేమకి పట్టేసావ్ అన్న చండాలమైన పేరు పెట్టావు ఏమిటి?” అంది కోపంగా దివ్య..
“దివ్య చెప్పింది కరక్టే!.. ఇన్ని సంవత్సరాల నుండి దివ్య, వివేక్ ఒకరిని ఒకరు లైక్ చేసినా.. ఎంత స్వచ్ఛంగా, ఎంత పవిత్రంగా ప్రేమించుకుంటున్నారు..”
“మా బైబిల్లో లవ్ గురించి ఒక Quote ఉంది.”
“If you welcome God’s love into your heart, then you will be able to love like God, too”
“వాళ్లిద్దరి మధ్య ఉన్నది మాములు love కాదు.. పవిత్రమైన లవ్” అని కళ్ళల్లో నిండిన నీటిని తుడుచుకున్నాడు డేవిడ్.
గభాలున దగ్గరకు వెళ్ళి డేవిడ్ చెయ్యి పట్టుకొని, “థాంక్యూ డేవిడ్, థాంక్యూ!.. మా ఇద్దరి మధ్యా ఉన్న బంధాన్ని నువ్వు కరక్ట్‌గా అర్థం చేసుకున్నావ్!..” అంది దివ్య..
అప్పటికే సునీల్ అడుగులు వేయడం చూసి కంగారుగా రాధిక..
“నీల్!.. వెళ్ళిపోతున్నావు ఏమిటి?.. ఎందుకు నువ్వు డల్‌గా ఉన్నావో మాకు తెలుసు.. ఇప్పుడు చూడు!.. వివేక్.. దివ్య.. ఇద్దరు.. ఒకరిని ఒకరు ఎంతో ఇష్టపడ్డారు.. కాని బెస్ట్ ఫ్రెండ్స్ లాగే ఇన్నాళ్ళు ఉన్నారు.. కాని వివేక్ ఇండియా బయలుదేరిన సమయంలో ఇద్దరు ఒకరిని ఒకరు విడిచి ఉండలేరు అన్న విషయం తెలిసింది.. అదే ప్రేమ.. నీల్!.. నీ ప్రేమ తప్పకుండా సక్సస్ అవుతుంది.. ఫేస్బుక్లో ఆ అమ్మాయి ఎకౌంట్ డీలీట్ అయిపోయిందని అంతలా ఫీలయిపోతున్నావు ఏమిట? నీల్!.. ప్రేమకి patience ఉండాలి నీల్! ”
“నీల్!.. నీ లవ్ తప్పకుండా సక్సస్ అవుతుంది.. ఏ కారణం వలనో ఫేస్బుక్ నుండి తన ప్రొఫెల్ తీసి ఉంటుంది.. ఒక రకంగా చెప్పాలంటే నీ ప్రేమకి పరీక్ష అనుకో..” అన్నాడు డేవిడ్.
“కరక్ట్‌గా చెప్పావు డేవిడ్” అంది రాధిక.
“మీరందరు ఎన్ని చెప్పినా.. తను.. తను.. ఇక ఫేస్బుక్ లోకి రాదు.. తను.. నన్ను ఫ్రెండ్‌గా accept చేయడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. ఈ మధ్యనే తను నన్ను లైక్ చేస్తుందని తెలిసి, ఇన్నాళ్ళ నా నిరీక్షణ ఫలించిందని.. మా ప్రేమ సక్సస్ అయిందని సంతోషపడ్డాను.. వివేక్ ఇండియా వెళుతున్నాడని తెలిసి.. తన గురించి చెబుదామనుకొని.. వివేక్ అటువంటి situation లో వెళుతున్నప్పుడు నేను తన గురించి చెప్పడం సబబు కాదు అని అనుకున్నాను. అదీగాక.. నేను వెళ్ళి తనని కలిస్తే బాగుంటుందని.. నా మనసు చెబుతుంది.. తనకి, నాకు మధ్య ఏదో తెలియని అడ్డుగోడ.. బయలుదేరింది.. అందుకే తను ఫేస్బుక్లో తన profile delete చేసింది. సరే!.. నేను ఇంటికి వెళుతున్నాను” అన్నాడు సునీల్.
“ఘోరం సునీల్!.. మనందరం చాలా.. చాలా బెస్ట్ ఫ్రెండ్స్‌మి.. లైఫ్ లాంగ్ బెస్ట్ ఫ్రెండ్స్ గానే ఉంటాం అనుకున్నాను.. కాని మన ఫ్రెండ్షిప్ని గడ్డిపోచలా తీసి పారేసావు.”
“ముక్కు మొఖం తెలియని అమ్మాయి కోసం.. మమ్ములను avoid చేస్తున్నావు.. అన్నాయం సునీల్” అంది రాధిక.
