91
అనుకున్నట్లే, ఉదయాన్నే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లో రాజమండ్రికి బయలుదేరాను. రాత్రంతా ఆలోచనలతో సతమతమయ్యానేమో, మధ్య మధ్యన కునుకుపట్టింది. ఇంతలో నిడదవోలు స్టేషన్లో ఆగింది రైలు. రైల్వే కాంటీన్‌కి వెళ్ళి భోజనం చేశాను. తిరిగి రైలు బయలుదేరింది. మరి కొద్ది గంటలలో రాజమండ్రి చేరుకోబోతున్నాను. నిజానికి రాజమండ్రి పట్టణం గురించి కొంత తెలిసినప్పటికి, చూడడం మాత్రం ఇదే మొదటిసారి. ఒకప్పుడు రాజమహేంద్రవరంగా పిలవబడిన చారిత్రాత్మక పట్టణమే ప్రస్తుత రాజమండ్రి. తూర్పు గోదావరి జిల్లాలో జిల్లా కేంద్రమైన కాకినాడ తరువాత, అతి పెద్ద పట్టణం అంటే రాజమండ్రే. అదియును గాక, తెలుగు భాషకు పుట్టినిల్లు రాజమండ్రి అంటారు. పవిత్ర గోదావరి నది ఒడ్డున విరాజిల్లుతున్న నగరం రాజమండ్రి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సాంస్కృతిక ముఖ్య పట్టణంగా, అభివర్ణిస్తారు రాజమండ్రిని. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులుగారి పుట్టినిల్లు రాజమండ్రి. ఆదికవి నన్నయ పుట్టింది కూడా రాజమండ్రిలోనే. తిక్కన మరియు ఎర్రన గార్లతో కలిసి సంస్కృత భాషలో ఉన్న మహాభారతాన్ని తెలుగులోకి అనువదించి, మనకందించిన మహానుభావుడు ఆదికవి నన్నయ.
అలా ఆలోచిస్తూ ప్రయాణిస్తుండగా, రైలు కొవ్వూరు దాటింది. అప్పుడే పెద్దగా శబ్దాలు చేస్తూ నడుస్తుంది రైలు. ఒక్కసారి ఉలిక్కిపడి చూస్తే, రైలు గోదావరి బ్రిడ్జి మీదకు ప్రవేశించింది. ఈ బ్రిడ్జి కొవ్వూరు రాజమండ్రి మధ్య, గోదావరి నదిపై, సుమారు 4.1 కిలోమీటర్లు పొడవున నిర్మించబడివుంది. విశేషమేమిటంటే, ఇది రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి. క్రింది భాగంలో రైల్వే బ్రిడ్జి, పై భాగంలో రోడ్ బ్రిడ్జి వుండడం ఓ ప్రత్యేకత.
భారతదేశంలోనే మూడవ అత్యంత పొడవైన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి, రాజమండ్రి బ్రిడ్జి. అస్సాం రాష్ట్రంలో దిబ్రుగర్ జిల్లాలోని, బ్రహ్మాపుత్ర నదిపై నిర్మించబడిన బోగీబీల్ రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి మన దేశంలో కెల్లా ఒకటవ అత్యంత పొడవైన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి. బీహార్ రాష్ట్రంలో గంగానదిపై నిర్మింపబడిన దిఘా సోన్పూర్ బ్రిడ్జి, దేశంలో కెల్లా రెండవ అత్యంత పొడవైన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి.
అలా రాజమండ్రి బ్రిడ్జిపైన ప్రయాణిస్తూ, దిగువన పరుగులు తీస్తున్న గోదావరీ నదీ ప్రవాహాన్ని వీక్షించడం ఓ మధురానుభూతి.
అంతలోనే తోటి ప్రయాణీకులంతా, చిల్లర నాణాలను గోదావరి నదిలోకి విసురుతున్నారు.
“ఎందుకలా చేస్తున్నారు?” అని అమాయకంగా అడిగాను నేను. “అలా చేస్తే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి!” అని చెప్పారు వాళ్ళు.
వెంటనే నేను కూడా, నా జేబులోని చిల్లర నాణాలను చేతుల్లోకి తీసుకుని, గోదావరి నదీమతల్లికి మనసారా నమస్కరించి, “మేమంతా బాగుండాలి! మా అందరికీ అంతా మంచి జరగాలి!!” అని కోరుకుంటూ, ఆ నాణాలను కిటికీ గుండా నదిలోకి జారవిడిచాను.
