141
ఆ రోజు… నా టేబిల్ మీద ఫోన్ గణగణా మ్రోగింది. రిసీవర్ ఎత్తి…
“హలో… ఎవరండి?” అడిగాను.
“హలో సార్… నేను జనరల్ మేనేజర్ మాలకొండారెడ్డి గారి పి.ఎ.ని మాట్లాడుతున్నాను! సార్ మీతో మాట్లాడుతారట! లైన్లో ఉండండి సార్!” చెప్పింది అవతలి కంఠం.
“అలాగేనండి!” అని చెప్పి, జనరల్ మేనేజర్ గారు నాతో ఏం మాట్లాడుతారబ్బా అనుకుంటూ ఆత్రుతతో ఎదురుచూడసాగాను. ఇంతలో జనరల్ మేనేజర్ గారు లైన్ లోకి వచ్చారు.
“ఆ! ఏమయ్యా! ఎలా వున్నావ్? ఎలా వుంది మీ బ్రాంచ్?”
“సార్! నమస్తే సార్! నేను బాగున్నాను సార్! మా బ్రాంచ్ కూడా చాలా బాగుంది సార్!”
“గుడ్.. ఇప్పుడు నీకో ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను… కంగారు పడకుండా.. విను!”
“చెప్పండి సార్!”
“నిన్ను చైతన్య గ్రామీణ బ్యాంక్‌కి ఛైర్మన్‌గా పోస్ట్ చేస్తున్నాము. ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఈ రోజే పంపిస్తున్నాము. వెంటనే తెనాలి వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వు!”
“సార్… సార్… అదేంటి సార్! నేను ఇక్కడకు వచ్చి ఒక సంవత్సరమే కదా సార్! అప్పుడే నాకు ట్రాన్స్ఫర్ ఏంటి సార్! ఇక్కడ బాగానే చేస్తున్నాను కదా సార్!”
“అవును… నిజమే… సంవత్సరమే అయింది అక్కడికి నువ్వు వచ్చి… అక్కడ నువ్వు బాగానే చేస్తున్నావు కూడా… అందులో ఎలాంటి సందేహం లేదు. కాని… చైతన్య గ్రామీణ బ్యాంక్‌కు నీ సేవలు చాలా అవసరం అయ్యాయి. పైగా అది చాలా పెద్ద పదవి క్రింద లెక్క… అక్కడ నువ్ బాగా చేయగలవు. నీ కెరీర్ డెవలప్మెంట్కు చాలా ఉపయోగపడుతుంది ఆ పోస్ట్. మరో విధంగా ఆలోచించకుండా, ఆర్డర్ రాగానే వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వు… సరేనా?” అంటూ గద్దించి అడిగారు జనరల్ మేనేజర్ గారు.
“అలాగేనండి!” నిర్లిప్తంగా చెప్పాను.
“గుడ్! అక్కడ జాయిన్ అయిన తరువాత ఫోన్ చెయ్! ఆల్ ది బెస్ట్!”… రిసీవర్ పెట్టేసిన శబ్దం వినిపించింది.
***
అప్పటిదాకా జరిగింది కలా… నిజమా… ఏమీ అర్థం కావడం లేదు. తల వేడెక్కింది. ఆలోచనలు పరిపరి విధాలుగా పరిగెడుతున్నాయి.
ఎందుకిలా జరిగింది? ఇప్పుడిప్పుడే బ్రాంచ్ పనితీరుపై పూర్తిగా పట్టు సాధిస్తున్నాను. ఖాతాదారులతో సత్సంబంధాలు నెలకొన్నాయి. కరీంనగర్ పట్టణానికి, ఇక్కడి స్థితిగతులకు నేను, మా కుటుంబం బాగా అలవాటు పడ్డాము. ఇప్పుడే మరల వేరే చోటికి వెళ్ళాలి… అంటే ఎందుకో నా మనసు ఎదురు తిరుగుతోంది. అయినా హెడ్ ఆఫీసు వారు ఎక్కడ పోస్ట్ చేస్తే, అక్కడకు వెళ్ళి పని చేయవలసిందే కదా! అదైతే తప్పదు కదా! పైగా నా కెరీర్‌కు ప్లస్ అవుతుందని చెప్పారు జనరల్ మేనేజర్ గారు… అదీ నిజమే కదా!
ఇంకో విషయం… నేను వెళ్తుంది తెనాలికి, గుంటూరు జిల్లాకి. అలా, మా వాళ్ళందరికీ దగ్గరగా వుండబోతున్నాను. అది సంతోషించదగ్గ విషయమే కదా!
