రెండు వారాల తరువాత మరలా మా ఊరెళ్లిన నాకు ఓ సరికొత్త అనుభవం ఎదురైంది. అమ్మా, నాన్న, నాయనమ్మలతో మాట్లాడుతుండగా…
“నాయనా! నీతో ఓ విషయం చెప్పాలనుకుంటున్నాము!” అన్నది అమ్మ.
“చెప్పమ్మా ఏంటా విషయం?”
“ఏం లేదయ్యా! నీ తోటి వాళ్లందరికీ పెళ్ళిళ్ళవుతున్నాయి. కొంతమంది బిడ్డల తండ్రులు కూడా అయ్యారు! మరి నువ్ కూడా పెళ్ళి చేసుకోవచ్చు గదయ్యా!” నెమ్మదిగా చెప్పింది అమ్మ.
ఊహించని ఆ మాటలకు ఉక్కిరిబిక్కిరి అయ్యాను. ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి. అతి కష్టం మీద నా నోట మాట పెగిలింది.
“అమ్మా! నాకేంటి…! పెళ్ళేంటి…! … ఏంటమ్మా ఇది?! ఇప్పుడు నా పెళ్ళి ఆలోచన ఎందుకమ్మా!?”
“ఏం లేదయ్యా! నీకు మంచి ఉద్యోగం వచ్చింది. సంతోషమే!… కాని అక్కడ నువ్వు ఒక్కడివే ఉంటున్నావు! ఎలా ఉంటున్నావో! ఏం తింటున్నావో! అని దిగులుగా ఉంటుందయ్యా! పెళ్ళైతే నీకో తోడు దొరుకుతుంది…! నీ గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది నీక్కాబోయే భార్య! అప్పుడు మేం ఇక్కడ ధైర్యంగా ఉంటాం కదయ్యా! ఆలోచించు!!”
“అది కాదమ్మా! ఈ మధ్యనే ఉద్యోగంలో చేరాను. ఇంకా కన్ఫర్మ్ కూడా అవలేదు. అంటే… పర్మనెంటు కాలేదు… మరి… నా పెళ్ళికి తొందరెందుకమ్మా!” బ్రతిమాలుతూ చెప్పాను.
“అదేందయ్యా!! నీది పర్మనెంటు ఉద్యోగం అన్నావుగా!” ఆశ్చర్యంగా అడిగింది అమ్మ.
“అది నిజమే అమ్మా! పర్మనెంటే! కాని, కొత్తగా ఎవరు బ్యాంకులో చేరినా, ఆరు నెలల తరవాతనే పర్మనెంటు చేస్తారు! అంతే!…” వివరించాను.
“అయితే, ఇప్పటి నుంచి నీకో మంచి సంబంధం కోసం వెతుకుతుంటాము. పర్మనెంటు అయిన తరువాతనే పెళ్ళి చేసుకుందువుగాని! సరేనా! ఒప్పుకోయ్యా!” ప్రాధేయపూర్వకంగా అడిగింది అమ్మ.
“ఒప్పుకోయ్యా!” అంటూ నాన్న, నాయనమ్మ అమ్మతో గొంతు కలిపారు.
“మీరందరూ ఇలా బలవంతం చేస్తుంటే… ఇక నేనేం మాట్లాడగలను! సరే మీ ఇష్టం!” అన్నాను. అలా అనక తప్పలేదు మరి!
విచిత్రం ఏంటంటే, ఆ టైంలో నాకు కొంచెం సిగ్గనిపించిన మాట నిజం. అది మొదలుకొని, నాలో, నా ఆలోచనలో… ఏంటో కొంత మార్పు వచ్చినట్లనిపించింది నాకు.
అప్పటికే మా ఇంట్లో ఇద్దరు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు జరిగాయి… ఇప్పుడు మగ పిల్లాడి పెళ్ళికి ప్రయత్నాలు ప్రారంభించారు మావాళ్లు కొత్తగా.
వెంటనే మా కుటుంబ సలహాదారు, మా అందరి శ్రేయోభిలాషి, మా మేనమామ రామకోటయ్యగారికి ఉత్తరం రాశారు… మంచి సంబంధం చూడమని సందేశం పంపారు.