కాసేపటికి రైలు రాజమండ్రి మెయిన్ స్టేషన్లో ఆగింది. రైలు దిగి దగ్గరలోనే వున్న హోటల్లో ఓ రూమ్ తీసుకుని, ఫ్రెష్ అప్ అయి, ఆంధ్ర బ్యాంకు రీజినల్ ఆఫీసుకు బయలుదేరాను.
92
రీజినల్ ఆఫీసుకు వెళ్ళి అక్కడ తేరిపార చూస్తే, అన్నీ కొత్త ముఖాలే! అందుకే సరాసరి రీజినల్ మేనేజర్ శ్రీ వై భాస్కరరావు గారి క్యాబిన్ లోకి నడిచి, ఆయనకు నమస్కరించి, నన్ను నేను పరిచయం చేసుకున్నాను. నన్ను సాదరంగా ఆహ్వానించిన రీజినల్ మేనేజర్ గారు…
“ఆ! రండి రండి! ఈరోజు మీరొస్తారని డి.జి.యం గారు చెప్పారు. సంతోషం! కూర్చోండి!” అంటూ ఎదురుగా వున్న కుర్చీ చూపించారు.
ఇద్దరం తేనీరు సేవించాము.
“ఆ! ఇప్పుడు మీతో కలిసి పనిచేయబోయేవారిని మీకు పరిచయం చేస్తానుండండి!” అని చెప్పి ఇంటర్కమ్లో సెక్రటరీతో మాట్లాడారు.
కాసేపటికి ముగ్గురు వ్యక్తులు క్యాబిన్లోకి వచ్చారు.
“ఆ! వీళ్ళే! మీతో కలిసి పనిచేయబోయేది! వీరు హరకృష్ణ, టెక్నికల్ ఆఫీసర్… వీరు జగన్నాధరాజు, మీలాగే గ్రామీణాభివృద్ధి అధికారి… ఇక వీరు శ్రీకాంత్, క్లర్క్/ స్టెనో టైపిస్ట్… ఇంకో అటెండర్ కూడా వస్తాడు! వీళ్ళంతా హేమాహేమీలు! మీకు మల్లే వీళ్ళని కూడా ఏరి కోరి ఎంపిక చేశాము! ఇక ఈ సరికొత్త సంస్థని మీ చేతుల్లో పెట్టబోతున్నాము. ఆ సంస్థ పేరుప్రతిష్ఠలు మీ మీదే ఆధారపడి ఉన్నాయ్!” అంటూ ఆర్.యమ్. గారు వాళ్ళందరినీ నాకు పరిచయం చేసి, పరోక్షంగా మాకు ఓ లక్ష్యాన్ని నిర్దేశించారు.
“సార్! మేమంతా కలిసి కష్టపడి పని చేస్తాము. మీరు మా మీద పెట్టిన బాధ్యతను నిష్ఠతో నిర్వహిస్తాము!” అంటూ మా అందరి తరఫున హామీ ఇచ్చాను నేను.
“వెరీ గుడ్! ఆల్ ది బెస్ట్! ఈ పూటకి ఒక పని చేయండి… మీరంతా కలిసి కూర్చుని, మాట్లాడుకుని, ప్రణాళికలు సిద్ధం చేసుకోండి! ఎటూ రేపు, హైదరాబాద్ నుండి డి.జి.యం మాలకొండారెడ్ది గారు వస్తారు! అప్పుడు మిగతా విషయాలు మాట్లాడుకుందాం! సరేనా!” అని చెప్పారు ఆర్.యమ్. గారు.
“అలాగే సార్!” అంటూ మేమంతా నిష్క్రమించాము.
రీజినల్ ఆఫీసులో అందర్నీ పరిచయం చేసుకున్న తరువాత, మేం నలుగురుం ఒక చోట కూర్చున్నాము. ఆ సంస్థ తాలూకూ ఫైల్‌ను ముందు పెట్టుకుని, సంస్థ స్థాపన ఉద్దేశాలను ఒక్కొక్కటిగా, కూలంకుషంగా చర్చించాము. ఆ ఉద్దేశాలను నెరవేర్చేందుకు మా ముందున్న అవకాశాలన్నింటిని ఒక ప్రణాళిక రూపంలో పొందుపరిచాము. ఏమైతేనేం, ఆ సంస్థ గురించి నాకు పూర్తి అవగాహన కలిగింది.