ఇవన్నీ ఒక ఎత్తైతే, గ్రామీణ బ్యాంకు శాఖల ద్వారా, గ్రామీణ ప్రజలకు సేవ చేస్తూ, గ్రామీణాభివృద్ధికి నేను కృషి చేయవచ్చు అనేది… నిర్వివాదాంశం… అది నా అదృష్టం… నాకు వ్యక్తిగతంగా అత్యంత సంతృప్తిని మరియు సంతోషాన్ని కలగజేసే విషయం.
ఇలా పరుగులిడుతున్న నా ఆలోచనలతో నా మనసు కాస్త సంబాళించింది. ఇక తెనాలి వెళ్ళేందుకే మొగ్గు చూపిస్తుంది.
***
నా బదిలీ విషయం సిబ్బందికి చెప్పాను.
“అదేంటి సార్! అప్పుడే మీకు ట్రాన్స్ఫర్ ఏంటి? అందరం బాగా కలిసిపోయాం కదా సార్! మరికొంత కాలం మీరు ఇక్కడే ఉంటే బాగుంటుంది కదా సార్!” అంటూ ఆశ్చర్యాన్ని వెలిబుచ్చారు వాళ్ళంతా..
“మీరు చెప్పిందీ నిజమే! కాని… మన చేతుల్లో ఏముంది చెప్పండి? ఈ విషయంలో మనం చేయగలిగింది ఏమీ లేదు! హెడ్ ఆఫీసు వారు ఎలా చెప్తే అలా నడుచుకోవడం తప్ప!” వేదాంత ధోరణిలో చెప్పాను.
***
ఆ రోజు సాయంత్రం పెందలకడే ఇంటికి వెళ్ళి, నా భార్యా పిల్లలతో నా బదిలీ విషయం చెప్పాను.
“అదేంటండీ! సంవత్సరానికే మరలా ట్రాన్స్‌ఫరా!!” అంటూ నోరెళ్ళబెట్టింది నా శ్రీమతి. అమాయకంగా చూస్తున్నారు పిల్లలు.
“మన చేతుల్లో ఏముంది చెప్పండి… హెడ్ ఆఫీసు వారి ఆర్డర్స్ ప్రకారం నడుచుకోవాల్సిందే కదా!” అని జనరల్ మేనేజరు గారు చెప్పిన విషయాలను, తరువాత నా మదిలో మెదిలిన అలోచనలను, వారికి పూస గుచ్చినట్టు చెప్పాను.
“సరే లెండి! మన మంచి కోసమే అంటున్నారు కాబట్టి… సంతోషంగానే వెళ్దాం లేండి! పైగా, మనవాళ్ళందరికీ చాలా దగ్గరలో వుంటాం కదా!” అంటూ కళ్ళు పెద్దవి చేసి చెప్పింది నా శ్రీమతి. పిల్లలు కూడా తనతో మాట కలిపారు.
142
ఆరోజు చైతన్య గ్రామీణ బ్యాంకు ఛైర్మన్‌గా తెనాలికి నన్ను బదిలీ చేసినట్టు ఉత్తర్వులు అందాయి. అదే రోజు కరీంనగర్ రీజినల్ మేనేజర్ శ్రీ సురేంద్ర రెడ్డి గారికి కూడా పదోన్నతిపై వరంగల్ జోనల్ మేనేజర్‌గా బదిలీ చేసినట్టు ఉత్తర్వులు అందాయి. అదే సమయంలో, కరీంనగర్ రీజినల్ ఆఫీసు, జోనల్ ఆఫీసు స్థాయికి ఎదగడం వలన… జోనల్ మేనేజర్‌గా శ్రీ బి.టి. కాంతారావు గారిని నియమించారని తెలిసింది. నేను గుంటూరు రీజినల్ ఆఫీసులో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజరుగా పని చేసేటప్పుడు, శ్రీ బి.టి. కాంతారావు గారు గుంటూరు రీజినల్ మేనేజరుగా ఉండేవారు. నాకు సుపరిచితులు, మంచి వ్యక్తి మరియు గురుతుల్యులు కూడా.
అప్పుడే నా టేబిల్ మీద ఫోన్… ట్రింగ్… ట్రింగ్… అంది. మాట్లాడేందుకు రిసీవర్ తీశాను.
“హలో సార్! మీరు కరీంనగర్ బ్రాంచ్ చీఫ్ మేనేజరు గారేనాండి?” అడిగింది అవతలి కంఠం.