నా ఉద్యోగ నిర్వహణలో తలమునకలై ఉన్న నాకు, ప్రతి ఆదివారం, ఏదో ఒక ఊరు తీసుకెళుతూ, ఎవరో ఒక అమ్మాయిని చూపిస్తునే ఉన్నారు మా వాళ్ళు. ఏమీ నిర్ణయించుకోలేని అయోమయంలో పడ్డాను నేను. అందుకే…! భారమంతా వాళ్ళ మీదనే పెట్టి… నాకో అమ్మాయిని చూసే బాధ్యత వాళ్ళకే అప్పగిద్దామనుకున్నాను. ఎంతైనా… మా వాళ్ళే కదా! వాళ్ళంతా నా మంచినే కోరుకుంటారు కదా! అందుకే చెప్పాను:
“మీరందరూ ఆలోచించి ఓ నిర్ణయానికి రండి! మీ అందరికీ ఇష్టమైతే… నాకూ ఇష్టమే…! మీరే అమ్మాయిని చేసుకోమంటే, ఆ అమ్మాయిని చేసుకుంటాను. ఇక నన్ను ఈ విషయంలోకి దయచేసి లాగకండి!…
మరో విషయం, మీరు చెప్పిన అమ్మాయినే పెళ్ళి చేసుకుని, కలకాలం సంతోషంగా ఆ అమ్మాయితోనే జీవిస్తానని మీకు నా మాటగా చెప్తున్నాను! ఇక మీరు మీ ప్రయత్నాలు కొనసాగించండి!”
“అదెలా కుదురుతుంది? నువ్వు చూడకుండానా? అదెలా సాధ్యం?” ఆశ్చర్యంగా అడిగారు మామయ్య.
“పరవాలేదు మామయ్యా! మీరంతా అన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచించి, ఎంపిక చేసిన అమ్మాయిని, పెళ్ళికి ముందు ఓసారి చూస్తాన్లే!” అన్నాను.
అందరూ కొంచెం సేపు వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకుని, “సరే…! అలాగే కానిద్దాం…!” అన్నారు మామయ్య.
“హమ్మయ్య!” అంటూ ఊపిరి పీల్చుకున్నాను నేను.
***
బ్యాంకులో ఆరు నెలల సర్వీసు పూర్తి కాగానే హెడ్ ఆఫీసు నుండి కన్ఫర్మేషన్ లెటర్ వచ్చింది. అప్పటికే మా వాళ్ళు నాకో మంచి సంబంధం వెతికారు. అమ్మాయి వాళ్ళది గుంటూరు. ఓ మంచి ముహూర్తాన ఆ కలియుగ దేవుడు శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో వివాహం ఏ ఆర్భాటం లేకుండా, పెద్దల ఆశీర్వాదాలతో సాదాసీదాగా జరిగింది. తిరుగు ప్రయాణంలో కాళహాస్తిలో ఆగి శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్నాము.
ఆ తరువాత ఒంగోలులో కాపురం పెట్టించారు, ఇరువైపుల పెద్దలు. మా బ్యాంకు వాళ్ళకు ఓ పెద్ద హోటల్లో మంచి పార్టీ కూడా ఇచ్చాను. వైవాహిక జీవిత ఆనందాల అనుభూతులతో రోజులు తొందరగానే గడుస్తున్నాయి. మా నెల జీతంతో సంసారం ఏ లోటు లేకుండా, సంతృప్తిగా సాగుతుంది. పండగలకు పబ్బాలకు, మేమిద్దరం, వాళ్ళ ఊరూ, మా ఊరు వెళ్ళొస్తున్నాం. అప్పుడప్పుడూ వాళ్ళమ్మా వాళ్ళు, మా అమ్మావాళ్ళు వచ్చి, మాతో కొద్ది రోజులు గడుపుతూ, మా భవిష్యత్తు జీవితం, సాఫీగా గడిపేందుకు మార్గదర్శకం చేస్తున్నారు.
