23
1981 సంవత్సరం జూలై నెలలో రాష్ట్రంలో పని చేస్తున్న వివిధ కర్షక సేవా సహకార సంఘాల మేనేజింగ్ డైరక్టర్లందరికీ, హైదరాబాద్ సకలార్థ సహకార శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో, ములకనూరు సహకార గ్రామీణ బ్యాంకులో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఆ సమావేశంలో రాష్ట్రంలోని కర్షక సేవా సహకార సంఘాలన్నింటి పనితీరును అధ్యయనం చేశారు. ములకనూరు సహకార గ్రామీణ బ్యాంకు అధ్యక్షులు శ్రీ ఎ.కె. విశ్వనాథరెడ్డి గారు, ఇతర అధికారులు ఆ సమావేశంలో పాల్గొని, వారి బ్యాంకు ఈ స్థాయికి చేరుకోవడంలో, వారి సుదీర్ఘ అనుభవాలను మా అందరికీ వివరించారు. వారి అనుభవ పాఠాలు మా అందరిలో ఎంతో స్ఫూర్తిని నింపాయి. మా ఆత్మస్థైర్యాన్ని పదింతలు పెంచాయి. పర్యవసానంగా ములకనూరు సహకార గ్రామీణ బ్యాంకులా అభివృద్ధి పరచలేకపోయినా, ఆ బ్యాంకును ఆదర్శంగా తీసుకుని, కురవి కర్షక సేవా సహకార సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనే బలీయమైన కోరికకు, అప్పుడే బీజం పడింది నా మనసులో.
చివరిగా రాష్ట్రంలోని కర్షక సేవా సహకార సంఘాల పనితీరుపై జరిపిన సమీక్షలో, ముందుగా నిర్ణయించిన ప్రామాణికాలను బట్టి, కురవి కర్షక సేవా సహకార సంఘం రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచింది. అప్పుడే నాకంటూ ఓ లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నాను. కురవి కర్షక సేవా సహకార సంఘంలో, నా పదవీ కాలం ముగిసే లోపు, ఆ సంఘాన్ని రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలబెట్టాలనే దృఢ సంకల్పం నా అంతరంగంలో నిశ్చయమైంది.
24
1981 సంవత్సరం సెప్టెంబరు నెలలో… సంఘ పరిధిలోని గ్రామాల్లో వున్న గొర్రెల మందల్లో, గాలికుంటు వ్యాధి (ఫుట్ అండ్ మౌత్ డిసీజ్) అనే భయంకరమైన వ్యాధి ప్రబలింది. ఆ వ్యాధి సోకిన గొర్రెలు వందల సంఖ్యలో మృతి చెందాయి. ఆ జబ్బు అతి త్వరితగతిన వ్యాపిస్తూ మిగతా గొర్రెలకూ కూడా పాకుతుంది.
ఆ విపత్కర పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున, జిల్లా పశు సంవర్ధక శాఖ నుండి వెటరనరీ డాక్టర్లు, ఇతర సంబంధిత అధికారులు, సిబ్బంది, గ్రామాల్లో పర్యటిస్తూ, ఆ జబ్బు వ్యాప్తిని అరికట్టేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నారు.


వారికి అండగా, మా వంతు బాధ్యతగా, మా సంఘం తరఫున వారికి సంపూర్ణ సహకారం అందజేయాలనుకున్నాము. వారందరూ ఉండేందుకు తగిన బస, భోజన సదుపాయాలు ఏర్పాటు చేశాము. అలా వారి కెలాంటి అసౌకర్యాలు లేకుండా మా సంఘం సిబ్బంది, పాలకవర్గ సభ్యులు, అందరం దగ్గరుండి చూసుకున్నాము.
అప్పటికే వ్యాధి బారిన పడిన గొర్రెలను క్వారంటైన్లో వుంచి, మృత్యువాత పడకుండా మందులు వాడారు. మిగతా గొర్రెలకు మందులు వాడుతూ, ముందు జాగ్రత్తగా వ్యాధి నిరోధక చర్యలను చేపట్టారు. ఫలితంగా గొర్రెలలో మరణాలను కట్టడి చేయగలిగారు. ఆ భయంకరమైన వ్యాధి మరింతగా వ్యాపించకుండా అడ్డుకట్ట వేయగలిగారు.
