47
రెండో రోజు బస్సు దిగగానే, పొన్నూరు ఆంధ్రా బ్యాంకుకు వెళ్ళి, మేనేజర్ గారిని, సిబ్బందిని పరిచయం చేసుకున్నాను. మేనేజర్ శ్రీ కె.వి.యన్.యస్.యస్.ఆర్.కె.ప్రసాద్ గారు… చాలా సరదా మనిషి… మంచి స్నేహశీలి. కాసేపు ఇద్దరం బ్యాంకు గురించి, పొన్నూరు పట్టణం గురించి మాట్లాడుకున్నాము. తరువాత కలుద్దామని చెప్పి మా బ్రాంచికి వచ్చాను. ముందుగా బ్రాంచ్ ప్రొఫైల్ తెప్పించుకుని క్షుణ్ణంగా చదివాను. తరువాత, ఇన్స్పెక్షన్ రిపోర్టును, ఆ రిపోర్టుకు బ్రాంచి ఇచ్చిన రిప్లై రిపోర్టును, ఆసాంతం పరిశీలనాత్మకంగా చదివాను. తద్వారా బ్రాంచి గురించి సంపూర్ణంగా అర్థం చేసుకోగలిగాను.
పొన్నూరు శాఖ సాధారణ శాఖ. నిడుబ్రోలు శాఖ ఓ ప్రత్యేకమైన శాఖ.
‘గ్రామీణ పరపతి శాఖ’ మా నిడుబ్రోలు శాఖ. గ్రామీణ ప్రాంతాలలో నివసించే రైతాంగానికి, రైతు కూలీలకు, చేతి పని వృత్తుల వారికి, చిరువ్యాపారులకు, ఇతర ప్రభుత్వశాఖల సంక్షేమ పథకాల లబ్ధిదారులకు, విరివిగా ఋణ సదుపాయాలు కల్పించి, వారి ఆర్థికాభివృద్ధిని కాంక్షిస్తూ, ఆంధ్రా బ్యాంకు అనేక చోట్ల ఇలాంటి ప్రత్యేక శాఖలను తెరిచింది. అందులో నిడుబ్రోలు శాఖ ఒకటి. ఈ ప్రత్యేక శాఖ లన్నింటికీ, గ్రామీణాభివృద్ధి అధికారులను మాత్రమే మేనేజర్లుగా నియమిస్తారు. నా నేపథ్యం కూడా ఒక గ్రామీణ అభివృద్ధి అధికారే కాబట్టి, నన్ను ఈ ప్రత్యేక శాఖకు మేనేజర్‌గా పోస్టు చేశారు. మా బ్రాంచి ద్వారా చుట్టుపక్కల వున్న దాదాపు నలభై గ్రామాల్లో అధిక సంఖ్యాకులకు, అప్పులు ఇచ్చి, ఈ ప్రత్యేక శాఖను నెలకొల్పిన ఉద్దేశాన్ని నెరవేర్చడం జరిగింది. ఆ క్రమంలో ఋణ వసూళ్ళు కొంచెం మందగించి, బకాయిలు బాగా పేరుకుపోయాయి.
అప్పుడే ప్రక్కనే వున్న ఫోన్ రింగయింది.
“హలో సార్! నేను రీజినల్ మేనేజర్ గారి సెక్రటరీని… ఆర్.ఎమ్. గారు మీతో మాట్లాడతారట! లైన్లో వుండండి!”
“అలాగే నండి!”
“హలో!”
“నమస్కారం సార్!”
“ఆ నమస్కారం… ఎలా వున్నారు? బ్రాంచి ఎలా వుంది?”
“బాగున్నాను సార్! బ్రాంచి కూడా బాగానే వుంది సార్!”
“అవునయ్యా! అది మనకు ప్రిస్టీజియస్ బ్రాంచి… కానీ ఓవర్ డ్యూస్ చాలా ఎక్కువగా వున్నాయ్! నువ్ కూడా గమనించే వుంటావు!”
“అవున్సార్! చూశానండి!”