అనుకోకుండా ఓ రోజు మా మామయ్య వచ్చారు. రెండు రోజులు మాతో గడిపి, మా అన్యోన్య దాంపత్యాన్ని చూసి సంతృప్తి చెంది తిరిగి వెళ్ళారు. మాది ఆయన కుదిర్చిన సంబంధం కదా! అందుకని మేం ఎలా వుంటున్నామో… ఓసారి చూడాలనిపించి వచ్చి వుంటారు.
***
అప్పుడే నా దృష్టికి వచ్చింది… మా కొలీగ్స్ ఏవో బ్యాంకు పరీక్షలు వ్రాస్తుండటం. ఆ పరీక్షల గురించి ఆరా తీశాను.
‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్’ అనే సంస్థ బొంబాయిలో వుంది. వారు సంవత్సరంలో రెండు సార్లు, దేశంలోని అన్ని బ్యాంకుల సిబ్బందికి పరీక్ష నిర్వహిస్తారు. పార్ట్ 1లో ఐదు సబ్జెక్టులు, పార్ట్ 2లో ఆరు సబెక్టులు ఉంటాయి. రెండు పార్టులలో ఉత్తీర్ణులైన వారికి ‘సి.ఎ.ఐ.ఐ.బి’ అనే బ్యాంకింగ్ సర్టిఫికెట్ ఇస్తారు. అంటే ‘సర్టిఫికెటెడ్ అసోసియేట్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్’.
ఆ క్వాలిఫికేషన్ ప్రత్యేకతలు ఏమిటంటే, పార్ట్ 1 పాసయితే ఒక ఇంక్రిమెంటు, పార్టు 2 కూడా పాసయితే రెండు ఇంక్రిమెంట్లు, అంటే మొత్తం మూడు ఇంక్రిమెంట్లన్న మాట! పైగా ఆ ఇంక్రిమెంట్లు ‘ప్రొటెక్టెడ్ ఇంక్రిమెంట్స్!’. అంటే మున్ముందు ఆ సర్టిఫికెట్ సాధించిన ఉద్యోగికి ఎప్పుడు ప్రమోషన్ వచ్చినా, అలా ఎన్ని ప్రమోషన్లు వచ్చినా, ప్రమోషన్ తరువాత స్కేల్ ఆఫ్ పే లో, ఆ మూడు ఇంక్రిమెంట్లను కలుపుతూ, నూతన బేసిక్ పే ని నిర్ణయిస్తారు. అంటే ఆ ఇంక్రిమెంట్లు సర్వీసు చివరి వరకూ వస్తుంటాయని అర్థం చేసుకున్నాను. ఆ ఇంక్రిమెంట్లు ఇచ్చిన తరువాత, ఫిట్మెంట్లో మాగ్జిమమ్ రీచ్ అయితే, ‘ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అలవెన్సు’ అని ఓ ప్రత్యేకమైన అలవెన్సు కూడా ఇస్తారు.
ఇంకో విషయం! సి.ఎ.ఐ.ఐ.బి క్వాలిఫికేషన్ వున్నవారికి ప్రమోషన్ సమయంలో స్పెషల్ వెయిటేజ్ కూడా ఇస్తారట! అందుకే ఆ క్వాలిఫికేషన్ని సాధించడం, ఓ ప్రిస్టేజ్‌గా భావిస్తారు బ్యాంకు వాళ్ళు.
కాని, ఆ పరీక్షల్లో పాసవడం అంత ఈజీ కాదట! ఆల్ ఇండియాలో పాస్ పర్సంటేజ్, 15 నుంచి 20 శాతానికి ఏనాడూ మించదట! అదీ గాక, అక్కౌంట్స్ బ్యాక్‌గ్రౌండ్ వారికి పరవలేదు గానీ, సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ వున్న నాలాంటి వారికి మరీ మరీ కష్టమట!
