14
1979 సంవత్సరం.
గ్రామీణ ఋణాధికారి అంటే కేవలం గ్రామీణ ప్రాంతాల్లో అప్పులు ఇవ్వడానికి, ఇచ్చిన అప్పులు వసూలు చేయడానికి మాత్రమే, నియమించబడిన అధికారి… అని అర్థం స్ఫురిస్తుంది. అందుకే హెడ్ ఆఫీసు వారు, ఈ విషయంలో నిశితంగా పరిశీలన జరిపి, ఆ హోదాను ‘గ్రామీణ ఋణాధికారి’ (రూరల్ క్రెడిట్ ఆఫీసర్) బదులు ‘గ్రామీణ అభివృద్ధి అధికారి’ (రూరల్ డెవెలప్మెంట్ ఆఫీసర్) గా మార్చారు. అంటే, ఇకపై గ్రామాల్లో అప్పులిచ్చి వసూలు చేయడంతో పాటు, ఆ గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి విస్తృతస్థాయీ బాధ్యతలను నిర్వహించాలి… ఈ గ్రామీణ అభివృద్ధి అధికారులు.
ఆ క్రమంలో పైలట్ ప్రాజెక్టుగా, ‘ఇంటిగ్రేటెడ్ డెవెలప్మెంట్ ఆఫ్ సెలెక్టెడ్ విలేజ్’ (ఐ.డి.ఎస్.వి.) అనే నూతన పథకాన్ని ప్రవేశపెట్టింది ఆంధ్రా బ్యాంకు. ఆ పథకం కొరకు రూపకల్పన చేసిన విధి విధానాల ననుసరించి, ఒక్కో గ్రామీణాభివృద్ధి అధికారి, తను అప్పటికే నిర్వహిస్తున్న విధులకు అదనంగా… ఒక్కో గ్రామాన్ని ఎన్నుకొని, ఆ గ్రామాభివృద్ధి కోసం ప్రణాళికను తయారు చేసుకొని, అమలుపరచాలి. ఓ సంవత్సరం తరువాత, ఐ.డి.ఎస్.వి. పథకం ద్వారా, ఆ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో, ఆ గ్రామ ప్రజల ఆర్థిక స్థితి గతుల్లో, వచ్చిన మార్పుపై ఓ నివేదిక సమర్పించాలి. గ్రామీణాభివృద్ధి అధికారులంతా, వెంటనే ఈ పథకం అమలు చేయాలని హెడ్ ఆఫీసు నుంచి ఆదేశాలు వెలువడ్డాయి.
నా మటుకు నేను, గొల్లప్రోలు, కత్తిపూడికి మధ్యలో ఉన్న ‘చేబ్రోలు’ అనే గ్రామాన్ని దత్తత తీసుకుని, ఆ ఐ.డి.ఎస్.వి. పథకాన్ని గొల్లప్రోలు బ్రాంచి ద్వారా అమలుపరచాలని నిర్ణయించుకున్నట్లు హెడ్ ఆఫీసుకు తెలియపరిచాను. గొల్లప్రోలు బ్రాంచి మేనేజర్ శ్రీ సుబ్బారావు గారు, ఆ బ్రాంచీలో పని చేస్తున్న అగ్రికల్చరల్ క్లర్కు శ్రీ అశోక్ రాజు గారు ఇద్దరూ నాకు సంపూర్ణ సహకారం అందించేందుకు, సుముఖత వ్యక్తం చేశారు.