“మరి ఇప్పుడు ఆ బకాయిలను వసూలు చేయడం చాలా అవసరం. లేకపోతే అవి మరింతగా పెరిగిపోతాయ్!”
“అవున్సార్!”
“ముఖ్యంగా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నువ్ పని చేయాలి!”
“తప్పకుండా సార్! నా శక్తివంచన లేకుండా కృషి చేస్తాను సార్! ఈపాటికే రికవరీ సీజన్ కూడా అయిపోయింది. ఇప్పుడు అప్పులు అవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి, వచ్చే సంవత్సరం రికవరీ సీజన్లో, అంటే జూన్, 1987 కల్లా ఓవర్ డ్యూస్ రికవరీలో మంచి ప్రోగ్రెస్ చూపిస్తాను సార్!”
“నీ మీద నాకు నమ్మకం ఉంది. నువ్ సాధించగలవ్!… గో ఎహెడ్… ఆల్ ది బెస్టయ్యా!”
“థాంక్స్ అండీ!”
“వుంటాను మరి!”
“నమస్తే సార్!”
రిసీవర్ పెట్టేసి కాసేపు దీర్ఘంగా ఆలోచించాను. అప్పుడే… నా కంటూ, ఓ లక్ష్యం, నా కళ్ళెదుట సాక్షాత్కరించింది. అదే… అప్పుల వసూళ్ళలో అభివృద్ధిని సాధించాలి… యస్… డిపాజిట్ల సేకరణ, ఋణ వితరణ, ఖాతాదారుల సేవ, మొదలైన వాటికి ప్రాముఖ్యతనిస్తూనే, అప్పుల వసూళ్ళకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం వుందని నాకవగతమైంది.
ఆంధ్రా బ్యాంకు కర్షక సేవా సహకర సంఘం, కురవిలో; ఆంధ్రా బ్యాంకు మహబూబూబాద్ శాఖలో వ్యవసాయ ఋణాల్లో 90 శాతంపైగా వసూళ్ళను సాధించిన నా గత అనుభవం ఇక్కడ తప్పక ఉపయోగపడుతుంది. బహుశా… అందుకే నన్ను ఇక్కడ మేనేజర్‌గా పోస్ట్ చేసి ఉంటారేమో! ఏది ఏమైనప్పటికీ… ఇదొక మంచి అవకాశంగా తీసుకొని, వసూళ్ళలో మంచి ఫలితాలు సాధించాలి! అదే… ఇప్పుడు నా ముందున్న లక్ష్యం!!!
48
ఇప్పుడు మొట్టమొదటిగా నేను చేయాల్సింది… ఒక మంచి ఇల్లు అద్దెకు తీసుకోవాలి. ఆరా తీయగా, నా కంటే ముందు ఈ బ్రాంచిలో పని చేసిన మేనేజర్ గారు నేతాజీనగర్‌లో వుండేవారట! వారు ఖాళీ చేసిన ఇల్లు ఇంకా ఖాళీగా వుందని తెలిసింది. ఆ ఇల్లు బ్రాంచికి చాలా దగ్గరలోనే వుంది. వెళ్ళి చూశాను. బాగుంది. మాకు సరిగ్గా సరిపోతుంది. అడ్వాన్సు ఇచ్చి, ఓ వారం రోజుల్లో వచ్చి చేరుతామని చెప్పాను.