ఆ క్రమంలో కురవి కర్షక సేవా సహకార సంఘం యొక్క సహాయ సహకారాలను, చికిత్స చేయడానికి వచ్చిన వెటరనరీ డాక్టర్లు, ఇతర అధికారులు, సిబ్బంది… ఎంతగానో కొనియాడారు.
సంఘం పరిధి లోని గ్రామాల్లో ఎలాంటి కష్టాలు వచ్చినా,… సంఘం సేవాభావంతో ముందుకొచ్చి ఆదుకుంటున్న వైనాన్ని చూసిన గ్రామీణ ప్రజలు తమ సంతృప్తిని, సంతోషాన్ని వెలిబుచ్చారు.
25
1982 సంవత్సరం.
ఒక కర్షక సేవా సహకార సంఘాన్ని గొప్పగా అభివృద్ధి చేయాలనే ఆశయం నెరవేరాలంటే, ములకనూరు సహకార గ్రామీణ బ్యాంకును ఆదర్శంగా తీసుకోవాల్సిందే! నేను ఆ సహకార గ్రామీణ బ్యాంకును ప్రత్యక్షంగా చూడడమే కాకుండా, ఆ బ్యాంకు కార్యకలాపాలను బాగా అర్థం చేసుకున్నాను. వాటిని మా సంఘంలో అమలు చేయాలంటే, నేనొక్కడిని నిర్ణయించుకుంటే సరిపోదు. నాతో పాటు, మా సంఘ సిబ్బంది, పాలకవర్గ సభ్యులు కూడా నిర్ణయించుకోవాలి. వారందరూ కూడా ఆ సహకార గ్రామీణ బ్యాంకును సందర్శించాలి. ఆ బ్యాంకు కార్యకలాపాలను పరిశీలించాలి. వాటిని అర్థం చేసుకోవాలి. ఆ బ్యాంకును ఆదర్శంగా తీసుకుని, మన సంఘాన్ని కూడా బాగా అభివృద్ధి చేయాలనే ఆలోచనలు వాళ్ళ మనసుల్లో కలగాలి. అప్పుడే వారందరి సంపూర్ణ సహకారం నాకు తప్పకుండా దొరుకుతుంది. అప్పుడే కురవి కర్షక సేవా సహకార సంఘాన్ని గొప్పగా అభివృద్ధి చేయాలనే నా ఆశయ సాధనకు మార్గం సుగమం అవుతుంది.
అనుకున్నదే తడవుగా, కొంతమంది సిబ్బందిని, మరికొంతమంది అందుబాటులో ఉన్న పాలకవర్గ సభ్యుల్ని ములకనూరు సహకార గ్రామీణ బ్యాంకు సందర్శనకు తీసికెళ్ళడం జరిగింది. వాళ్ళంతా మరెంతోమంది ఆలోచనలను ప్రభావితం చేయగల సమర్థులు. వాళ్ళంతా ఆ బ్యాంకులో జరుగుతున్న దినసరి కార్యక్రమాలను కళ్ళారా చూడగలిగారు. ఆ తరువాత బ్యాంకు పరిధిలో వున్న గ్రామాలకు వెళ్ళి అక్కడి సభ్యులతో సంభాషించారు. ఆసియా ఖండంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతులను సొంతం చేసుకున్న సహకార గ్రామీణ బ్యాంకును చూసి చాలా సంతోషించారు. మన కర్షక సేవా సహకార సంఘాన్ని కూడా మరింతగా అభివృద్ధి చేయాలనే ఏకాభిప్రాయానికి వచ్చారు వాళ్ళంతా.
అందుకే అంటారు ‘సీయింగ్ ఈజ్ బిలీవింగ్’ అని!… ఆ తరువాత రోజుల్లో మా కర్షక సేవా సహకార సంఘం అభివృద్ధి కార్యక్రమాలు మరింతగా ఊపందుకున్నాయి. ఈ ఉరవడి ఇలాగే కొనసాగితే, రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో ఉన్న మా సంఘం, ప్రథమ స్థానానికి చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదని నాకనిపిస్తుంది.
