[శ్రీ కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం రచించిన ‘నువ్వు లేక నేను లేను’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


నీ నయనాల బాసలు
నాలో కోటి ఆశలు రేపాయి
నీ దరహాసపు భాషలు
నాలో భావుకతను నింపాయి
నీ తియ్యని పలుకులు
నా మది వీణను మీటాయి
నీ చిలిపి చేష్టలు
నాకు ఇష్టాలుగా నిలిచాయి
నీ రూప లావణ్యం
నను మంత్రముగ్దుణ్ని చేసింది
చివరకు నా మనసు
ఓ మాట చెప్పింది..
నువ్వు లేక నేను లేనులేనని..