ఆ రోజు రాత్రి అల్పాహారంతో సరిపెట్టుకుని, నిద్రకు ఉపక్రమిస్తే, నాకు నిరాశే ఎదురైంది. ఆ సంస్థ గురించి నా మదిలో మెదిలే ఆలోచనలే అందుకు కారణం కాబోలు!
93
వాస్తవానికి ఆ సంస్థ పేరు ‘ఆంధ్రా బ్యాంకు గ్రామీణాభివృద్ధి సంస్థ’. పేరును బట్టే ఆ సంస్థ ఎందుకు స్థాపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు… గ్రామీణాభివృద్ధి అనేది నాకెంతో ఇష్టమైన అంశం అనే విషయం నాకే కాదు, నా పై అధికారులకు కూడా బాగా తెలుసు. ఎందుకంటే, ఉద్యోగ రీత్యా, ఎక్కడున్నా, ఏ హోదాలో వున్నా, నా విధి నిర్వహణలో గ్రామీణాభివృద్ధి ద్వారా గ్రామీణ ప్రాంతాలకు, గ్రామీణ ప్రజలకు, ప్రథమ ప్రయోజనం చేకూర్చాలనేదే, నా అభిమతం. ఆ మాటకొస్తే, నన్ను గ్రామీణాభివృద్ధి అధికారిగా, ఆంధ్రా బ్యాంకు నియమించుకుంది కూడా అందుకే కదా! ఇక ఈ సంస్థ ప్రత్యేకత గురించి చెప్పుకోవాలంటే, ఇదొక శిక్షణా సంస్థ. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపైన, గ్రామీణ ప్రజలకు వ్యవసాయ అనుబంధ రంగాల్లో… అంటే పాడి పరిశ్రమ, కోళ్ళ పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, ఇతర గ్రామీణ వృత్తులకు చెందిన పరిశ్రమలపైన, కుటీర పరిశ్రమల పైన… శిక్షణ ఇస్తారు.
అంటే… ఇది బ్యాంకు సిబ్బందికి శిక్షణనిచ్చే సంస్థ కాదు. బ్యాంకుల ద్వారా ఋణాలు పొందిన గ్రామీణ ప్రజలకు, ప్రభుత్వ పథకాల ద్వారా ఋణాలు పొందిన లబ్ధిదారులకు శిక్షణ ఇచ్చే సంస్థ ఈ సంస్థ. ఋణాలు పొందిన ఆయా అంశాల్లో శిక్షణ పొంది, తద్వారా ఆ పథకాల అమలు ద్వారా, అధిక దిగుబడిని, అధికోత్పత్తులను సాధించి, వాళ్ళంతా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే… ఆశయంతో స్థాపించబోతున్న సంస్థ ఈ సంస్థ.
ఒక్కో అంశంపై మూడు, నాలుగు రోజుల వరకు, తరగతి గదుల్లో, ఆయా అంశాలలో నిష్ణాతుల పర్యవేక్షణలో శిక్షణ, ఆ తరువాత క్షేత్ర సందర్శన, చక్కగా నడుస్తున్న యూనిట్ల సందర్శనాలతో సహా; శిక్షణలో పాల్గొన్నవారికి పరిపూర్ణమైన అవగాహన కలిగిస్తుంది ఈ సంస్థ. శిక్షణలో పాల్గొన్నవారికి రానుపోను ఛార్జీలు ఇవ్వడమే కాకుండా, శిక్షణా కాలంలో సంస్థ హాస్టల్లోనే వసతి, భోజన సదుపాయాలు కూడా ఉచితంగానే ఏర్పాటు చేస్తుంది ఈ సంస్థ.
ప్రస్తుతానికి ఉభయ గోదావరి జిల్లాల్లోని ఆంధ్రా బ్యాంకు శాఖల ద్వారా ఋణాలు పొందిన లబ్ధిదారులకు ఈ సంస్థలో శిక్షణ ఇస్తారు.
ఒక బ్యాంకు, ఇలాంటి సంస్థను నెలకొల్పడం, మన రాష్ట్రంలోనే కాదు… దేశంలోనే ప్రప్రథమం. అలాంటి సంస్థకు, నన్ను డైరక్టర్‌గా నియమించడం, నిజంగా, నా అదృష్టంగా భావిస్తున్నాను. డి.జి.యం. మాలకొండారెడ్డి గారు నన్ను ఆ పదవికి, ఎంతో నమ్మకంతో, ఎంపిక చేశారు. వారు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, నాకొచ్చిన ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ఆ సంస్థ అభివృద్ధికి నా శక్తివంచన లేకుండా, పని చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఇలా ఆలోచిస్తూ, ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో నాకే తెలియదు.