***
చేబ్రోలు గ్రామంలో ఆరా తీయగా, ‘దొరవారు’ అని పిలవబడే ఓ విశిష్ట వ్యక్తి గురించి అందరూ చెప్పారు. ఆయన మృదు మధురభాషి, అజాతశత్రువు, తోటివారికి సహాయపడే మనస్తత్వం కలిగిన మనిషి. ఆయన అసలు పేరు నాకు తెలియదు. కానీ అందరూ ‘దొరవారు’ అనే అంటారు. ఆయనొక పెద్ద రైతు, రైసు మిల్లు ఓనరు కూడా. వారిని కలిసి ఐ.డి.ఎస్.వి. పథకం క్రింద నేను చేబ్రోలు గ్రామాన్ని ఎన్నుకున్నట్లు చెప్పి, ఆ పథకాన్ని విజయవంతంగా అమలుపరిచేందుకు, వారి సహాయ సహకారాలు కోరాను. అందుకు దొరవారు ఎంతో సంతోషించారు. గ్రామంలోని ప్రజలందరికీ, మంచి జరుగుతుందంటే, తానెప్పుడూ ముందుంటానని, నాకు అన్ని విధాలా తోడ్పాటు నందిస్తానని మాటిచ్చారు.
ఆ రోజే, గ్రామ సర్పంచ్, మరియు గ్రామ పెద్దలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి, నేను ఈ పథకం గురించి వివరించాను. అందరూ ఎంతగానో సంతోషించారు. తమ గ్రామాన్ని ఎన్నుకున్నందుకు నన్నెంతగానో అభినందించారు.




***
నిజానికి, మన దేశ జనాభాలో దాదాపు డెబ్భై శాతం మంది గ్రామాల్లోనే నివసిస్తున్నారు. అందుకే ‘ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్…’ అంటారు. జిల్లాలోని గ్రామాలన్నీ అభివృద్ధి చెందితేనే ఆ జిల్లా అభివృద్ధి చెందుతుంది. జిల్లాలన్నీ అభివృద్ధి చెందితేనే ఆ రాష్ట్రం, రాష్ట్రాలన్నీ అభివృద్ధి చెందితేనే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది.
దేశాభివృద్ధి జరగాలంటే ప్రతి గ్రామం తప్పనిసరిగా అభివృద్ధి చెందాలని, మనసా వాచా కర్మణా విశ్వసించే నేను, ఈ ఐ.డి.ఎస్.వి. పథకాన్ని వ్యక్తిగతంగా కూడా స్వాగతించాను. ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ఈ చేబ్రోలు గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడిపించాలని, కృతనిశ్చయుడనై, రంగంలోకి దిగాను.
- ఆ గ్రామంలో ఉండే, ఇంటర్మీడియట్ పాసైన వారిని ఓ పదిమందిని నాకు సహాయకులుగా ఏర్పరుచుకున్నాను.
- ఆ పదిమందిని ఇద్దరు చొప్పున ఐదు గ్రూపులుగా విభజించాను.
- ఈ ఐదు గ్రూపులు విడివిడిగా గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించి, ఆ ఇంటి యజమానులతో సంప్రదించి, నేను అప్పటికే తయారు చేసిన ప్రశ్నావళి నింపాలి.
- ఆ ప్రశ్నావళి పత్రం ద్వారా, ప్రతి ఇంట్లో వున్న వారి వివరాలు, ప్రస్తుత ఆర్థిక స్థితిగతులు, ఇతర వనరులు తెలుసుకున్నాము.
- ఆర్థికంగా ఎదిగేందుకు బ్యాంకు ద్వారా వారికి కావలసిన సహాయం గురించి తెలుసుకున్నాము. ఆ విధంగా ఆ కుటుంబ ఋణ ప్రణాళికను తయారు చేశాము.
- అలా తయారు చేసిన అన్ని కుటుంబాల ఋణ ప్రణాళికలను క్రోడీకరించి, ఆ గ్రామ ఋణ ప్రణాళికను తయారు చేశాము.
- ఋణాల విషయమే కాక, ఆ గ్రామం యొక్క రూపురేఖలు మార్చేందుకు, పాఠశాల, ఆసుపత్రి, దేవాలయం, మసీదు, చర్చి, పార్కు, ఆటస్థలం, వీటన్నింటిలో మరిన్ని వసతులు కల్పించేందుకు ఆ గ్రామ ప్రజల అభిప్రాయాలను సేకరించాము.