“వెధవ వాగుడు వాగకు.. ప్రేమించిన మనిషికే తెలుస్తుంది ప్రేమ విలువ.. ప్రేమించడానికి ముక్కు, మొఖం, నాలుగు ప్రేమ కబుర్లు, నాలుగు చోట్లకు తిరగడం ఇవన్నీ అక్కర లేదు.. ఫలాన మనిషి అని తెలిస్తే చాలు.. ప్రేమ పేరుతో మనసులో ఆ మనిషి స్థానం సంపాదించుకుంటారు.. సునీల్ మనసులో ఆ అమ్మాయి స్థానం సంపాదించుకుంది.. దాన్నే ప్రేమ అంటారు.. ప్రేమలో పడని.. నీకు.. ఆ బాధ ఏమిటో తెలియదు..”
ఆశ్చర్యంగా అంది రాధిక..
“అవును కదూ?.. ఎన్నో ఏళ్ళ బట్టి.. నువ్వు, వివేక్ ఎదురుబదురుగా కూర్చున్నా, కలిసి తిరుగుతున్నా.. అందరి లవర్స్‌లా చెట్టా పట్టాలేసుకోకుండా, మూగగా, అదే.. Silent love లో ఒకరితో ఒకరు ఎంత deep love లో ఉన్నారో, వివేక్ ఇండియా వెళ్ళాకా, నీ మాటల్లో తెలిసింది. ఫోన్లో వివేక్‌తో మాట్లాడుతున్నప్పుడు.. నీ మొఖంలో వెలుగు చూసాక, ప్రేమకి ఇంత శక్తి ఉందా అని అనుకుంటున్నప్పుడు.. ఛ!.. ఛ!.. నేను ఇంకా ప్రేమలో ఎందుకు పడలేదని.. అనుకుంటూ ఉంటున్నప్పుడు.. నేను ప్రేమించాలి?.. అని అనుకుంటూ ఉంటాను.. ప్చ్!.. మీ ఇద్దరిలా.. నేనూ.. ప్రేమలో పడాలి!.. ఎలా? ఎవరు నా దృష్టిలో పడలేదు.. కాదు.. కాదు.. నా మనసులో ఏ వ్యక్తి.. నా మనసుకి దగ్గర కాలేదు.. ” అని గబగబా సునీల్ దగ్గరకు వెళ్ళి..
“నీల్!.. నీ ప్రేమ కచ్చితంగా సక్సెస్ అవుతుంది. Don’t worry.. వివేక్ రానీ.. ఆ అమ్మాయి గురించి మొత్తం చెప్పేసేయ్!.. ఇన్నాళ్ళు దాచినది చాలు.. ఆలస్యం అమృతం విషం అంటారు.. నేను ఈ మాట చెప్పనాకే దివ్య లవ్ లో ముందడుగు వేసింది.. ఇప్పుడు డ్రీమ్స్‌లో హేపీగా enjoy చేస్తుంది” అంది రాధిక నవ్వుతూ..
“దీన్నే డబ్బా కొట్టుకోవడం అంటారు.. సరేలే!.. నీ సరదాని నేను ఎందుకు కాదనాలి?.. నీల్!.. వివేక్ వచ్చాక.. నీ లవ్ గురించి, ఆ అమ్మాయి గురించి నేను తనతో చెబుతాను.. Don’t worry.. ఈ రోజు నేను చిన్న ట్రీట్ ఇస్తున్నాను.. ప్లీజ్ కాదనకు” అంది దివ్య..
“నీల్!.. మా బైబిల్లో ఒక మాట ఉంది.”
“God’s love never wears out! అలాగే నీ love కూడా అంతే!..” అన్నాడు డేవిడ్..
“అందరూ!.. మీరంతా దీనిగా.. నా లవ్ సక్సెస్ అవుతుందని చెబుతుంటే చాలా happy గా ఉంది..” అన్నాడు సునీల్..
“హమయ్యా!.. అయితే ట్రీట్ ఎంజాయ్ చేయవచ్చు” అంది రాధిక.
ఇంటికి వచ్చిన దివ్య.. సంతోషంగా మంచం మీద వాలిపోయింది.
‘రెండు రోజుల నుండి వివేక్ ఫోను చేయలేదు.. వాళ్ళ మావయ్య గురించి చాలా worryలో ఉన్నాడు. ఈ మధ్యన చాలా upset మూడ్‌లో ఉన్నాడు.. పాపం వాళ్ళ మావయ్య అలా ఉన్నప్పుడు.. అలా ఉండకపోతే ఎలా ఉంటాడు ?.. అందుకే వివేక్ని.. ఇబ్బంది పెట్టకుండా.. తన బాధని పోగొట్టడానికే తన వంతు ప్రయత్నం తను చేస్తంది..’ అనుకుని లైట్ అపబోయి గభాలున సెల్ తీసింది.
ఒక్కసారి వివేక్‌తో మాట్లాడాలనిపించింది.. అవును! వివేక్‌తో మాటాడితే.. హాయిగా నిద్రపోవచ్చు అనుకొని వివేక్కి ఫోను చేసింది.
“దివ్యా!.. ఇప్పుడే ఇంటికి వచ్చాం” అన్నాడు వివేక్.
“ఏమిటి? USA వచ్చేసారా?.. వివేక్!.. ఇది చాలా అన్యాయం!.. నేను ఎయిర్‌పోర్టుకి వచ్చేదానినిగా! ప్చ్!.. నిన్ను మిస్ అయి నరకం అనుభవిస్తున్నాను.. దగ్గరగా ఉన్నప్పుడు నాకు తెలియలేదు. నిన్ను ఇన్నాళ్ళు చూడకుండా ఎలా ఉన్నానా?.. అని ఆశ్చర్యపోతున్నాను..”
“దివ్యా!.. దివ్యా!.. ఒక్కసారి నేను చెప్పేది.. విను.. అనుకోకుండా.. చాలా.. సంఘటనలు జరిగాయి.. ఫోనులో చెప్పేవి కావు.. కాని నేను తీసుకున్న నిర్ణయం మంచిదే అనుకుంటున్నాను. మావయ్య లేనిది నేను లేను..” అంటూ..
“మావయ్యను దక్కించుకోవాలంటే.. నేను తీసుకున్న నిర్ణయం మంచిదే అనిపించింది.. దాని పరిణామాలు ఎలా ఉంటాయో, ఏమిటో, నేను అమృత కూడా ఆలోచించలేదు.. మా ఇద్దరికి కావలసింది మావయ్య కోరిన ఒక్కగానొక్క చివరి కోరిక తీర్చడం.. అది మా బాధ్యత అనిపించింది. నాకు నువ్వు ఎన్ని సార్లు గుర్తు వచ్చావో తెలుసా? నా మనసుకి దగ్గరయినదానివి నువ్వు.. నీతో ఎంతో చెప్పాలనిపించింది. ఇక్కడ జరిగిన విషయాలన్నీ.. చెప్పలేకపోయాను. ఎందుకో తెలుసా?.. నువ్వు బాధపడితే నేను చూడలేను.. ఇక.. నన్ను చూసి అమృత.. పాపం చాలా బాధ పడుతుంది.. ‘సారీ మామూ!.. నువ్వు మధ్యన నలిగిపోతున్నావు అంటుంది..’ నీకు తెలుసు కదా? నేనంటే అమృతకి ప్రాణం.. ఎవరూ ఏమీ చేయలేకపోయాం.. పరిస్థితి అటువంటిది.. రేపు నేను రాలేను.. ప్లీజ్! ఒకసారి ఇంటికి రా!.. నీతో నా మనసులో బాధ అంతా చెప్పాలని ఉంది దివ్యా..” అని వివేక్ అంటుండగానే..
చేతిలో ఉన్న సెల్ సరిగా పట్టుకోలేక.. కళ్ళల్లో వస్తున్న నీటిని తుడుచుకోకుండా, బొంగురు పోయిన గొంతుతో.. “అ..లా..నా.. వివేక్.. నాకు.. ఏం మాట్లాడటాలో తెలియడం.. లేదు” అంది.
“అవును.. మా పరిస్థితి అలాగే ఉంది.. నీతో చాలా విషయాలు చెప్పాలి. ప్లీజ్, రా!.. మరి ఫోను పెట్టేయనా?.. ఆ వస్తున్నా అమృతా!.. కాఫీ అక్కడ పెట్టు. ఉంటాను దివ్యా!” అన్నాడు వివేక్..
(సశేషం)
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
కుసుమ వేదన-2
ఆధునిక శాకుంతలం
అన్నింట అంతరాత్మ-23: బహుళ ప్రయోజనకారి ‘బల్లను’ నేను!
ఎన్నో ప్రశ్నలు రగిల్చిన ‘జై భీమ్’
సరిగ పదమని-2
మరోసారి ‘జగజ్జాణ’ – సరళంగా, సంక్షిప్తంగా!!-29
జీవితాన్ని బయోస్కొప్ నుంచి చూడడం
చంద్రునికో నూలుపోగు-2
పద శారద-2
కాలనీ కబుర్లు – 7
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
చక్కటి ఇంటర్యూ. యువ రచయిత్రికి అభినందనలు
All rights reserved - Sanchika®