94
మరుసటి రోజు తెల్లవారు జామునే అలారం పెట్టుకుని లేచి తయారయ్యాను. రీజినల్ మేనేజర్ గారితో కలిసి, హైదరాబాద్ నుండి వస్తున్న డి.జి.యం గారిని రిసీవ్ చేసుకునేందుకు రాజమండ్రి రైల్వే స్టేషన్‌కి చేరుకున్నాను. ట్రయిన్ రైట్ టైమ్‌కే వచ్చింది. డి.జి.యం. గారిని తోడ్కొని అందరం హోటల్‌కి వెళ్ళాము. వారి తయారైన పిమ్మట అందరం కలిసి ఆ హోటల్లోనే బ్రేక్‌ఫాస్ట్ చేసి రీజినల్ ఆఫీసు చేరుకున్నాము. డి.జి.యమ్ మాలకొండారెడ్డి గారు ఆ నూతన సంస్థలో చేరబోతున్న మా అందరితో కలిసి, అప్పటి వరకు ఆ సంస్థలో జరుగుతున్న పనులపై ఓ సమీక్ష నిర్వహించారు. ఆ సందర్భంగా వారు మాట్లాడుతూ…
“నవంబర్ 14వ తారీఖున సంస్థను ప్రారంభించడానికి నిర్ణయం జరిగిందని తెలియజేయడానికి నేనెంతో సంతోషిస్తున్నాను. ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మన బ్యాంక్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ శ్రీ కె. ఆర్. నాయక్ గారు రాబోతున్నారు. వారి చేతుల మీదుగానే ఆ సంస్థ ప్రారంభించబడబోతోంది. ఈలోపు సంస్థ భవనానికి అవసరమైన రిపేర్లన్నీ పూర్తి చేయించి, రంగులు వేయించి, తోరణాలు కట్టించి, పూజా కార్యక్రమానికి ఏర్పాట్లు చేసుకుని, ఆ సంస్థ ప్రాంగణాన్ని, భవనాన్ని చక్కగా అలంకరించి ముస్తాబు చేయించాలి.
ఆ రోజు ఏదో ఒక శిక్షణా కార్యక్రమం కూడా తప్పకుండా ప్రారంభించబడాలి. కార్యక్రమ నిర్వహణలో ఎక్కడా చిన్నపాటి పొరపాట్లు కూడా దొర్లకుండా జాగ్రత్త పడాలి! ఇంకో ముఖ్యమైన విషయం! పత్రికా విలేఖరులను ఆహ్వానించడం మరవకండి! వివిధ పత్రికల్లో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం గురించి వస్తేనే అందరికీ ఈ సంస్థ గురించి తెలుస్తుంది! ఎక్కడా ఏ తేడా రాకుండా, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి!” అని చెప్తూ మా అందరికీ దిశానిర్దేశం చేశారు.
ఇక అక్కడి నుండి అందరం కలిసి సంస్థ ప్రారంభించబడే భవనం దగ్గరకి బయలుదేరాము.
(మళ్ళీ కలుద్దాం)

ఆంధ్రాబ్యాంకు లో ప్రాంతీయ అధికారి హోదా లో ఉద్యోగ విరమణ చేసిన తరువాత , తన కెంతో ఇష్టమైన రచనా వ్యాసంగాన్ని ఎంచుకొని , కథలు,నాటికలు,నవలలు వ్రాస్తూ ముందుకెళ్తున్నారు.
66 Comments
Sambasiva+Rao+Thota
Ee roju SANCHKA lo , nenu vraashina “NAA JEEVANA GAMANAMLO “ ..37th episode prachrinchinanduku , Editor Sri MuraliKrishna Gaariki,Sri Somashankar Gaariki , thadithara Sanchika Team Sabhylandariki , naa hrudayapoorvaka kruthajnathalu …
Mee,
Sambasiva Rao Thota .
Sagar
అంకుంఠిత దీక్షతో అంచెలంచెల మీ ఎదుగుదల నిజంగా గొప్ప విషయం సర్. చదివే ప్రతి విషయం మనస్సులో నాటుకునేలా ఉన్నాయి మీ జీవన గమనాలు. మీకు అభినందనలు మరియు ధన్యవాదములు.
Sambasiva+Rao+Thota
Dhanyavaadaalu Brother …..Sagar!