- వీటన్నిటి కోసం, బ్యాంకు నుండి, ప్రత్యేక నిధులను మంజూరు చేయించుకోవడంతో పాటుగా, సమాజసేవలో పాల్గొనదలచిన ధనికులను, స్వచ్ఛంద సేవా సంస్థలను కూడా ఈ గ్రామీణాభివృద్ధిలో భాగస్వాములుగా చేయాలని నిర్ణయించుకున్నాము.
- గ్రామంలో వున్న రైతులకు కావల్సిన స్వల్పకాలిక పంట పెట్టుబడి ఋణాలు, కోళ్ళఫారాలు, డెయిరీ ఫారాలు, ట్రాక్టర్ల కొనుగోలు, బోర్వెల్ తవ్వకాలు, ఎలెక్ట్రిక్ మోటార్లు, ఆయిల్ ఇంజన్ల కొనుగోలుకు, ఇతర పరిశ్రమల ఏర్పాటు కొరకు, కావలసిన మధ్యకాలిక, మరియు దీర్ఘకాలిక ఋణాలు, అలాగే చేతి పని వృత్తుల వారికి, వ్యవసాయ కూలీలకు, నిరుద్యోగులకు, వితంతువులకు కావలసిన ఋణాల గురించి, ఆ గ్రామ ఋణ ప్రణాళికలో చేర్చాము.
- తయారు చేసిన చేబ్రోలు గ్రామ ఋణ మరియు అభివృద్ధి ప్రణాళికను, గొల్లప్రోలు బ్రాంచి మేనేజర్, కాకినాడ రీజినల్ మేనేజర్ గార్ల సిఫారసులతో హెడ్ ఆఫీసుకి పంపాను.
- హెడ్ ఆఫీస్ వారు ఆ ప్రణాళికల అంచనాలను పరిశీలించి, ఆమోదించి, అందుకవసరమయే బడ్జెటుని మంజూరు చేశారు.
- వెంటనే గొల్లప్రోలు బ్రాంచి ద్వారా, అప్పటికే గుర్తించిన వారందరికీ, ఆయా అవసరాల నిమిత్తం ఋణాలు మంజూరు చేయడం జరిగింది.


















15
గ్రామీణ ప్రాంతాల్లో, నూతనంగా బ్యాంకు శాఖలు తెరవడానికి జిల్లా అధికారులు సర్వే చేసి, ఓ ఇరవై దాకా గ్రామాలను గుర్తించారు. లీడ్ బ్యాంక్ సమావేశంలో ఆయా బ్యాంకులు, ఆంధ్రా బ్యాంకుతో సహా, కొన్ని గ్రామాలను ఎంచుకుని, ప్రభుత్వం గుర్తించిన అన్ని గ్రామాలలో శాఖలు తెరవడానికి ముందుకొచ్చాయి; ఏజన్సీ ప్రాంతంలోని రాజవొమ్మంగి, మారేడుమిల్లి గ్రామాల్లో తప్ప. ఆ సమయంలో తూర్పు గోదావరి జిల్లాకు లీడ్ బ్యాంక్‌గా వ్యవహరిస్తున్న ఆంధ్రా బ్యాంకు ఆ రెండు గ్రామాల్లో విధిగా తమ శాఖలు తెరవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆ క్రమంలో ఆ రెండు గ్రామాలకు వెళ్ళి అక్కడి ప్రజలతో సంప్రదింపులు జరపడం, సర్వే చేసి బడ్జెట్లు తయారు చేయడం నా వంతయింది. ఆ తరువాత ఆ రెండు గ్రామాల్లో బ్యాంకు శాఖలు తెరవడానికి తయారు చేసిన ప్రతిపాదనలను, రీజినల్ మేనేజర్ గారు హెడ్ ఆఫీసుకు పంపారు. హెడ్ ఆఫీస్ వారు ఆ ప్రతిపాదనలను తమ సిఫారసులతో, లైసెన్సులు ఇచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పంపారు. వెంటనే రిజర్వ్ బ్యాంక్ వారు లైసెన్సులు మంజూరు చేశారు.