26
రోజులు గడిచే కొద్దీ మా కర్షక సేవా సహకార సంఘంలో అధిక సంఖ్యలో సభ్యులుగా చేరారు. రైతులందరికీ పంట పెట్టుబడికి స్వల్పకాలిక ఋణాలు; ఎడ్లు కొనుక్కోడానికి, బావులు తవ్వుకోడానికి, ఎలక్ట్రిక్ మోటార్లు, ఆయిల్ ఇంజన్లు కొనుక్కోడానికి, స్ప్రేయర్లు, డస్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాలు కొనుక్కోడానికి, గేదెలు కొనుక్కోడానికి, గొర్రెల పెంపకానికి, కోళ్ళ పెంపకానికి మధ్యకాలిక ఋణాలు ఇవ్వడం జరుగుతుంది. రైతులతో పాటుగా చేతిపని వృత్తుల వారికి, చిరు వ్యాపారులకు మధ్యకాలిక ఋణాలు ఇవ్వడం జరుగుతుంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా షెడ్యూలు కులాల, షెడ్యూలు తెగల, వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంస్థలు, జిల్లా మహిళాభివృద్ధి సంస్థ, జిల్లా పరిశ్రమల శాఖ మొదలైన ప్రభుత్వ శాఖలు, సంఘ పరిధిలోని గ్రామాల్లో గుర్తించిన లబ్ధిదారులకు మధ్యకాలిక ఋణాలు మంజూరు చేయడం జరుగుతుంది.








మా సంఘం ద్వారా తీసుకున్న అప్పులు సద్వినియోగం చేసుకుంటూ, గ్రామీణ ప్రజలంతా ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో మా సంఘం ద్వారా సుమారు 1.20 కోట్ల రూపాయలు పంట పెట్టుబడికి స్వల్పకాలిక ఋణాలు సమకూర్చితే, పైన తెలుపబడిన ఇతర అవసరాల నిమిత్తం దాదాపు 1.10 కోట్ల రూపాయలు మధ్యకాలిక ఋణాలుగా మంజూరు చేయడం జరిగింది.
నిజానికి వ్యవసాయ రంగం, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే, స్వల్పకాలిక ఋణాలతో సమానంగా మధ్యకాలిక ఋణాలు ఇవ్వాల్సి వుందనేది నిర్వివాదాంశం.
ఆ క్రమంలో రాష్ట్రమంతటా తిరిగి, సహకార పరపతి సంఘాలు మధ్యకాలిక ఋణాలు ఇవ్వడంలో ఎదుర్కుంటున్న ఇబ్బందులు, వాటిని అధిగమించే మార్గాలు అన్వేషించేందుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకు, హైదరాబాద్ ఒక కమిటీని నియమించింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకు జనరల్ మేనేజరు శ్రీ యస్.వి.యస్. రాజు గారు, సకలార్థ సహకార సంఘాల సమాఖ్య, హైదరాబాద్ అధ్యక్షులు శ్రీ మామిడి రామారెడ్డి గారు, ములకనూరు సహకార గ్రామీణ బ్యాంకు అధ్యక్షులు మరియు సకలార్థ సహకార సంఘాల శిక్షణా సంస్థ, హైదరాబాద్, అధ్యక్షులు అయిన శ్రీ ఎ.కె. విశ్వనాథరెడ్డి గారు, ఆ కమిటీలో గౌరవ సభ్యులు.
కాని మన రాష్ట్రంలోని సహకార పరపతి సంఘాలన్నింటిలో, స్వల్పకాలిక, మధ్యకాలిక ఋణాల నిష్పత్తి సగటున 90:10 మాత్రమే వున్నట్టు ఆ కమిటీ గుర్తించింది.
ఆ కమిటీ తమ రాష్ట్ర పర్యటనలో భాగంగా 1982 సంవత్సరం మే నెలలో మా కర్షక సేవా సహకార సంఘానికి విచ్చేసింది. మా సంఘ కార్యకలాపాలను పరిశీలించిన మీదట, రాష్ట్రంలోని సహకార పరపతి సంఘాల్లో స్వల్పకాలిక, మధ్యకాలిక ఋణాల నిష్పత్తి సుమారు 90:10 వుండగా, అందుకు భిన్నంగా కురవి కర్షక సేవా సహకార సంఘంలో, ఆ నిష్పత్తి దాదాపు 1:1గా వుండడం గమనించింది ఆ కమిటీ. ఆహ్వానించదగిన ఈ పరిణామంతో కమిటీ సభ్యులు మిక్కిలిగా సంతోషించారు.