Edi yemainaa meelaanti snehithulu mariyu shreyobhilaashula shubhaakaankshalu mariyu aa Bhagavanthudi Daya, nannu nadipinchaayi…
Thanks Brother
Paleti Subba Rao
సాంబశివరావు గారూ, ఆదివారం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు ‘మీ జీవన గమనంలో’ నూతన అధ్యాయం గురించి తెలుసుకుందామా అనే ఆలోచన శుక్రవారం నుండే మొదలవుతుంది. ఈవారం మీ నూతన అధ్యాయం మీ జీవితంలోని ఒక ముఖ్యమైన బాధ్యతను చేపట్టడంతో మొదలుకావడం చాలా ఆనందంగా ఉంది. ఒక ప్రతిష్ఠాత్మకమైన సంస్థకు ప్రప్రథమ రూపశిల్పిగా బాధ్యతను స్వీకరించడం అభినందనీయం. మీకు ఇష్టమైన గ్రామీణాభివృద్ధి సంబంధించిన బాధ్యతలతోనే మీ కెరీర్ పెనవేసుకుపోయినట్లుంది. ఆ అవకాశం అందరికీ దక్కదు కూడా. అది మీకు సంతృప్తినిచ్చే విషయమే. ఆ బాధ్యతల నిర్వహణలో, మీ మనసులోని మంచి మంచి ఆలోచనలను ఆచరణలో పెట్టి ఆ సంస్థకు మంచి పేరు తేవడం, అందరి ప్రశంసలు పొందడం యింకా అభినందనీయమైన విషయం.
Bhujanga rao
జీవనగమనం 37 ఎపిసోడ్ బాగుంది.ఉద్యోగ నిర్వహణలో భాగంగా ఒక ముఖ్యమైన మన దేశంలోనే ప్రప్రదమైన ఆంధ్రా బ్యాంక్ గ్రామీణాభివృద్ధి సంస్థ స్థాపించి మిమ్ములను బాధ్యత కలిగిన డైరెక్టర్ గా నియమించడం మీరు స్వీకరించడం జరిగాయి.గ్రామీణాభివృద్ధితోనే మీ ఉద్యోగం పెనవేసుకుంది. ఈ అవకాశం అందరికి రాదు మీరు చాలా అదృష్టవంతులు సర్.ఈ నిర్వహణ భాగంలో మంచి ఆలోచనలతో, నిర్దిష్టమైన ప్రణాళికలతో అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగి సంస్థకు మంచి పేరు తీసుకురావడం, ఇప్పటి వరకు జరిగినది,జరుగబోయే ది మనమంచికే,జరుగుతున్నది మన మంచికే అని భావించి ముందుకు సాగిన మీకు అభినందనలు మరియు ధన్యవాదములు.
Sambasiva+Rao+Thota
BhujangaRao Garu!
Dhanyavaadaalandi
Thank you very much for your affectionate comments and encouragement and appreciation….
Edi yemainaa meelaanti snehithulu mariyu shreyobhilaashula shubhaakaankshalu mariyu aa Bhagavanthudi Daya, nannu nadipinchaayi…
Thanks BhujangaRao Garu….
Sambasiva+Rao+Thota
Dear SubbaRao Garu!
Thank you very much for your affectionate comments and encouragement and appreciation
Edi yemainaa meelaanti snehithulu mariyu shreyobhilaashula shubhaakaankshalu mariyu aa Bhagavanthudi Daya, nannu nadipinchaayi…
Thank you very much SubbaRao Garu!
Sambasiva+Rao+Thota
SubbaRao Garu!
Thank you very much for your affectionate comments and encouragement and appreciation…..
Dhanyavaadaalandi
Edi yemainaa meelaanti snehithulu mariyu shreyobhilaashula shubhaakaankshalu mariyu aa Bhagavanthudi Daya, nannu nadipinchaayi…
Thanks SubbaRao Garu!
Sambasiva+Rao+Thota
చాలా బాగుంది.మీ కథలన్నీ బ్యాంకును చుట్టుకునే ఉంటాయి.బాగుంది,మీరు అక్కడే పనిచెసారు కాబట్టి.

From
Smt.Prabha Sasthry
Mysore
Sambasiva+Rao+Thota
Dhanyavaadaalandi Prabhaa Sasthry Garu
Bank lo naa anubhvaalanu maathrame prasthutham vraasthunnaanu..
