

శ్రీ బివిడి ప్రసాదరావు రచించిన ‘నరేంద్ర ఐ యామ్ విత్ యు’ అనే నవలని సరికొత్త ధారావాహికగా అందిస్తున్నాము.
~
చక్కని ఉద్యోగాన్ని వదిలేసి, పల్లెటూరికి వెళ్ళి వ్యవసాయం చేయాలన్న ఆలోచన నరేంద్రకి ఎందుకొచ్చింది?
తల్లిదండ్రులని ఒప్పించి మరీ పల్లెటూరికి వెళ్ళేందుకు ఏది దోహదం చేసింది?
అతని లక్ష్యమేమిటి? అతనికి ఆ ఊర్లో ఆసరాగా నిలిచినదెవరు?
తనను ప్రోత్సహించిన ఆ ఊరి మాథ్స్ టీచర్ శ్యామలతో నరేంద్రకి ఏర్పడిన పరిచయం ప్రణయంగా మారి అనురాగ వల్లరిలా ఎలా అల్లుకుంది? ఎవరు ముందు చొరవ చూపారు?
శ్యామల సమయోచితమైన సూచనలు నరేంద్రకు ఎలా ఉపయోగపడ్డాయి?
నరేంద్రను చూసి అతనిలానే సమాజానికి ఉపయోగపడాలని ముందుకొచ్చిన మరికొందరిని అతనెలా గైడ్ చేశాడు?
~
విలన్లు లేకుండా, దుర్మార్గాలు మోసాలు, కుట్రలు లేకుండా చక్కగా సానూకూల వాతావరణంలో సాగే ఈ నవల హాయిగా చదివిస్తుంది.
~
వచ్చే వారం నుండే..
‘నరేంద్ర ఐ యామ్ విత్ యు’
చదవండి.. చదివించండి..