ఏ సహకార పరపతి సంఘ విజయానికైనా కొలబద్ద ఇచ్చిన ఋణాల వసూళ్ల శాతం. మరి మా సంఘంలో వసూళ్ల శాతం, 90 శాతంపైగా వుండడం గమనించిన కమిటీ సభ్యులు, మా కర్షక సేవా సహకార సంఘ మేనేజింగ్ డైరక్టర్ని, సిబ్బందిని, పాలకవర్గ సభ్యులని పరిపరి విధాలా అభినందించారు.
(మళ్ళీ కలుద్దాం)

ఆంధ్రాబ్యాంకు లో ప్రాంతీయ అధికారి హోదా లో ఉద్యోగ విరమణ చేసిన తరువాత , తన కెంతో ఇష్టమైన రచనా వ్యాసంగాన్ని ఎంచుకొని , కథలు,నాటికలు,నవలలు వ్రాస్తూ ముందుకెళ్తున్నారు.
57 Comments
Sambasivarao Thota
Ee roju SANCHKA lo , nenu vraashina “NAA JEEVANA GAMANAMLO “ ..21st episode prachrinchinanduku , Editor Sri MuraliKrishna Gaariki,Sri Somashankar Gaariki , thadithara Sanchika Team Sabhylandariki , naa hrudayapoorvaka kruthajnathalu …
Mee
Sambasivarao Thota
డా కె.ఎల్.వి.ప్రసాద్
బాగుంది.
అభినందనలు
రావు గారూ.
Sambasivarao Thota
Prasad Garu!
Dhanyavaadaalandi
Sagar
నిబద్దతతో చేసే పనికి ఫలితం ఎలా ఉంటుందో మీ రచన స్పష్టంగా వివరిస్తుంది ఇక్కడ. మొదటి స్దానానికి చేరుకోవాలనే మీ లక్ష్యమే ఇంత వృధ్ధికి కారణం అని చెప్పడంలో సందేహమే లేదు సర్ .మంచి అనుభవాలను అందిస్టున్న మీకు ధన్యవాదములు.
Sambasivarao Thota
Brother Sagar!
Mee aathmeeya spandanaku Dhanyavaadaalu
RAGHU PRASAD K
అనుభవాలను చక్కగా ఆసక్తికరంగా వివరిస్తున్న శ్రీ తోట సాంబశివరావు గారికి అభినందన పూర్వక ధన్యవాదములు
— BBG K RAGHU PRASAD
Sambasivarao Thota
RaghuPrasad Garu
Mee aathmeeya spandanaku Dhanyavaadaalandi
పాలేటి సుబ్బారావు
మీ విస్తారమైన అనుభవం, మీ కృషి ఫలితం కురవి కర్షక సేవా సహకార సంఘ అభివృద్ధికి బాగా సహకరించాయి. మొదటినుండీ, ఏ పని చేసినా, నెంబర్ వన్ గా ఉండాలనే తపన మీలో నిబిడీకృతమై ఉన్నది సాంబశివరావు గారూ. నిస్వార్థంగా, నిజాయితీగా పనిచేసే మీరు దొరకడం ఆంధ్రా బ్యాంక్ అదృష్టమే.
Sambasivarao Thota
SubbaRao Garu!
Nenu yedi cheyyagaliginaa,adi naaku Andhra Bank prasaadinchina avakaashaala valane ani nenu bhaavisthanu..