“అవునండి! మీరెవరు?” అడిగాను.
“సార్! నేను చైతన్య గ్రామీణ బ్యాంక్ ఛైర్మన్ గారి పి.ఎ. సురేష్‌ని సార్! మా ఛైర్మన్ గారు, రేపు ఇక్కడ రిలీవ్ అవుతున్నారు సార్! మీరెప్పుడు వస్తున్నారో తెలుసుకుందామని ఫోన్ చేస్తున్నాను సార్!”
“సురేష్ గారు! మీరు ఫోన్ చేసినందుకు చాలా సంతోషంగా వుంది. నేను కూడా రేపే రిలీవ్ అవుతాను. ఎల్లుండికి తెనాలికి ట్రయిన్లో వస్తాను. తెనాలి వచ్చేసరికి బహుశా సాయంత్రం నాలుగవచ్చు!”
“వెల్కం సార్! నేను ఆఫీస్ జీప్ తీసుకుని రైల్వే స్టేషన్‌కి వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటానండి! మీకు హోటల్ సామ్రాట్‌లో సూట్ రిజర్వ్ చేస్తాను సార్!”
“అలాగే! థాంక్యూ సురేష్ గారూ!”
“గారు వద్దు సార్! సురేష్ అనండి!”
“సరే… సురేష్!”
***
ఓహో! నా వ్యక్తిగత విషయాల్లో సహాయకారిగా ఉండేందుకు అక్కడ నాకో పి.ఎ. కూడా వుంటారన్న మాట! అవున్లే… ఉద్యోగంలో హోదా పెరిగేకొద్దీ బాధ్యతలతో పాటు, వసతులు కూడా పెరుగుతుంటాయి కదా! రాబోయే రోజులు తలచుకుంటూ… కాసేపు… ఊహాలోకంలో విహరించాను.
***
ఆ రోజు ఉదయమే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీ బి.టి. కాంతారావు గారు కరీంనగర్ జోనల్ మేనేజర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ విషయం తెలియగానే వెంటనే వెళ్ళి వారిని మర్యాదపూర్వకంగా కలిశాను.
ఆ రోజు సాయంత్రం కరీంనగర్ రీజియన్ లోని శాఖాధిపతులు మరియు సిబ్బంది అందరూ కలిసి ఒక సభను ఏర్పాటు చేశారు. బదిలీపై వెళ్తున్న నాకు, శ్రీ సురేంద్ర రెడ్డి గారికి వీడ్కోలు చెప్పడం మరియు కరీంనగర్ జోనల్ మేనేజర్‌గా జాయిన్ అయిన శ్రీ బి.టి. కాంతారావు గారికి స్వాగతం పలకడం ఆ సభ ఏర్పాటు ఉద్దేశం. నేను, రీజినల్ మేనేజర్ గారు అక్కడున్న వారందరికీ కొత్తేమీ కాదు. జోనల్ మేనేజర్ గారు మాత్రం అక్కడున్నవారిలో, నాలాంటి అతి కొద్దిమందికి మాత్రమే తెలిసి వుండవచ్చు. నాకైతే… గుంటూరు రీజినల్ ఆఫీసులో వారి దగ్గర పని చేసిన అనుభవం కూడా వుంది. అందుకే వారిని సభకు పరిచయం చేసే బాధ్యతను నాకు అప్పగించారు… ఆ సభా నిర్వాహకులు.


సభావేదికపై ప్రసంగిస్తున్న రచయిత, శ్రీ బి.టి. కాంతారావు గారు మరియు శ్రీ సురేంద్ర రెడ్డి గారు
సభలో మాట్లాడిన వక్తలంతా – శ్రీ సురేంద్ర రెడ్డి గారితో మరియు నాతో వారికున్న అనుభవ విశేషాలను నెమరు వేసుకున్నారు. అలాగే శ్రీ బి.టి. కాంతారావు గారికి హార్ధిక స్వాగతం పలికారు. తరువాత నేను, రీజినల్ మేనేజర్ గారు మరియు జోనల్ మేనేజర్ గారు – అక్కడున్న వారందరికీ – ఇంత మంచి సభ నిర్వహించి, మా పై చూపించిన ఆదరాభిమానాలను కృతజ్ఞతలు తెలియజేశాము.
చివరిగా నోరూరించే పసందైన వంటకాలతో కూడిన భోజనాల అనంతరం, ఆనాటి కార్యక్రమం ముగిసింది.
