[శ్రీమతి పుట్టి నాగలక్ష్మి రచించిన ‘పహరా హుషార్’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


అలనాడు..!
ఉమ్మడి కుటుంబాలలో
బామ్మా, తాతయ్యల
ప్రేమ, లాలనలో
అల్లి బిల్లి తిరుగుతూ
గిల్లి కజ్జాలాడుకుంటూ
ఆత్మీయాభినాల మధ్య
కల్లాకపటం లేని స్నేహలతల నీడల్లో
సామరస్యం, పరస్పర అవగాహనలతో
ఎదిగి ఒదిగిన పిల్లలు
మనోధైర్య స్థైర్యాలతో
ఆత్మన్యూనతను అధిగమించి
అభివృద్ధి పథంలో పయనించి
‘జననీ జన్మభూమిశ్చ – స్వర్గాదపీ గరీయసి’ అని నిరూపిస్తే..!
ఈనాడు..!
వ్యష్ఠి కుటుంబంలో
మితిమీరిన గారాబం
పెచ్చరిల్లిన అసహనం – దురభిమానం –
సామాజిక అవగాహనా లోపం –
స్నేహ, ప్రేమరాహిత్యాలనే
అడకత్తెర మధ్య పోకచెక్కలా నలిగిపోతుంటే!
కృష్ణ పక్షపు చంద్రుడిలా మసక బారుతుంటే!
కాంక్రీటు, కార్పొరేట్ విద్యాలయాల్లో
పెల్లుబికిన రాక్షసత్వం
సర్దుకోలేని పసితనం
అమాయకపు మొండితనం
ఆత్మహత్యకు పురికొల్పితే
ఆ తల్లిదండ్రుల ఆవేదన..!
అనిర్వచనీయం..
నేటి తల్లిదండ్రులూ!
పహరా హుషార్! పహరా హుషార్! పహరా హుషార్!

10 Comments
అల్లూరి Gouri Lakshmi
Message oriented poem.. నిజమే! తల్లితండ్రులు పిల్లల్ని బహుజగ్రత్తగా కాచుకోవలసిన తరుణం.చక్కని కవిత లక్ష్మీ..అభినందనలు.
శ్రీధర్ చౌడారపు
జారిపోయిన గతాన్ని, కళ్ళముందున్న వర్తమానాన్ని కవితగా మలిచారు. సమకాలీన సమస్యలను ఏకరవు పెట్టారు. ఏం చేయగలం ? సరిదిద్దుకునే అవకాశం ఉన్నచోటల్లా ప్రయత్నం చేయాలి.
బాగుంది మీ కవిత అభినందనలు.
కొల్లూరి సోమ శంకర్
పహరా హుషార్ కవిత చదివాను. బావుంది.అభినందనలు.
తమిరిశ జానకి
కొల్లూరి సోమ శంకర్
పహరా హుషార్ హుషారుగా సాగింది.అభినందనలు
డా. వి.ఆర్.రాసాని
కొల్లూరి సోమ శంకర్
Excellent..congrats!
A. Raghavendra Rao
శీలా సుభద్రాదేవి
నాగలక్ష్మి గారూ మీ పహారా హుషార్ కవిత చదివాను.నేటి యువతరానికే కాక, తల్లిదండ్రులకూచాలా అవసరమైన కవిత.మనసారా అభినందనలు
కొల్లూరి సోమ శంకర్
సరిగ్గా రాశారు. మావాళ్ళ పిల్లలు ఇద్దరు. (వేరు వేరు ఇంటి) 10,8 చదివే వాళ్లు ఈ జనవరిలో హాస్టల్ నుంచి వచ్చేశారు. మిగతా పిల్లలు సతాయిస్తున్నరని. మీ కవితకు అద్దం పట్టినట్టుంది సిట్యుయేషన్. బాగా రాశారు
దొడ్డపనేని అఖిల
కొల్లూరి సోమ శంకర్
ఇప్పటి కార్పొరేట్ విద్యాలయాలలో పరిస్థితి ఇది. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రజ్ఞను దృష్టిలో పెట్టుకుని ఎక్కడ చేర్పించాలో , తమ పిల్లలు ఏమి చదవగలరో నిర్ణయించుకుని జాగ్రత్త పడాలి. అభినందనలు నాగలక్ష్మి
పి. విజయలక్ష్మి
Sugunaallani
చాలా బాగా చెప్పారు నాగలక్ష్మి గారూ!ఇది వరకు ఇంట్లో పెద్దవారు పిల్లలను ఏదైనా అన్నా.. తల్లిదండ్రులు కోపం వచ్చేది కాదు.. ఇప్పుడు మనవలు మనవరాళ్ళనేమైనా అంటే తల్లిదండ్రులకు కోపం వచ్చి అసలు దగ్గర కే వెళ్లనివ్వరు….. ఓపిక అనే మాట అర్థం తెలియకుండా పోతుంది…
అభినందనలు
sunianu6688@gmail.com
ప్రస్తుత పిల్లల మరియు తలితండ్రులు మేల్కొలిపే “కవిత ” అప్పట్లో భర్త ఉద్యోగానికి వెళితే భార్య అన్ని పనులు, పిల్లల చదువులు చూసుకునేది. తాత, భామ్మ గార్లతో పాటు, బాబాయ్, మేనమామల అదుపు, ఆజ్ఞలు ఉండేవి. పిల్లలు క్రమశిక్షణ తో పెరెగేవారు.ఇప్పుడు హాస్టల్ చుదువులు, ఎవరికి వారే. చాలా బాగుంది కవిత మాం! అభినందనలు