Mee aathmeeya spandanaku Dhanyavaadaalandi
Bhujanga rao
ముల్కనూరు సహకార గ్రామీన బ్యాంక్ ను ఆదర్శంగా తీసుకుని, కర్షక సేవ సహకార సంఘం కురవి రాష్ట్రంలో ప్రధమ స్థానంలో నిలబెట్టాలని మీ ధృడ సంకల్పం ప్రశంసనీయం.అందుకు పశు సంవర్ధక శాఖ మరియు సంబంధిత అధికారుల (గవర్నమెంట్ సహకారం)తో, మీరు మీ సిబ్బంది గ్రామాల్లో పర్యటిస్తూ,ఎప్పటికప్పుడు పరిస్థితులను నెమరు వేసుకుని ,అందుకు తగ్గ ఋణాలు ఇవ్వడమే కాకుండా ,ఇచ్చిన ఋణాలు వసూలు చేయడం అంతకంటే ముఖ్యమని భావించి 90% తక్కువ కాకుండా రికవరీ చేయడంలో విజయం సాధించారు. మంచి అనుభవాలు అందిస్తున్న మీకు దాన్యవాదములు.
Sambasivarao Thota
Dear Sambasiva Rao
U are the lucky man to get an opportunity to serve the rural people who are the backbone of the country . Well presented Sir about ur experience
Good luck
R Laxman Rao
Hyderabad
Sambasivarao Thota
LakshmanaRao Garu!
Mee aathmeeya spandanaku Dhanyavaadaalandi
Sambasivarao Thota
ఎంత విపులంగా కళ్ళకు కట్టినట్లు చూపావు సోదరా! నీ జ్ఞాపకశక్తికి జోహార్లు. మన ఆంధ్రా బ్యాంక్ వుండివుంటే, మ్యాజికార్ట్ లో ధారావాహికంగా సక్సెస్ స్టోరీ గా వేయించి ఉండేవాళ్ళం.
అభినందనలు
From
Sri Shanmukhachary
Hyderabad
Sambasivarao Thota
Brother Shanmukhachary!
Mee aathmeeya spandanaku Dhanyavaadaalu
Sambasivarao Thota
Your ambition to be No.1 made you to serve and uplift the living conditions of rural people through our Andhra Bank. Great job done.
From
Sri ChandrasekharReddy
Hyderabad
Sambasivarao Thota
ChandrasekharReddy Garu!
Mee aathmeeya spandanaku Dhanyavaadaalandi
Sambasivarao Thota
From
Sri BoseBabu
Hyderabad
Sambasivarao Thota
BoseBabu Garu!
Dhanyavaadaalandi
Sambasivarao Thota
సర్ చదివాను.మీ జ్ఞాపక శక్తికి హ్యాట్సాఫ్..స్వతహాగా మీకు రచన మీద అభిరుచి ఉండటంవల్ల ఏ విషయం మైనా పాఠకుడిని చదివించే శక్తి వచ్చింది.ఈ వయస్సులో మీ ఒపికకు శతకోటి వందనాలు. ప్రస్తుత టెక్నాలజీ నీ అందుకుని సాగటం చాలా ముదావహం.గత కాలపు ఫోటోలు ను జాగ్రత్తగా భద్రపరచి సమయానుకూలంగా వాటిని వినియోగించటం లో మీకున్న ప్లానింగ్ తెలుస్తుంది.మా తరానికి లేనిది అదే అని గుర్తు చేశారు.

నేను కూడా వృత్తి పరంగా 2 సార్లు ములకనురు వెళ్ళాను. విశ్వనాథ్ రెడ్డి గారి సేవలు,నాయకత్వ లక్షణాలు గురించి వినటమే గాని వారిని ప్రత్యక్షం గా చూడలేక పోయాను.వారి తరువాత దానిని తీర్చిదిద్దిన వారి అబ్బాయి Praveen Kumar రెడ్డి గారి నీ 2,3 సార్లు ఇంటర్వ్యూ చేశా.తరువాత వారు శాసన సభ సభ్యులు అయ్యారు.
మీ ఈ ఎపిసోడ్ తో నేనూ ఆ జ్ఞాపకాల దొంతర లో కి వెళ్లాను సర్.మీకు హదయపూర్వక నమస్సులు.
From
Sri Gopichand
Hyderabad
Sambasivarao Thota
Gopichand Garu!
Mee aathmeeya spandanaku Dhanyavaadaalandi
Mee jnaapakaalanu koodaa gurthu chesukunnaru..