ఆ క్షణంలోనే… ఎలాగైనా… ఆ క్వాలిఫికేషన్ సాధించి తీరాలనే బలీయమైన ఆకాంక్షకు నాలో బీజం పడింది… అంతే! …వెంటనే అందుకు కావలసిన పుస్తకాలు కొనుక్కుని చదవడం మొదలెట్టాను. మొదటిగా పార్ట్ 1 లో రెండు సబ్జెక్టులు, తరువాత రెండు సబ్జెక్టులు, ఐదో సబ్జెక్టు అక్కౌంట్స్ – ఆ ఒక్క సబ్జెక్టును ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి వ్రాద్దామనుకున్నాను.
మొదటిసారిగా వ్రాసిన పార్ట్ 1 లో రెండు సబ్జెక్టులు సునాయాసంగానే పాసయ్యాను.
డెలివరీ కోసం పుట్టింటికెళ్ళింది మా ఆవిడ. ఆ సమయంలోనే, ఎటూ ఒక్కడినే ఉండాలి కాబట్టి పార్ట్ 1 లోని మరో రెండు సబ్జెక్టులు ప్రిపేర్ అయ్యాను. ఓ ప్రక్క బ్యాంకు ఉద్యోగాన్ని బాధ్యతాయుతంగా చేస్తూ, మరో ప్రక్క కష్టపడి చదివి ఆ రెండు సబ్జెక్టులు కూడా వ్రాశాను. చాలా బాగా వ్రాశాను కూడా! ఓ రోజు రిజల్ట్స్ కూడా రానే వచ్చాయి. పాసయ్యాను! ఎంతో ఆనందించాను. పార్ట్ 1 అవాలంటే, చివరిది, అయిదోది అయిన అక్కౌంట్స్ సబ్జెక్టులో పాసవ్వాలి… అంతే!
***
అనుకోకుండా ఓ రోజు, …గుంటూరు నుండి రీజియనల్ మేనేజరు శ్రీ చెరువు రాధాకృష్ణమూర్తి గారు మా బ్రాంచి విజిట్‌కి వచ్చారు. బ్రాంచి మేనేజరుగారితో బ్రాంచికి సంబంధించిన అన్ని విషయాలు చర్చించిన తరువాత, ఇద్దరూ కలిసి స్థానికంగా వున్న, మా బ్యాంకు ద్వారా అప్పు పొందిన కొన్ని యూనిట్లను సందర్శించారు. పెద్ద డిపాజిట్ కస్టమర్లను కూడా కలిశారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి బ్రాంచికి వచ్చారు. స్టాఫ్ మీటింగ్‌లో మా అందరితో ముచ్చటించారు రీజియనల్ మేనేజరు గారు.
ఆ మీటింగులోనే… గుంటూరు బ్రాంచి నుండి, రీజియనల్ ఆఫీసును విడదీసి వేరే బిల్డింగులో పెట్టబోతున్నామని చెప్పారు. తాను ఆ రీజియనల్ ఆఫీసులోనే రీజియనల్ మేనేజరుగా వుండేందుకు హెడ్ ఆఫీసు నిర్ణయించిందని తెలియజేశారు. ఇకపై గుంటూరు మేనేజరుగా, ఈ మధ్యనే ప్రమోషన్ పొందిన మా బ్రాంచి మేనేజరుగారిని ట్రాన్స్ఫర్ చేస్తారని, అతి త్వరలో మా బ్రాంచికి కొత్త మేనేజరు గారు వస్తారని చెప్పారు.
మీటింగ్ అయిపోగానే, మా బ్రాంచి సిబ్బంది అందరూ, మా మేనేజరుగారికి అభినందనలు తెలియజేశారు. తరువాత మేనేజరు గారి క్యాబిన్లో మేనేజరు గారు, రీజియనల్ మేనేజరు గారు, ఇద్దరూ ఏవో విషయాలు చర్చించుకుంటున్నారు.
అంతలో నన్ను క్యాబిన్లోకి రమ్మని కబురు చేశారు. నన్నే ఎందుకు పిలుస్తున్నారో… అర్థం కాక… భయం భయంగా… బిక్కుబిక్కుమంటూ… మేనేజరు గారి క్యాబిన్లోకి వెళ్ళాను.
“ఏం బాబూ! ఎలా వున్నావ్?!… వర్కు బాగా నేర్చుకున్నావా?” అంటూ నన్ను ప్రశ్నించారు రీజియనల్ మేనేజరు గారు.