Thanks Andi
rao_m_v@yahoo.com
As usual excellent narrative
Sambasiva+Rao+Thota
Thank you very much Sri M V Rao Garu
Sambasiva+Rao+Thota
Over Good…
From
Sri Rattaiah
Tenali
Sambasiva+Rao+Thota
Thank you very much Rattaiah Garu
Sambasiva+Rao+Thota
Nice Sir
From
Sri Venkateswarlu
Guntur
Sambasiva+Rao+Thota
Thank you very much Venkateswarlu Garu
Sambasiva+Rao+Thota
కార్యసాధకుని చేతికి పగ్గాలు ఇచ్చారు. మరి అది పురోగమ నానికే . తిరుగులేదు. భేష్!


మీలాగా మేము.చెయ్యలేదు అని సిగ్గు పడుతున్నాను.

గోదావరి బ్రిడ్జి , గోదావరి చక్కని అనుభూతులు ఎప్పుడు ఇస్తుంది.

గురువు గారు ! మీకు ప్రణామములు
From
Sri RaviRamana
Hyderabad
Sambasiva+Rao+Thota
RaviRamana Garu!
Dhanyavaadaalandi
Edi yemainaa meelaanti snehithulu mariyu shreyobhilaashula shubhaakaankshalu mariyu aa Bhagavanthudi Daya, nannu nadipinchaayi…
Thanks Andi…
Sambasiva+Rao+Thota
Read the episode. Good narration sir.
I think next episode
Will be inauguration of
Training institute.
Well narrated sir
Regards
From
Sri Seshumohan
Hyderabad
Sambasiva+Rao+Thota
Thank you very much Seshumohan Garu
Sambasiva+Rao+Thota
Nice presentation Sir Similar efforts had been put up by us when we were asked by Dist Collector to establish FSCS at Pithapuram There was lot of opposition from some of the societies already existing which were proposed to merged into FSCS We went to such societies and convene meetings with the society leaders and villagers and convinced them about the advantages of FSCS and finally we were successful and established FSCS in time as required by collector This FSCS had become one of the best Obe in 12 such FSCS of Bank in AP and Karnataka under Hyderabad Zone We were much appreciated by the Collectir Swaminathan at that time
Good luck Sir Pl continue ur narration
R Laxman Rao
Hyderabad
Sambasiva+Rao+Thota
Lakshman Rao Garu!

Thank you very much for your affectionate comments and appreciation
I am very happy to know that you were so successful in establishing FSCS at Pithapuram..
You were really deserved for every recognition and appreciation…
I am proud have your association…
Thank you very much Sir
Sambasiva+Rao+Thota
From
Sri Shivakumar
Hyderabad
Sambasiva+Rao+Thota
Shivakumar Garu!
Dhanyavaadaalandi
Edi yemainaa meelaanti snehithulu mariyu shreyobhilaashula shubhaakaankshalu mariyu aa Bhagavanthudi Daya, nannu nadipinchaayi…
Thanks Andi…
Sambasiva+Rao+Thota
I am very glad to know, that you are the first director of the institute. I used to feel pleasure when ever I used to visit the institute, when I was a chairman of GGB.
From
Sri RamanaMurthy
Vizag
Sambasiva+Rao+Thota
Thank you very much RamanaMurthy for remembering the Institute and your visits there
Jhansi koppisetty
మీ అనుభవాలు చదువరులకు చాలా స్ఫూర్తిదాయకంగా వున్నాయండీ


Sambasiva+Rao+Thota
Jhansi Garu!
Thank you very much for your affectionate comments and appreciation
Sambasiva+Rao+Thota
సాంబశివరావు గారు, మీ అనుభవాల్ని చాలా చక్కగా చక్కని స్వచ్ఛమైన పదహారణాల తెలుగు భాషలో వివరించిన విధానం అద్భుతం. చదువుతున్నంతసేపు మీతోపాటు మేమూ ప్రయాణం చేస్తున్నామా అన్నంత అనుభూతి కలిగింది. చాలా బాగుంది మీ జీవన గమనం
From
Sri Brahmajirao
Hyderabad
Sambasiva+Rao+Thota
Brahmajirao Garu!
Thank you very much for your affectionate comments and encouragement and appreciation
డా. కె.ఎల్ వి ప్రసాద్
రాజమండ్రి ని
గొప్పగా వర్ణించారు. మీ కార్యస్థలాల ఎమ్పిక
మీ ఎమ్పిక గ్రామీణాభివృద్ధి కి గొప్ప గా ఉపయోగ పడింది.
