సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    ప్రసాద్ మార్ని డి

    శ్రీ నమిలికొండ విశ్వేశ్వర శర్మ మహాశయులకు మా హృదయపూర్వక పాదాభివందనములు..
    తమరి విశ్లేషణాత్మకమైన విషయాలు అత్యంత అద్భుతంగా ఉన్నాయి .. ఇవన్నీ శాస్త్ర సమ్మతమైనవే.. జ్ఞానులైనవారందరూ అంగీకరించక మానరు.. ఈనాడు దినపత్రికలు తెరవాలంటేనే భయం మరియు అసహ్యం వేస్తున్నది.. ఏ పేజీ చూసినా నేరాలు ఘోరాలు, చంపడాలు ఆత్మ హత్యలు చేసుకోవడాలు, యుద్దోన్మాదాలు, మోసాలు ఆక్రమణలు,
    ప్రకృతి విపత్తులు..ఇవే కన్పిస్తున్నాయి టివీ లలో కూడా ఇవే కన్పిస్తున్నాయి.. వీటిని ఎలా తగ్గించాలి అని మీలాంటి విజ్ఞులైన పెద్దలు ఆలోచించడం కూడా
    సబబుగానే ఉంది.. ఇదంతా తమలాంటి వారి సంస్కారం మరియు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.. కానీ నేడు జరుగుతున్న ప్రకృతి విపత్తులన్నింటికీ కారణం గత దశాబ్దాలుగా స్వార్థం మూర్తీభవించిన మానవజాతి మితిమీరిన విధ్వంసమే కారణమని మేధావులందరికీ తెలుసును.. కానీ నోరు మెదపరు.. కాబట్టి నేడు జరుగుతున్న ప్రకృతి భీభత్సం ఫలితాలను వారుకూడా అనుభవించక తప్పదు
    చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఛందమే ఇది
    మరొక విషయం ఏమిటంటే గురువు గారు ఏనాడో విశ్లేషణ చేసి చెప్పారు.. ఇది కలికాలం ప్రథమపాదం పూర్తయి ఇప్పుడు సంధికాలం జరుగుతున్నది.. ఇది సుమారు 20 వేల సంవత్సరాల పాటు జరుగుతుంది.. ఇప్పటికే భూగోళం పైన అనేక విపత్తులు సంభవించాయి.. ఇంకా సంభవిస్తూనే ఉంటాయి కాబట్టి మానవజాతి అంతా అనుభవించక తప్పదు
    ఇప్పుడు భగవంతుడిని అనుక్షణం మనస్సులో నిరంతరం స్మరించడం తప్ప ఆత్మోన్నతికోసం ఎవరికి వారు తమకు అనుకూలంగా పాటుబడడం తప్ప మరేమీ చేయలేని స్థితిలో ఉన్నారు
    శుభం భూయాత్ 🙏

    Reply
    1. 1.1

      Sreedevi peddi

      శుభోదయం🙏అయ్యగారు *ప్రకృతి విలయ తాండవం* గురించి ఈ మధ్య కాలంలో రాసిన వ్యాసం నేటి ఆధునిక యుగంలో ప్రకృతి తో మనం ప్రయాణం చేయాలి కానీ ప్రకృతి ని నాశనం( ఆక్రమణ , రక్షించక పోవడం) చేయడం వంటి ఉదాహరణలతో భగవానుడు చెప్పిన విషయాలను మాకు అర్థం అయ్యేటట్లు వివరించారు🙏🙏
      అప్పుడే అనుకుకున్న ఈ విషయం మీ శిష్యులమైన మాతో పాటు చాల మందికి తెలిస్తే బావుండు అని…ఆ భగవద్ అనుగ్రహం వల్ల *సంచిక* డిజిటల్ మ్యాగజైన్ లో ప్రచురితమై ఆన్లైన్ వేదికగా ఎందరికో స్ఫూర్తిదాయకం కాబోతుందని కోరుకుంటూ నమస్సులు🙏🙏

      Reply
  2. 2

    శ్రీధర్ రావు దేశ్పాండే

    విశ్వేశ్వర శర్మ గారి వ్యాసం చదివినాను. బాగుంది. చివరలో శర్మ గారు నీటి తావులకు గృహ సముదాయాలు ఎంత దూరంలో ఉండాలో చెప్పిన ప్రమాణాలను పూర్వ కాలంలో పాటించారు కనుకనే వరదల ప్రమాదాలు ప్రజలను పెద్దగా బాధించలేదు. ఇప్పుడు బాజాప్తా నీటి తావులను కబ్జా చేసి గృహ సముదాయాలను నిర్మిస్తున్నారు. చెరువులకు నీటిని తీసుకు వచ్చే, తీసుకుపోయే నాలాలను ఆక్రమిస్తున్నారు. ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. ప్రకృతిని చెరబడితే అది మన మీద ప్రతీకారం తీర్చుకుంటుంది. నీరు పల్లమెరుగు. అంతే. ఎక్కడ పల్లం ఉంటే అక్కడకే నీరు చేరుతుంది. అది ప్రకృతి ధర్మాన్ని నిర్వహిస్తున్నది. వాటి తావుల్లోకి మనిషి చేరుతున్నాడు. ప్రకృతి ధర్మాన్ని ఉల్లంఘించిన మనిషిని ముంచి వేయక తప్పదు కదా. అది మనిషి తనకు తాను తెచ్చుకున్న ముప్పు. ఇప్పటికైనా మనిషి ప్రకృతి ధర్మాలను తెలుసుకొని వ్యవహరిస్తే మానవాళి ఇటువంటి ప్రకృతి విపత్తులు మన దారి చేరవు. ఇవ్వాలటి ఈ పరిస్థితికి పాలకులు, నిర్మాణదారులు, కొనుగోలుదారులు.. అందరికీ బాధ్యత ఉన్నది.
    ఈ అంశాలను శర్మ గారు బాగా వివరించారు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!