విజ్ఞప్తి
సంచికలో ధారావాహికంగా ప్రచురించబడుతున్న నా రచన ‘నా జీవన గమనంలో…!’ ఇప్పటి వరకు 47 ఎపిసోడ్స్ మీకందించబడ్డాయి.
మీరు ప్రతి ఎపిసోడ్‌ని చదువుతూ నన్ను ప్రోత్సహిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు.
కాని, కొన్ని అనివార్య కారణాల వల్ల, తదుపరి ఎపిసోడ్స్‌ని మీకందించడానికి కొంత విరామం కలుగుతుందని తెలియజేయడానికి చింతిస్తున్నాను.
అతి త్వరలో మరలా కలుద్దాం…
తోట సాంబశివరావు
రచయిత

ఆంధ్రాబ్యాంకు లో ప్రాంతీయ అధికారి హోదా లో ఉద్యోగ విరమణ చేసిన తరువాత , తన కెంతో ఇష్టమైన రచనా వ్యాసంగాన్ని ఎంచుకొని , కథలు,నాటికలు,నవలలు వ్రాస్తూ ముందుకెళ్తున్నారు.
43 Comments
Sambasiva+Rao+Thota
Ee roju SANCHKA lo , nenu vraashina “NAA JEEVANA GAMANAMLO “ .47th episode prachrinchinanduku , Editor Sri MuraliKrishna Gaariki,Sri Somashankar Gaariki , thadithara Sanchika Team Sabhylandariki , naa hrudayapoorvaka kruthajnathalu …
Mee
Sambasiva Rao Thota
B Rattaiah
Sri Thota sambasivaraos story narration is readable. Simple words, simple sentences and easy to reading his story.
Sambasiva+Rao+Thota
Thank you very much Rattaiah Garu
rao_m_v@yahoo.com
It is an exciting series and I hope you will resume soon, trust everything is OK. You can personally message me or call me if you feel like.
Sambasiva+Rao+Thota
Sri MV Rao Garu!

Thank you very much for your concern and affectionate comments
Every thing is OK Andi…
Will certainly resume soon Sir..
Will surely call you Sir…
Dhanyavaadaalandi
K. Sreenivasa moorthy
Sambasiva Rao garu every week on Sunday we eagerly wait for this column and today we read that there will be a break for some time. Any how we are happy to know about you and your achievements and your way of approach to the things is a guideline for the people like us. Thanks for sharing your experiences andi. God bless you and your family members Good health.
Sambasiva+Rao+Thota
SreenivasaMurthy Garu!

Thank you very much for your affectionate comments and appreciation
Will certainly resume soon ….Dhanyavaadaalandi
Paleti Subba Rao
సాంబశివరావు గారూ, యిప్పటి వరకు ‘మీ జీవన గమనంలో’ జరిగిన విషయాలు గమనిస్తే తెలిసిందేమిటంటే, ఎక్కడా మీరు కోరుకుని ఏ పదవినీ చేపట్టలేదు. మీ ప్రతిభను గుర్తించి యాజమాన్యం వారే మీకు ఆ పదవులు కట్టబెట్టారు, మిమ్మల్ని సంప్రదించకుండానే, మీ ఇష్టాయిష్టాలు, కష్టనష్టాలు కూడా పట్టించుకోకుండానే. అయినా మీరు వారి ఆదేశాలు పాటిస్తూ, ప్రతి పదవికి న్యాయం చేస్తూ, మంచి పేరు ప్రతిష్టలు సంపాదించారు మరియు ఆ పదవులకు గౌరవం తెచ్చారు.
ప్రతి ఆదివారం మీ శీర్షిక కోసం ఎదురుచూసే మాకు సుదీర్ఘ విరామం మాత్రం ప్రకటించవద్దని మనవి.
Sambasiva+Rao+Thota
SubbaRao Garu!
Thank you very much for your observations and appreciation
You are one of my very close friends and on whom I rely and used to take advices from you and through out…
I always remember your nice and long term association …
Will resume soon..
Thank you very much SubbaRao Garu…
Dhanyavaadaalandi
Sagar
పనిచేసే వాడి నిబద్దత ముందు ఈ బదిలీలు లాంటివి బలాదూర్ అని మీ రచన స్పష్ఠంగా చెపుతూంది సర్. మీకు ధన్యవాదములు.
Sambasiva+Rao+Thota
Brother Sagar!
Thank you very much for your affectionate comments which I always cherish
Sambasiva+Rao+Thota
Hero of Tenali ….
