[శ్రీ సముద్రాల హరికృష్ణ రచించిన ‘నే నెక్కడి కెళ్ళానూ?’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
నేనెక్కడి కెళ్ళానూ, ఇదిగో నీ ముందే ఉన్నాగా?! ఆ నిమ్మకు నీరెత్తినట్టు, మీ గుళ్ళో దైవమట్టు!! *** ఇదిగో ఇపుడే తారామణుల కోలాహలంలో! అదిగో పడవ లాంటి చంద్రవంక విహారంలో!! *** ఈ క్షణం హరి ధనువు రంగుల దొంతరలలో ఒక్క ఊపుతో శ్వేతాశ్వపు ఆ రౌతు బీరంతో! *** మరు లిప్త నీలిమబ్బు నీటిముత్యాల ఆటలో మెరిసేటి కత్తి ఝళిపింపు,ఆ వియత్ప్రభలో! *** అదె, ఆ ఆకాశగంగ దివ్య జలాభిషేకంలో నందనవన విరిమండప సౌరభపర్వంలో!! *** ఇక్కడ అబ్ధి ఉవ్వెత్తు అలల పడగలపై అక్కడ నదీ సుందరి నడక బెడగులలో!! *** ఇదె, విరిసే సుమంతో సుస్నేహ సంభాషణలో అదె, రాలే సుమధీర, మ్రృదు సమాశ్వాసనలో!! *** నేనొట్టి మట్టి గణపతినే, అర్థం అయిందిగా?! ఆ నిమ్మకు నీరెత్తినట్టు, మీ గుళ్ళో దైవమట్టు!! *** లోపలి వానరపు విశ్వ యాన విలాసమది, ఆ పైవన్నీ, దాని కొమ్మచ్చులే, రెమ్మ ఊయలలే!!
*** నేనెక్కడి కెళ్ళాను, ఇదిగో నీ ముందే ఉన్నాగా?! ఆ నిమ్మకు నీరెత్తినట్టు, మీ గుళ్ళో దైవమట్టు!!
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
జ్ఞాపకాలు – వ్యాపకాలు – 34
మరుగునపడ్డ మాణిక్యాలు – 45: నాయక్
నీలి నీడలు – ఖండిక 1 – వరకట్నం
కాజాల్లాంటి బాజాలు-112: సలహా ఇద్దురూ!..
శాంతి
మరుగునపడ్డ మాణిక్యాలు – 54: ఇటర్నల్ సన్‌షైన్ ఆఫ్ ద స్పాట్‌లెస్ మైండ్
మా అన్న మీనన్ మలయాళీ కాదు..!!
బాలల హక్కుల అవగాహన
స్నిగ్ధమధుసూదనం-21
గొంతు విప్పిన గువ్వ – 36
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®