Chaalaa Santhoshamandi …
Sambasivarao Thota
నిజం ! కొన్ని విషయాలు ప్రత్యక్షంగా చూస్తేనే మనకు అవగాహన వస్తుంది. అవతల వాళ్ల విజయ పంధా ఏమిటో మీరు అర్థం చేసుకుని అమలు చేయడం ముదావహం.



సాంబశివ రావు గారు…మీ ఉన్నత ఆలోచన విధానమే ..మీ విజయ రహస్యం…భేష్ భేష్


From
Sri RaviRamana
Hyderabad
Sambasivarao Thota
RaviRamana Garu!
Mee aathmeeya spandanaku Dhanyavaadaalandi
Sambasivarao Thota
Your role and efforts in development of co-op banks/societies was commendable sir.
From
Sri SuryachandraRao
Hyderabad
Sambasivarao Thota
SuryachandraRao Garu!
Mee aathmeeya spandanaku Dhanyavaadaalandi
Sambasivarao Thota
“Aanati patha madhuralanu” vintunna, choosthunna entha theeyaga, pasandhuga untundho..
“45 samvatcharala kritham na prasthanm”.. ” Korivi karshaka seva sahakara sangham, “GHANAPAATEELAINA” alanati marga dharshakulaina Sri. P. Ramakotaiah garu, Sri. T. Sambasiva Rao garu, Sri. N. Subba Rao gari vijaya param parala samputalanu, andhulo memu kuda pathra dharulamu ayinandhulaku santhoshamga, gargarvamga undhi.
Gathanni thirigi smaranaku thesthunnandhuku meeku Dhanyavaadhaalu.. Mee..
From
Sri Rammurthy
Mahabubabad
Sambasivarao Thota
Rammurthy Garu!
Mee aathmeeya spandanaku Dhanyavaadaalandi
K. Sreenivasa moorthy
Sambasiva rao garu you once again proved that dedication and hard work towards any assignment will show results definitely in case it is slow too but the end result is always a appreciated one.
Sambasivarao Thota
SreenivasaMurthy Garu!
Thank you very much for your affectionate comments
Bhujanga rao
ముల్కనూరు సహకార గ్రామీణ బ్యాంక్ ను ఆదర్శంగా తీసుకొని,కర్షక సేవా సహకార సంఘం కురవి రాష్ట్రంలో ప్రధమ స్థానంలో నిలబెట్టాలన్న మీ దృఢమైన సంకల్పం ప్రశంసనీయం.మీ స్ఫూర్తి భావి తరానికి ఒక ఆదర్శం. మీరు మీ సిబ్బంది,పశుసంవర్ధక శాఖ వెటర్నరీ డాక్టర్స్,ఇతర సంబంధిత అధికారులు(గవర్న్ మెంట్ వారి సహకారంతో) గ్రామాల్లో పర్యటిస్తూ, ఎప్పటికప్పుడు పరిస్తితులకు అనుగుణంగా కావాల్సిన వారికి ఋణాలు మంజూరు చేసి వారి అభివృద్ధికి కారకులై,ఋణాలు వసూలు చేయడం కూడా అంతకంటే ముఖ్యమని భావించి 90% తక్కువ కాకుండా రికవరీ చేసి ,సంఘం అభివృద్ధికి సహకరించి విజయం సాధించారు.మంచి అనుభావాలు జీవనగమనం ద్వారా అందిస్తున్న మీకు ధన్యవాదములు.
Sambasivarao Thota
BhujangaRao Garu!

Mee aathmeeya spandanaku Dhanyavaadaalandi
Mee analysis naakentho inspirational gaa vuntundi..
Thank you so much for your appreciation and encouragement..
Boddu Rattaiah
Experience of sri Thota Sambasivarao in cooperative sector has nicely presented . He innovatively giving his loans to middle term loans to the farmers.
As a good banker not only advances loans but also giving veterinary facilities to the poor people. Now the bankers are ignored this type of service to the public. Nicely…….
Sambasivarao Thota
Rattaiah Garu!
Mee aathmeeya spandanaku Dhanyavaadaalandi
Thank you so much for your understanding and appreciation..
Sambasivarao Thota
మీ అనుభవాలు, వాటి వివరణ, ఆసక్తికరంగా చెప్పేశైలికి మా అభినందనలు
— కొడాలి రఘు ప్రసాద్
Hyderabad
Sambasivarao Thota
RaghuPrasad Garu!