(మళ్ళీ కలుద్దాం)

ఆంధ్రాబ్యాంకు లో ప్రాంతీయ అధికారి హోదా లో ఉద్యోగ విరమణ చేసిన తరువాత , తన కెంతో ఇష్టమైన రచనా వ్యాసంగాన్ని ఎంచుకొని , కథలు,నాటికలు,నవలలు వ్రాస్తూ ముందుకెళ్తున్నారు.
47 Comments
Sambasivarao Thota
Ee roju SANCHKA lo , nenu vraashina “NAA JEEVANA GAMANAMLO “ ..5..2..episode prachrinchinanduku , Editor Sri MuraliKrishna Gaariki,Sri Somashankar Gaariki , thadithara Sanchika Team Sabhylandariki , naa hrudayapoorvaka kruthajnathalu …
sagar
ఈనాటి ప్రత్యేకత మీరు కష్టతరమైన ఎగ్ఙామ్ పాస్ కావడం. ఎంతో క్లిష్టతరమైన అటువంటి పరీక్ష పాసవ్వడం మీ జీవనగమనంలో ఒకమైలురాయి అని నా అభిప్రాయం. మీకు అభినందనలు సర్
Sambasivarao Thota
Avunu Brother Sagar..
Mee abhipraayam nizame..
Thanks
P Sreenivasa Rao
Happy to go way back decades. The zeal to grow & learn is quite visible. The respect given to parents and elders is the best thing to observe from this story. The pure relations with showering blessings are lacking now a days. The author is the luckiest to have them. All the best for CAIIB and beautiful kids.
Sambasivarao Thota
Srinivas Rao ..
Thanks for observations and appreciation…
Sambasivarao Thota
Happy to go way back decades. The zeal to grow & learn is quite visible. The respect given to parents and elders is the best thing to observe from this story. The pure relations with showering blessings are lacking now a days. The author is the luckiest to have them. All the best for CAIIB and beautiful kids.
From
Sri Srinivas Rao..
Guntur
Sambasivarao Thota
Thanks SrinivasaRao..
Sambasivarao Thota
జీవన గమనం…చక్కని గాడి లవ్ పడింది…..మాకు వారం వారం…. మీ రచన కోసం ఎదురు చూస్తాం….శైలి బాగుంది సాంబశివ రావు గారు

మా తాత గారిని జ్ఞాపకం చేసుకున్నారు..ధన్యవాదములు…


Sambasivarao Thota
The above comments are from
Sri Ramana,,Hyderabad..
Ramana Garu!
Mee comments nannentho uthsaahaparusthunnayi..!!
Marentho uthejaanni Isthunnaayi..!!
Dhanyavaadaalandi
Sambasivarao Thota
Very good to know that your marriage was performed at Tirumula.
From
Sri RamanaMurthy
Vizag
Sambasivarao Thota
Thanks RamanaMurthy
Sambasivarao Thota
Sir
I have gone through your story. It’s nice.
Thanks for sharing
Regards
From
Sri Seshumohan
Hyderabad
Sambasivarao Thota
Thanks Seshimohsn Garu
Sambasivarao Thota
Mamaiah wonderful.
While reading imaging pictures before me.
Really mamaiah it’s coming from my heart you are the roll model to us and we should learn how to maintain balance in Life.


I remember one word from Bhagavat Gita that is SITHAPRATHIGUNUDU
From
Mr.Nagaraju
Vijayawada
Sambasivarao Thota
Nagaraju..
Visualising while reading is an art..
Good that you possess it…
I feel honoured about your opinion on me..