Sambasiva+Rao+Thota
Prasad Garu!
Thank you very much for your affectionate comments and appreciation
Sambasiva+Rao+Thota
Starting a Rural development center by Andhra Bank is a great idea. Bank has identified a service minded officer like you to run it. It will be a great help for Rural people for their economic development . I presume that your team done very well. Thanks.
From
Sri ChandrasekharReddy
Hyderabad
Sambasiva+Rao+Thota
ChandrasekharReddy Garu!

Thank you very much for your affectionate comments
Dhanyavaadaalandi
Edi yemainaa meelaanti snehithulu mariyu shreyobhilaashula shubhaakaankshalu mariyu aa Bhagavanthudi Daya, nannu nadipinchaayi…
Thanks Andi…
Sambasiva+Rao+Thota
Very Nice Sir.Actually I too like Rural Development activities.




From
Sri Krishna Murthy
Hyderabad
Sambasiva+Rao+Thota
Thank you very much Krishnamurthy Garu
I am really happy to know that you are also interested I Rural Development activities…
Sambasiva+Rao+Thota
Dear Sambasiva Rao ji


Happy to know about the past remembrances of your banking career at RAJAHMUNDRY and your guidance as DIRECTOR
and. training centre
Regards and best wishes
M S RAMARAO
Manager retd Central Bank of India Begum bazar br Hyderabad
Sambasiva+Rao+Thota
Dear MS RamaRao Garu!
Thank you very much for your affectionate comments which I always cherish..
Dhanyavaadaalandi
Sambasiva+Rao+Thota
జీవితం లో గమనమే తెలియని ఎంతో మంది రైతులకు, వ్యవసాయం మీద ఆధార పడ్డ ఇతరులకు, మీ వంతు సహాయం చేసిన ధన్యులు మీరు. అది మీ వృత్తి అయినా, మీరు మనసు పెట్టి ఎంతో నిబద్దత, ఇష్టంతో చేశారు, అది మీ గొప్ప తనం. మీ జీవన గమనంలో ఒక మైలు రాయి.
From
Sri VenkobaRao
Hyderabad
Sambasiva+Rao+Thota
VenkobaRao Garu!
Thank you very much for your affectionate comments and encouragement and appreciation
Dhanyavaadaalandi

Edi yemainaa meelaanti snehithulu mariyu shreyobhilaashula shubhaakaankshalu mariyu aa Bhagavanthudi Daya, nannu nadipinchaayi…
Thanks Andi…VenkobaRao Garu
Sambasiva+Rao+Thota
Very emotional and touching….
From
Sri Chalapathirao (FB)
Kakinada
Sambasiva+Rao+Thota
Chalapathirao Garu!
Thank you very much for your affectionate comments
Sambasiva+Rao+Thota
Good evening sir, నా జీవన గమనంలో, ఎపిసోడ్ 37 చదివాను మీ రచన సూపర్ సర్.
From
Sri Arunakar
Mahabubabad
Sambasiva+Rao+Thota
Thank you very much Arunakar Garu
Sambasiva+Rao+Thota
Ehodalounna graminaprajalaku prayojanamu చేకూర్చాలని మి అభిమతం అభినందనీయము
From
Smt.Seethakkaiah
Hyderabad
Sambasiva+Rao+Thota
Dhanyavaadaalandi Seethakkaiah
Arunakar Macha
పవిత్ర గోదావరి నదీ తీరాన వెలిసిన రాజమహేంద్రవర సంస్కృత రాజధాని నగర వడిలో ఉన్న “ఆంధ్రా బ్యాంక్ గ్రామీణాభివృద్ధి సంస్థ” కు అధికారిగా వెళ్లడం మీకెంతో ఇష్టమని తెలుసు. అందుకే ఈ పదవి మిమ్ములను వరించింది. మీ డైరెక్షన్ లో గ్రామీణ ఋణ దాతల శిక్షణా శిబిరాల ద్వారా ఫలితాలు కూడా నెంబర్ వన్ గానె ఉంటాయి… (గురువుగారు శ్రీ జగన్నాధరాజు ఆర్ డి ఓ గారు అంటే మా ABFSCS KORVI మాజి MD కదా).
ధన్యవాదములు
అరుణాకర్ మచ్చ, మానుకోట
Sambasiva+Rao+Thota
Arunakar Garu!
Thank you very much for your affectionate comments which I always cherish….