మరోసారి ఆ గ్రామాలకు వెళ్ళి, అక్కడ బ్యాంకు శాఖలను ఏర్పాటు చేయడానికి అనువైన ఇళ్ళను అతి కష్టం మీద గుర్తించి, ఆ ఇళ్ళ యజమానులను ఒప్పించి, అద్దెకు తీసుకున్నాము. అవసరమైన మరమ్మత్తులు చేయించి, బ్యాంకు శాఖలు తెరవడానికి కావలసిన ఫర్నీచర్‌ను, రికార్డులను, రిజిస్టర్లను అందుబాటులో వుంచాము. ఈలోపు రీజినల్ మేనేజర్ గారు, ఆ శాఖలను నడిపించేందుకు మేనేజర్లను, ఇతర సిబ్బందిని బదిలీ చేశారు.
ఓ మంచి రోజున జిల్లా కలెక్టరు గారి చేతుల మీదుగా రాజవొమ్మంగి, మారేడుమిల్లి గ్రామాల్లో ఆంధ్రా బ్యాంకు శాఖలు ప్రారంభించబడ్డాయి. ఆ ప్రాంత ప్రజలందరికీ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
ఇక్కడ చెప్పుకోదగ్గ ముఖ్యమైన విషయం ఉంది.
అలనాడు బ్రిటీష్ సామ్రాజ్యంపై, స్వాతంత్ర్యం కోసం, ఏజన్సీ ప్రాంతంలో, అలుపెరుగని సాయుధ పోరాటం చేసి, చివరికి బ్రిటీష్ వారి తుపాకుల తూటాలకు బలైపోయి వీరమరణం పొందిన, స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం పులి, అల్లూరి సీతారామరాజు గారు నడయాడిన పవిత్ర ప్రదేశాల్లో, ఇప్పుడు నేనూ తిరిగాను. స్వాతంత్ర్య సాధన కోసం అల్లూరి సీతారామరాజు గారి నాయకత్వంలో బ్రిటీష్ వారిపై సాయుధ పోరాటం చేసి అసువులు బాసిన మన్యం వీరుల వారసుల మధ్య, ఇప్పుడు నేను తిరిగాను.
అదొక మధురానుభూతి. చరిత్ర పుటల్లోకి తొంగి చూడగలిగాను. ఆనాటి సంఘటనలను గుర్తు చేసుకుంటేనే రోమాలు నిక్కబొడుచుకున్నాయి.
దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను, తృణప్రాయంగా అర్పించిన ఆ త్యాగమూర్తులందరికీ మనసులోనే వందనాలు సమర్పించాను.
(మళ్ళీ కలుద్దాం)

ఆంధ్రాబ్యాంకు లో ప్రాంతీయ అధికారి హోదా లో ఉద్యోగ విరమణ చేసిన తరువాత , తన కెంతో ఇష్టమైన రచనా వ్యాసంగాన్ని ఎంచుకొని , కథలు,నాటికలు,నవలలు వ్రాస్తూ ముందుకెళ్తున్నారు.
64 Comments
Sambasivarao Thota
Ee roju SANCHKA lo , nenu vraashina “NAA JEEVANA GAMANAMLO “ ..14th and 15th episodes prachrinchinanduku , Editor Sri MuraliKrishna Gaariki,Sri Somashankar Gaariki , thadithara Sanchika Team Sabhylandariki , naa hrudayapoorvaka kruthajnathalu …
….Sambasivarao Thota
Sagar
మీ వాయువేగం అభినందనీయం. పనితనంలో మీ వేగానికి ఆకర్షితులయ్యే మీ పై అధికారులు మికు సంపూర్ణ సహాయాలు అందించారని నా అభిప్రాయం. దురదృష్టవ శాత్తు అలాంటి విలువలు నేడు ఉండి ఉంటె దేశం ఎంతో అభివృద్దిలో ఉండేది. అన్నిటా రాజకీయాలు రాజ్యమేలుతున్న రోజులివి. అల్లూరి వారి రణక్షేత్రాన్ని దర్శించడం మీ అదృష్టం సర్ . మీకు అభినందనలు మరియు ధన్యవాదములు.
