[కె.వి.యస్. గౌరీపతి శాస్త్రి గారు రచించిన ‘నీ స్ఫూర్తి’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]


మంచు తెరలు కురుస్తున్నాయి
మత్తు పొరలు క్రమ్ముతున్నాయి
మన సంస్కృతులు
మంటగలుస్తున్నాయి
పరాయి పెట్టుబడులు
పెంచి పోషిస్తున్నాయి
కన్నతల్లి చనుపాలు త్రాగి
కండలు పెంచిన వీరులు
సవతి తల్లి ఒడి తొత్తులు
కారణం ఏమిటి చూద్దామా?
మన నందులు వివేకులుగా!
వివేకానందుడు పుట్టిన నేల
విజ్ఞానం పంచిన భూమిలో
అజ్ఞానపు సుడులు తిరిగి
ఆకాశ నిచ్చెన లెక్కున్నాయి
అవకాశ మెట్లెక్కుతున్నాయి
మన దౌర్భాగ్యం అనుకుందామా?
చేతకాక సిగ్గు చిందిద్దామా?
ఓ నవయువతా మేలుకో
రత్నగర్భ నీ భూమని తెలుసుకో
ఎందరినో పోషించిన ఈ నేల
నిన్ను పేదను చేస్తుందా?
నీలో చిచ్చులు తొలగించు
చుచ్చు బుడ్డులు వెలిగించు
వెలుగులు విరజిమ్మ నర్తించు
కన్న తల్లి కడుపుకోత తీర్చు
పాపాత్ముల పాలనలను ఛేదించు
ఇజాలు వద్దు నిజాలు గ్రహించు
లే భారతకీర్తిని పెంపొందించు.
విశ్వ యవనికపై నీ ధర్మం ప్రబోధించిన వివేకానంద నీ స్ఫూర్తి