[శ్రీమతి తోడేటి దేవి రచించిన ‘నీలో నేను..!!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


నీ ఊసులతో నేను
నా ఊహల్లో నువ్వు
సదా ఎప్పుడు నాతోనే..!
ఎదురెదురు లేకున్నా
ఉన్నట్టుగా మాట్లాడే తీరు..
పక్కనే ఉన్నట్టు చెప్పే ఊసులు..
నీకూ నాకూ మధ్య
లెక్కే లేని అడుగుల దూరం!
అయినా సరే..
కనుపాపల ముందు,
రెప్పల వెనుక–
నీ రూపం ప్రతి నిమిషం.
మనసైతే నీతోనే సావాసం!
తలపులు నీవే, తికమకలు నీ వల్లే..
నా ఉచ్ఛ్వాసం..
ఎక్కడి నుండో నువ్వు
నా కోసం పంపిన ఊపిరి!
నా చిరునవ్వు..
నీ ఊహల, ఊసుల గిలిగింతల ఫలితం..!
నువ్వొస్తావేమో అన్న ఊహ చాలు
వేల వాయులీనాలు –
నా కోసం మోగుతాయి!
అద్భుతం..
నిన్ను వెంటబెట్టుకొచ్చిన క్షణం
నా ఎదురుగా.. ఆశ్చర్యంగా..
అందంగా.. ముస్తాబయ్యి..
నువ్వు నేను..
మనసులో మాటలు సైతం
వినిపించేంత దగ్గరగా..!
నీ స్పర్శ తాలూకు పరిమళం
నాతోనే ఉండేంత దగ్గరగా..
నీడలు సైతం చేతులు కలిపి
నడిచేంతగా..
కొత్త లోకం..
రంగుల ఇంద్రజాలం..
నీ వల్లే..!
తెలియకుండా కాలం
రోజుల పేజీలు తిప్పేస్తోంది..!
ఇంకా అందంగా నీతో
ప్రయాణాన్ని రాసుకోవాలి..
మురిసిపోవాలి..!!

తోడేటి సునీలా దేవి గారు ప్రస్తుతం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో మేనేజర్‌గా సేవలందిస్తున్నారు. జన్మస్థలం విజయవాడ. సిద్ధార్థ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో పట్టభద్రులైనారు.
16 Comments
Shyam kumar chagal
అద్భుతమైన భావాలు
sunianu6688@gmail.com
TQ shyam garu
sunianu6688@gmail.com
నా ఈ కవిత “నీలో నేను ” ప్రచురించిన సంచిక యాజమాన్యానికి, శ్రీ సోమ శంకర్ గారికి, సాంకేతిక నిపుణులకు, మరియు నన్ను అనుక్షణం వెన్నుతట్టి ప్రోత్సహించే Dr KLV ప్రసాద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు



M.Anuradha
Andamyna vuhalokamlo …
Adbhutamyna rasaaswaadana
sunianu6688@gmail.com
TQ Mam
సత్తి పద్మ
చాలా బాగుంది దేవి గారూ. ఊహల్లో వేగం ఎక్కువ.ఆనందం కూడా ఎక్కువే.ఎందుకంటే అవి మన చేతుల్లో ఉంటాయి కాబట్టి.చాలా బాగా రాశారు.
sunianu6688@gmail.com
TQ padma garu
MV Satyaprasad, Vijayawada
మీ రాసిన కవిత ” నీలో నేను ” చాల బాగా రాశారు . భావాన్ని బాగా ప్రస్ఫుటింప చేశారు. మళ్ళీ మళ్ళీ చదవాలి అనిపించింది. ఇలాగే వ్రాస్తూ ఉండండి.
sunianu6688@gmail.com
TQ brother
సత్తి పద్మ
గుప్పెడంత గుండెలో
ఉప్పెనంత ఊహలు.
అందమైన అలలలా ప్రశాంతంగా కొన్ని,
చుట్టుముట్టి ముంచేసే సునామీలా కొన్ని.
అద్భుతమైన కవిత దేవిగారూ
అభినందనలు
bajisyed45@gmail.com
భౌతిక మై జీవిత సత్యమనే కుసుమం గా
వికసించాలని
హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
sunianu6688@gmail.com
TQ అండి
. నా కవిత కన్నా మీ అందమైన వివరణ బాగుంది అండి 
Shyam kumar chagal
మనసుకు సంబంధించిన భావాలను హృదయాలలోంచి పుట్టుకొచ్చిన మధురమైన ఊహలను జోడించి కవిత్వం రూపంలో మనకందించిన కవయిత్రి శ్రీమతి తోడేటి సునీల దేవి గారికి నా యొక్క అభినందనలు
Sunianu6688@gmail.com
ధన్యవాదాలు సర్
Mohammad. Afasara Valisha
అద్భుత మైన భావనతోచాలా బాగా వ్రాశారు కవిత దేవి గారు చాలా చక్కని అనుభూతి సో… బ్యూటిఫుల్ హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు











మొహమ్మద్. అఫ్సర వలీషా
ద్వారపూడి (కోనసీమ జిల్లా)
sunianu6688@gmail.com
TQ very much అండి