From
Sri RamanaMurthy
Vizag
Sambasiva+Rao+Thota
Anthaledule Boss ….

Thank you very much my dear RamanaMurthy
Sambasiva+Rao+Thota
Nice Sir…
From
Sri Venkateswarlu
Guntur
Sambasiva+Rao+Thota
Thank you very much Venkateswarlu Garu
Sambasiva+Rao+Thota
Malkonda Reddy sir, was always encouraging the performers and elevate them in their carrier. We were lucky to have such executives in Andhra Bank. Your performance was recognized and rewarded. Chairman position of Grammena bank is an independent position than RM or ZM. You can take a dession and implement in the bank. I hope you have done excellent job in Greenena.
From
Sri P.Chandra Sekhar Reddy .
Hyderabad
Sambasiva+Rao+Thota
ChandrasekharReddy Garu!
What you have told about Sri MalakondaReddy Garu,is quite correct…
As you said,the post of a Chairman,is very much challenging and I got the opportunity to face such challenges at CGB TENALI..
Lot of job satisfaction, I had in that post …
Thank you very much for your observations and appreciation
Sambasiva+Rao+Thota
Great Sir,Old memories ni real ga chupistunnaru.Mi memory hats off.Way you are keeping memories is really great


From
Sri Bhaskarao
Hyderabad
Sambasiva+Rao+Thota
Bhaskarao Garu!
Thank you very much for your observations and appreciation which I always cherish
Sambasiva+Rao+Thota
Your experience at
All the episodes of NAA JEEVANA GAMANAMU LO
are Highly interesting and
Illustrative , REGARDS
M S RAMARAO,
Manager retd
Central Bank Hyderabad,
Sambasiva+Rao+Thota
MS RAMA RAO Garu!
Thank you very much for your affectionate comments and appreciation
Sambasiva+Rao+Thota
అన్ని చదివేను,అక్కడ నా అభిప్రాయాలు రాయాలంటే messge చేసేది తెలియలేదు.బలే రాస్తారు మీరు.బాగుంది.

From
Mrs.Prabha Sasthry
Mysore
Sambasiva+Rao+Thota
Prabhaa Sasthry Garu!
Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalandi
Bhujanga rao
మీరు బ్యాంక్ లో చేరిన నాటి నుండి బదిలీ విషయంలో గాని పదోన్నతి విషయంలో గాని వాటంతటవే మిమ్ములను వెతుక్కుంటూ వచ్చాయి.మీరు పని విషయంలో ఎక్కడైనా రాజీ పడకుండా నిబద్ధతతో పరిస్తితులు, అవసరాలు దృష్టిలో ఉంచుకొని సమయానుకూల నిర్ణయాలతో కష్టించి పని చేస్తే ఫలితాలు వాటంతట అవే వస్థాయి. అనడానికి మీకు లభించిన పదోన్నతి ద్వారా నిరూపించి విజయం సాధించారు సర్.అభినందనలు మరియు ధన్యవాదములు
Sambasiva+Rao+Thota
BhujangaRao Garu!
Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalandi
Anninti Kannaa mukhyamgaa, meelaanti sahodyogula Sahaya sahakaaraalu koodaa chaalaa avasaram..
Sambasiva+Rao+Thota
గ్రామీణ బ్యాంక్ చైర్మన్ పదవికి న్యాయము చేస్తూ మంచి పేరు ప్రతిష్టలు సంపాదించారని తలుస్తాను మీకు అభినందనలు
From
Mrs.Seethakkaiah
Hyderabad
Sambasiva+Rao+Thota
Mee abhimaana mariyu aathmeeya spandanaku hrudayapoorvaka Dhanyavaadaalu Akkaiah
Sambasiva+Rao+Thota
Superb mamaiah,and waiting eagerly for the coming episodes…
From
Mr. Ravikumar
Vijayawada
Sambasiva+Rao+Thota
Dear Ravi,
Thank you very much Ravi
Sambasiva Rao Thota
Sir, are you plannng to go abroad?
From
Sri RamaRao
Hyderabad
Sambasiva+Rao+Thota
Rama Rao Garu!
Just need some break..
Will resume soon…
Thank you very much…
Sambasiva+Rao+Thota
Sir,how to read your first 46 episodes
Where are they available
From
Sri MadhusudanaRao
Hyderabad
Sambasiva+Rao+Thota
Madhusudhanarao Garu!
when you open the link,
beneath my name ,you can see “ ITHARA RACHANALU”.