Sambasivarao Thota
Brother Sagar..
Abhimaanantho koodina mee apoorva spandanaku ..
naa hrudayapoorvaka Dhanyavaadaalu..
Thank you very much
ఆకెళ్ళ శ్రీనివాసరావు
చాలా బావుంది, ఆనాటి దృశ్యాలు కళ్ళకి కట్టినట్లుగావున్నాయి . ఆ నాటి photos అంత జాగ్రత్తగా ఉంచి మా అందరితో పంచుకుంటున్న మీకృషి అభినందనీయం.
Sambasivarao Thota
SrinivasaRao Garu!
Thank you very much for your observations and appreciation ,
Which I always cherish
Sambasivarao Thota
Nice sir
From
Sri Venkateswarlu D
Guntur
rao_m_v@yahoo.com
It is amazing that you retained such old photographs, and newspaper clippings of the time. You seem to be sincere and corruption does not seem to exist – is it true that even now things are generally corruption free? Difficult to believe.
Sambasivarao Thota
Sri M N Rao Garu!
Thank you very much for your observations and appreciation..
which I always cherish
Sambasivarao Thota
మీ అనుభవాలను కళ్ళకు కట్టినట్లు వ్రాశారు. గ్రామీణాభిృద్ధికి మీ చేసిన సేవలు అమోఘం, మరువ రానిది. అభివందనాలు.
From
Sri VenkobaRao
Hyderabad
Sambasivarao Thota
VenkobaRao Garu!
Dhanyavaadaalandi
Sambasivarao Thota
Very nice.
From
Sri RamanaMurthy
Visakhapattanam
Sambasivarao Thota
RamanaMurthy!
Thank you very much
Sambasivarao Thota
Meeanubhavalanni chakkaga varnicharu. Pata photolu yamta jagrattagadacharu miku abhinandanalum
From
Smt.Seethakkaiah
Hyderabad
Sambasivarao Thota
Seethakkaiah!
Dhanyavaadaalu Akkaiah
Sambasivarao Thota
Very nice information Samba Siva Rao garu While I was working at RO Vijayawada as Chief Officer ( Rural Development ) Myself abd my other colleagues from Vizag had an opportunity to visit many places which were visited by the great freedom fighter SrinAllurinSeeta Tama Raju in Chintalpally mandal of Agency area I observed that the tribals were very honesty and straightforward but unfortunately they were being cheated by non tribals taking their ignorance and innocence as to the advantage of the non tribals
We had implemented dairy development scheme in Chintalpally area and made the milk chilling centre to run The scheme was very successfully implemented and recovery rate was also good
Thanks for taking back some past memories through ur article of ur experience
Regards
R Laxman Rao
Hyderabad
Sambasivarao Thota
LakshmanRao Garu!



Thank you very much for your observations and appreciation
I am so happy to know your services in tribal areas,by implementing the Dairy Development scheme for the economic upliftment of rural people,particularly tribals..
I am very glad that you have shared your experiences in those days..through your beautiful coments…
Thank you so much LakshmanaRao Garu
K. Sreenivasa moorthy
You are something different sir. That’s the reason you could keep all your records of achievement intact till today also. It will be a great experience working in rural areas at the beginning of the career when there is not much family responsibility and also your enthusiasm towards work and also getting helping hand from your colleagues and a appreciation pat from superiors. Great sir. God bless you and keep you and your family safe and healthy.
Sambasivarao Thota
SreenivasaMurthy Garu!
Thank you very much for your observations and appreciation..
I am inspired and encouraged by your affectionate words,which I always cherish and remember …
Dhanyavaadaalandi
Sambasivarao Thota
సాంబశివరావుగారూ,
ఈరోజు నాజీవనగమనంలో..చదివాను.ఆఖరి మూడు పేరాలవరకూ మీ బాంక్ కార్యక్రమాలు. తదుపరి మీస్వీయనుభవాలు. నాకు బాగా నచ్చింది. ధన్యవాదాలు.
