[డా. కె. ఎల్. వి. ప్రసాద్ రచించిన ‘’ముసుగు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఆమె మౌనాన్నీ ఆడిపోసుకుంటారు అక్కుడున్నవాళ్ళందరూ! అతనిముందు – మౌనానికి కారణం.. ఆమెకు, అతనికే తప్ప మూడో మనిషి — అన్నవాళ్ళెవరికీ తెలీదు..! చూడ్డానికి.. ఆమె అసంకల్పిత మూగనోము, గర్విష్టిగా ముద్రవేస్తుంది! కానీ.. ఆమె మూగతనానికి కారణం అతడి అర్థంపర్థం లేని, అసందర్భ వ్యాఖ్యానాలని , తద్వారా.. ఆమె మౌనానికి కారణం, గొంతును నొక్కిపట్టివుంచే గుండెవేదనే కారణమని.. అది రాక్షస సహచరుడు సృష్టించే — నరకయాతన ఫలితమని, ఎంతమందికి తెలుసు? ఆ మౌనానికి వెనుక ఉన్న దౌర్బగ్యపు ‘ముసుగు’ లోని కిరాతక మర్మ సూత్రం..!!
వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
కవి, అనువాదకులు శ్రీ వై. ముకుంద రామారావు ప్రత్యేక ఇంటర్వ్యూ
నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-44
‘సీత’ – కొత్త ధారావాహిక – ప్రకటన
జీవన రమణీయం-44
జీవాధార లయ
కొరియానం – A Journey Through Korean Cinema-6
పదసంచిక-66
సంచిక ఉగాది కవితల పోటీ 2022 ఫలితాలు – కవుల పరిచయాలు
పరిపూర్ణ భక్తి
మోక్షగుండం విశ్వేశ్వరాయ స్వీయ చరిత్ర అనువాదం – అధ్యాయం-8
అన్నం విలువ మనసుకు తాకేలా వివరించారు... ప్రతిదీ వివరంగా పరిశీలించి అందిస్తున్నందుకు ధన్యవాదాలు...🙏
Thank you somuch sir
ధన్యవాదాలు సర్.
సుబ్బారావు గారు ధన్యవాదాలు మీకు.
వేణు గారూ ధన్యవాదాలు
All rights reserved - Sanchika®