ఆ వారాంతం నుండి జాయినింగ్ టైం వాడుకున్నాను. మహబూబాబాద్ వెళ్ళి, మా పిల్లల స్కూళ్లల్లో టీ.సీ.లు తీసుకొని, ఇంటి సామాన్లను నిడుబ్రోలు అద్దె ఇంట్లోకి చేర్పించాను. భార్యాపిల్లలు కూడా నాతో వచ్చారు. సామాన్లన్నీ సర్దుకున్నాము. ఒక నెలకు సరిపడా కిరాణా సామానులు కొనుక్కున్నాము. ఇంటికి సమీపంలోనే కూరగాయల మార్కెట్టు వుంది. ప్రతి రోజూ ఉదయం పూట వెళ్ళి అవసరమైనవి కొనుక్కోవచ్చు. పిల్లలిద్దర్నీ… స్థానికంగా వున్న సెయింట్ ఆన్స్ కాన్వెంట్ స్కూల్లో చేర్పించాను. మొత్తానికి కుటుంబపరంగా సెటిల్ అయినట్లే. ఇక బ్యాంకులో నా విధి నిర్వహణపై మనసు లగ్నం చేయాలి…
49
ఆ రోజు ముందుగా, సబ్ మేనేజర్ అమర్నాధ్ గారిని క్యాబిన్లోకి పిలిపించాను.
“చూడండి! అమర్నాధ్ గారూ! మన బ్రాంచి ఓవర్ డ్యూస్ చాలా ఎక్కువగా వున్నాయి. వాటిని వసూలు చేయడంలో మనమంతా ప్రత్యేక శ్రద్ధ చూపించాలి!”
“చెప్పండి సార్! అందుకు నన్నేం చేయమంటే అది చేస్తాను!”
“గుడ్! మీరు చేయాల్సిందల్లా… నేను బ్రాంచి బిజినెస్ డెవలప్మెంట్ కోసం, ఋణాల వసూళ్ళ కొరకు గ్రామాలు తిరుగుతుంటాను. అంటే, ఎక్కువ టైం బ్రాంచ్ బయటే వుండాల్సి వస్తుంది. అప్పుడు బ్రాంచిని జాగ్రత్తగా చూసుకోవాలి. అటు సిబ్బంది నుండి గాని, ఇటు ఖాతాదారుల నుండి గాని ఏ విధమైన ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా మన పై అధికారుల నుండి మన బ్రాంచి గురించి ఒక్క రిమార్కు కూడా రాకుండా చూసుకోవాలి. మీకు అలవి కాని సమస్య ఏదైనా వస్తే నాకు చెప్పండి. నేను చూసుకుంటాను. ఏమంటారు?”
“ఆ విషయాల్లో మీరింకేమీ ఆలోచించకండి! బ్రాంచిని నాకొదిలేయండి! అంతా నేను చూసుకుంటాను! మీరనుకున్నట్లు మీరు చేయండి సార్!”
“థాంక్స్ అమర్నాధ్ గారూ! ఇక మీరెళ్ళి మీ పని చూస్కోండి!”
తరువాత బ్రాంచిలో పని చేస్తున్న ఇద్దరు గ్రామీణాభివృద్ధి అధికారులను క్యాబిన్లోకి పిలిపించాను. ఇద్దరూ వేరే వేరే బ్రాంచీలలో అగ్రికల్చరల్ క్లర్కులుగా వుండేవాళ్ళు. పదోన్నతిపై ఈ బ్రాంచికి వచ్చారు. పేర్లు శ్రీ జి. ప్రభాకరరెడ్డి, శ్రీ యమ్. రామకృష్ణ. ఇద్దరూ యువకులు, ఉత్సాహవంతులు. గ్రామీణ ప్రాంతాలలో అత్యధికంగా ఋణ వితరణ చేయడానికి పెట్టిన ప్రత్యేక శాఖ కాబట్టి ఒకరికి ఇద్దరు గ్రామీణ అభివృద్ధి అధికారులను ఈ బ్రాంచిలో పోస్ట్ చేశారు. ఇద్దరూ క్యాబిన్ లోకి వస్తూనే,
“నమస్కారం సార్!” ఒకేసారి చెప్పారు.
“నమస్కారం! రండి… కూర్చోండి! మీ ఇద్దర్నీ చూస్తుంటే ముచ్చటేస్తుందయ్యా!! జయ విజయుల్లాగా భలే వున్నారు! మీ ఇద్దరూ నా ప్రక్కన వుంటే ఏదైనా సాధించగలనని నాకనిపిస్తుంది! మరి మీరేమంటారు?”
“సార్! మీరు మా కంటే చాలా సీనియర్! అనుభవజ్ఞులు! మీతో కలిసి పని చేయడం మా అదృష్టం సార్!” అన్నాడు ప్రభాకర్ రెడ్డి.
“మీతో కలిసి పని చేస్తే, మీ నుండి మేమెంతో నేర్చుకోగలం సార్!” అన్నాడు రామకృష్ణ.
“సరే! మీకు నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బ్రాంచి గురించి మీకంతా తెలుసు. ప్రస్తుతం మన ముందున్న ప్రధాన సమస్య… ఓవర్ డ్యూస్… వాటి వసూలు… ఆ తరువాత బ్రాంచి బిజినెస్ డెవెలప్మెంట్!”
“మీరు చెప్పింది నిజమే సార్!”
“ముందుగా నేను మన బ్రాంచి పరిధిలోని నలభై గ్రామాలను చూడాలి. ఆ గ్రామాల సర్పంచులను, ప్రజా ప్రతినిధులను, గ్రామ పెద్దలను, రైతులను, ఇతర లబ్ధిదారులను కలుసుకోవాలి. అందుకోసం మీరెలా ప్లాన్ చేస్తారో చెప్పండి.”
“అలాగే సార్! ప్రతి రోజూ ఉదయం ఆరు గంటలకు బయలుదేరుదాం సార్! మధ్యాహ్నం రెండు గంటల కల్లా బ్రాంచికి వచ్చేద్దాం సార్!”
“గుడ్! మరి రేపట్నించే మొదలుపెడదామా!”
“ఓ.కే. సార్! రేపట్నించే!”
(మళ్ళీ కలుద్దాం)

ఆంధ్రాబ్యాంకు లో ప్రాంతీయ అధికారి హోదా లో ఉద్యోగ విరమణ చేసిన తరువాత , తన కెంతో ఇష్టమైన రచనా వ్యాసంగాన్ని ఎంచుకొని , కథలు,నాటికలు,నవలలు వ్రాస్తూ ముందుకెళ్తున్నారు.
65 Comments
Sambasiva+Rao+Thota
Ee roju SANCHKA lo , nenu vraashina “NAA JEEVANA GAMANAMLO “ ..28th episode prachrinchinanduku , Editor Sri MuraliKrishna Gaariki,Sri Somashankar Gaariki , thadithara Sanchika Team Sabhylandariki , naa hrudayapoorvaka kruthajnathalu …
Mee
Sambasiva Rao Thota
Sagar
చేయాలనుకున్న పని పూర్తిచేసే మీ కార్యదక్షత మీ రచనలోనే తెలుస్తుంది సర్. నిజమే మీరన్నట్లు మీ అనుభవాన్ని దృష్టీలో పెట్టుకుని ఈ బ్రాంచికి పోష్ట్ చేశారని తెలుస్తుంది. మంచి అనుభవాలను అందిస్తున్న మీకు అభినందనలు మరియు ధన్యవాదములు సర్
Sambasiva+Rao+Thota
Brother Sagar!
Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalu…
Thank you very much for your encouragement and appreciation
Paleti Subba Rao
తన సహోద్యోగులను ఎలా కార్యోన్ముఖులను చేయాలో మీకు బాగా తెలుసు సాంబశివరావు గారూ. వారిని సరిగా వెన్నుతట్టి ప్రోత్సహించడంలోనే సగం విజయం సాధిస్తారు మీరు. కొంతమంది అధికార్లు అంతా తమ గుప్పిట్లోనే ఉండాలని, ఘనత అంతా తమకే దక్కాలని భావిస్తూ, సహోద్యోగుల సమర్ధతను సరిగా ఉపయోగించుకోరు. అందరినీ కలుపుకుని పోతూ పనిచేస్తే అఖండ విజయం సాధించవచ్చనే మీ విశ్వాసమే మీ సక్సెస్ కు కారణం సాంబశివరావు గారూ.
Sambasiva+Rao+Thota
SubbaRao Garu!
Meeru cheppina vishayalu akshara sathyaalu..
Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalandi
డా.కె.ఎల్.వి.ప్రసాద్
బ్యాంకు ను అభివృద్ధి పథంలో నడిపే విషయంలో
అధికారులు మిమ్మల్ని ఒక బాధ్యత గల ఆఫీసర్ గా గుర్తించారు.దానికి అనుగుణంగా నే మీ సేవలు
విస్తరించే అవకాశం మీకు కలిగింది.
అభినందనలు సాంబశివ రావు గారూ.
Sambasiva+Rao+Thota
Prasad Garu!
Meeru cheppina vishayalu nizamgaa sathyaalu ..
Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalandi
K. Sreenivasa moorthy
Good morning Sambasiva Rao garu. Your acceptance to work and working with staff is definitely a unique one. As deposits and advances are both needed for development of a branch, recovery of overdues is also a big task and show lot of impact on the profitability of a branch.
Sambasiva+Rao+Thota
SreenivasaMurthy Garu!
Meeru cheppina vishayalu chaalaa ardhavamthamgaa vunnaayi..
Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalandi
Arunakar Macha
గురువు గారికి నమస్తే
, నా జీవన గమనంలో… ఎపిసోడ్ 28, సంచిక తెలుగు సాహిత్య వేదిక వెబ్ పత్రిక లో తమరి రచన చాలా బాగుంది. మీరు మానుకోట వీడినా కురవి సంఘాన్ని & ఆంధ్రా బ్యాంక్ ను మరవకుండా ఇక్కడి అనుభవ స్పూర్తితో, అనుభవం తోడై పొన్నూరు AB పరిధిలో మీ నేపథ్యంలో “గ్రామీణ పరపతి శాఖ” నిడు బ్రోలు నందు, గ్రామీణ అభివృద్ధి అధికారిగా మీ సేవలు మరువరానివి. గురువుగారు శ్రీ KVNSSRK ప్రసాద్ గారి చంతాడంట పేరును బలే గుర్తు పెట్టుకున్నారు. మీ జ్ఞాపకాశక్తి అమోఘం. అందుకే మీ ఆంధ్రా బ్యాంక్ ఉద్యోగ గమనంలో, సహచరులను మరిచి పోకుండా, అనుభవా లను ప్రతి విషయాన్ని తెలియచేయడం అద్భుతం. 
అరుణాకర్ మచ్చ మానుకోట.
Sambasiva+Rao+Thota
Dear Arunakar!
Episode ni poorthigaa chadivi meeru spandinchina vidhaanam naakentho natchindi..
Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalu
K Venkoba Rao
It is essential to motivate concerned staff either for recovery of overdue loans or Business development. You had the perfect plan for execution. You did well in taking the services of the staff and we’re successful in your assignment.
Congratulations Sir
Sambasiva+Rao+Thota
VenkobaRao Garu !
Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalandi
K Venkoba Rao
You were successful in your efforts with best planning.
Sambasiva+Rao+Thota
VenkobaRao Garu!
Thank you very much for your observations encouragement and appreciation
Sambasiva+Rao+Thota
Good Manager …
From
Sri RaviRamana
Hyderabad
Sambasiva+Rao+Thota
Thank you very much Ramana Garu
Sambasiva+Rao+Thota
Very Convincing….
From
Sri RamanaMurthy
Vizag
Sambasiva+Rao+Thota
Thank you very much RamanaMurthy Garu
Sambasiva+Rao+Thota
Very Nice…
From
Sri Diljeeth
Hyderabad
Sambasiva+Rao+Thota
Thank you very much Diljeeth Jee
Sambasiva+Rao+Thota
Very Nice…
From
Sri Venkateswarlu
Guntur
Sambasiva+Rao+Thota
Thank you very much Venkateswarlu Garu
Sambasiva+Rao+Thota
Well narrated Sir Ur experience should motivate the younger generation of the bankers I feel it may be circulated to some of the young bankers of Andhra Bànk Union Bànk and others
R Laxman Rao
Hyderabad
Sambasiva+Rao+Thota
Lakshman Rao Garu!
Thank you very much for your affectionate comments and encouragement..
Your advice is very useful…
I shall certainly put efforts to implement your advice ,
Thanks Andi
Sambasiva+Rao+Thota
Mee experiences chala chakkaga pusaguchinattu vivaristunnaru kotha vallaki idi oka encyclopedia laantidi.


From
Sri RaghavendraRao
Hyderabad
Sambasiva+Rao+Thota
RaghvendraRao Garu!
Thank you very much for your appreciation and encouragement…
Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalandi
Sambasiva+Rao+Thota
Dear Sambasiva rao garu, prati vaaram… Naa jeevanagamanam lo chaduvutunnanu, really Excellent… Sukumar…Hyderabad
Sambasiva+Rao+Thota
Sukumar Garu!
Thank you very much Andi
Sambasiva+Rao+Thota
చాలా చక్కగా ఉంది. ఒక శాఖ కు అధిపతిగా, క్రింది ఉద్యోగులకు దిశ నిర్దేశించి వారి ద్వారా పనులు చేయించు కోవడం మనం అనుకున్న టార్గెట్ చేరుకోవడం ఉత్తముల లక్షణం. ఇది చేసి మీరు ఉత్తీర్ణులు అయ్యారు.
From
Sri VenkobaRao
Hyderabad
Sambasiva+Rao+Thota
VenkobaRao Garu!
Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalandi
Sambasiva+Rao+Thota
Super Uncle

Waiting to know how much do you make use of your young fellows
From
Mr.Leelaa Krishna
Tenali
Sambasiva+Rao+Thota
Sure Leelaa Krishna!!!
You will certainly know soon..
Sambasiva+Rao+Thota
Sir, very very interesting. Language is very simple and kept me absorbed completely. How to go through the earlier episodes.. Where to find the link.. Please let me know..
From
Sri Venkanna Babu
Hyderabad
Sambasiva+Rao+Thota
Venkanna Babu Garu!
Thank you very much for your encouragement and appreciation
Regarding earlier episodes I will guide you over phone..
Thanks Andi….
Sambasiva+Rao+Thota
అందరినీ కలుపుకని నడవటం మి లోని గొప్ప విషేశత మీకు ధన్యవాదాలు అన్నయగారు
From
Smt.Seethakkaiah
Hyderabad
Sambasiva+Rao+Thota
Seethakkaiah!
Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalu Akkaiah
Sambasiva+Rao+Thota
Sir
కళ్లకి కట్టినట్టు….
చాలా చక్కగా….ఉంధి
మీ రచన.
Interesting gaa
అభినందనలు
Krishnarao
Hyderabad
Facebook
Sambasiva+Rao+Thota
Krishna Rao Garu !
Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalandi
rao_m_v@yahoo.com
As usual an excellent and interesting narrative!
Sambasiva+Rao+Thota
Sri MN RAO GARU!
Thank you very much Sir
Sambasiva+Rao+Thota
Chkkaga saguthondi mee jeevana gamanam lo
From
Smt.Kasturi Devi
Hyderabad
Sambasiva+Rao+Thota
Kasturi Devi Garu!
Dhanyavaadaalandi
Bhujanga rao
జీవన గమనం 28 చదివాము బాగుంది.అనుకున్నది సాధించాలని ఒక దృఢమైన సంకల్పంతో అందరిని కలుపుకొని పోయి పనిచేస్తూ అఖండ విజయం సాధించవచ్చునని,ఏ పరిస్థితుల్లోనైన మన కర్తవ్యం గుర్తుంటే జరగాల్సిన పనులు అవే జరిగిపోతాయని మీకున్న నమ్మకమే మీ విజయానికి కారణం. మంచి అనుభవాలు అందిస్తున్న మీకు అభినందనలు మరియు ధన్యవాదములు సర్.
Sambasiva+Rao+Thota
BhujangaRao Garu!

Meeru cheppina vishayalu akshara sathyaalu
Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalu
Sambasiva+Rao+Thota
9866039460 M S RAMARAO

Dear Sambasiva Rao ji
The kind remembrances
of your bank every Sunday is excellent Let this be a source of guidance for
young new entrants in their careers REGARDS
Hyderabad
Sambasiva+Rao+Thota
RamaRao Garu!

Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalandi
Naapai mee abhimaanaanni ilaage konasaagisthoo naannu prothsahinchaalani manasaaraa korukuntunnaanu
Sambasiva+Rao+Thota
*Good Sir*


From
Sri ADV Prasad
Hyderabad
Sambasiva+Rao+Thota
Thank you very much Prasad Garu
Sambasiva+Rao+Thota
nice episode
From
Mr.Ramakrishna
Hyderabad
Sambasiva+Rao+Thota
Thank you very much Ramakrishna
Sambasiva+Rao+Thota
Manchi rachana
From
Sri Sathyanarayana
Hyderabad
Sambasiva+Rao+Thota
Thank you very much Sathyanarayana Garu
Sambasiva+Rao+Thota
అప్పు వసూలు మేనేజర్ గారూ,
రైతులకు ఇబ్బంది కలగకుండా మీ డబ్బు వసూలు చేసుకోండి. తొడపాసమ్ పెట్టకండి.
జోవి యల్ గా వ్రాసాను. మరేం అనుకోకండి.
మీతో కాస్త సరదాగా…
From
Sri ARK Rao
Kurnool
Sambasiva+Rao+Thota
ARK Rao Garu!
Parvaaledu..
Enjoy cheddaam..
Sambasiva+Rao+Thota
Your secret of your sucess is your ability to mingle and involve the staff members in recovery and business development. I presume that you have recovered the overdues of branch . P.Chandra Sekhar Reddy
Hyderabad
Sambasiva+Rao+Thota
ChandrasekharReddy Garu!
Meeru cheppina vishayalu akshara sathyaalu..
Mee anchanaalu nizamayye roju kosam eduruchooddaam…
Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalandi
Sambasiva+Rao+Thota
సాంబశివ రావు గారు నమస్కారములు.బ్యాంకు ఉద్యోగము లో పనిమీదవున్న మీ అంకితభావం మీ స్టాఫ్ తో కలిసి పోయి వాళ్ళతో పని చేయించగల సమర్ధత మరియు సమయస్ఫూర్తి కి నా దన్యవాదములు.
From
Sri NagaLingeswararao
Hyderabad
Sambasiva+Rao+Thota
NagaLingeswararao Garu!

Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalandi
Mee abhimaanaanni naapai ilaage konasaaginchaalani korukuntunnaanu
Sambasiva+Rao+Thota
మనిషికీ మాత్రమే మరొకరి అనుభవానుంచి నేర్చుకునే (non-participant observation) శక్తో ఉంది. చర్చీ, vicar, లేకపోయినా vicarious experience పొందవచ్చు. మీఆత్మకధ తోపాటు రమణి గారి ‘జీవనరమణీయం’ కూడా చదువడం నేను రాస్తున్న పుస్తకానికి లభంగా ఉంది
From
Sri Someswar
Sr.Writer
Bangalore
Sambasiva+Rao+Thota
Someswar Garu!
Naa anubhavaalu Meeku upayoga paduthunnanduku chaalaa santhoshamgaa vundi…
Dhanyavaadaalandi
Sambasiva+Rao+Thota
It is nice you remember all those things even today. Young people live in future. Senior people like us live in the past remencing. Great Sambasivaraogaru. If I have an opportunity, I will read it in a book form.
From
Sri HariPrasad
Hyderabad
Sambasiva+Rao+Thota
HariPrasad Garu!

Thank you very much for your encouragement and appreciation
Your desire to read the episodes in a book form,will be fulfilled,after completion of all the episodes
Sambasiva+Rao+Thota
చాల చక్కగ రాసారండి కొత్త శాఖ లో మీ అనుభవాలు. అభినందనలు.
From
Sri Jeevaanandam
Hyderabad
Sambasiva+Rao+Thota
Thank you very much Jeevaanandam Garu