పిల్లల పెంపకమనేది ఒక అందమైన ప్రయాణం. పిల్లల పుట్టుకతో మొదలయ్యే ఈ ప్రయాణంలో ప్రతి దశలో కొత్త సందేహాలు ఎదురవుతూనే ఉంటాయి. పిల్లల అభివృద్ధి, చదువు, ప్రవర్తన, భావోద్వేగాలు, స్నేహ సంబంధాలు, డిజిటల్ యుగంలో భద్రత – ఇలా అనేక విషయాలు తల్లిదండ్రుల మనస్సును తొలుస్తూనే ఉంటాయి. వాటికి సమాధానాలు వెతికే ప్రయత్నంలో, చాలామంది తల్లిదండ్రులు తికమకకి గురవుతుంటారు.
అందుకే ‘సంచిక’లో ఒక సరిక్రొత్త ఫీచర్ ‘పిల్లల పెంపకంలో నూతన దృక్పథం’ త్వరలో ప్రారంభిస్తున్నాం.
ఈ ఫీచర్ తల్లిదండ్రుకు వచ్చే సందేహాలను భయాలను తొలగించి వారికి స్పష్టమైన మార్గదర్శనం చేస్తుంది. తల్లిదండ్రులు ఎదుర్కొనే ప్రధానమైన సమస్యలు, ఆందోళనలు, అనుమానాలకు, సమాధానాలను ప్రాక్టికల్‌గా, శాస్త్రీయంగా, వారి మనసుకు దగ్గరగా ఉండేలా ఈ ఫీచర్లో వివరణ వుంటుంది.
పిల్లల వయస్సు దశను బట్టి తల్లిదండ్రులు అవలంబించాల్సిన సరైన వ్యూహాలు, తల్లిదండ్రులు-పిల్లల మధ్య నమ్మకబంధాన్ని పెంచే చిట్కాలు కూడా ఈ ఫీచర్ ద్వారా అందుతాయి.
ఈ ఫీచర్లో తల్లిదండ్రుల అనుభవాలు, నిపుణుల సూచనలు, విజ్ఞానపూర్వకమైన విశ్లేషణలు పొందుపరచబడతాయి. చిన్న పిల్లల నుండి టీనేజ్ వరకు, పిల్లల పెంపకంలో ఎదురయ్యే అసలు సమస్యలు, వాటికి సులభమైన పరిష్కార మార్గాలు ఈ వ్యాసాల్లో వుంటుంది
పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం, వారితో మెరుగైన అనుబంధాన్ని ఏర్పరచుకోవడం, భవిష్యత్తు కోసం వారికి సరైన మార్గదర్శనం ఇవ్వడం వంటి ఎన్నో అంశాలను ఈ ఫీచర్ కవర్ చేస్తుంది.
మిగతా అన్ని ఫీచర్లు లాగానే ఈ ఫీచర్ కూడా మీకు నచ్చుతుంది మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాము.
***
‘పిల్లల పెంపకంలో నూతన దృక్పథం’ –
కొత్త ఫీచర్.. త్వరలో
ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ ఐ.పి.సుహాసిని గారు నిర్వహణ
త్వరలో..