From
Sri ARK Rao
Kurnool
Sambasivarao Thota
Ramakrishna Garu..



Thank you very much for your observations and appreciation …
I always need your encouragement..
Thank you so much Sir
K. Sreenivasa moorthy
Very well explained and also holding supportive documentary evidences till date is exceptional. Best wishes to you and your family and God bless you.
Sambasivarao Thota
SreenivasaMurthy Garu!
Dhanyavaadaalandi
డా.కె.ఎల్.వి.ప్రసాద్
గ్రామాభి వృద్ధి లో బ్యాంకు ల కీలక పాత్రను రూపొందించి, ఆమోదింప జేసి,అమలుపరచిన గొప్ప
పాత్ర మీది.
అల్లూరి ఉద్యమ ప్రదేశం లో మీకు పని చేసే అవకాశం
రావడం మీ అదృష్టం.
అభినందనలు రావు గారూ.
Sambasivarao Thota
Dr.Prasad Garu!
Thank you very much for your observations and appreciation..
Budagala Nagaraju
మామయ్య,
గ్రామాల అభివృద్ధి కొరకు మీ కృషి చాలా విలువ ఐనది.
అప్పటి ఫొటోస్ ఇప్పటికి ఉంచటం ఆశ్చర్యకరం.
మీ పై ఆఫీసర్స్ , తోటి ఉద్యోగులు, కస్టమర్స్ నేమ్స్ ఇంకా గుర్తు ఉండటం మీ యొక్క జ్ఞాపక శక్తి కి నిదర్శనం.
మీ ఉద్యోగ నిబద్ధత మా లాంటి వారికి ఎంతో ఆదర్శ ప్రాయం.
తరువాతి భాగం కోర్టుకు ఎదురు చూస్తూ….
నాగరాజు.
Sambasivarao Thota
Thank you very much Venkateswarlu Garu
Sambasivarao Thota
NagaRaju!
Thank you very much for your observations and appreciation..
Next episode kosam vatche Aadivaaram varakuAaagaali Mari
Sambasivarao Thota
ఈ వారం అప్పటి ఫొటోస్ ఇప్పటి వరకు మీ వద్ద ఉండటం చాలా గ్రేట్ మీ ముందు జాగ్రతకు ఇదే నిదర్శనం మీ ప్లాన్ ఆఫ్ జాబ్ ప్లాన్ ఆఫ్ ఫ్యూచరకు ఇదే నిదర్శనం hats off to you sir.
G yadagiri mahabuvabad
Sambasivarao Thota
Yadagiri Garu!
Dhanyavaadaalandi
Sambasivarao Thota
Vandebharathamatharam
From
Sri SrinivasaRao M
Hyderabad
Sambasivarao Thota
Vandebharathamatharam
Sambasivarao Thota
బ్లాక్ అండ్ వైట్ ఆ కాలం నాటి ఫొటోలతో మీరు రాసిన దొరగారి గమనం బాగుంది.
From
Smt.Prabha Shasthry
Mysore
Sambasivarao Thota
Prabha Sastry Garu!
Dhanyavaadaalandi
Sambasivarao Thota
From
Sri Shanmukhachary
Hyderabad
Sambasivarao Thota
Thanks Brother Shanmukhachary
Sambasivarao Thota
You are an instrument for rural development through AB . Good.
From
Sri Ramanaiah
Hyderabad
Sambasivarao Thota
Ramanaiah Garu!
Dhanyavaadaalandi
Sambasivarao Thota
మీ అకుంఠిత దీక్ష, బ్యాంక్ ద్వారా ఇతరులకు సహాయం చెయ్యాలనే ఆకాంక్ష ఫలించిన రోజులు. జాగ్రత్తగా ఫోటో లు కూడా భద్ర పరిచారు..