Dhanyavaadaalandi
Sambasivarao Thota
నిజాయితీగా పనిచేస్తే ఫలితం ఉంటుంది అని మీ అనుభవాలు తెలిపాయి అభినందనలు
From
Smt.Seethakkaiah
Hyderabad
Sambasivarao Thota
Dhanyavaadaalandi
Seethakkaiah
Sambasivarao Thota
Very nice episode..
It’s really surprising how you remember so many tiny details..
Great inputs to today’s Bankers..
Who used to take those pictures..?
From
Mr.RamaKrishna
Hyderabad
Sambasivarao Thota
Dear Ramakrishna,
Thank you very much for appreciating the episode…
In those days,only the photographer from the photo studio,used to take the photos..
Sambasivarao Thota
You have proved that you have strong will power.
From
Sri Sathyanarayana
Hyderabad
Sambasivarao Thota
Thank you very much Sathyanarayana Garu
Sambasivarao Thota
Ur narration is fine memories with available photos .
From
Sri VenkateswarReddy
Guntur and
Sambasivarao Thota
Thank you very much VenkateswarReddy Garu
Sambasivarao Thota
చాలా ఆసక్తి దాయకమైనన విషయం. మనీషికీ జంతువుకీ ఉన్న ముఖ్యమైన తేడా మనిషి స్వయంగా అనుభవించ కుండా మరొకరి అనుభవంతో.(non-participant observation) నేర్చుకోగల నేర్పే. నిప్పు ముట్టుకుంటే కాలుతుందన్న విషయం తెలియడానికీ అందరూ కాల్చుకునే అవసరం లేదు. ఈ విషయంలో ఆత్మకథలకి చాలిమంచి ఉపయోగం ఉంది. సహకార సంస్థలు ఎన్నో ప్రతి రోజూ విఫల మవడానికి కారణాలు బోధఫడుతాయి ఇలాటి పుస్తకాలవల్ల. ఇందులో ముఖ్యం వాటిమీద ప్రభుత్వ cooperative విభాగం పట్టు, ప్రేరితులైన (commited) అధికారులు లేకపోడం. రేషన్.కార్డుమీద అప్పులు, నిర్దేశకుల అవకతవకలూ (ఒకే గేదెమీద ఎన్నో ఆప్పలు), జనార్దన్ పూజారి లాటి ‘నాయకుల’ జోక్యం ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి. ఎవరినీ నొప్పించకుండా వీటి మీదరాయడానికి కావలసిన సామర్ధ్యం అరుదు. అదిమీరు చూపారు. జోహార్లు.
From
Sri Someswar
Hyderabad
Sambasivarao Thota
Someswar Garu!
Yentho anubhavamtho koodina mee maatalu , naakentho santhoshaanni kalaga jeshaayi..
Mee aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalu
Sambasivarao Thota
గురువు గారు తోట సాంబశివ రావు గారు మీ కథా సంచిక లు 16 నుండి 21 వరకు చదివాను. మంచి ఆసక్తికరంగా సరసమైన పదాలతో చక్కగ రాశారు. నేను హన్మకొండ సీనియర్ మేనేజరు గా చేస్తున్న టైంలో ఆ శాఖ కి అనుబంధంగా “” కాపుల కనపరితి రైతు సహకార సేవా సంఘం లో జరిగిన విషయాలు అన్నీ సినిమా రీల్ లా కంటి ముందు అలా గిర్రు నా తిరిగాయ్. సూపర్ సార్. అన్నీ గురుతు పెట్టుకుని ఫోటో లతో పాటు చక్కగ వివరిస్తూ కధనం చాల ఆసక్తి దాయకం గా రాసిన వైనం బహుధా అభినందనీయం. సూపర్…












జీవానందం, రిటైర్డ్, ఐఓబి
Hyderabad
Sambasivarao Thota
Jeevaanandam Garu!


Mee anubhavaalanu koodaa cheppinanduku chaalaa santhosham…
Thank you very much for your observations and appreciation
Mee aathmeeya spandanaku Dhanyavaadaalandi
Mee abhimaanaaniki paathrudanainanduku chaalaa aanandangaa vundandi…
Thank you once again..