God bless you and all your family members
పాలేటి సుబ్బారావు
మీ తల్లితండ్రులు మీకు ఆ సమయంలో పెళ్లి చేయాలనే ఆలోచన చాలా సమంజసంగా ఉంది సాంబశివరావు గారూ. వారి మీద నమ్మకం ఉంచి వారు సెలెక్ట్ చేసిన అమ్మాయిని మీరు కూడా అంగీకరించి పెళ్ళి చేసుకోవడం చాలా బాగుంది. ఈ కాలంలో, పెద్దవాళ్లు కూడా కొంతమంది పిల్లల పెళ్లి, ఏవేవో కారణాలతో, సకాలంలో చేయలేకపోతున్నారు. పిల్లలు కూడా చాలామంది తల్లిదండ్రుల అభిమతాల కు విలువ ఇవ్వడం లేదు. అందువల్ల పిల్లల పెళ్ళిళ్ళు సకాలంలో జరగడం లేదు. సకాలంలో పిల్లలను కనడం కూడా చాలా ముఖ్యమైన విషయం. ఇంత విలువైన విషయాలను ఈనాటి యువతరం నిర్లక్ష్యం వహిస్తున్నారు. చివరలో మమ్మల్ని మంచి సస్పెన్స్ లో పెట్టారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నని ఆత్రుతగా ఉంది.
Sambasivarao Thota
SubbaRao Garu!
Thanks for your observations and appreciation
Bhujanga rao
బ్యాంక్ ఉద్యోగులకు caiib పాస్ కావటం ఎంతగా నో ఉపయోగం ఉంటుందని,వారికి ప్రమోషన్ విషయంలో గాని,ఇతర విషయాలలో చాలా అనువుగా ఉంటుందని చక్కగా చెప్పారు.మీకు అభినందనలు సర్.మీరు తల్లి తండ్రులు, మరియు పెద్దవాళ్లతో సముచితమైన గౌరవంతో,స్నేహా భావంతో ఉంటారని జీవనగసమనం ద్వారా తెలుసు కున్నాము. వచ్చే వారం మీ ఎపిసోడ్ కొరకు ఎదురుచూస్తుంటాము సర్.
Sambasivarao Thota
Thanks for your observations and appreciation Bhujangarao Garu
rao_m_v@yahoo.com
Gripping narrative. Hats off to your photographic memory. I eagerly wait every Sunday to read your serial!
Sambasivarao Thota
Sri MN Rao Garu!
Thanks Andi
Sambasivarao Thota
Marriag vishayamlo Mee nirnayam bagundi.
From
Mrs.Kasthuri Devi
Hyderabad
Sambasivarao Thota
Kasthuri Devi Garu!
Dhanyavaadaalandi
Sambasivarao Thota
From
Mr.Leelaa Krishna
Tenali
Sambasivarao Thota
From
Mr.Leelaa Krishna
Tenali
Sambasivarao Thota
Thanks Leelaa Krishna
Sambasivarao Thota
caiib kastalu bagunnai sir.
From
Sri SuryachandraRao
Hyderabad
Sambasivarao Thota
Thanks SuryachandraRao Garu
Sambasivarao Thota
Excellent but what a suspense we must bear for next one week. Nice one but our dasari garu was remembered. Next week we will hear double damaka family promotion and some office good news.
From
Sri KS Murthy
Hyderabad
Sambasivarao Thota
Murthy!
Chooddaam ..
Yemouthundo…
Dhanyavaadaalandi
Sambasivarao Thota
సాంబశివరావు గారు మీరు చాలా అదృష్టవంతులు
From
Smt.Seethakkaiah
Hyderabad
Sambasivarao Thota
Thanks Seethakkaiah
Rattaiah boddudu
Today part of your life experiences are unforgettable. Narration of ur story is excellent
. Hope to continue with more matter.
Sambasivarao Thota
Thanks Andi Rattaiah Garu

I shall try to come up to your expectations
P. Nagalingeswara Rao
నా జీవనగమనం 5.2 చాలా ఆసక్తిగా
సాగింది . మీకు పెళ్లి జరగటం ,తరువాత departmental exams వ్రాసి పాస్ అవటం అన్ని కూడా శుభపరిణామం. ముందు ముందు ఇంకా శుభవార్తలతో ముందుకు మీజీవనగమనంసాగుతుంది అని తలుస్తాను సాంబశివ రావు గారు.
Sambasivarao Thota
Thanks Andi Nagalingeswara Rao Garu

We Will see the future happenings serially..