శబాష్
సంతోషం గా ఉంటుంది, ఎందుకంటే మన బ్యాంక్ ఏవిధంగా ప్రజలకు సేవ చేసిందో తెలుసుకుంటే… అది కూడా మీలాంటి అధికారుల ద్వారా
దేవుడు మిమ్మలని ఎప్పుడు కాచి రక్షించాలని కోరుకుంటూ


From
Sri Ravi Ramana
Hyderabad
Sambasivarao Thota
RaviRamana Garu!

Thank you very much for your observations and appreciation,which I always cherish..
Mee abhimaanaaniki hrudayapoorvaka Dhanyavaadaalandi
I sincerely need your encouragement for forwarding in my writing efforts..
Thanks Andi
Sambasivarao Thota
Superb mamaiah . I worked as sr manager at Gollaprolu branch for 3 years. In the year 1979; and me in 2019…
From
Mr.Ravi
Vijayawada
Sambasivarao Thota
Yes Ravi
Nice Coincidence
Thank you very much..
Sambasivarao Thota
Nice narration
From
Sri Sathyanarayana
Hyderabad
Sambasivarao Thota
Thanks Sathyanarayana Garu!
పాలేటి సుబ్బారావు
ఆనాటి సమగ్ర గ్రామీణాభివృద్ధి ప్రణాళిక లో భాగంగా మీరు చేసిన కృషి ఫలితము మీకు ఎంతో ఆత్మ సంతృప్తినిచ్చి ఉంటుంది. అందుకనే, ఆనాటి ఫోటోలను, పేపర్ క్లిప్పింగ్ లను భద్రపరచుకుని ఇప్పుడు మా అందరికీ చూపించగలిగారు. ఆనాటి నుండే మీలో మంచి లీడర్షిప్ క్వాలిటీలు పెరిగి, తదుపరి లీడ్ డిస్ట్రిక్ట్ అధికారి అయి జిల్లాలనే అభివృద్ధి చేయగలిగే స్థాయికి ఎదిగారు. బ్యాంక్ లో మీ ఎదుగుదల మీ ప్రతిభ ఆధారంగానే జరిగింది అని నేను నమ్ముతున్నాను. అభినందనలు
Sambasivarao Thota
SubbaRao Garu!
Thank you so much for your observations and appreciation..
I am so thankful to you for your affectionate and encouraging words..
Dhanyavaadaalandi
Sambasivarao Thota
SubbaRao Garu!
Thadupari kaalamlo nenu Lead District Manager gaa raaninchadamlo naatho kalisi panichesina mee sahakaaram neneppatikee gurthunchukuntaanu..
Bhujanga rao
జీవనగమనం ఎపిసోడ్స్ చాలా ఆసక్తిగా సాగుతున్నాయి. 1979 సంవత్సరం లో చేబ్రోలు గ్రామస్థులతో,నిర్వహించిన సభ మరియు రాత్రివేళ చలన చిత్ర ప్రదర్శన నిర్వహించిన సంక్షేమ పథకాల అమలు గురించి,అందుకు అర్హులైన వారిని సహాయకులుగా ఏర్పరచుకున్న విధానం బాగుంది.ఈనాడు దిన పత్రికలో ఆనాటి కార్యక్రమాల ప్రచురణ,ఫొటోలు కళ్ళకు కట్టినట్టుగా ఉన్నాయి.ఆ ఫోటోలు జాగ్రత్తగా ఉంచి మాతో పంచుకున్న కృషికి అభినందనలు. మన దగ్గర ఎంత విజ్ఞానం ఉన్నదన్నది ముఖ్యం కాదు,ఉన్నదాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాము అన్నది ముఖ్యమని నిరూపించారు.అల్లూరి సీతారామరాజు వారి రణ క్షేత్రములో పని చేసే అవకాశం రావడం మీ అదృష్టం సర్.ధన్యవాదములు.
Sambasivarao Thota
BhujangaRao Garu!
Thank you very much for your understanding..
Your detailed analysis of the episodes,is so impressive and encouraging..
Your affectionate words made me so happy and satisfied..
