[పాలస్తీనా కవి ఖాలేద్ జుమా రచించిన కవితని తెలుగులో అందిస్తున్నారు ప్రముఖ రచయిత్రి గీతాంజలి. Telugu Translation of Palestinian poet Khaled Juma’s poem ‘Oh Rascal Children Of Gaza’ by Mrs. Geetanjali.]
~
ఓహ్హ్ నా గాజా అల్లరి పిల్లల్లారా.. నా కిటికీకి అవతల మీ అరుపులతో నన్ను నిత్యం చిరాకు పెట్టిన పిల్లల్లారా.. ప్రతీ ఉదయం… దూకుడుగా నా పూల కుండీలను విరగ్గొట్టి.. నా బాల్కనీలో మిగిలిన ఒకే ఒక్క పువ్వును దొంగలించిన అల్లరి పిల్లల్లారా.. ఒక్కసారి.. ఒకే ఒక్కసారి వెనక్కి తిరిగి రండి. నా ఇంటి ముందు ఎంత సేపైనా ఆడుకుంటూ ఎంత పెద్దగా అయినా అరవండి. మీకు కావాల్సినన్ని పూల కుండీలను పగల గొట్టుకోండి. ఎన్ని పూలు కావాలంటే అన్నీ పూలనూ దొంగలించుకు పోండి. నేనేమీ అనను.. నిజం. రండి.. వెనక్కి తిరిగి రండి. ఒక్కసారి.. ఒక్కసారి.. రండి.. నా గాజా పిల్లలారా..
మూలం: ఖాలేద్ జుమా
అనువాదం: గీతాంజలి
పాలస్తీనియన్ కవి, నాటక రచయిత ఖలీద్ జుమా గాజా స్ట్రిప్‌లోని అల్-షబౌరా పాలస్తీనా శరణార్థుల శిబిరంలో పెరిగారు. ప్రస్తుతం పాలస్తీనా న్యూస్ అండ్ ఇన్ఫర్మేషన్ ఏజెన్సీ (WAFA) లో కల్చరల్ డిపార్ట్మెంట్ హెడ్‌గా ఉన్నారు. గతంలో ఏడేళ్ల పాటు రోయా మ్యాగజైన్‌కు ఎడిటర్-ఇన్-చీఫ్‌గా ఉన్నారు.
జుమా ‘Oh Rascal Children Of Gaza’ అనే ఈ కవితను ఆపరేషన్ ప్రొటెక్టివ్ ఎడ్జ్‌లో గాజాపై ఇజ్రాయెల్ బాంబు దాడి సమయంలో వ్రాశారు. ఈ కవిత మొదట ఆగస్టు 24, 2014న ప్రచురించబడింది.
శ్రీమతి గీతాంజలి (డా. భారతి దేశ్‌పాండే) వృత్తిరీత్యా సైకోథెరపిస్ట్, మారిటల్ కౌన్సిలర్. కథా, నవలా రచయిత్రి. కవయిత్రి. అనువాదకురాలు. వ్యాస రచయిత్రి. ‘ఆమె అడవిని జయించింది’, ‘పాదముద్రలు’. లక్ష్మి (నవలిక). ‘బచ్చేదాని’ (కథా సంకలనం), ‘పహెచాన్’ (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), ‘పాలమూరు వలస బతుకు చిత్రాలు’ (కథలు), ‘హస్బెండ్ స్టిచ్’ (స్త్రీల విషాద లైంగిక గాథలు) ‘అరణ్య స్వప్నం’ అనే పుస్తకాలు వెలువరించారు. ‘ఈ మోహన్రావున్నాడు చూడండీ..! (కథా సంపుటి)’ త్వరలో రానున్నది. ఫోన్: 8897791964
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
త్రోవ
సిరివెన్నెల పాట – నా మాట – 41 – లోతైన భావాల వెన్నెల పాట
నూతన పదసంచిక-31
అమ్మణ్ని కథలు!-22
విజయ విశ్వనాథమ్: విశ్వ విజయీభవ!-1
పదసంచిక-68
నవ్వేజనా సుఖినోభవంతు -4: రభస సభలు
అష్టాదశ కథల సమాహరం ‘అమ్మకో అబద్ధం’
అత్తగారు.. అమెరికా యాత్ర 20
అన్నం విలువ మనసుకు తాకేలా వివరించారు... ప్రతిదీ వివరంగా పరిశీలించి అందిస్తున్నందుకు ధన్యవాదాలు...🙏
Thank you somuch sir
ధన్యవాదాలు సర్.
సుబ్బారావు గారు ధన్యవాదాలు మీకు.
వేణు గారూ ధన్యవాదాలు
All rights reserved - Sanchika®