భారతీయుల పండుగల గురించి, జాతీయ పర్వదినాల గురించి ఒక నూతన ప్రక్రియలో వెలువరించిన కవితల సంపుటి ‘పండుగలు ముత్యాలహారాలు’. ఉట్నూర్ సాహితీ వేదిక ద్వారా వెలువడిన 31వ పుస్తకం ఇది.
వృత్తి రీత్యా హిందీ అధ్యాపకులైన శ్రీ రాథోడ్ శ్రావణ్ తెలుగు సాహిత్యాభిమాని. స్వయంగా కవి, వ్యాసకర్త కూడా. కవిత్వం మీది అభిమానంతో స్వయంగా ‘ముత్యాలహారం’ అనే ఒక కొత్త కవితా ప్రక్రియని రూపొందించారు.
‘ముత్యాలహారం’ కవితా ప్రక్రియ నియమాలు:
ఈ ప్రక్రియని కవుల్లో ప్రచారం చేయడమే కాకుండా ఈ ప్రక్రియలో కవితలు రాసి, సంపుటి వెలువరించడం ముదావహం.
***
ఈ పుస్తకంలో మన దేశంలో వివిధ మతస్తులు జరుపుకునే పండుగలు, జాతీయ పర్వదినాలు, మహనీయుల జయంతులపైన లఘుకవితలు ఉన్నాయి. తెలుగువారి పండుగ ‘ఉగాది’తో ప్రారంభించి ‘ఉపాధ్యాయ దినోత్సవం’తో ముగించారు.
ఈ పుస్తకంలోని 29 ముత్యాలహారాలలో, దేనికదే ప్రత్యేకమైనది. పండుగలు, పర్వదినాల నేపథ్యంలో సరళమైన పదాలతో, భారతీయ సంస్కృతిని సంప్రదాయాలను వివరించారు కవి. అలాగే ముఖ్యమైన దినోత్సావల నేపథ్యంగా కొందరు మహనీయులు జాతికి చేసిన సేవలను స్మరించారు.
‘ఉగాది’లో “కోకిలమ్మ పాటలు/పరిమళిస్తూ పువ్వులు/వసంత కాల ఋతువులు/మదిన ఆనందక్షణాలు” అంటూ పండుగ ప్రాశస్త్యం వివరించడంతో పాటు అందమైన ప్రకృతిని దర్శింపజేస్తారు.
‘శ్రీరామనవమి’లో “శ్రీరాముని గుణగణాలు/అధర మధుర తలపులు/నిత్య సత్య వచనాలు/సకల ప్రాణుల రక్షకులు” అంటూ శ్రీరామచంద్రుని స్తుతించారు.
‘గురు పూర్ణిమ’లో “రవి చంద్రుల వెలుగులు/చుక్కల్లోని చంద్రులు/సత్య హరిశ్చంద్రులు/మన గురువులు” అంటూ గురువుల ఔన్నత్యాన్ని చాటుతారు.
‘నాగుల పంచమి’లో “ఉయ్యాల కట్టాలి/అక్క చెల్లిని పిలవాలి/ఖుషి ఖుషిగా ఉండాలి/ఉయ్యాల పాట పాడాలి” అంటూ పండుగ వేడుకలోని ఆచారాలను తెలుపుతారు.
‘రాఖీ’లో “రక్షాబంధన వేడుకలు/సంతోష పలకరింపులు/రంగురంగుల రాఖీలు/కట్టేను అక్కాచెల్లెళ్ళు” అంటూ సోదరీమణుల అప్యాయతలను ప్రదర్శిస్తారు.
“అల్లిన బుట్టలను పట్టి/చేతులు చేతులు కట్టి/తెచ్చేను చీమల మట్టి/ఉపవాస దీక్షలు పట్టి” అంటూ ‘తీజ్’ పండుగ సందర్భంగా గిరిజన మహిళల భక్తశ్రద్ధలను తెలియజేస్తారు.
“మా కోసం బతుకుతావు/సిరులు పండిస్తున్నావు/పండుగ రోజున నీవు/పూజలు అందుకుంటావు” అంటూ ‘పోలాల అమావాస్య’ సందర్భంగా పశువులను పూజించే ఆచారం గురించి తెలిపారు.
“సంతోషంగా ఆటలు/మధురమైన పాటలు/వరి పొలాలు అందాలు/వాకిలికి కొత్త శోభలు” అంటూ బతుకమ్మ పండుగలోని శోభని కళ్ళకు కడతారు.
