[శ్రీమతి జీ. సందిత రచించిన ‘ఒంటరితనం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]


ఆడపిల్లలూ
మగపిల్లలూ
కూతుళ్లూ
కొడుకులూ
చెల్లెళ్లూ
తమ్ముళ్ళూ
ఆడాళ్ళూ
మగాళ్ళూ
పిన్నమ్మలూ
బాబాయిలూ
స్నేహితులూ
బంధువులూ
చుట్టూ
మనుషులెందరో
వందల్లో ఉన్నా
ఆడై నా
మగైనా
ఆ వ్యక్తి ఒంటరే
ఒంటరితనం
ఒంటరిగా
ఉండడంవల్ల రాదు..
చుట్టూ ఉన్న మనుషులు..
కనీసం
గుర్తింపూ
మర్యాద, గౌరవం ఇవ్వనపుడే
ఆ వ్యథను
అనుభవిస్తున్న
ఆ వ్యక్తికి..
అది
అసలైన ఒంటరితనం!
అయినా
అప్పుడది
ఆప్యాయంగా
అక్కున చేర్చుకునే
అమ్మ ఒడి ఔతుంది!!