Kusharani
Sambasiva garu though I am not able to post comment for every episode of “Geevana gamanam” still I am following your every episode . Really Sambasiva garu your memory power & expressing the same memories on paper in neat & decent language is fantastic. Simultaneously you are also making same aged group of people to go through their past Golden days and forgetting the present busy life for a while. Sambasiva rao what you presently doing is also comes under one type of social service. Your selection of writing & enjoying yourself & making others to enjoy is also just like how you selected bank job as your career proves your wisdom of leading life happily before & after retirement.
In those days there was very craziness for bank jobs .Geting bank job is a great achievement. So you got two achievements one bank job & other as a writer.
Your family members also supported you well & they have also taken right decisions at write time & helped you in taking right path by supporting you morally.
From your side you also put your efforts & whatever hardwork you can afford in achieving high positions in bank & thus making your family proud of you.
During this process financially also your calculations are good & taken a good step. Once again this proves your intelligence & wisdom.
Ok Sambasiva rao garu eagerly waiting for next episode
Sambasivarao Thota
Usha Rani Garu!

Thanks for your observations and appreciation
Your eloberative analysis of my episodes and also the encouraging words you are writing,are so practical and natural..
I am so inspired and motivated to do the Best in my chosen line of activities..
Thank You very much,once again
Jhansi koppisetty
Well narrated with all minute details




ఈ ఎపిసోడ్ లో ఇంక్రిమెంట్ల గురించి చదువుతుంటే నాకూ నా ఇంక్రిమెంట్లు గుర్తొచ్చాయి.. సాధారణంగా స్టెనోల shorthand speed 80 words per minute వుంటుంది. మాకు 100 words per minute speed రాస్తే ఒక ఇంక్రిమెంటు 120 words per minute రాస్తే రెండు ఇంక్రిమెంట్లు ఇస్తారు. అందుకు ఒక board కూర్చుంటుంది. నేను కష్టబడి 120 words speed practice చేసి రెండు ఇంక్రిమెంట్లు సంపాదించాను… ప్రతీ ప్రమోషనులో ఆ రెండు ఇంక్రిమెంట్లు బేసిక్ పేలో ఏడ్ అయ్యేవి.. అలా సీనియర్ స్టెనోల కన్నా నా పే ఓ పిసరు ఎక్కువుండేది
Sambasivarao Thota
Jhansi Garu!

Thanks for your observations and appreciation
Mee increments kosam mee Shrama ,hard work ,abhinandaneeyam..
Theliyajeshinanduku Dhanyavaadaalandi
Naccaw Sudhacaraw Rau
This episode as the earlier ones is interesting. Your gracious acceptance of the match settled by elders was an example of your gracious respect for elders.
The perseverance and practice to get through the Departmental exams and clearance of the tests speak for your industry and ambition.
However,the closing of this episode is dramatic and thrilling since you left us with suspense to know why the Manager and the RM called you in!!
Nice closing!!
Sambasivarao Thota
Sudhakar Rao Garu!
I thank you very much from the bottom of my heart,for your practical and eloberative analysis of the episode…
I am delighted to read your inspiring and motivating words,which I always cherish..
We will see what is going to happen in thy Manager’s cabin on coming Sunday..
Thanks for your observations and appreciation,which I value the most
డా కె.ఎల్.వి.ప్రసాద్
పెళ్లి సందడి
పరీక్ష ల అలజడి
రీజినల్ మేనేజర్ పిలుపు
తదుపరి సస్పెన్స్…
బాగుంది ఈ ఎపిసోడ్.
రావుగారు…
మీకు అభినందనలు.
Sambasivarao Thota
Prasad Garu!

Dhanyavaadaalandi!!
Sambasivarao Thota
Prasad Garu!
Dhanyavaadaalandi
Sambasivarao Thota
యౌవనం జ్ఞాపకాలు తీయగా వుంటాయి. రాసిన వారికి చదివిన వారికి ఆనందం కలుగుతుంది
From
Sri ChidambaraRao
Hyderabad
Sambasivarao Thota
ChidambaraRao Garu!

Avunandi!!
Dhanyavaadaalandi!!!