Dhanyavaadaalandi
Sambasivarao Thota
Very nice presentation
With photos too.
Past experience presented very well.
While reading felt as if I am reading a story.
Thanks for sharing
Regards
Sri Seshumohan
Hyderabad
Sambasivarao Thota
Seshumohan Garu!
Dhanyavaadaalandi
Sambasivarao Thota
Excellent Anna
From
Sri ChristaChaari
Hyderabad
Sambasivarao Thota
ChristaChaari Garu!
Thank you very much Brother
Sambasivarao Thota
Simply superb, it seems ur own experience rather than ur writings.






From
Sri ButchiRaju
Hyderabad
Sambasivarao Thota
Thank you very much ButchiRaju Garu
Yes…
My own experiences…
Sambasivarao Thota
సాంబశివ రావు గారు, మీరు గ్రామీణ ఉఫాధి పథకం ద్వారా చేసిన కృషి అమోఘం . అప్పటి ఫోటోలను మీరు జాగ్రత్తగా ఉంచటంవల్ల ఈరోజు మాఅందరికి చూసే అవకాశం కలిగింది . ధన్యవాదములు.
From
Sri NagaLingeswararao
Hyderabad
Sambasivarao Thota
NagaLingeswararao Garu!
Dhanyavaadaalandi
Kusharani
Really you are superb
sambasiva rao garu.That golden days memories together with black & white photos & paper clips maintaing till today that is 20yrs back record. Usually people when shifting from one place to other they used to clear off
the old record though personally we are against family members likes to avoid the old ones. So in this matter your family members also supported you.For their cooperation they are also eligible for half your good wishes.
. “Jai Kiran Jai Jawan”.
Regarding your carrier ,by solving farmer’s financial problems in gentleway&
Smoothly is nothing but indirectly serving the country India
Right choice of selecting accodemic
Carrier & suitable propession for selected course. It is all God’s gift. You acquired full self satisfaction. What more required in life
Now also you are helping Sr.citizens during this crisis “carina lockdown” together with your recollections they also recollection their golden days thus for a while coming out of present crisis.
Anyhow once again I am appreciating your memory power & communication skills& for your comman on telugu language.
I wish all the best for your future
Writings also.
Sambasivarao Thota
Usha Garu!
Thank you very much for your observations and appreciation…
Your indepth analysis of the episodes,is so practical and perfect..
I should specifically thank you for your time and understanding..
As you rightly said,but for the cooperation and support from my family members,I would not have succeeded in my attempts to reach my goals…
Because of the opportunities extended to me by my Bank, I could derive the Geatest Job Satisfaction…
A small clarification,the records and photos pertain to the year 1979..
happenings of 42 years back…
Thank you so much for your affectionate words,which I always cherish..
Sambasivarao Thota
ఈ రోజే చదివాను.మీరు చేసిన పని తీరు అద్భుతం.మీ అనుభవాలు మాకు చూపించినందుకు థాంక్స్
From
Mrs.Kasturi Devi
Hyderabad
Sambasivarao Thota
Kasturi Devi Garu!
Dhanyavaadaalandi
Sambasivarao Thota
Narration of your experience is wonderful. These narratives will help young bankers to mould their careers if published in bank’s journal. You may try Sambasiva Rao Garu.
From
Mrs.Mahalakshmi
Hyderabad
Sambasivarao Thota
MahaLakshmi Garu!

Thank you very much for your observations and appreciation
Your suggestion is very good and what you have told is quite correct..
Thanks Andi…..
Thanks for your time and response..
Naccaw Sudhacaraw Rau
The glorious role in the comprehensive development of villages, adoption of a village, identification of the areas for improvement, and the project work, involvement of all the stakeholders and the establishment of new branch es are interesting to note the role and relevance of banking in the development
Nice to learn the responsibilities of bank officials in the growth and prosperity of our villages..
Jhansi koppisetty
సాంబశివరావు గారూ, గ్రామాభివృద్ధి కొరకు మీ కృషి అభినందనీయం… Good episode well narrated