“తలకు నెమలి కిరీటాలు/కాళ్ళకు కట్టేను గజ్జెలు/చేతికి రాజదండాలు/రేల, థింసా నృత్యాలు” అంటూ ఆదివాసి పండుగ ‘దండారి’ని జరుపుకునే పద్ధతిని పరిచయం చేస్తారు.
“పవిత్రమైన పండుగ/నిష్ఠ నియమాలు ఉండగ/ఉపవాసం కఠినంగా/సహర్ ఇఫ్తిర్ విందుగా” అంటూ రంజాన్ పండుగ విశిష్టతని వెల్లడిస్తారు.
‘క్రిస్మస్’లో “మీ మహిమలు అనంతం/మీ దీవెనలు అమృతం/మీ బోధనలు అద్భుతం/ప్రభు త్రిగుణాలు స్వంతం” అంటూ యేసు ప్రభువును కొనియాడుతారు.
“రంగురంగుల ముగ్గులు/అలంకరించు గడపలు/మామిడాకు తోరణాలు/ఇంటింటికి వెలుగులు” అంటూ సంక్రాంతి సంబరాలను వర్ణిస్తారు.
“పూసిన పువ్వు నీవు/మెరిసిన మెరుపు నీవు/దీపానికి కాంతి నీవు/పారే సెలయేరువి నీవు” అంటూ ‘అంబేద్కర్ జయంతి’లో ఆ మహనీయునికి వందనాలు అర్పిస్తారు.
ఇవే కాక జెండా పండుగ, గాంధీ జయంతి, నెహ్రూ జయంతి, సంత్ సేవాలాల్ జయంతి, ఛత్రపతి శివాజీ జయంతి, సీత్ళ పండుగ, పీర్ల పండుగ గురించి మనోజ్ఞమైన భావాలతో చక్కని కవితలు వెలువరించారు.
ఈ కవితలన్నింటిలో దేశ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాల పట్ల, దేశానికి సేవలందించిన మహనీయుల పట్ల కవికి ఉన్న గౌరవ భావం స్పష్టంగా గోచరిస్తుంది. ఆయా శీర్షికలకి తగ్గ బొమ్మలతో, చక్కని ఛాయాచిత్రాలలో పుస్తకాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
పండుగలు ముత్యాలహారాలు (కవితా సంపుటి) రచన: రాథోడ్ శ్రావణ్ ప్రచురణ: ఉట్నూర్ సాహితీ వేదిక పేజీలు: 84 వెల: ₹ 75/- ప్రతులకు: రాథోడ్ శ్రావణ్, ఐబి సుభాష్ నగర్ ఉట్నూర్, ఆదిలాబాద్. 504311 సెల్. 9491467715. ఆన్లైన్లో తెప్పించుకునేందుకు: https://www.amazon.in/PANDUGALU-MUTHYALA-HARALU-Poems-Telugu/dp/B0BVBL3B5Y/
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు. సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.
పండుగలు ముత్యాల హారాలు అను నా పుస్తకానికి చాలా చక్కటి సమీక్ష చేసిన ప్రముఖ రచయిత,అనువాదకుడు గౌ. శ్రీ. కొల్లురి సోమ శంకర్ గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు..
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
మనల్ని మనకి చూపే కవితలు ‘ఒక ఆదివారం సాయంత్రం’
భూమి నుంచి ప్లూటో దాకా… పరిచయం
తుమ్మల సీతారామమూర్తి కనకాభిషేక సన్మాన సంచిక-3
సిరి ముచ్చట్లు-12
కొరియానం – A Journey Through Korean Cinema-63
సాధించెనే ఓ మనసా!-18
ఎంత చేరువో అంత దూరము-27
వెలుదండ వారి వెలుగుదండ – వాగ్దేవి వరివస్య పుస్తకం పీఠిక
చిరుజల్లు-130
అమ్మ మాట – పుస్తక పరిచయం
అన్నం విలువ మనసుకు తాకేలా వివరించారు... ప్రతిదీ వివరంగా పరిశీలించి అందిస్తున్నందుకు ధన్యవాదాలు...🙏
Thank you somuch sir
ధన్యవాదాలు సర్.
సుబ్బారావు గారు ధన్యవాదాలు మీకు.
వేణు గారూ ధన్యవాదాలు
All rights reserved - Sanchika®