Sambasivarao Thota
Hyderabad
Sambasivarao Thota
Jeevaanandam Garu!

Oka Nationalised Bank lo General Manager gaa retiraina Meeru,
Mee songs,mee simplicity,mee kalupugugolu thanam ,modatlone naakentho natchaayi..
Oka vishayam chepthe meeru nammuthaaro ledo kaani,mimmalni BBG lo cherpinchina Sudhakar gaarini ,mimmalni naaku parichayam cheyamani adigaanu thelusaa…
Tharuvaatha manamanthaa ilaa kalusukogaligaamu..
God is always Great Andi
Maro vishayam… ee madhyane mee gurinchi,nenu ,naa chirakaala mithrudu ,Dr.K L V Prasad,Dentist,Hanamkonda, maatlaadukunnaamu..
Ikapai ee chinna rachayitha rachanalannee Meeku thappakundaa cherathaayi..
Dhanyavaadaalandi
rao_m_v@yahoo.com
It is difficult to believe that in public sector banks such enthusiastic officers are there! Are you an exception? Gripping story! Hats off to your systematic collection of photos! May God bless you. Take care of your health. Trust you took both vax jabs.
Sambasivarao Thota
Sri MNRao Garu!
Thank you very much for your understanding and appreciation..
Your affectionate comments are highly inspirational to me..
Dhanyavaadaalandi
Sambasivarao Thota
Good effort
From
Sri RamanaMurthy
Vizag
Sambasivarao Thota
Thanks RamanaMurthy
P. Nagalingeswara Rao
సాంబశివ రావు గారు చాలా బాగుంది .మీ సేవా మరియు కృషి ఈనాటి తరానికి మార్గదర్శనం కావాలని కోరుకుంటాను. దన్యవాదములు
Sambasivarao Thota
NagaLingeswararao Garu!
Dhanyavaadaalandi
Sambasivarao Thota
చాలా బాగుంది సార్

From
Mrs.Bhavani
Hyderabad
Sambasivarao Thota
Bhavani Garu!
Dhanyavaadaalandi
Arunakar Macha
గురువు గారికి
. “నా జీవన గమనం లో ” 23,24,25 & 26 పుటలు మీ రచనలను చదివి చాలా సంతోషమయింది. సర్ నాకు గుర్తు లేకున్నా ఆనాటి సంగతులు తమరు వివరంగా తెలిపారు. నిజంగా మనం ఆ.బ్యా.క.సే.సం.కురవి రైతులకు, సభ్యులకు ఇతరులకు ఎన్ని విధాలుగా సహకారలు అందించాము: పంటరుణాలు, మధ్య దీర్ఘకాళిక రుణాలు వ్యవసాయ పనిముట్లు, ఎరువులు, క్రిమసంహారక మందులు, గ్రామీణ వృత్తి పనులవారికి పెట్టుబఫులు, ఆర్థిక బ్యాంక్ సహకారం వల్ల ముక్యంగా మీ అంకుట దీక్ష, కార్యనిర్వహణ కృషి వల్లనే ఇవ్వడం జరిగింది. కీ.శే.A.K. విశ్వనాదరెడ్డి, అధ్యక్షులు (ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంక్) వారి అడుగు జడలో పయనించి, హైదరాబాద్ సకలార్థ సహకార శిక్షణా సంస్థ, MSGB సమావేశం,మేడం శశి రాజగోపాలన్ ఆధ్వర్యంలో ముక్యంగా గౌ. నీ. శ్రీ మాలకొండారెడ్డి గారి ప్రేరణతో , సుదీర్ఘ అనుభవలతో నాడు మన సంఘాన్ని ఉన్నత శిఖరాలకు రధసారధి అయి నడిపించారు. అందుకే అప్పటి రాష్ట్రంలో మనం నెంబర్వన్ దరిలో ఉన్నాం. ఎవరు సాధించని రికవరి రేటును 90% సాదించాం. ఇదంతా మీ క్రెడిట్ సర్.
ధన్యవాదములు….
మీ అరుణాకర్ మచ్చ.
మానుకోట.