Please touch (click)it.. You can see all the previous episodes and other articles,written by me..
Thank you very much for the interest you have shown…
Dhanyavaadaalandi
Sambasiva+Rao+Thota
Dear Sambasiva Rao
When I had gone through ur write up I remember what happened to
Me exactly Like this I was transferred to Vishakhapatnam as Scake III BM from RO Bangalore before I completed my tenure if 3 years. With in 9 months I was transferred to ZO Chandigarh as CM PRS .Again I was transferred to Dharbhanga as Chairman RRB with in 9 months of posting at ZO Chandigarh When I asked GM PRS over phone his reply was yes we knew it but we want you at Dharbhanga and He had taken posting of All Officers from Agl Bsckingvas Chaurmaen of all RRBs of Bànk and he never wanted to cancel order But he had assured to extend his full support and after competeion of term at RRB the next post will be given as our choice We had joined at our respective posting.As promised he had given full support to us and also directed all Zonal Managers to ensure support from respective Zonal offices and regional Office .In my case he had permitted me to take my family and children to back to Vijayawada at Banks cost by Air as there was no
Proper schooling at Darbhanga -Bihar A border dist of Nepal . As promised after completion of our term we were all posted at places if our choice .Ibwas posted to Vijayawada as RM ie 1990 . Somebtimes Managemnt takes correct decisions though t is in convince to us but they used to help us abd take care in our career
I was also a successful Chairman of RRB We had an opportunity of discussing with ObikReddy committe on RRB staff salary system. It was a good exposure at the cost of family suffering
Any Hiw this happens may be in all situation abd in all organisations
With respect to your views abd troubles u had
Iam sorry tiday Iam late in responding as I went to Vanabhojanam programme of our BBG
Thank u
R Laxman Rao
Hyderabad
Sambasiva+Rao+Thota
LakshmanRao Garu!
Namasthe!
I must specifically thank you very much for your time and patience
You have so eloberatively narrated your real time experiences…
Hard work will never go waste..
It will certainly pay one day or the other…your experience is the Best example for the same…
Your career path might have inspired and motivated so many people in your Bank…
Thank you very much for sharing your experiences with all of us..
Regards,
Sambasiva Rao Thota
Sambasiva+Rao+Thota
Exiting Episode…..
From
Mr.Ramakrishna
Hyderabad
Sambasiva+Rao+Thota
Thank you very much Ramakrishna…
Arunakar Macha
గ్రామీణాభివృద్ధికి సమర్థ వంతమైన పరిపాలకుడైన తమరు, చైతన్య గ్రామీణ బ్యాంక్ తెనాలికి, చైర్మన్ గా ఉన్నత పదోన్నతిని పొందడం మీ యొక్క కృషిఫలితం. అనతి కాలం లోనే మరొక ప్రమోషన్ రావడం గొప్పవిషయం. ట్రాన్స్పర్ వల్ల మన మంచికే అని కుటుంబ సభ్యులను ఒప్పించి మెప్పించి, స్వంత గడ్డకు, ఆప్తుల చెంతకు రావడం శుభ పరిణామం. మరియు చై.గ్రా.బ్యా.శాఖల ద్వారా అభివృద్ది పతంలో మంచి సత్ఫలితాలను కూడా ఇచ్చి ఉంటారు. మీ ఆంధ్రా బ్యాంక్ ఉద్యోగ పర్వంలో చక్కని అభివృద్దిబాటలు, మంచి కార్య క్రమాలు ఇంకా ఉంటాయనీ ఆశిస్తున్నాను.
ధన్యవాదములు
అరుణాకర్ మచ్చ, మానుకోట.
Sambasiva+Rao+Thota
Arunakar Garu!
Thank you very much for your affectionate comments and appreciation
As long as ,hard working,sincere,honest, and dedicated colleagues like you,are there,Successes are assured…
Dhanyavaadaalandi
Sambasiva+Rao+Thota
Baagundhi. Why break
From
Sri Sathyanarayana
Hyderabad
Sambasiva+Rao+Thota
Thank you very much Sathyanarayana Garu!
Will resume soon….
Sambasiva+Rao+Thota
AB service seems to be like IAS in which out of 3 years 1 5 go to understanding the posf and next 1.5 to manipulating next posting .You never got the time and still acted. Great.
are going to US or Canada?
From
Sri Someswar
Bangalore
Sambasiva+Rao+Thota
Thank you very much Someswar Garu,for your understanding and appreciation..
Not going anywhere..
Will resume soon..
Dhanyavaadaalandi