Thank you very much for your observations and appreciation
K. Sreenivasa moorthy
Very nice to know that you were selected as first director of the prestigious institute andi. A new assignment and a new beginning. Great sir
Sambasiva+Rao+Thota
SreenivasaMurthy Garu!
Thank you very much for your affectionate comments which I always cherish….
Also thank you for your observations and appreciation
Sambasiva+Rao+Thota
ABIRD ఆవిర్భావం గురించి చక్కగా, వివరణాత్మక వ్యాసం చాలా బాగుంది. ప్రతీవారం మీరు వ్రాస్తున్న మీ జీవనగమనం లో అద్భుతంగా, అత్యద్భుతంగా, పఠనాశక్తి కలిగించేలా .. చాలా..చాలా..చాలా బాగుంది.






మీ
పోడూరి
Hyderabad
Sambasiva+Rao+Thota
Dr.Poduri Garu!
Thank you very much for your affectionate comments which I always cherish…
Also thank you for your encouragement and appreciation
Sambasiva+Rao+Thota
The way you write your memories is very nice Sambasivarao garu. This time your narration about Rajahmundry and the Godavari bridge is very apt and good.

In my 40 years service in Indian Bank I did not get chance to work in Godavari districts.
From
Sri Bhanumurthy N
Hyderabad
Sambasiva+Rao+Thota
BhanuMurthy Garu!
Thank you very much for your affectionate comments and encouragement and appreciation,which I always cherish….
Sambasiva+Rao+Thota
Interesting Episode….
From
Mr.Ramakrishna
Hyderabad
Sambasiva+Rao+Thota
Thank you very much Ramakrishna
Sambasiva+Rao+Thota
Good.goahead.next.operation training farmers.ie .guidance,technical,administration,mantainance skills for prosperity
From
Sri VenkateswarReddy
Guntur
Sambasiva+Rao+Thota
Yes…,
Thank you very much VenkateswarReddy
Sambasiva+Rao+Thota
But, your article showed nostalgic feelings. Good narration
From
Sri Rajasekhar
Hyderabad
Sambasiva+Rao+Thota
Rajasekhar Garu!
Thank you very much for your affectionate comments and appreciation
Sambasiva+Rao+Thota
టోపీసీలోకి కాస్త లోతుగా వెడుతూ..మళ్లీ బోర్ కొట్టకుండా మరో విషయంలోకి తీసుకెడుతూ ఆసక్తి పోకుండా రాస్తున్నారు. అభినందనలు.
From
Sri Maheswar
Bangalore
Sambasiva+Rao+Thota
Maheshwar Garu!
Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalandi
Sambasiva+Rao+Thota
నమస్కారం సాంబశివ రావు గారు
మీ జీవన గమనంలో 37 లో మీ Rajahmundry ప్రయాణం చదువుతుంటే పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి థ్రిల్ అయ్యాను. మీరు పేర్కొన్న అధికార్లు వై భాస్కరరావు గారు, జగన్నాథ రావు గారు, మాలకొండా రెడ్డి గారు, k.r. naayak garu అందరూ తెలిసున్న వారే కావడం, ABIRD లో ప్రతీ సంవత్సరం ఆటల పోటీల్లో పాల్గొన్న సంగతి గుర్తు రావడం చాలా ఆనందంగా అనిపించింది.
నేను 1991 నుంచి 2000 వరకు క్లర్క్ కం స్టెనో గా రాజమండ్రి RO lo చేశాను.
మొన్న ఏప్రిల్ 2021 లో HO నుంచి రిటైర్ అయ్యాను. పాత సంగతులు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.
From
Sri TataRao(FB)
Hyderabad
Sambasiva+Rao+Thota
TataRao Garu!

Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalu
Sambasiva+Rao+Thota
సాంబశివ రావు గారు, నాజీవన గమనంలో 37 చదివాను.చాలాబాగా వ్రాసుకొస్తున్నారు.రాజమండ్రి వరకుసాగిన మీప్రయాణం మరియు గోదావరి బ్రిడ్జి గురుంచి చాలావిఫులంగా వ్రాసినారు.వచ్ఛేఎపిసోడ్ లో ఆంధ్రాబ్యాంకు గ్రామీణ అభివృద్ధి సంస్థ నిర్వహించే కార్యక్రమాల గురుంచి తెలుసుకునేందుకు ఎదురుచూస్తుంటాను.దన్యవాదములు .
From
Sri NagaLingeswararao
Hyderabad
Sambasiva+Rao+Thota
NagaLingeswararao Garu!
Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalandi