వ్యక్తిగత కారణాలు మరియు గోప్యత దృష్ట్యా, ఈ రచనలోని కొందరు వ్యక్తులు మరియు అధికారుల అసలు పేర్లకు బదులుగా వేరే పేర్లను వ్రాయడం జరిగింది. దయచేసి అర్థం చేసుకోగలరు.
~~
సెప్టెంబరు… 14 వ తేదీ… నా జీవితంలోనే అతి ముఖ్యమైన రోజు… అని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు.
దానికి కారణం లేకపోలేదు… సుమారు 47 సంవత్సరాల క్రితం అదే రోజు… నేను… ఆంధ్రా బ్యాంకు ఉద్యోగంలో చేరాను. ఆ రోజే ప్రతి సంవత్సరం నేను ఓ పండుగలా జరుపుకుంటున్న రోజు.
ఈసారి మాత్రం ఆ రోజున, అంటే, ది. 14.09.2019 అదో రకమైన దిగులు, బాధ. ఎందుకంటే ఇటీవల కేంద్రప్రభుత్వం బ్యాంకుల విలీనంపై తీసుకున్న ఓ నిర్ణయం.
ది. 30.08.2019 న కేంద్ర ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన మేరకు, ఆంధ్రా బ్యాంకు మరియు కార్పోరేషన్ బ్యాంకు, పెద్ద బ్యాంకైన యూనియన్ బ్యాంకుతో విలీనం కాబోతున్నాయి.
ది. 13.09.2019న జరిగిన బోర్డు మీటింగులో, ఆంధ్రా బ్యాంకు డైరక్టర్లు, ప్రతిపాదిత విలీనానికి ఆమోదం కూడా తెలియజేయడం జరిగింది.
ఈ విలీనం ద్వారా 14.59 లక్షల కోట్ల రూపాయల ఆస్తులతో, 9609 శాఖలతో, దేశంలోనే ఐదవ అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంకుగా అవతరించబోతోంది యూనియన్ బ్యాంక్.
ఇక ఆంధ్రా బ్యాంకు విషయానికొస్తే, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో స్వాతంత్ర్య సమరయోధుడు, డాక్టర్. బోగరాజు పట్టాభి సీతారామయ్య గారిచే స్థాపించబడిన బ్యాంకు ఆంధ్రా బ్యాంకు.
ది. 20.11.1923 న ఒక లక్ష రూపాయల పెయిడ్ అప్ క్యాపిటల్‌తో, ఒక మిలియన్ రూపాయల ఆథరైజ్డ్ క్యాపిటల్‌తో రిజిస్టర్ చేయబడింది ఆంధ్రా బ్యాంకు…
1956లో, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్ ముఖ్య పట్టణమైంది. అప్పుడే ఆంధ్రా బ్యాంకు రిజిస్టర్డ్ ఆఫీసు మచిలీపట్నం నుండి హైదరాబాద్‌కు తరలించడం జరిగింది.
2011-12 సంవత్సరంలో త్రిపుర, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలోకి ప్రవేశించింది ఆంధ్రా బ్యాంకు.
ప్రస్తుతం దేశంలోని 25 రాష్ట్రాలలో మరియు మూడు కేంద్ర పాలిత ప్రాంతాలలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది ఆంధ్రా బ్యాంకు.
దాదాపు 96 సంవత్సరాల క్రితం, మచిలీపట్నంలో ఒక చిన్న శాఖతో మొదలై, ఇంతై, అంతై, వటుడింతైనట్లు, శరవేగంతో అభివృద్ధి చెందింది ఆంధ్రా బ్యాంకు…
ది. 31.03.2019 నాటికి 2885 శాఖలతో, 3.64 లక్షల కోట్ల రూపాయల ఆస్తులతో, 4,387.95 కోట్ల రూపాయల ఆపరేటింగ్ ప్రాఫిట్‌తో, 20,981 మందికి ఉద్యోగాల కల్పనతో, ఉజ్వలంగా విరాజిల్లుతోంది ఆంధ్రా బ్యాంకు…
అలాంటి ఆంధ్రా బ్యాంకుతో దాదాపు 47 సంవత్సరాల అఖండమైన అనుబంధం నాది. ఎందుకంటే ఇప్పటికీ నేను ఆంధ్రా బ్యాంకు నుండి నెల నెలా పెన్షన్ తీసుకుంటూనే వున్నాను.
కానీ, వచ్చే సెప్టెంబరు 14 నాటికి ఆంధ్రా బ్యాంకు కనబడకుండా పోబోతుంది. కనీసం పేరు కూడా వినబడకుండా పోబోతుంది. అది తలచుకుంటే, నా గుండె పిండినట్లవుతుంది. ఆ తలంపు రాగానే మనసు కకావికలవుతుంది. కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరుగుతున్నాయి. ఏదో భరించలేని బాధ… తట్టుకోలేని దిగులు…
ఒక్కసారిగా నేను ఆంధ్రా బ్యాంకులో పని చేసిన రోజులు, అప్పటి అనుభవాలు, నా కళ్ళ ముందు సినిమా రీళ్ళలా కదిలిపోతున్నాయి.
సంతోషాలు… దుఃఖాలు…; సుఖాలు…, కష్టాలు…; ఆశలు…, నిరాశలు…; సన్మానాలు…, అవమానాలు…; అన్నింటిని చవిచూసిన నేను, వాటన్నింటినీ ఒక్కొక్కటిగా నెమరు వేసుకుంటున్నాను.
(మళ్ళీ కలుద్దాం)
ఆంధ్రాబ్యాంకు లో ప్రాంతీయ అధికారి హోదా లో ఉద్యోగ విరమణ చేసిన తరువాత , తన కెంతో ఇష్టమైన రచనా వ్యాసంగాన్ని ఎంచుకొని , కథలు,నాటికలు,నవలలు వ్రాస్తూ ముందుకెళ్తున్నారు.
ఆంధ్రా బ్యాంకు నే పద్యంగా తన జీవన విశేషాలను ప్రారంభించారు,సాంబ శివ రావు గారు.ఉద్యోగ పర్వం తో మొదలైన ఈ సీరియల్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మనకు అందిస్తుందనె ఆశాభావాన్ని వ్యక్టపరుస్టున్నాను. రావు గారికి అభినందనలు.
Prasad Garu! Mee spandanaku Dhanyavaadaalandi 🙏 Nizaniki mee salahalu ,soochanalatho modalai ippatikee niraatamkamgaa nadusthundi naa rachana vyaapakam .. Anduku meeku yellappudu vidheyudygaane vuntaanu 🙏 Guruvugaariki Vandanaalu… 🙏🙏🙏
Nenu vraashina “NAA JEEVANA GAMANAMLO” ane FEATURE,ee roju nundi SANCHIKA Web Magazine lo ,prathi AADIVAARAM dhaaravaahikamgaa prachurinchabaduthundi.. Anduku Sanchika Editor gaariki, migathaa Sanchika Team sabhyulandariki naa hrudayapoorvaka Dhanyavaadaalu.. 🙏🙏🙏
Mee.. Sambasivarao Thota
It is a gripping auto biography and you are a good writer! i am looking forward to future issues. i presume I can use same link to read every week. If possible, send me a reminder on every Monday. When children grow, they go away and may not be able to spend time with us. Similarly when parents pass away, we are emotionally shocked, but recover with time. India can’t have too many small banks – they have to be merged to become probably 4 or 5 for all India and this is inevitable. While I do share your feelings, it is inevitable.
Sri M V RAO Garu ! Thanks for your observations and appreciation 🙏 Every Sunday,I note to send the link…👍
మీ జీవన గమనానికి స్వాగతం ఎన్నో ఆసక్తికర విషయాలకోసం వేచి చూస్తున్నాం సర్ . అభినందనలు మీకు.
Brother Sagar! Thank You very much 👍
సాంబశివరావు గారూ, మీతో బాటు ప్రతి ఒక్క ఆంధ్రాబ్యాంక్ ఉద్యోగి అదే ఉద్విగ్నతను అనుభవిస్తున్నారు. ఆంధ్రాబ్యాంక్ ను మన బ్యాంక్ అనుకుని స్వంతం చేసుకుని మరీ పనిచేశాము. అది ఆంధ్రుల బ్యాంక్. ఆంధ్రా ప్రజల జీవనం ఆంధ్రాబ్యాంక్ తో విడదీయలేని అనుబంధం ఏర్పరుచుకుంది. ఇక నుండి ఆ పేరు చూడలేము. వినలేము. మీ ఆవేదనలో నేనూ పాలుపంచుకుంటున్నాను సాంబశివరావు గారు. మీ జీవన గమనం పూర్తిగా తెలుసుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నాను. కొంతకాలం మీతో కలసి ప్రయాణం చేసినందులకు నేనెంతో గర్వపడుతున్నాను.
SubbaRao Garu! Thanks for your understanding and appreciation.. I always cherish our Association.. Thanks Andi 🙏
నా జీవన గమనంలో _చదివినా అభినందనలు ముందు ముందు మీ రు రాసె విషయములకు ఎదురు చూస్తున్న
From Seethakkaiah Hyderabad
Seethakkaiah ! Thanks Akkaiah!! 🙏
really ur jeevan gamanamlo vishayalu andhrabank lo work chesa a mana andheri bhavalu meeru vrastunnavi chakkaga vivarincharu
From Sri Haribabu Guntur
Thanks Haribabu Garu 🙏
ఆంధ్రాబ్యాంక్ తో ఉన్న అనుబంధాన్ని కళ్ళకు కట్టినట్లుగా వివరించారు. మనకు మనకుటుంబానికి ఒక మార్లము ఛూపిన సంస్ధ మన కళ్ళ ముందే అస్ధిత్వము కోల్పోతుంటే తీరని వేదన మరియు ఆవేదన 👏🙏
From Sri J Lakahman Kumar Hyderabad
LakshmanKumar Garu! Thanks for your understanding and observations 🙏
Good afternoon Sambasiva Rao Thota gaaru.🙏
1 st Feb, is extremely an auspicious day as it saw your first episode of your chequered career and cursus vitae that would unfold in the course… under the title ” Naa Jeevana Gamanamlo- part -1.
Your responsible concern for the privacy of the persons and the events associated with others…in changing the actual names with fictional ones is an excellent and respected tradition in writing one’s memoirs! Your honest declaration at the beginning itself is a great admission of the sanctity of privacy of others concerned.🙏
14 September, in your second innings is the grand and gracious beginning which is a great day with you in your cherishable memories! like wise for many too , though dates, months and years may vary…
The beginning, evolution, development, expansion, growth and finally the painful merger of your mother Bank “Andhra Bank”along with another unfortunate Corporation Bank with Union Bank in 2019….your poignant feelings in the disappearance of your MOTHERLY Andhra Bank are natural and spontaneous to any employee who was with it in all circumstances …high and low…for more than three decades…😭 I think this saddening experience was felt by others too equally at the tragic merger and haunts too in times to come…
The establishment of A B in Machalipatnam about a century ago ie on November 20,in the year 1923 by Bhogaraju Pattabhi SeethaRamaih of INC , during the hey days of British Rule…. conjures up many things / mile stones in history… and they deepen the feelings of fateful estrangement more unbearable for those associated with it as employees or customers or beneficiaries…et al …is real visual and documented.
The sudden death of AB and CB or merger with UB when the capital of the Bank was in lakhs of crores, with presence in 25 states and two UTs,in addition to about five thousand crore rupees in profits is by any means a heart break or a death blow! to speak the least.!
Since the writer has about half a century of bonds, association, connections, relations, memories, living, working, and growth as a part and parcel of the AB , and the sudden and unwarranted merger with other bank … the TRAUMA is inexplicable in words …
We hope, the readers would be exposed to a wide range of events and activities you had in your second innings,along with your first innings ( birth, child hood, education) and your present innings ( post retirement)…
Thank you Thota Samba Siva Rao gaaru for your kindness in sharing your thoughts….🙏
From Sri Sudhakar Hyderabad
Sudhakar Garu! I am so delighted to read your eloberative analysis and meaningful observations.. I thank you very much for your time and understanding.. I will take your advice to heart to write other segments of my life also after my feature on my Bank Service .. Thank You very much Sir 🙏
Very interesting mamaiah…👍👍👍 From Mr.Nagaraju Guntur
Thanks Nagaraju👍
Very very happy to hear this. Hope all of our relatives may appear in someway…. Feeling proud of you mamaiah……..🙏🙏🙏🙏🙏
Mr.Srinivas Rao Guntur
Thanks Srinivas! This feature is related to my service in Andhra Bank 👍
Chala manchi ga undi.proceed avvandi.💐
From Mrs.Kasthuri Devi Hyderabad
Thanks Kasthuri Devi Garu 🙏
Very nice sir nicely expressed hope will come to know the facts faced by you during your service. This will inspire all our colleagues and will go to old memories.
From Sri k.Ramchander Hyderabad
Thanks Ramchander Garu 🙏
yes sambasiva siva garu I also faced same situation when Govt.asked VRS from all BSNL employees as I am also retired BSNL employee. The writer selected good subject.This helps the writer in recollection of his past memories and in the same way also helps all the retd.employes like me to recall their working days valuable memories once again. We all thank you Sambasiva Rao Garu for giving opportunity to share our memories & recollect. Best wishes for your future continuity of the “Geevana Gamanam”
UshaRani Garu! Thanks for your observations and encouraging and appreciating words..
Really really true sir.Mine is also same feeling
From Sri ChalapathiRao Hyderabad
Thanks ChalapathiRao Garu 🙏
Eagerly waiting mamaiah. Superb… Mamaiah … But the feelings …. No words to express and me also completed 24 years approx. The same feeling.
From Mr.Ravikumar Vijayawada
Thanks Ravikumar👍
ఆంధ్రా బ్యాంకు పుట్టు పూర్వోత్తరాలు దాని ఘన చరిత్రతో మీ ధారావాహికను అద్భుతంగా ప్రారంభించారు… జయహోలు మీ ఆరంభానికి… ఆసక్తికరమైన ఆంధ్రా బ్యాంకుతో మీ అనుబంధాన్ని ప్రయాణాన్ని తిలకించటానికి ఎదురు చూస్తున్నాం🙏🏻🙏🏻🙏🏻
Chaalaa Chaalaa Thanks Andi 🙏
Jhansi Garu! Chaalaa Chaalaa Thanks Andi 🙏
సాంబశివరావు గారు,మీతో బాటు బాధను,ఆవేదనను అనుభవిస్తున్న ఆంధ్రా బాంక్ ఉద్యోగులలో నేను ఒకన్నీ. ఆంధ్రా బ్యాంక్ తో విడదీయరాని బంధం మనది.ఇక నుంచి ఆ బాంక్ పేరు రాయలేము,చూడలేము.మనకు మన కుటుంబానికి ఒక మార్గము చూపిన సంస్థ. మీతో కల్సి పనిచేసినందుకు ఎంతో గర్వపడుతున్నాను. ఆంధ్రా బ్యాంక్ తో మీ ప్రయాణంలో జరిగిన సంఘటనలు తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము.
Thanks Bhujangarao Garu 🙏
Good sir congratulations on.becoming regular writer expecting many more Regards Amarnadh
Hyderabad
Thanks Amarnadh Garu 🙏
బావుందండి. మొదటి భాగం కనుక బ్యాంక్ చరిత్ర చెప్పారు మీ అనుబంధాన్ని జతచేసి…నిజమే ఒక సంస్థలో పాణిజేసిన అనుభవం లోనుంచి పుట్టుకొచ్చే భావాలు జీవంతో ఉట్టిపడతాయి. మంచి ప్రయత్నం..ఉన్నది వున్నట్లుగా చెప్పండి. మనుషుల మనస్తత్వాలు బయట పడతాయి..బ్యాంకింగ్ సెక్టార్ లోకి అడుగుపెట్టేవారికి మార్గదర్శనంగా నిలుస్తాయి..పరిస్థితులు మారినా ‘మనుషులు’…కదా. అభినందనలు.👍😊
From Sri Maheswar Bangalore
Chaalaa Thanks Andi Maheswar Garu! Mee prothsaahaaniki Dhanyavaadaalandi!! 🙏🙏🙏
నిజమే…జీర్ణించుకోలేని విషయం..ఈ విలీనాలు….కాలంతో మర్చిపోవచ్చునేమో కానీ…మనం బ్రతికినంత కాలం ఇది మనకు మింగుడు పడటం కష్టం.😖😖😖
బాగుంది sir👌🏻😊
From Sri Ravi Ramana Hyderabad
Ramana Garu! Dhanyavaadaalandi 🙏
గురువు గారికి వందనాలు, మీ “నా జీవన గమనంలో” చదివాక మీలాగే ఒక బ్యాంకు ఉద్యోగిగా కొంత బాధ కలిగింది. మనం పనిచేస్తున్నప్పుడు మనది అనే భావనతో వుంటాము, ఈరోజు ఆ చిహ్నమే కనుమరుగౌతుంటే మనస్సు చివుక్కుమంటుంది. మీ భావనలతో ఏకీభవిస్తున్నాను. మీ రచనా సరళి చక్కగా వుంటుంది. ఆసక్తి కరంగా సాగిపోతుంది. హృదయపూర్వక అభినందనలు మాస్టారు.💐💐💐🙏🙏🙏
From Sri JP Sudhakar Hyderabad
Thank You very much Sudhakar Garu 🙏
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
They Have Lived Their Life!
ఫస్ట్ లవ్-9
ఫొటో కి కాప్షన్-3
అవయవ దాన మహత్యం
జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-60
పదసంచిక-85
మనం నేర్పితే కదా!
కాజాల్లాంటి బాజాలు-12: అదండీ సంగతీ…
సంస్కృత శ్లోకాలు – తెలుగు పద్యాలు 10
ఉదయ రాగం-10
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®