[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘ఫలితం ఒక్కటేగా!’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]


ప్రవేశానికి లేని బెంగ
నిష్క్రమణకు ఎందుకు
ప్రమోదమైనా ప్రమాదమైనా
నీ ప్రమేయమేముంది
అమేయమైన శక్తి ఉందని
మిడిసిపడినా కాలం
ఒడిసి పట్టేస్తుందిగా
జడిసి దాక్కున్నా
ఎగిసి ఎదిరించినా
ఫలితం ఒక్కటేగా
మొక్కిన వాడినీ
వెక్కిరించిన వాడినీ
చుక్కలూ చూపించేస్తుందిగా

పెద్దాడ సత్యప్రసాద్ విశాఖపట్నం జిల్లా వాస్తవ్యులు, కవిగా, రచయితగా దశాబ్దాల ప్రయాణం. వీరి కధలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమవడమే కాక, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా కూడా ప్రసారం అయ్యాయి. ఇక, వృత్తిగతంగా పాత్రికేయులు. రెండున్నర దశాబ్దాలకు పైగా పాత్రికేయ వృత్తిలో అంకితభావంతో పనిచేస్తున్నారు. రాజకీయ విశ్లేషణలు వీరి ప్రత్యేకత. ప్రస్తుతం ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో న్యూస్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.